Site icon Sanchika

కవిత్వం!

ఊటబావిలా ఊరిస్తావు
ఉహకందని నీరిస్తావు
కలలో నువ్వే కవ్విస్తావు
కనిపించక మురిపిస్తావు
మస్తిష్కంలో కల్లోలం సృష్టిస్తావు
పదిమందిలో మెప్పిస్తావు
నలుగురిని నవ్విస్తావు
చదువుల బడినే
వలెస్తావు
పిల్లల కోసం తల్లి వౌతావు
తెలుగు కవుల సరిగమలౌవుతావు
కవిత్వమా కాసేపు కవ్వించుమా. .

రాగాలలో గానమౌతావు
రాసే యువకుల ప్రేమౌవుతావు
విరహం, సరసాలాలతో
సాధిస్తావు
అవధానాలతో అలరిస్తావు
అష్ట దిగ్గజాలనే ఆటాడిస్తావు
కవిత్వమా కాసేపు లాలించుమా.

Exit mobile version