కష్టే ఫలి

0
1

[dropcap]అ[/dropcap]క్కా చెల్లెళ్లు 👧👧అడవికి వెళ్లారు
కంపను కొట్టారు-ఇంటికి తెచ్చారు
ఏటికి వెళ్లారు- నీటిని తెచ్చారు
కసువును ఊడ్చారు-ఎరువుగ మార్చారు
హద్దులు కట్టారు – పందిరి వేశారు
చిక్కుడు, బీర , దొండ, పొట్ల పాదులెక్కించి
బెండ, వంగ, 🍆టమాట🍅 నారులు పోశారు
మల్లె, బంతి, చేమంతి,🌻💐 మందార, గులాబీ 🌹
అందమైన పూల బాటలో🪴🪴 ముందుకు పోతే,,🌷🌸
ఆకు కూరల మడులొక వంక !☘️🌱
సపోటా, అరటి,🍌 జామ, మామిడి 🥭, దానిమ్మ 🌴🌱
పండ్ల చెట్లు మరొక వంక;
కాల్వ చేసి – నీటిని పారించి
కలుపులు ఏరి – కావలి కాసి
చెత్తను ఏరి – గెత్తం వేసి
గొప్పులు తవ్వి – గోతులు పూడ్చి
మట్టిని మార్చి – చీడను దులిపి
కష్టాన్నే ఇష్టంగా మార్చుకుని
🍍పండ్లు – 🌶️కాయలు కోశారు,
*ఆరోగ్యం ఇదిగో* నంటూ
పూలను పంచి 💐💐💐- – కాయలు తెంచీ
పండ్లను అమ్మీ ⚖️
ధనాన్ని పొందారు – 💰
హాయిగా బతికారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here