Site icon Sanchika

కవి సమ్మేళనాలు – గాలి దుమారాలు – వాసంత సమీరాలు

[box type=’note’ fontsize=’16’] హిందీలో ‘నీరజ్ ఏక్ మస్త్ ఫకీర్’ అనే శీర్షికతో ప్రేమ్‍కుమార్ రచించిన వ్యాసాన్ని తెలుగులో అనువదించి అందిస్తున్నారు డా. టి.సి. వసంత. [/box]

[dropcap]ఈ[/dropcap] మాటలను గురించిన కొన్ని మాటలు.

ఇన్ని రోజులు, ఇన్ని సార్లు నీరజ్‌ని కలవకపోయి ఉంటే, ఆయనతో మాట్లాడకపోయి ఉంటే, ఆయన కవితలు చదువుతున్నప్పుడు వినడంలో ఎంతో ఆనందం ఉంది కాని ఆయన ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా వింటుంటే అంతే ఆనందం ఉందని, ఈ ఆనందం వేరు కాదన్న సత్యం నాకు తెలిసి ఉండేది కాదు. ఆయన ఎన్నో విషయాల మీద మాట్లాడగలరు. సొంతంగా అర్థాలు, కొత్తగా తాత్పర్యాలు చెప్పగలరు. కొత్త ఇన్‌ఫర్‌మేషన్, సూచనలు ఇవ్వగలరు. ప్రేమ, పెళ్ళిళ్లు, సుఖ దుఃఖాలు, రోగ-శోకాలు, జన్మ-మరణాలు, యుద్ధాలు, శాంతి మొదలైన విషయాలే కాదు, ఆర్థిక, ధార్మిక, రాజనైతిక, ఆధ్యాత్మిక, రాష్ట్రీయ. అంతరాష్ట్రీయ, ఏ సమస్య గురించి అయినా ఏ సంఘటన గురించి అయినా మాట్లాడుతుంటే వేదిక మీద నుండి మాట్లాడుతున్నరా అని అనిపిస్తుంది. అసలు ఆయన మాటలే ఒక లయ అని అనిపించక మానదు. ఆయన కేవలం కవే కాదు ఇంకా చాలా… చాలా…. వారిలో ఎంతో ప్రతిభ ఉంది. స్మరణ శక్తి ఇక చెప్పనఖర లేదు. బతకాలి అన్న తీవ్రమైన కోరిక, సక్రియత, అమాయకత్వం, మస్తీ, సాధుత్వం, ఏం ఏం లేవని? ఆయనకున్న  ఈ గుణాలన్నింటికి ఒక సమ్మోహన శక్తి ఉంది.  ఆ శక్తి మన అందరిని ఎంతో ప్రభావితం చేస్తుంది. నీరజ్ పట్ల మనం ఆకర్షితులమవుతాం… అదంతే…

అసలు ఆయన మాట్లాడటం మొదలు పెడితే రోజుల తరబడి మాట్లాడుతునే ఉంటారు. మాట్లాడిన ప్రతీసారి మనకు వ్యక్తిగా, కవిగా ఆయన గురించిన కొత్త విలువైన విషయాలు తెలుస్తూనే ఉంటాయి. వారి మనస్సు, ఇష్టాఇష్టాలు, సంస్కారాలు, అభిప్రాయాలు, గతం, వర్తమానం, వాతావరణం, కుటుంబంతో ఆత్మీయ సంబంధాలు, అంతరంగ సంబంధాలు, పడ్డ సంఘర్షణ, కోరికలు, ఆయన సాహిత్యం గురించి తెలియని, స్పర్శింపబడని ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. నిజానికి ఇదంతా ఒక పెన్నిధి. దీన్నంత నా దగ్గరే పెట్టుకోవడం కొంత కష్టదాయకం అని అనిపించింది. అందుకే ఆయన పాఠకులకు, శ్రోతలకు, ప్రశంసకులకు ఇదంతా అందించాలి అని అనిపించింది. పంచాలనిపించింది. ఈ పుస్తకం, పంచాలనే కోరికకి నేను చేసిన ప్రయత్నం.

ఎక్కడైనా, ఏదైనా పునరావృతం అయితే నీరజ్ కావ్య-పఠనం లాంటిదే అని భావించండి. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకు అమితమైన ఆనందం కలిగేది. మీకూ మంచిగా అనిపిస్తుందని నేను భావిస్తున్నాను. ఒక వేళ మంచిగా అనిపించక పోయినా చెడుగా మాత్రం అనిపించదని నా అభిప్రాయం.

  1. నేను “మస్త్ ఫకీర్” నండీ…..
    నేను “మస్త్ ఫకీర్” నండీ! నాదంటూ ఏ చోటు లేదండీ!
    నేను ఎట్లా వస్తానో అట్లా వెళ్లిపోతానండీ!
    రామ్‌ ఘాట్ లో పొద్దున గడిచిపోతే,
    ప్రేమ్ ఘట్ లో రాత్రి గడిచిపోయింది,
    ఒక గూడు లేదు, తల పైన నీడా లేదు,
    అయినా ప్రతి వర్షఋతువు గడిచిపోయింది.
    ఎన్నెన్నో మాహల్ లని చూసానండీ! వాటిల్లో ఉండి నిజాన్ని తెలుసుకున్నానండీ
    ఏ ఇంట్లో అయినా ఆత్మీయత – ఆప్యాయతలు ఉన్నాయా! అన్నీ వెల వెలపోయిన ఇళ్ళేనండీ! ||నేను మస్త్ ఫకీర్ నండీ||
    అందరి ధనం వెండి – బంగారాలు
    నా ధనం మాత్రం ప్రేమ – ఆత్మీయతలు
    మనస్సు నుండి మనస్సు దాకా
    నా వ్యాపారం కొనసాగిందండీ!
    డబ్బు – దస్కమే ధ్యేయం అనుకునే వారికే లాభనష్టాల లెక్కలు
    ఉదయపు మంచు లాంటిదండీ నా లాభ నష్టాల లెక్కలు. ||నేను మస్త్ ఫకీర్ నండీ!||
    పూలు – ముళ్ళు ఏవి దొరికినా,
    మనస్ఫూర్తిగా స్వీకరించానండీ,
    మానావమానాలు ఏవి దొరికినా,
    పిచ్చివాడిలా సమానంగా భరించానండీ!
    ఎవరు ధనవంతులు ఎవరు బీదవాళ్ళు, ఎప్పుడు ఆలోచించలేదండీ!
    అందరిదీ ఒకే చోటండీ, కాకపోతే వేరు – వేరు దారులండీ! ||నేను మస్త్ ఫకీర్ నండీ!||
  2. ఈ జీవితం, సంబంధాల సంగమం…
    ఈ జీవితం సంబంధాల సంగమం,
    ఒక సారి ఇది జన్మంతా శాపం అయితే, మరో సారి దేవతల వరం,
    ఈ సంగమంలో అందరు స్నానమాడతారు,
    మునిగినా, తేలినా ఏదైనా సరే,
    ఈ శ్వాసల ఋణాన్ని వాయిదాలలో తీర్చాల్సిందే. ||ఈ జీవితం||
    ఒక తీరం బాధల లైరు బండి అయితే,
    మరో తీరం సుఃఖాల తీరనాళ్ళు,
    ఈ రెండింటి మధ్య పేకల మేడ ఉంది,
    విరహం – కలయికలు రెండు ధారలు,
    ఒక సారి నవ్విస్తాయి, మరో సారి ఏడిపిస్తాయి. ||ఈ జీవితం||
    ఇక్కడ కొందరు ఆకలితో అలమాడుతారు,
    మరి కొందరు దాహంతో చచ్చిపోతారు,
    అందరికి కాజు-కిస్‌మిస్‌లు దొరకవు. ||ఈ జీవితం||
  3. సాధువా! తెలుసుకో!
    సాధువా!తెలుసుకో! జీవితం అంటే దుఃఖాల సముద్రం
    ప్రతిరోజు, కాలం తన చేతుల్లో కాలుతున్న కట్టెను పట్టుకుని తిరుగుతుంది,
    పక్షులు, పంజరాలు మాడి మసై పోతాయి,
    శతాబ్దాలు, కల్పాలు, మన్వంతరాలు మండి పోతాయి,
    పెద్ద – పెద్ద మంటలు రగులుకున్నాయి, వెండి – బంగారాలు ఏవీ మిగలలేదు. ||సాధువా! తెలుసుకో!||
    ఎత్తుకన్నా ఇంకా ఇంకా పై పై ఎత్తు
    పల్లం కన్నా ఇంకా ఇంకా పల్లం
    వీటి పైన ఉన్న ప్రతి భుజం పై వంద మణుల కట్టెల బరువు ||సాధువా! తెలుసుకో!||
    పడమరకి వెళ్ళు, తూర్పుకి వెళ్ళు
    ఎక్కడ విబూది పెట్టినా,
    ఒక చేయి ప్రతి చోటు క్షణం క్షణం వీపు మీద కర్రల దెబ్బలు వేస్తుంది. ||సాధువా! తెలుసుకో!||
    రాజు – పేదా, గృహస్థుడు, సన్యాసి!
    పెద్ద కత్తులను ఇష్టపడే విలాసీ!
    ఎవరు ఇక్కడికి వచ్చినా, గడ్డి మోపు ఖాళీ చేసే వెళ్ళారు ||సాధువా! తెలుసుకో!||
    బొంత కప్పుకుని,
    మట్టిబొమ్మ పడుకుని ఉంది.
    ఓరి పిచ్చి వాడా ప్రపంచం అంటే పట్టు వస్త్రం లేని శవంరా ||సాధువా! తెలుసుకో!||
  4. సాధువా! మనందంరం…
    సాధువా మనమందరం, చదరంగంలోని పావులమే,
    ఒకరు ఎరుపు, మరొకరు నలుపు, ఒకరు పెద్దగా, మరొకరు చిన్నగా,
    ఒకరు పీడింపబడి, మరొకరు నిలబడి
    ఒకరు ఏడ్చి, మరొకరు నవ్వి,
    అందరు ఈ గడ్డు ఆటని ఆడుతూనే ఉంటారు, ముద్ద దొరకకపోయినా. ||సాధువా! మనమందరం||
    ఈ గడి నుండి ఆ గడి వరకు
    బానిస నుండి యజమాని దాకా,
    కాలం అనే ఆటగాడి చేతిలో అందరి పిలకలు ||సాధువా! మనమందరం||
    అప్పుడప్పుడు ప్రతీ పావు గెలుస్తుంది
    ఒక్కక్క సారి అనుకోకుండా ఓడిపోతుంది
    ఒకడు ఎత్తుకు పై ఎత్తు వేస్తే, మరొకడు లంగోటీ సైతం ఓడిపోతాడు. ||సాధువా! మనమందరం||
    ఒక్కొక్క ఎత్తు ఒక్కొక్క ఉరితాడు,
    ఒక్కొక్క ఇల్లు అంతా మాయాజాలం
    ఇక్కడి అందరి నుదిటి రాత, కుక్కనోట్లో బొమికెలాంటిది. ||సాధువా! మనమందరం||
    చదరంగం పరిచినంత వరకే, పావులు జమ అయినంత వరకే,
    ఈ ఆటలు, పరుగులు – ఉరుకులూ,
    ఆ తరువాత కట్టేస్తారు అందరిని పెద్ద మూటలో. ||సాధువా! మనమందరం||

1941 నుండి నేటి వరకు నీరజ్‌గారు గోష్ఠులలో 111 కవి సమ్మేళనాలలో పాల్గొంటునే ఉన్నారు. దాదాపు 64 సంవత్సరాలు నుండి వారు వేదిక పైన కవితలు చదువుతునే ఉన్నారు. గీతాలు పాడుతూనే ఉన్నారు. ఆయన కంఠం మాధుర్యం గురించి చెప్పాలంటే పదాలు దొరకవు. అసలు ఇంత దీర్ఘాయుష్షు ఎవరికి లభిస్తుంది? చాలా తక్కువ మందికి మాత్రమే. ఆయన కవితలు చదివే తీరులో అధ్బతమైన అమూల్యమైన లయ ఉంది. అందుకనే ఆయన ఎత్తైన శిఖరాలను స్పర్శించగలిగారు. ఈ యాత్రలో ఆయనకి ఎన్నో చేదు అనుభవాలు కూడా కలిగే ఉంటాయి. అవమానాలు జరిగే ఉంటాయి. ఎన్నో కష్టనష్టాలను భరించాల్సి వచ్చే ఉంటుంది. ఒక్కొక్కసారి పూర్తిగా కవితలు చదవకుండానే ఆపేయాల్సిన పరిస్థితిలు కూడా వచ్చి ఉండవచ్చు. అందుకే కవి సమ్మేళనాలలో ఆయనకు కలిగిన ఆనందాలు – అనుభవాల గురించి నేను తెలుసుకుందామనుకున్నాను. నేను అడగగానే ఆయన చెప్పడం మొదలు పెట్టారు.

1941 సంవత్సరంలో మొట్టమొదటి సారిగా ఏటాలో జరిగిన కవి సమ్మేళనంలో నేను పాల్గొన్నాను. కవితని చదివినాను. ఇక ఆ తరువాత నా పేరు అంతట మారుమ్రోగిపోయింది. ఫిరోజ్‌బాద్‌లో జరిగిన కవి సమ్మేళనానికి శ్రీ రత్నలాల్ బంసల్ నన్ను ఆహ్వానించారు. అందరు నా కవితను ఎంతగానో మెచ్చుకున్నారు. నన్ను చూడగానే ఆశ్చర్యపోయారు. నేను వయస్సులో చిన్నవాడిని. ఆ తరువాత వారు నాకు స్నేహితులయ్యారు. దాదాపు అక్కడ జరిగిన ప్రతీ కవి సమ్మేళనానికి నన్ను పిలిచారు. మొట్టమొదట నాకు ఐదు రూపాయలు ఇచ్చారు. నిజానికి ఈ రోజు నాకు వెయ్యి రూపాయలకన్నా, ఆ ఐదు రూపాయలు ఎంతో విలువైనవి ఎందుకో తెలుసా? అది నా ‘మొదటి సంపాదన’.

నీరజ్ గారు చెబుతూ చెబుతూ నవ్వడం మొదలు పెట్టారు. నవ్వు ఆపి మళ్ళీ చెప్పడం మొదలు పెట్టారు – “ఒకసారి ఫిరోజ్‌బాద్‌లో కవి సమ్మేళనంలో పాల్గొనే ముందు నేను కొంచెం భంగ్ తాగాను. బహుశ 1952లో అనుకుంటాను. నేను గీతాన్ని పాడుతున్నాను. – “మత్ కరో ప్రియ రూప్ కా అభిమాన్, కబ్ర్ హై ధరతీ, కఫన్ హై ఆస్‌మాన్” (ప్రియతమా రూపాన్ని చూసి గర్వపడకు, నేలే సమాధి ప్రేత వస్త్రమే ఆకాశం) మరో పంక్తిని చదువుతున్నాను – “రంక్ రాజా, మూర్ఖ్ పండిత్, రూపవాన్ కురూప్” (రాజు పేదా, మూర్ఖ్ పండిత్, అందమైనవాడు కురూపి) చదివేటప్పుడు నా కళ్ళు మూసుకు పోతున్నాయి. మూర్ఖ్ పండిత్ అని అంటున్నప్పుడు ఒక్క సారిగా నా కళ్ళు తెరుచుకున్నాయి. ఎదురుకుండా బొట్టు పెట్టుకున్న ఒక పండితుడు కనిపించాడు. చూడగానే నాకు ఇంకా నవ్వు వచ్చింది. అసలు ఆ నవ్వును ఆపుకోలేక పోయాను. ఇక నేను ఇక చదవలేకపోయాను. ఆ రోజు ఇక ఎప్పుడు భంగ్ తాగను అని ఒట్టు పెట్టుకున్నాను.”

ఒక సారి ఆగ్రాలో కవిత చదువుతున్నాను – “హర్ ముసాఫిర్ బినా పాఁవ్ చల్ నే లగా…”(ప్రతి బాటసారి కాళ్ళు లేకుండా నడుస్తున్నాడు) ఇంతలో పెద్దగా ఎవరో అరిచారు. భూతం… భూతం… భూతం… నాకు కోపం వచ్చింది. మరో క్షణంలో నవ్వూ వచ్చింది. అందరు వెనక్కి తిరిగి చూసారు. భంగ్ తాగిన ఒక చతుర్వేది కూర్చుని ఉన్నారు. ఆయన కూర్చున్న విధానం చూసాక, కంఠం విన్నాక నాకు నవ్వు ఆగలేదు.  ఆ రోజు నేను కావ్య పఠనం చేయలేకపోయాను.

1953-55 లో నేను నిరుద్యోగిని. ఆ సమయంలో దేశం మొత్తంలో జరిగిన కవి సమ్మేళనాలలో నేను పాల్గొన్నాను. దేశం నలుమూలలు నా పేరు మారుమ్రోగింది. బెనారస్‌లో ఒక కాలేజిలో కవిసమ్మేళనం ఏర్పాటు చేసారు. నేను కాల్ కా మేల్‍లో బయలు దేరాను. మొగల్ సరాయ్ స్టేషన్ లో దిగాను. నన్ను రిసీవ్ చేసుకోడానికి కొందరు వచ్చారు. సుధాకర్ గారు వచ్చారని నాకు జ్ఞాపకం ఉంది. ఆయన మెడలో పిస్తోలు వేలాడేసి ఉంది. కవి సమ్మేళన నిర్వాహకులు రాలేదా అని అడిగాను. మిమ్మల్ని తీసుకు వెళ్ళి ఒక గదిలో బంధించి ఉంచాలని వాళ్ళ ప్లాన్. కవి సమ్మేళనం అయ్యాకే మిమ్మల్ని విడుదల చేయాలి. అందువలనే మేము మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చాము. ఇక ఇప్పుడు వాళ్ళు  మిమ్మల్ని ఎట్లా గదిలో బంధంచి ఉంచగలరో చూద్దాం అని ఆయన అన్నారు. నేను ఒక్కసారిగా అవాక్కయ్యాను. భయపడ్డాను. వేదిక దాకా వాళ్ళు నన్ను తీసుకు వెళ్ళారు. అక్కడ నరేష్ మెహతా అధ్యక్షత వహిస్తున్నారు. “హియర్ కమ్స్ ద టెర్రర్ ఆఫ్ ది కవిసమ్మేళన్” అన్నారు. నేను వెళ్ళగానే ఒక్కొక్క కవి వేదికను దిగి వెళ్ళిపోతున్నారు. మాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది అని సాకులు చెప్పడం మొదలు పెట్టారు. వాళ్ళందరు బయట ఉన్న బస్సులో వెళ్ళి కూర్చున్నారు. కాని నరేష్ మెహతా గారి భార్య నేను నీరజ్ గారి కవితలు వినకుండా వెళ్ళను అని అన్నారు. బయట బస్సులో కూర్చున్న వాళ్ళు హారన్ కొడుతునే ఉన్నారు. ఇంకా అక్కడ కూర్చున్న వాళ్ళందరు వస్తే బస్సు బయలుదేరుతుందని వాళ్ళ ఉద్దేశం. రాత్రి దాదాపు 12 గంటలకు కవి సమ్మేళనం సమాప్తమయింది. అప్పటి దాకా ఆ కవులందరు బయట చలికి ఒణికి పోతున్నారు. నాకు వ్యతిరేకంగా నన్ను అవమానం చేయడానికి  పన్నాగం పన్నారు.

(సశేషం) 

Exit mobile version