కవితా వస్తువు!!

0
3

[శ్రీ సముద్రాల హరికృష్ణ రచించిన ‘కవితా వస్తువు!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]పొ[/dropcap]ట్ట కూటికి అగ్నిహోత్రుని ప్రవేశ ద్వారమిదే/
చిత్త శుద్ధికి రుద్రపూజలో ధూపాదుల దారిదే/
అన్ని పనుల మూల మెలెక్ట్రిసిటీ ప్రాగ్రూపమిదే/
తుట్ట తుదకు పూర్ణ ఫలమిచ్చు నిగ్గు తేజమిదే!!
(అగ్గిపుల్ల)
***
అంతరంగముల శుధ్ధి మింటి దేవుడెరుగు, ఒంటి/
వింత మిలమిలల కిది లేక, తరుగె తరుగు,
నేతల మాట మూటలన్ని దీని నురుగె నురుగు/
ఇంతి నేటికాలపు నీటు గోటుల పైడి సొరుగు!!
(సబ్బుబిళ్ళ)
***
అన్నమిడిన వాని ననుక్షణము వెన్నంటి గాచు/,
దన్నుగ, యజమాని మేలుకు ఉసురైన విడచు/
అన్నన్న, జాలి వీడిన కొడుకు కొరత తా దీర్చు/
చిన్నన్న, నీడయై, కడ వరకు నీతోనే నడచు!
(కుక్కపిల్ల)
***
ఇది కాదె నిష్కర్ష, ఆ అధిక సిరుల ఆంధ్ర కవిది
ఏదైన–అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల, ఏదైనను,
కాదేదీ కవిత కనర్హమని! జనహితమె గీటని!
ముందుగ పసిగట్టి ఆగామి, మాటాటల గడుసాసామి!.
(శ్రీశ్రీ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here