[dropcap]శ్రీ [/dropcap]ఎన్.కె. బాబు సంపాదకత్వంలో ప్రచురితమైన ‘కథా సౌరభాలు’ పుస్తకం ఆవిష్కరణ 19 జూన్ 2022 న విశాఖ పౌర గ్రంథాలయం (మినీహాల్), విశాఖపట్నంలో ఉదయం 10 గంటలకు జరుగుతుంది.
అందరూ ఆహ్వానితులే.
***
కథల విందు:
తెలుగునాట కథలకు, కథకులకు కొదవ లేదు. అయితే అవి ప్రచురించే పత్రికలు, వెబ్ పత్రికలు పరిమితంగా వున్నాయి. అయినప్పటికీ వాటి వాటి పరిధిలో వాటి శక్తానుసారం ప్రచురిస్తూనే ఉన్నాయి. అయితే పత్రికల్లో వచ్చిన కథలను దాచుకోవడం కన్నా ఓ కథా సంకలనంలా వచ్చిన పుస్తకాన్ని దాచుకోవడానికి రచయిత మక్కువ చూపిస్తాడు. అంతే కాకుండా కథా సంకలనాలలో ఇతరుల కథల సరసన తన కథను చూసుకోవడం తనకే మంచి అనుభూతి ఇస్తుండనడలో అతిశయోక్తి లేదు.
అలాంటి ప్రయత్నమే విజయనగరం నుండి ఎన్.కె. పబ్లికేషన్స్ చేస్తున్నది. ‘నాకు నచ్చిన నా కథ’ పేరిట కథకుల నుంది కథలు సేకరించి సంకలనాలుగా 2019 డిసెంబరు నుంచి వరుసగా 5 సంకలనాలను ప్రచురించింది. మిగతా సంకలనాలకు భిన్నంగా రచయిత తనకు నచ్చిన కథను ప్రచురణకు పంపించే వీలుండడం వలన చాలామంది రచయితలు ఉత్సాహంగా ఈ సంకలనాలలో పాలుపంచుకుంటున్నారు.
ఏ సంకలనాలకు లేని వెసులుబాటు ఉండడంతో వర్ధమాన రచయితల నుండి, సీనియర్ రచయితల వరకూ తమ తమ కథలను పంపిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి పరిమితులు, కొలమానాలు, ఇజాలు లేకపోవడం వలన, స్వేచ్ఛగా కథాగుచ్ఛాలు తయారవుతున్నాయి. ఈ సంకలనాలలో పాల్గొన్న రచయితలలో కొంతమంది మనోభావాలను తెలుసుకుందాం.
***
మల్లిపురం జగదీష్
—-
రజని సుబ్రహ్మణ్యం
—
రావాడ శ్యామల, రచయిత్రి
—
నల్లా యోగేశ్వరరావు
—
జ్యోతి సుంకరణం
—
కథకు పుట్టిల్లు ఉత్తరాంధ్రే అయినా, ఎందుకో ఇక్కడ కథకులు తక్కువ. ఇలాంటి స్థితిలో కొత్త కథకులకు ప్రోత్సాహం ఇస్తూ, వస్తు వైవిధ్యంతో కథల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ… లాభాపేక్ష లేకుండా ఇంత తక్కువ వ్యవధిలో సంకలనాలు తీసుకురావడం చాలా సంతోషించ వలసిన విషయం. రాబోయే రోజుల్లో మరిన్ని సంకలనాలు రావాలని కోరుకుంటున్నాను.
వి. వెంకటరావు
—
‘నాకు నచ్చిన నా కథ’ పేరుతో ఇప్పటిదాకా ఐదు కథాసంకలనాలు వచ్చేయి. ప్రచురణకర్త సాహితీప్రియుడు, సాహిత్యాభిమాని ఎన్.కె.బాబు గారు. ఎన్.కె.పబ్లికేషన్స్ పేర ఇంతవరకూ అనేక కథా సంకలనాలు, నవలలు, కవిత్వం, కవిత్వం_చిత్రలేఖనం, వ్యాస సంకలనాలు, ప్రబంధం, మోనోగ్రాఫ్ ఇలా అనేక ప్రక్రియల్లో సాహిత్యాన్ని ప్రచురించి పాఠకలోకానికి అందించి ప్రచురణరంగంలో తనదైన ప్రత్యేకతతో కొనసాగుతున్నారు. ఈ సంస్థ ప్రచురించిన చాలా గ్రంధాలకు పురస్కారాలు లభించేయి కూడా. డా. యు.ఎ. నరసింహమూర్తి గారి రచన ‘కన్యాశుల్కం_19వ శతాబ్ది భారతీయ నాటకాలు.. తులనాత్మక పరిశీలన’ అనే గ్రంథం దానికదే ప్రత్యేకమైంది. ఇక ‘నాకు నచ్చిన నా కథ’ శీర్షికతో ప్రచురించిన ఐదు కథా సంకలనాలు విశేషమైనవని చెప్పాలి. రచయితలకు నచ్చిన కథలతో పుస్తకాల్ని ప్రచురించాలనే ఆలోచనే గొప్పది. ప్రతి రచయితా తన కథ పత్రికలో అచ్చైనాక అది మరో ప్రత్యేక సంకలనంలో వస్తే ఎంతో సంతోషిస్తాడు. పత్రికలో వచ్చిన కథ ఆ తరువాత ఎవరికీ అందకుండాపోతుంది. అదే కథ ఒక ప్రత్యేక సంకలనంలో వస్తే దాని విలువ, ఆయువు పెరుగుతాయి కూడా. ఈ ప్రచురణ ద్వారా మంచి కథల్ని, రచయితలు తమకు నచ్చిన తమ కథల్ని ఇలా సేకరించి కథాగుచ్ఛాలుగా పాఠకులకు అందించడం హర్షణీయం. కథల లోకానికిదొక కానుక అనే చెప్పాలి. నాలుగు సంకలనాలు ‘నాకు నచ్చిన నా కథ’ పేరుతో ప్రచురించి ఇప్పుడు ‘కథా సౌరభాలు’ పేరుతో ఐదవ సంకలనం తీసుకొచ్చారు. మంచి సాహిత్యం పాఠకులకు అందించడం ద్వారా సాహితీరంగంలో విశేష కృషి సల్పుతున్న మిత్రుడు ఎన్.కె.బాబు గారికి అభినందనలు.
గంటేడ గౌరునాయుడు
—
కథలు చాలా మంది వ్రాస్తారు, కథా సంకలనాలు చాలా వచ్చాయి, కానీ ఇలా రచయిత తనకు నచ్చిన కథను తానే ఎన్నిక చేసుకొని 40 మంది కథకుల సరసన తన 41వ కథగా చూసుకోవడం ఓ అనిర్వచనీయమైన అనుభూతికి లోనుచేసింది. రచయితకు ఇంతటి స్వేచ్ఛను ఏ ప్రచురణకర్తా ఇవ్వరు. జయహో. కొనసాగాలని ఆకాంశిస్తూ.
వియోగి
—
కవి రచయిత మంచి కథకులు శ్రీ అంబల్ల జనార్థన్ గారి ద్వారా ‘చెల్లాయి బర్త్ డే’ అను నా కథతో శ్రీ ఎన్.కె.బాబుగారు పరిచయమయ్యారు. వారి సంపాదకత్వంలో విశాఖ రచయితల సంఘం ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా ‘నాకు నచ్చిన నా కథ’.. వరుసగా 1, 2, 3, 4 కథా సంకలనాలు విజయవంతంగా విశాఖ పౌర గ్రంథాలయంలో ఆవిష్కరించబడ్డాయి. అట్టి ప్రతీ కథా సంకలనంలో నా కథ చోటు చేసుకుంటూ వచ్చింది. గొప్ప కథకులున్న ఈ కథా సంకలనంలో మంచి ఇతివృత్తం గల కథలు రాయడం, రావడం విశేషం.
ఇందులోని కథలన్నీ సమాజానికి జీవం పోస్తున్నవే. నా లాంటి వర్ధమాన కవులను అక్కున చేర్చుకున్నందుకు సంతోషంగా ఉంది. వినూత్న కథా శీర్షికలతో వెలువడుతూ పోటాను పోటీగా రాసే ఈ కథా సంకలనం మేలిమి కథల్ని రాబడుతోందనే చెప్పాలి. ఈ సంస్థ ఇలాగే మునుముందు ఇంకా ఉన్నతమైన కథా సంకలనాలు తేవాలని ఆశిస్తూ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదములు.
జక్కని గంగాధర్, ముంబాయి
—
పాణ్యం దత్త శర్మ, హైదరాబాద్
—
సోదరులు శ్రీ ఎన్.కె.బాబు గత ఐదు సంవత్సరాలుగా ప్రచురిస్తూ ఉన్న ‘నాకు నచ్చిన నా కథ’, ప్రస్తుత ‘కథా సౌరభాలు’ ఒక వినూత్న ప్రయోగం. రచయితకు నచ్చిన కథను ఇందులో, ఇతర రచయితల కథలతో పాటు చూసుకోవచ్చు. ప్రతి సంకలనంలో నా కథను చేరుస్తారు బాబు. అది ఒక ప్రివిలేజ్‌గా భావిస్తాను. వస్తు వైవిధ్యానికి ఇవి సజీవ ఉదాహరణలు.
‘కథా సౌరభాలు’ నిజంగానే ఇదొక సరికొత్త, సాహసోపేతమైన ప్రయోగం. గతంలో, రచయిత/రచయిత్రుల కథాసంపుటాలు విరివిగా వచ్చినాయి; కానీ, అవి అంతకుముందు, వివిధ పత్రికల్లో అచ్చైన వారి వారి కథలతో వెలువరించడం జరిగింది. అన్నీ కొత్త కథలతో సాహసోపేతమైన ఇటువంటి, విన్నూత్న ప్రయోగం తలపెట్టిన శ్రీ కృష్ణబాబు గారిని అభినందిస్తూ, వారు ముందు, ముందు ఇటువంటి అనేకానేక experiments ఎంతో జయప్రదంగా చేయాలని అభిలషించుతూ, ఆశిస్తూ, ఇంకోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
అత్తివిల్లి బాల సుబ్రహ్మణ్యం
—
డా. ఎం.వి.రమణారావు వ్రాయునది. నేను ఎప్పుడో వ్రాసిన ‘రామలాలి’ అనే కథను మీ ‘కథా సౌరభాలు’ సంకలనంలో ప్రచురించినందుకు నా కృతజ్ఞతలు. నాకు మిస్టరీ, ఫాంటసీ యిష్టం. అవి ఈ కథలో చోటు చేసుకోవడం వల్ల పై కథ నాకిష్టమైనది.
శ్రీ యండమూరి, రంగనాయకమ్మ, మల్లాది, అడపా వంటి ప్రసిద్ధులు, లబ్ధప్రతిష్ఠులైన కథా రచయితల సరసన నా కథ, నా పేరు చేరడం నాకు ముదావహంగా వున్నది. మీ యీ సాహిత్య సేవను ఇంకా కొనసాగించగలరని ఆశిస్తున్నాను.
డా. ఎం.వి. రమణారావు
—
బెలగాం భీమేశ్వరరావు
***
(41మంది కథకులు, 41 కథలు)
300 పేజీలు
వెల ₹200/-
ప్రతులకు
N K పబ్లికేషన్స్,
సమీర రెసిడెన్సీ,
విజయనగరం
ఫోన్. 9440343479.