[dropcap]ఒ[/dropcap]క కల్లోల వాతావరణ
కలగాపులగంలో
నేడు సమాజం..
మెదడులో ఆలోచనల తిరుగుబాటు..
స్వేచ్ఛను బంధీ చేసి..
విశృంఖల విన్యాసం చేస్తున్న
క్రిమికి దాసోహం..
జనారణ్యంలా దర్శనమిచ్చే
జనసందోహానికి
ఆనకట్ట వేసి చోద్యం చూస్తున్న
కరోనా విలయతాండవం..!
జీవితంలో ఏది సాధించాలన్నా..
కావలసింది కృషి, పట్టుదల..అవి
మన భారతీయుల బలం..
గెలుపు శిఖరానికి మనల్ని చేర్చే నిచ్చెనలవి..
నిరాశకే నిరాశ పుట్టే
నిరంతర మన ప్రయత్నం ముందు..
కరోనా హడలిపోవాల్సిందే..!
ఆయుధమే లేని యుద్ధం చేస్తున్న
భారతీయుల కట్టుబాట్లకి
నివ్వెరపోవాల్సిందే..!
నిజానికి..
కష్టాల చీకట్లను దాటితేనే
విజయాల గమ్యాన్ని చేరుకోగలం..
ఘోర విపత్తును సృష్టించి
వినోదం చూస్తున్న
చైనోడికి
ఇప్పుడు మనమంటే ఏంటో తెలియచెబుదాం..
ఆర్ధిక దిగ్బంధనం చేసి
చైనా ఆటలు కట్టిద్దాం..!
మరోసారి
దుర్మార్గపు..దుందుడుకు
వేషాలేయకుండా
కట్టడితో మట్టుబెడదాం.!!