[dropcap]క[/dropcap]వితా! ఓ కవితా!!
నిన్ను రాయని కలాన్ని నేనై
నిన్ను చదవనీ పుస్తకాన్నై నేను
అక్షరాలను చెక్కడం భావస్వేచ్ఛైన
వ్యక్తావ్యక్త అభివ్యక్తి సౌందర నందనమై
పదాలను కూర్చే ప్రకృతి కృతి సుమ సౌందర్యమై
నడకలో జన జగమంతా పాదాల గురు లఘువులై
నాలో పరవశించిన పద్యమై నేను
సామాజిక రుగ్మతల్ని మాన్పే
వైద్య కవితా జీవళ శిల్పాన్నీ నేనై..