Site icon Sanchika

కావ్య మత్తు జీవితమంతా నన్ను మత్తులోనే ఉంచింది… -3

[box type=’note’ fontsize=’16’] నీరజ్‌గారితో డా.ప్రేమ్‌కుమార్ జరిపిన సుదీర్ఘ సంభాషణని తెలుగులో అందిస్తున్నారు డా. వసంత టి.సి. ఇది మూడవ భాగం. [/box]

[dropcap]”గ[/dropcap]జల్‌కి ఒక నియమం ఉంది… మొదటి పంక్తిలో ఎక్కడైతే స్వరాఘతం (యతి) ఉటుందో అదే ప్రతి పంక్తిలోను రావాలి. నేను కొంత పరివర్తన చేసాను. ఈ విధంగా పరివర్తన చేయడం వలన ఒకటి రెండు పంక్తులను గీత్‌లా రాయడం వలన గజల్‌కి ఉండే మొనోటమీ ఉండకుండా పోతుంది. ఇట్లు చేయవచ్చు, చేయగలుగుతాము అన్న ఉద్దేశ్యంతో మేం అట్లా చేసాం. దాని వలన నష్టం ఏమీ లేదు. అసలు ఉర్దూ బహర్‌ల వెంట ఎందుకు పడటం. హిందీ శబ్ధాలు ప్రకృతి, ప్రసాద్‌లను మరో విధ్ధంగా ఉచ్చారణ చేస్తూ, వ్యాకరణాన్ని మారుస్తూ హాస్యాస్పదంగా చేస్తారు. మనం కొంచెం లైసెన్స్ తీసుకుంటే మరి ఆ మూతి విరుపులు ఎందుకు? మనం వాళ్ళనే అనుసరించాలని ఎందుకు అనుకుంటారు?

నేను ఏదో తొందరలో రాయలేదు. లోతుగా అధ్యయనం చేసి రాసాను. అసలు తక్కువ సామాన్లు ఉంటే ప్రయాణం సుఖంగా ఉంటుంది. సరళమైన భాష ఒక మంచి సందేశం, జీవితంలో అధికంగా పనికి వచ్చే మాటలు. అందువలనే నేను మొత్తం దేశంలో పాపులర్ అయ్యానని అందరు అంటారు. విద్యార్ధి జీవితం నుండి నాకు రజనీష్‌తో పరిచయం ఉంది. నేను ఒక షేర్ ఆయనకి చెప్పాను. అమెరికా నుండి వచ్చాక మేం ఇద్దరం కలిసాము. వారు ముందు రజనీష్, తరువాత ఆచార్య రజనీష్, ఆ తరువాత భగవాన్ రజనీష్ అయ్యారు. ఓషో కాకముందు నేను వారితో అన్నాను – “ఏదో ఒక రోజు ఇదంతా వదిలివేయాల్సిన రోజు నీకు వస్తుంది.” ఎందుకు? అని వారు అడిగారు – ఎవరైతే చైతన్య వంతమైన హిమాలయాల ఆఖరి అంచున చేరాలనుకుంటాడో అతడి ఇంత బరువు తీసుకుని ఎట్లా వెళ్ళగలుగుతాడు? ఈ కీర్తి కిరిటాలు, అలంకారాలు అంతా బరువే. ఈ బరువును తగ్గించుకోవాలి. అన్నింటికన్నా పై స్థాయికి చేరినప్పుడు దిగంబరుడుగా మారిపోవాలి. పూర్తిగా నగ్నంగా నిలబడగలగాలి. వారు చిరునవ్వు నవ్వారు. తరువాత ఆయన కేవలం ఓషోగా మాత్రమే మిగిలిపోయారు. జపాను శబ్దం ఓషో. అది ఒక సింబల్… ఉపనిషత్‌లో ఒక సుత్రం ఉంది ‘రసోవైసః’ నేను ఒక షేర్‌లో ఇట్లా చెప్పాను. నేను గోపాల్‌దాస్, నీరజ్ ఈ రెండింటికి చెందని ఇంకో తత్వాన్ని. అదే ఆయన అద్దె ఇంట్లో ఉంది. ఆ అద్దె ఇంట్లో జీవితం అంతా అద్దెకున్నాను – నీవు ఆ రసిక్‌కి ఎప్పుడు అపరిచితుడిలాగానే ఉంటావు. నీరజ్… నీ సంజ్ఞ పైన విషేషణంగా ఉండే వరకు అంతే. జీవితాంతం నేను ఒక అపరిచిత వ్యక్తి ఇంట్లో ఉన్నాను. ప్రయాణం చేయకపోయినా ప్రయాణంలోనే ఉన్నాను. గజల్ టెక్నిక్ ‘ఆ’ శబ్దం నుండి నేనేం వ్యక్తం చేసాను, దానికి ప్రొనౌన్ పెట్టడం వలన ఇదంతా జరిగింది. “వో న జ్ఞానీ, న బిరహ్ మన్, న వో షేక్… వో కోయి జరా దేఖో తేరే మకాన్ తక్ పహుంచా” ఇక్కడ గజల్ చెప్పే కళ ఉంది. అసలు ఎంతో లోతైన కఠినమైన వాక్కును ఇంత తేలికగా చెప్పారు. ఏమీ రాని పామరుడు తెలుసుకోగలుగుతాడు. ఇక పండితుడి సంగతి వేరే చెప్పనే అక్కరలేదు. కృష్ణడు ఇట్లా అన్నాడు – నేను సృష్టిని, కర్తని కాను. నేను తయారు చేస్తాను కాని నేను నడిపించను.

తటస్థ ద్రష్ట. అసలు ఉపస్థితి లేనిదే ఏదీ నడవదు. అసలు నేను ఏమిటి? ఇంగ్లీషులో కేటలిస్ట్ అన్న శబ్దం ఉంది. అసలు దీని ఫంక్షన్ ఏదీ లేదు. ఓ, హెచ్, ఉన్నాయి. కాని విద్యుత్తు లేకపోతే నీళ్ళు తయారవ్వవు. నేను గజల్‌లో ప్రతీకలు, బింబాలు ద్వారా భారతీయతత్వాన్ని వ్యక్తం చేసాను – “న సోచ్ తూ కి సీయేగా వో తేరీ చాదర్ భీ. వో సిర్ఫ్ సుయి మే ధాగా పిరోనే వాలా హై.” (నీ దుప్పటి కూడా అతడే కుట్టిపెడతాడని అనుకోకు. అతడు కేవలం సూదిలో దారాన్ని ఎక్కించి మాత్రమే ఇస్తాడు.) ఇక ఇప్పుడు నీవు ప్రేత వస్త్రం, కుర్తా, బనీను, లుంగీ ఏదీ కుడతావో అది నీ బాధ్యత. అతడు కుట్టడు, అతడు సృష్టి చేసాడు. సూదిని ప్రతీకాత్మకంగా చేసి నేను ఒక చోట చెప్పాను. – “బిన్ ధాగా కీ సుయీ జిందగీ సియే న కుఛ్ బస్ చుభ్ చుభో హాజాయే – కటీ పతంగ్ సమాన్ సృష్టి యే లల్‌చాయే. పర్ హద్ న ఆయే” (దారం లేకుండా సూది, జీవితం ఏదీ కుట్టదు. పొడుస్తూ ఉంటుంది. తెగిన గాలి పటంలా ఈ సృష్టి ప్రలోభపరుస్తుంది కాని చేతికి రాదు). సాత్రే తత్వానికి భారతీయకరణ (ఇండియనైజ్). బాగా లోతుగా చదివిన వాళ్ళకి తెలుస్తుంది. దాదాపు ఆరుగురు పి.హెచ్.డి చేసారు. చాలా రాసారు కాని కవితలను పూర్తిగా చదివి లోతుగా అధ్యయనం చేసి ఇంకా ఋజువులను ఇవ్వలేకపోయారు.”

నీరజ్‌లోని మంచి వక్త, లెక్టరర్ రూపం ఆయన కవితలలోని దార్శనికత, ఆయన అధ్యయనం గురించి ప్రశ్నలడిగినప్పుడు బయటకు వచ్చింది భాషా సంబంధమైన ప్రయోగాల విషయం వచ్చినప్పుడు కొత్త కొత్త విషయాలు చెప్పారు. నీరజ్ తన గీతాల వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు విద్యార్ధులకు చదవు చెప్పే రీతిలో చెప్పడం మొదలు పెట్టారు.

“అసలు ఇప్పుడు చదివే వాళ్ళు ఎవరు? అరవింద్, బుధ్ధుడు, మదర్, గీత, ఉపనిషత్‌లు, మహావీర్, వైష్టవ్ దర్శనం. బైబిల్, ఖురాన్, భర్తృహరి మొదలైనవి.. నేను ఏది చదివినా లోతుగా చదివాను. కబీర్ ఈ పంక్తి ఎంతో ప్రసిద్ధి చెందింది. “ఢాయి ఆఖర్ ప్రేమ్‌ కా పఢై సో పండిత్ హోయ్” ఇందులో కవిత్వం కన్నా ఉపదేశం ఎక్కువ ఉంది. అఖిరలో సూటిగా చెప్పే గుణం కబీర్‌లో ఉంది. ‘ఢాయి ఆఖర్’ ఫ్రేజ్‌తో కవిత తయారయింది. మోలికంగా చెప్పబడ్డది. ఫిరాక్ ఇట్లు చెప్పారు – “సద్‌సాలా దౌరె-ఛర్ఖ్ థా సాగర్ కా ఏక్ దౌర్, నికలే జో మయకదే తో దునియా బదల్ గయీ.” భూమి తిరుగుతుంది అని మనం అంటాం. ఇస్లాం తత్వం ఆకాశం కూడా తిరుగుతోంది అని అంటుంది. ఆకాశంలో వంద సార్లు తిరిగే చక్రం మన మధుశాలలో తాగే పాత్రకు ఒక్కసారి సమానం. తాగి బయటపడ్డప్పుడు ప్రపంచ వికాసం 100 సంవత్సరాలకు చేరింది. ‘ఢాయి ఆఖర్..’ రెండున్నర అక్షరాలు… అంటే ఒక్క గుక్క. నేను ఇట్లా అన్నాను. నీ గుడిలో ఒక గుక్క ప్రేమను తాగాను. నేను బయటకి వచ్చి చూస్తే ప్రపంచం కన్నా నేను 100 సంవత్సరాలు ముందుగా ఉన్నాను, ఒక యుగం దాకా మొత్తం ప్రపంచం అక్కడికి చేరలేదు… నా భాషా ప్రయోగాలను సరియైన రీతిలో ఎవరు అధ్యయనం చేయలేదు. మొట్టమొదట ‘ముక్తక్’ లను నేనే రాసాను. ఇవి పేరు పొందాయి. పతీకాత్మక శైలిలో కవిత రాసాను. అది ఒక ప్రక్రియ అయింది. అనేక బాషా రూపాలను, భాషలోని మహత్యాన్ని నేను చూపెట్టాను. “మై సోచ్ రహా అగర్ తీసరా యుద్ధ్ హూవా తో ఇన్ నయీ సుబహ్ కీ నయి ఫసల్ కా క్యా హోగా?”(మూడో ప్రపంచ యుధ్ధం వస్తే, ఈ కొత్త ఉదయపు కొత్త అంకురాలు స్థితి ఏమిటి? అని అలోచిస్తున్నాను.) “ఆజ్ కీ రాత్ బడీ శోఖ్, బడీ నట్‌ఖట్ హై ఆజ్ తో తేరే బినా నీంద్ నహీఁ ఆయేగీ” – (ఈ రాత్రి ఎంతో చిలిపి అల్లరి రాత్రి… ఇవాళ నీవు లేకుండా నిద్ర రాదు.) “సేర్ భర్ బాజరీ మై సాల్ భర్ ఖావుంగీ… ” (శేరు సజ్జలు నేను సంవత్సరం పోడుగునా తింటాను.) ఇది నా శైలీ శల్పం. ఇది నా దౌర్భాగ్యం. ఎవరు సరియైన రీతీలో అధ్యయనం చేయలేదు.”

మీ విషయంలో కాదు చాలా మంది ప్రసిద్దమైన రచయితల కూడా ఇదే విధంగా ఫీల్ అవుతున్నారు అని నేనన్నాను. వెంటనే బచ్చన్ విషయంలో ఇదే జరిగింది అని అన్నారు. తరువాత ఆయన చాసిన కవితల ప్రయోగాల గురించి చెప్పడం మొదలు పెట్టారు-

“రుబాయి శైలిలో మనస్సులోని మాట చెప్పడం ఈ శక్తిని చూడండి – “క్యా కహుం యార్, హమే యారోం నే క్యా… క్యా… సమఝూ? కిసీనే కతరా కిసీ నే హమేం దరియా సమఝూ, సబ్ సమఝాతే రహే వో హీ జిసే జైసా ఆయా… కింతు హమ్ జో థే, వహితో న జమనా సమఝా.. (ఏం చెప్పను దోస్త్! నా గురించి అందరు ఏదో ఏదో అనుకున్నారు. కొందరు నన్ను తుంచేస్తే మరి కొందరు నన్ను ఓ సముద్రం అని అనుకున్నారు. కాని అసలు సిసలైన నేనేమిటో ఎవరు అర్థం చేసుకోలేదు.) భక్తిని వ్యక్త పరచాలంటే భాష మారుతుంది. ఒకే భాషలో అన్ని భావాలను వ్యక్త పరచలేము.

“తుఝుసే లగన్ లగాయి, ఉమర్, భర్ నీంద్ న ఆయి, సాంస్ సాంస్ బన్‌గయి సుమరిని, మృగ్‌ఛాలా సబకీ సబ్ ధరణీ, క్యా గంగా, కైసీ వైతరణీ భేద్ న కుచ్ కర్ పాయీ, దహాయి బనీ ఇకాయి” – (నీతో బంధం ఏర్పరుచుకున్నాను – జీవితం అంతా నిద్రలేదు. శ్వాస, శ్వాస ప్రార్థన అయింది. మొత్తం ధరణి ఎండమావే. ఏది గంగో ఏది వైతరిణియో, అసు బేధం తెలుసుకోలేక పోయాను). ‘లగన్’ అన్న శబ్దం ఎంత అందాన్నిచ్చింది. భక్తి గీతం యొక్క స్థాయి ఇది. ఛందస్సు చూడండి. చంధస్సులో కవిత గురించి ఒక్కక్కరు ఒక్కక్క విధంగా భావిస్తారు. కవితలో భాష కవి ఇంటి దర్వాజ దగ్గరికి ఆలోచన ఒక అతిథిగా రావాలి. భాష ఆ అతిథికి ఆతిధ్యం చేసే ఏర్పాటు. ఆతిథి ఇంగ్లీషు ఎక్కువగా వాడే ప్రదేశం నుండి వస్తే, చేర్, టేబుల్ పై భోజనం. వాళ్ళు తినే భోజనం. స్వాగతం కూడా అదే రీతిలో. సరైన రీతిలో ఏర్పాటే గీతత్వానికి సౌందర్యం. ఒక వేళ వ్రజ భూమి నుండి వస్తే మరో రకమైన భోజనం, మరో రీతిలో స్వాగతం. కవికి అతిథి ఎక్కడివాడో తెలియాలి. ఆ జ్ఞానం ఉండాలి. నగరవాసా, పల్లెవాసా దీనిని అనుసరించే భాషను వాడాలి. అప్పడే కవిత్వం మెరుగ్గా ఉంటుంది. నేను వ్రజ భాషలో ఇట్లా రాసాను. – “మాఖన్ చోరీ కర్ తూ నే కమ్ తో కర్‌ దియా బోఝ్ గ్వాలన్ కీ రీతీ గాగర్ కా – యుగ్ యుగ్ చలీ కాల్ కీ మథనీ తబ్ ఝులకీ దహీ మే చికనాయీ- (వెన్న దొంగిలించి నీవు గోపిక కుండ నుండి బరువు దించావు. యుగయుగాల వరకు కాలమనే కవ్వం చిలుకుతూనే ఉంది. అప్పుడు పెరుగులో జిడ్డుతనం తొలిగింది). ప్రతీకలన్నీ వ్రజ భూమికి సంబంధించినవే. మాఖన్ అనే బదులు మఖన్ అన్నీ శబ్దం రాస్తే వ్రజ భాషకుండే లాలిత్యం ఉండదు. అప్పుడు గీతంలో ప్రాణం ఉండదు, భాష భావం, వాతావరణం అన్వయం వలనే గీతంలో ప్రాణం ఉంటుంది. నాటకం లాగా అన్వితి.

సామ్యవాదం, ఆధ్యాత్మిక సామ్యవాదం అందరికి తెలిసిందే. మార్క్స్ చెప్పినదాన్ని నేను ఉపనిత్తుల జ్ఞానం ఆధారంతో చెప్పాను. భాష, భూమిక భేధం స్పష్టంగా తెలుస్తుంది – “జబ్ తక్ థీ భరపుర్ మటకియా, సౌ సౌ చోర్ ఖడే థే ద్వార్ అన్‍గిన్ చితాయే థీ మన్ మే, గేహ్ జడే థే లాఖ్ కివాడే” (కుండ నిండుగా ఉన్నంత కాలం, ద్వారం ముందు వందల దొంగలున్నారు. మనస్సులో లెక్కలేనన్ని చితులు ఉన్నాయి, ఇంటికి లక్ష ద్వారాలు)

పెట్టుబడి మనిషి ఆత్మను ఎన్నో ద్వారాలలో బంధించి వేసింది. “కింతు కట్ గయి అబ్ హర్ సాంకత్ జార్ హే గయీ హర్ హర్ ముష్‌కిల్. అబ్ పర్‌వాహ్ నహీ ఇతనీ భీ నావ్ లగే కిస్ నదీ కినారే” (కాని ఇప్పుడు ప్రతీ సంకెల విరిగిపోయింది. ప్రతీ కష్టం తీరిపోయింది. ఇక ఇప్పుడు ఏ నది ఒడ్డుకు చేరుకుంటుందో లెక్క చేసేది లేదు.) మార్క్స్ విషయం – చరణాలు పెట్టబడి మీద నిలబడి ఉన్నాయి. పెట్టుబడి ఒక అభిఘాతం. జాతి, వర్గ రహిత సమాజం గురించి వివిధ వాదాల గురించి జైన దర్శనంలో పునర్జన్మ సిద్ధాంతం ఎంతో మామూలు మాటాల్లో చెప్పబడ్డాయి. సత్య బోధకుడిలో అహం ఉండదు – “ఇస్ ద్వార్ క్యూం న జావూం, ఉస్ ద్వార్ క్యూం న జావూం ఘుర్ పాగయా తుమ్హారా, మై ఘర్ బదల్ బదల్ కే. ఇస్ గాంవ్ ఏక్ కాశీ, ఉస్ గాంవ్ ఏక్ కాబా, ఇస్ కా ఇధర్ బులావా, ఉస్ కా ఉధర్ బులావా! ఇస్ సే భీ ప్యార్ ముఝుకో ఉస్ సే భీ ప్యార్ ముఝుకో కిస్ సే గలే లగవూం, కిస్ సే కరూం దిఖావా? పర్ జాతి క్యూం బనావూ… దీవార్ క్యూం వుఠావూ. హర్ ఘట్ జల్ పియా హై గాగర్ బదల్ బదల్ కే” (ఈ ద్వారం వైపు ఎందుకు వెళ్ళను? ఆ ద్వారం వైపు ఎందుకు వెళ్ళను? ఇల్లు మార్చి మార్చి నీ ఇల్లు చేరేను. ఈ ఊరు ఒక కాశీ, ఆ ఊరు ఒక కాబా. ఇక్కడి నుండి పిలుపు అక్కడి నుండి పిలుపు. దీనిని నేను ప్రేమిస్తాను. దానిని ప్రేమిస్తాను. ఎవరిని కౌగిలించుకోను? ఎవరి కోసం నటన? అసలు కులాన్ని ఎందుకు తయారు చేయాలి? గోడని ఎందుకు ఎత్తాలి? కుండ మార్చి మార్చి నేను ప్రతి ఘట్ (ఒడ్డు) నీళ్ళు తాగాను. మాటిమాటికి పంక్తులను ఆయన రీపీట్ చేస్తూన్నారు.) “హర్ ఘాట్ కా జల్ పియా హై.”

“దిగంబర సంప్రదాయాన్ని సంత్ వాణి ద్వారా నేను ఇట్లు చెప్పాను.”

“చుప్ రహే తో అనుభూతి బోలే. ఆంగన్ కా ద్వార్ ఖులతా నహీ బాహర్ సే ఖోలో. తధ్య్ హై సీప్, సత్య్ హై మోతీ. ఆవరణ్ ఉఘడ్ తబ్ దిఖా జ్యోతి. నగ్న్ హీ పహతే, ఫీర్ జో హై వో హోతే” (మౌనంగా ఉంటే అనుభూతి ఇట్లు అంది. ప్రాంగణంలోని ద్వారం తెరుచుకోదు. బయట నుండి లేదు. ముత్యపు చిప్ప తధ్యం, ముత్యం సత్యం. ఆవరణ తొలగించు అప్పుడు జ్యోతి కనిపిస్తుంది. నగ్నమవు మొదట. తరువాత ఏది ఉంటే దానినే స్వీకరించు.) అంటే పవిత్ర బుద్ధత్వాన్ని స్వీకరించు. బుద్ధుడు లాంటి వాడు ఇక పుట్టడు. ఆయన తత్వం-సముత్పత్తి వాదం ప్రకారం ఒకదాని నుండి మరొకటి పుడుతుంది. ఏ రోజైతే జన్మ వస్తుందో ఆ రోజు నుండే మృత్యువు ప్రారంభం అవుతుంది. వైజ్ఞానికంగా, ఆధ్యత్మికంగా ఆలోచించండి – ఇప్పుడు మీ ఎదుట కూర్చున్న నేను ఒకప్పుడు అమ్మ ఒడిలో కూర్చున్న నేను కాదు. బుద్ధుడు ఒక ధారలో మనం మళ్ళీ స్నానం చేయలేం అని అన్నారు. నేను ఇట్లు రాసాను – “కేవలం కొంగును వదిలించుకోవాలనే ఆగాను. కాని బిడారు వంద కోసుల ముందుకు వెళ్ళిపోయింది. ఏ చెట్టు మీద గూడు కట్టుకోవాలని నిర్ణయించుకుంటుండగానే, తోట అంతా పచ్చబడిపోయింది. శిశిరంగా మారి పోయింది. ఒక ముక్తక్ పంక్తి – ” ‘అంతా లభించింది నీరజ్ అని అనుకోగానే నేను ఏదీ తెలుసుకోలేదని తెలసుకున్నాను.’ ఇదే జీవనతత్వం ఇదే కవితా తత్వం.

అవును ఇదే కవితాతత్వం, కవిత పరిభాష – అన్నింటి కన్నా తులసీదాసు చెప్పిందే సరియైన పరిభాష అని నాకు అనిపిస్తుంది. “మిస్టీరియస్ ఎలిమెంట్ ఈజ్ నెససరీ ఎలిమెంట్ ఆఫ్ పోయట్రీ”. భరతుడు రాముడికి వెనక్కి వచ్చేయమని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన వారి వర్గన చేస్తూ తులసి కవితకి పరిభాష ఇచ్చారు – “సుగమ్ అగమ్ మృదు, మంజు, కఠోరే అరథు అమిత్ అతి ఆఖర్ థోరే.”

సుగమ్ (ప్రసాద గుణం), అగమ్ (జ్ఞాని కోసం అగమ్ అర్థం), మృదు (మాధుర్య గుణం),  కఠోర్ (ఓజ గుణం, ఆస్థా యుక్త ధృఢత్వం) కవిత్వానికి ఉండాల్సిన గుణాలు. ఆయన ఇంకా ఇట్లు అన్నారు. ‘జ్యోం ముఖు ముకుర్, ముకురూ నిజ్ పానీ గహి న జాయి అస్ అద్భుత్ బానీ’ శబ్దాలు కాదు. అక్షరం. కవి శబ్దాలతో కాదు అక్షరాలతో కలుపుతాడు. వాక్ నుండి సూక్ష్మ శబ్దం, శబ్దం నుండి అక్షరం, అక్షరం నుండి నాదం, నాదం తరువాత భావం లేక స్వయం. చాలామంది శబ్దాల వరకే పరిమితం అయ్యారు. అక్షరం తరువాతి నాదం. గాయత కవితకి ముఖ్యం. ‘ఆజ్ జీ భర్ దేఖ్‌లో తుమ్ చాంద్ కో…’ ఇక్కడ చాంద్‌కి బదులు చంద్ర అని పెడితే సరిగ్గా అనిపించదు. చెవులకు ఇంపుగా ఉండదు. మీటరు ప్రకారం కూడా ఇది నప్పదు. ధరతీ ఆస్‌మాన్ అని అనండి. జమీన్ అంటే ఆస్‌మాన్ అనే అనాలి. అప్పుడు మ్యూజికల్‌గా అనిపిస్తుంది. ఆస్‌మాన్‌కి బదులు గగన్ అంటే పొసగదు. రూపం, బొమ్మ ధ్వని – అర్ధం – చిత్రం సమాజప్రదత్తమైనవి. గేయత్వం గీతానికి ముఖ్యమైన గుణం. కవి కవితా నివాస మండపంలో పురోహితుడిలాంటి వాడు. పురోహితుడు చేసే పని చేస్తాడు. అక్షరాల ఆత్మ – మైత్రిని ఏర్పాటు చేస్తాడు. ఒక సంఘటన గురించి చెబుతాను. చంద్రశేఖర్ ఫిల్మ్ ‘చా..చా…చా…’ లో గీతాలు రాసాను.  చా చా చా ఎంతో పాపులర్ అయిన డాన్స్. నేను గీతం రాసాను – వో హమ్ న థే, వో తుమ్ న థే, వో రహ్‌గుజర్ థీ ప్యార్ కీ లూటీ జహం పర్ బేవజా… వో పాలకీ బాహర్ కీ – న చోట్ హై యహ్ ఫూల్ కీ, న చోట్ హై యహ్ ఖార్ కీ. (అది నీవు కాదు. నేను కాదు. అదంతా ప్రేమ పథం. ఏ కారణం లేకుండా ఆ వసంత పల్లకీ దోచబడ్డది. ఈ గాయం పూవుది కాదు. ఈ గాయం ముల్లుదీ కాదు.) చంద్రశేఖర్ బాగుంది అని అన్నారు. ఈ చోట్ అనే శబ్దం ఎందుకో పొసగలేదని నాకు అనిపిస్తోంది అని నేను అన్నాను. ఆలోచించాను. ఆలోచిస్తూనే ఉన్నాను. ఏమీ తోచలేదు. అయినా మరో శబ్దం అక్కడ ఉపయోగించాలి అన్న తపన. అన్నం తిన్నాను. అందరూ నిద్రపోతున్నారు. నేనొక్కడినే మేల్కోని ఉన్నాను. ఒక్కసారి శబ్దం నోటికి వచ్చేసింది. – ‘న చోట్ హై యహ్ పూల్ కీ న హై ఖాలిష్ యే ప్ ఖార్ కీ’ ఎటువంటి శబ్దం! అసలు సిసలైన కవిత్వం రాయలంటే కవి పూర్తిగా మునిగిపోవాలి. పీ.ఎస్ రిచడ్స్ పర్వాయ వాచక శబ్దాలు కవి కోసం కాదు కాని ఒక్క శబ్దాని (ఉపయోగించినప్పుడు ఆ అర్థం వచ్చే శబ్దమే ఉపయోగించాడు కవి. ఆ శబ్దం స్థానంలో అన్నే మాత్రలు కల శబ్దం, అదే అర్థం వచ్చే శబ్దం వాడలేదు. ఒకవేళ వాడితే భావం చచ్చిపోతుంది. ముఖమల్ బట్టకి గోనె పట్టిని అతుకు పెట్టినట్లుగా ఉంటుంది. వేరు వేరు భావాల లయలలో రాసిన వాటిని వినిపిస్తాను – ఇందులో భాషా ప్రయోగ శక్తిని, ఊహకు మీరు చూడవచ్చు. ఒక ప్రయోగం – “జాత్ అజానీ, నామ్ అజానా కహీం న అపనా ఠౌర్ ఠికానా బినా కుటీ కే సన్యాసీ హమ్. మకీం బగైర్ మకాన్ కె…” (జాతి తెలియదు. పేరు తెలియదు. నాదంటు ఒక చోటు లేదు. కుటీరం లేకుడా ఉండే సన్యాసిని నేను. గ్రామస్థ్యం లేని ఇల్లు) ఇక్కడ మకీం కి బదులు గృహ్ అని ఉపయోగిస్తే ఎట్లా ఉంటుందో ఆలోచించండి. మాత్రలలో తేడా లేదు. అర్థం అదే కాని. సాథోని సంభోదిస్తూ ఒక గీతాన్ని నేను రాసాను. సధుక్కడీలో… “సాథో జీవన్ ధుఃఖ్ కీ ఘటీ. జిస్ దిస్ ఫిరే నిసంక్ హధ్ మే లేకర్ జౌఠ్ లుకాఠీ. సుల్‌గేం పంచీ, సులగేం పింజర్, సులగేం కల్ప్, సదీ మన్వంతర్. ఐసీ ఆగ్ లగీ హై భీషణ్, సోనా బచే న మాటీ. ఊంచాయిసే ఉచ్చ్ ఉంచాయి, నీచాయీ సే నిచ్చ్ నీచాయి.” ఇక్కడ ‘స’ కి బదులు ‘ష’ పెడితే జేఠ్ ని మార్చి చూడండి ఉచ్చ, నిచ్చ్ శబ్దాల ప్రయోగం పైన దృష్టి పెట్టండి. ఇదంతా ఫక్కడీ భాష. “ఏక్ ఆగ్ హై ఏక్ చిలమ్ హై అపన్ ఏక్ నషా హై రే బోల్ ఫకీరే సివా నషే కే అపనా కౌన్ సగా హై రే…. జో సబ్ కా సిరహనా హై రే వో అపనా పైతానా రే”. నగరీయ బాష ప్రయోగం చూడండి. “ఇస్ తరహ్ తయ్ హువా సాంస్ కా ఏ సఫర్ జిందగీ థక్ గయీ మౌత్ చల్‌తీ రహీ”. అరవిందుడి కవితల అనువాదంలో సంస్కృత శబ్దాలను ఎక్కువగా వాడాను. కథాత్మిక భాషలో కథను వ్యక్తం చేసాను. జీవితంలోని వివిధ సంఘటనలను గీతంలో వర్ణించాను – “ఏక్ దిన్ ఏక్ బోలీ పిటీ గోట్ యూం – ఏక్ మౌకా అగర్ తూ ముఝే ఔర్ దే, మన్ సచ్ యహ్ కి బాజీ బదల్ దూం అభీ. హార్ కో జీత్ సే, జీత్ కో హర్ సే, సున్ ఖిలాడీ ప్రథమ్ బార్ ఝిఝకా జరా. ఫిర్ బదల్ గోట్ వహ్ చాల్ చలనే లగా. జబ్ లగీ అక్ల్ సబ్ తబ్ బహుత్ దేర్ మే ఖేల్ కా కుచ్ తరాజూ బదల్‌నే లగా. పర్ హువా ఖత్మ్ వో ఖేల్ భీ ఇస్ తరహ్. గోట్ పిట్‌తీ రహీ, చాల్ చలతీ రహీ.” (ఒక రోజు ఓడిపోయిన గోలీ (పావు) ఇట్లా అన్నది – నీవు నాకు మళ్ళీ అవకాశం ఇవ్వు… నేను ఇప్పుడే పందాన్నే మార్చేస్తాను. ఓటమిని గెలుపుగా…. గెలుపును ఓటమిగా. వినగానే మొట్టమొదటి సారిగా ఆటగాడు సంకోచించాడు. మళ్ళీ ఎత్తుకు పై ఎత్తు వేసాడు. తెలివి వచ్చింది. కాని ఆలస్యంగా. ఆట త్రాసు కొంత మారుతోంది. కాని ఆట ఆగిపోయింది ఇట్లు పావు ఓడిపోతూనే ఉంది. వ్యూహం నడుస్తూనే ఉంది. ఎత్తు పై ఎత్తులు నడుస్తునే ఉన్నాయి)

ప్రగతివాదీ భాషతో పేరు వస్తున్న రచనలలో సిద్ధాంతాలకు సంబంధించిన ఉద్యమ నినాదాలు ఉన్నాయి. వాటికి నా రచనలకు మధ్య భేదం ఉంది. భాష చూడండి.

“మై సోచ్ రహా హూం అగర్ తీస్‌రా యుద్ధ్ హువా, ఇస్ నయీ సుబాహ్ కీ నయీ ఫసల్ కా క్యా హోగా? మై సోచ్ రహా హూం గర్ జమీ పర్ ఉగా ఖూన్, ఇస్ రంగ్‌ మహల్ కీ చహల్ పహల్ క్యా హోగా?” (ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే, ఈ కొత్త ఉదయపు కొత్త పంట ఏమవుతుంది? ఈ భూమిపైన రక్తం మొలకెత్తితే ఈ ఆనందమయ మహల్ కోలాహలాలు ఏమైపోతాయి?). మొత్తం గీతం జనపద సంస్కృతిని, భారతీయ సంస్కృతిని ప్రతిబింబ చేస్తుంది. ఇదంతా రొమాంటిక్ ప్రగతి. కూడలి సంస్కృతి భాష వేరే ఉంటుంది. చౌరస్తాలో మాట్లాడే భాష వేరే ఉంటుంది. ఒక నమూనా చూడండి – “దేఖో దేశ్ కా హాల్ హువా క్యా కుఛ్ బట్‌మారోం మే సంసద్ మే జూతా చల్‍తా హై, గోలీ చలె బాజా‍రోం మే… ఉఢక్ పఠక్ ఓ మచీ కీ సారె ఘటక్ ఖటక్ గయే – కుఛ్ తో గీరే కఢాయీ మే జౌర్ కుఛ్ ఖజూర్ మే లటక్ గయే కిసీకీ టూటీ కమర్, కిసీ కీ పాంట్ కె గట్టే చటక్ గయే. జైసీ హుయీ లడాయీ ఖైయ్యూ నేతోవోం కే దంగల్‌ మే, వహీ లడాయీ భటియురిన్ భటియారోం మే.”

ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించిన గీతాల భాష వేరుగా ఉంటుంది. “హర్ దర్పన్ తేరా దర్పన్ హై, హర్ చిత్‌వన్ తేరీ చిత్‌వన్ హై. మై కిసీ నయన్ కా నీర్ బనూం, తుఝ్‌కో హీ అర్ఘ్య్ చఢాతా హూం [ప్రతీ అద్దమూ నీ అద్దమే. ప్రతీ చైతన్యమూ (జ్ఞానం, ఆత్మ, హృదయం, మనస్సు, ఆలోచన) నీవే. నేను ఏ నయనాలలో నీరైనా నీకే అభిషేకం చేస్తాను].

(ఇంకా ఉంది)

Exit mobile version