[box type=’note’ fontsize=’16’] “నీలో పరకాయ ప్రవేశం చేసిన ఆ కాళీదాసుడిని చూసి అభినందించాలనిపిస్తుంది” అంటున్నారు జవేరియా ఈ కవితలో. [/box]
[dropcap]నీ [/dropcap]కలంలో దాగిన మర్మం
ఏమిటో తెలియదు గాని…!
జాలువారే అక్షరాలన్ని గలగల పారే సెలయేరులా
ఆగకుండ ముందుకు సాగిపోతూనే నన్ను ఆప్యాయంగా పలకరిస్తూంటాయి!
నీ తో లిఖించబడిన పదాలన్ని నాలో సరిగమలను
సృష్టించి ఎదమీటి రస మధురమైన రాగాలనే పలికిస్తాయి!
మేలి ముత్యాలవంటి నీ మాటల
పన్నీటి జల్లు నన్ను తడిపేస్తూ
నదీ తీరాలకు చేరుస్తుంటాయి!
నీ మనో మందిరంలో రూపు దాల్చిన
కవిత కుసుమాలన్ని రోజుకో బహుమానంగా
నాకందిస్తూ ఆనందింప చేస్తుంటే….
నీలో పరకాయ ప్రవేశం చేసిన
ఆ కాళీదాసుడిని చూసి అభినందించాలనిపిస్తుంది!
నీ ఊహాలోకంలో విరబూసిన అందమైన
పువ్వునై నిత్యం నీలో పరిమళిస్తూనే ఉంటాను!!