[box type=’note’ fontsize=’16’] హిమాలయాలకు నెలవు, ప్రకృతి అందాలకు కొలువు, భూతల స్వర్గమని కవులు అభివర్ణించిన కాశ్మీరులో తమ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు డి. చాముండేశ్వరి. [/box]
దాల్ లేక్ / బోట్ హౌస్
[dropcap]ప[/dropcap]హల్‌గామ్ నుండి తిరుగు ప్రయాణంలో ఎక్కడ ఆగకుండా శ్రీనగర్ చేరుకొని హోటల్‍లో లంచ్ చేసి, ముందుగా బుక్ చేసుకున్న హౌస్ బోట్‌కి వెళ్ళటానికి దాల్ లేక్ చేరాము. అరగంట తరువాత మమ్మల్ని లేక్ లోపల నిలిపి ఉన్న ఇంటికి తీసుకు వెళ్ళటానికి శిఖర్ అని పిలువబడే చిన్ని పడవ వచ్చింది. పాట హిందీ సినిమాలలో చూసాము.
ముందుగా మేము ఎక్కాక మా పెట్టెలు సర్దిపెట్టి బయలు దేరింది పడవ. నీటిలో తేలియాడే మార్కెట్ ప్లేస్ దాటుకుంటూ, అనేక పెద్ద చిన్న బోట్ హౌస్‌లు చూస్తూ మా హౌస్ బోట్‌కి చేరాము. దాల్ లేక్ శ్రీనగర్ నడిబొడ్డున 7.44 కిమీ పొడవు, 3. కిమీ వెడల్పు, 6 మీటర్ల లోతు కలిగిన సరస్సు. శీతాకాలంలో ఇది గడ్డకట్టిపోతుంది. రెండు లంకలున్నాయి. ఐలాండ్స్ సోనా, రూప. చార్ చినర్ అంటారు. లేక్ చుట్టూ మొఘల్ కాలపు తోటలు, పార్కులు, హౌస్ బోట్స్ ఉంటాయి. వింటర్‌లో లేక్ టెంపరేచర్ -11 సెల్సియస్‌కి చేరుతుందిట. ఫ్లోటింగ్ రెడ్ గార్డెన్స్ అంటే తామర తోటలు ఉన్నాయి.
చరిత్ర ప్రకారం లేక్‌కి మూలం శతధార అని పిలవబడిన నీటి ఊట. దుర్గ మాత నివాసమని నమ్మిక. మొఘల్ పాలనలో పాలకులు ఎండవేడిమి తట్టుకునేలా శ్రీనగర్‌ని పునర్నిర్మించారు తోటలు తదితరాలతో. మొఘల్ పాలన నశిస్తున్న దశలో లేక్ పస్థూన్ ట్రైబ్స్, ఆఫ్ఘన్ పాలకుల పాలనలోకి వెళ్ళిందిట. తరువాత సిక్కు పాలకుల చేతికి. ఇది చరిత్ర.
మా శిఖర్ boat man not batman దాల్ లేక్ సూర్యాస్తమయంలో, నైట్ చాలా బావుంటుందని చెప్పాడు. సో టీ తాగాక తిరిగి శిఖర్ ఎక్కి లేక్ టూర్‌కి వెళ్ళాము. బోట్ హౌస్, శిఖర్ అద్దెలు ఎక్కువ కాదు. మా లా తిరుగుతున్నా ఇతర శిఖర్‌లు కనిపించాయి. చాల పెద్దగా ఉన్న కాలువ, తామర పూల కొలనులు చూసాము. ఎంత అందమైన దృశ్యం, అనుభూతి. తరచుగా లేక్ క్లీన్ చేస్తూ కాలువలు శుభ్రం చేసి, ఇతర మొక్కలు పీకి వాటిని సేంద్రియ ఎరువుగా చేస్తారట. లేక్ చుటూ కుప్పలు పోసిన weed చూసాము. సూర్యాస్తమయం ఆహ్లదకరం.
దూరంగా రోడ్డుకు దగ్గరలా అనిపించే ఒక చిన్న లంక మీద ఉన్న చార్ చినారు వృక్షాలను, నీటి ఫౌంటైన్స్ చూపించాడు. లేక్‌లో తేలియాడుతున్న బోట్ హోటల్ దగ్గర ఆగి టీ అండ్ స్నాక్స్ తిన్నాము. మరింత చీకటి పడేలోగా మా బోట్ హౌస్‌కి చేరాము. చలి కూడా ముదరటం ఒక కారణం. మా చిన్ని ప్రకృతికి ఇబ్బంది కావద్దని ముందే ఆర్డర్ చేసాం ఫుడ్. సో రెడీ గా ఉంది వేడి వేడిగా కాశ్మీర్ చావల్, దాల్, రాజ్మా, రోటి, సబ్జి తిన్నాము. కొద్దిసేపు హాల్‌లో నగిషీలు చూస్తూ ఆనందించాము, మా పరి అటు ఇటూ పరుగెత్తి అడి అలసి పోయింది.
బోట్ హౌస్‌ల వద్దకే శిఖర్‌లో పూలు, పండ్లు, కూరలు, నగలు, బట్టలు అమ్మకానికి వస్తాయి. పూలు కొన్నాను. మామూలు నగలు కొన్నాము. లేక్‌లో ఒక గ్రామమే ఉంది తేలియాడుతూ. నీటిని అనుకుని ఉన్న నేలమీద కావలసిన కూరలు పండిస్తారు. మన ఊహకి అందని అదో లోకం. ఆ లోకానికి అతిథిగా రెండు రోజులున్నాము. అక్కడే ఒక పెద్ద గ్రంధాలయం ఉంది. భావుకులకు సరైన ప్రదేశం. ప్రేమికులకూ, ప్రశాంతత, ఆత్మావలోకానికి సరైన ప్లేస్. ఉదయం కూడా లేక్ చూసి వచ్చాము. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసి శ్రీనగర్ నుండి సోనామార్గ్‌కి ప్రయాణం అయ్యాము.