[dropcap]ఆ[/dropcap] చెట్లకు
తెలియందేమి కాదు
బాటసారి
నడిచిన దూరం
ధరలకు
రెక్కలు సరే
ఆదాయానికి
తోకుండాలి కదా!
ఒంటికాలిపై
కొంగ జపం
మోసం చేయడానికి కాదు
బ్రతకడానికి
వార్ధక్యం
శాపం కాదు వరం
అనుభవిస్తే
గొప్ప అనుభూతి
తలగడలు కూడా
నిద్రపోతున్నాయ్
ఎంత కదిపిన
లేవడం లేదు