Site icon Sanchika

కయ్యూరు బాలసుబ్రమణ్యం నానీలు 4

[dropcap]చె[/dropcap]ట్లకు
సంభాషణలుంటాయి
కాకపోతే
శబ్దాలే ఎక్కువ

రాతిని
నిర్జీవంగా చూడకు
మనసుతో చూస్తే
అది సజీవ శిల్పం

సేదతీరుస్తుంది
అలసినప్పుడల్లా
బాల్కనిలో
పిల్లతెమ్మెర

మట్టి రేణువులతో
బాల్యమంతా
సుగంధ పరిమళాలే
తనువంతా

కలవలేని
భగ్న హృదయాలు
ఎడబాటుతో
రైలు పట్టాలు

 

Exit mobile version