[dropcap]క[/dropcap]లవలేని
భగ్న హృదయాలు
రైలు పట్టాలు
నా చిన్నతనం
ఎయిర్ కండీషనర్
విసన కర్ర
సేదనిస్తుంది
అలసినప్పుడల్లా
పిల్ల తెమ్మెర
బాల్యమంతా
సుగంధ పరిమళాలే
మట్టి రేణువులు
విను వీధుల
మంచు కురిసినట్టు
వెండి వెన్నెల
గగనమున
సంతకం చేసినట్టు
పక్షుల గుంపు