కాశ్మీరు లోయలోని వృక్ష జాతులు 3 – చినార్

0
2

[డా. కందేపి రాణీప్రసాద్ రచించిన ‘కాశ్మీరు లోయలోని వృక్ష జాతులు 3 – చినార్’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

కాశ్మీరీ రాష్ట్ర వృక్షం

[dropcap]నా[/dropcap]రింజ, పసుపు, ఎరుపు రంగులు పువ్వులకు ఉంటాయని తెలుసు కానీ ఆకులకు ఉంటాయని తెలుసా! ఆకుపచ్చతో పాటు ఇన్ని రంగులను కలిగి ఉండే ఆకులున్న చెట్టు గురించి తెలుసుకుందామా! కాశ్మీర్ రాష్ట్ర వృక్షమైన చినార్ చెట్టు గురించి వివరాలు తెలుసుకుందాం. అత్యంత అధిక కాలం జీవించే చినార్ చెట్లు కాశ్మీర్ లోయలో వ్యాపించి ఉన్నాయి. ఇది ఆకులు రాల్చే చెట్టు ఈ చెట్టు దాదాపు 50, 60 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. చెట్టు పై బాగాన గుమ్మటంలా పందిరిలా పందిరిలా విశాలంగా వ్యాపిస్తుంది. ఈ చెట్లు 200 సం॥లకు పైబడి అధికంగా 700 సం॥ వరకు జీవిస్తాయి. అత్యధిక కాలం జీవించే వృక్షాలుగా వీటికి పేరున్నది. వీటిని తోటలు, ఉద్యాన వనాలలో అలంకార వృక్షాలుగా పెంచుతారు.

చినార్ చెట్టు ప్లాటో నేసియా కుటుంబానికి చెందిన చెట్టు. దీని శాస్త్రీయనామం ‘ప్లాటానస్ ఓరియాన్టాలసిస్’. దీర్ఘాయువు కలిగిన ఆకులు రాల్చే చెట్టు. శరదృతువులో దీని ఆకులు రక్త వర్ణం లోకీ ఆ తర్వాత కాషాయం రంగు లోకి, ఆ తర్వాత పసుపు రంగు లోకి మారుతాయి. దీని యొక్క ప్రత్యేక లక్షణమిది. ఎక్కువగా హిమాలయాల్లో ఈ చినార్ చెట్లు విస్తరించి ఉన్నాయి. తూర్పు ఇరాన్, మధ్య ఆసియా, దక్షిణ పాలస్తీనా, కాశ్మీరులో ఈ చెట్లు వ్యాపించాయి.

ఈ చినార్ చెట్టు ఎక్కువగా నది తీరాల్లో ఉంటాయి. విల్లో, ఆల్బర్, పోప్లర్ వంటి చెట్లతో కలసిపోయి జీపిస్తుంది. పాడి నేలల్లో ఎక్కువగా మనుగడ సాంగిస్తుంది. భారీ ఆకారం గల ఈ చెట్టు కాండం దాదాపు 13 అడుగుల వ్యాసంతో ఉంటుంది. దీని కాండం యొక్క బెరడు పొలుసులుగా ఉంటుంది. ఆకులు కాండం చుట్టూతా ఉంటాయి. పువ్వులు, పండ్లు కూడా సమూహాలుగా ఉంటాయి.

చినార్ చెట్లు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో సైతం కనిపిస్తాయి. ఇంకా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాకండ్ మరియు హిమాలయుల దిగుల ప్రాంతాలలోగా అక్కడక్కడా కనిపిస్తాయి. సమశీతోష్ణ వాతావరంలో పెరిగే ఈ మెట్లు ఎక్కువగా ఎండిన నేలను ఇష్టపడతాయి. అంతేకాక కొండలు, లోయలు, నదీతీరాలను బాగా ఇష్టపడుతాయి. కాశ్మీరు లోయలోనే నిర్ధిష్ట వాతావరరణ పరిస్థితులు చీనార్ చెట్లకు అనుకులంగా ఉంటాయి. చినార్ చెట్లు కాశ్మీరు యొక్క ప్రకృతి సౌందర్యానికి ఇది కూడా తమ వంతు కృషిని గణనీయంగా చేస్తాయి. చల్లని వేసవి, చల్లని శీతాకాలాలు చినార్ల అభివృద్ధికి ఎక్కువగా దోహదం చేస్తాయి. శరదృతువులో రంగు రంగుల ఆకులు నేల రాలి అంధమైన ప్రకృతి శోభను కలిగిస్తాయి. ఈ చెట్లు అందాలతో నేను చార్టులు చేసి ప్రదర్శించాను. ఈ చెట్లును రక్షించడానికి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది.

చారిత్రాత్మకంగా, సాంస్కృతికంగా చినార్ చెట్లు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. చివార్ చెట్లు కలపను ఫర్నీచర్ తయారికి ఉపయోగిస్తారు. ఈ చెట్ల యొక్క కలప అత్యంత ఖరీదైనది. మరియు మన్నిక గలది. చినార్ చెట్ల పై భాగం గొడుగు లాగా విస్తరించటం వల్ల చెట్టు కింద నీడను కలిగిస్తుంది. అందానికి, సంప్రదాయానికి చిహ్నంగా ఉన్న ఈ చెట్లు అనేక కళాకృతుల్లో, పాటల్లో పద్యాల్లో చొప్పించబడ్డాయి. చినార్ చెట్లను శరదృతువులో దర్శించదానికి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కాశ్మీర్ వెళ్ళేవారు. కాశ్మీర్ మాజీ ముక్యమంత్రి షేక్ మహమ్మద్ అబ్దుల్లా తన ఆత్మకథకు ‘ఆటిష్ – ఇ-చినార్!’ అనే పేరు పెట్టారు. ‘అతిష్-ఇ-చినార్’ అంటే ‘చినార్ యొక్క జ్వాల’ అని అర్థం. కాశ్మీర్ నివాసి అయిన ముఖాన్ లాల్  ఫోతేదార్ తన ‘చెర్-ఆల్ మెహెయిర్’ కు ‘ద చినార్ లిప్స్’ అవి పేరు పెట్టాడు.

శ్రీనగర్ లోని మొఘల్ గార్డెన్స్‌లో 100కు పైగా చినార్ చెట్లున్నాయి. ప్రేమికులు, నూతన జంటల సేల్ఫీలతో, ఫోటోలతో  చినార్ చెట్లు తప్పక దర్శనమిస్తాయి కాశ్మీర్‌లో అధికారికంగా 1970 ప్రాంతంలో 42,000 చినార్ చెట్లుండేవి. 2000 సం॥ నాటికి ఈ సంఖ్య 5000 చినార్ చెట్లుకు మాత్రమే పరిమితమైనది ప్రభుత్వ ప్రయత్నాల వలన తిరిగి 14000 చినార్ చెట్లను నాటి పూర్వ వైభవాన్ని తీసుకు రావాలని ప్రయతిస్తున్నారు

చినార్ చెట్టును కార్మరీ భాషలో బూయిన్ అని పిలుస్తారు. ఇది భవాని మాతకు ప్రతిరూపంగా భావిస్తారు చినార్ అనే పదం పర్షియన్ మూలానికి చెందినది. ‘ఎంత నిప్పు’ అనే అర్థం వస్తుంది. దీని ఆకులు ప్రఖ్యాతి చెందిన మేపుల్ చెట్లు ఆకుల వలె ఉండటం వల్ల చాలా మంది ఈ రెండింటిని ఒకే చెట్టుగా భావిస్తారు. ఆకలను రాల్చడంలో ప్రత్యేకమైన ఆకర్షణ కలిగి ఉంటుంది. దీనికి టోన్సాయ్ మొక్కగా కూడా ఇళ్ళలో పెంచుకుంటారు. ఇది ఔషధ మొక్కగా సైతం ఉపయోగ పడుతుంది. చినార్ యొక్క బెరడు యాంటిరైమాన్టిక్‌గా ఉపయోగపడుతుంది.

భారతదేశంలోని కామన్వెల్త్ క్రీడల ప్రారంభ వేడుకలలో చినార్ చెట్టు ప్రముఖంగా ప్రదర్శించబడింది. జమ్ముకాశ్మీర్ లోని అనేక విశ్వవిద్యాలయాలు చినార్ ఆకును చిహ్నంగా పెట్టుకున్నాయి. భారత కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము కాశ్మీరు యొక్క రాష్ట్ర చెట్టు చినార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here