Site icon Sanchika

కెన్యా – టాంజానియా నదీతీరాలలో మా నడక

[box type=’note’ fontsize=’16’] ప్రపంచవ్యాప్తంగా నదీతీరాలలో తమ నడకలో భాగంగా కెన్యా లోని నైలు నదీతీరాన సాగించిన తమ పర్యటన అనుభవాలను వివరిస్తున్నారు నర్మద రెడ్డి. [/box]

[dropcap]ప్ర[/dropcap]పంచంలోని వివిధ దేశాలలోని నదీతీరాలలో పర్యటించాలనే మా కోరిక మమ్మల్ని కెన్యా ప్రయాణించేట్టు చేసింది. నైల్ నది కెన్యా దేశంలో ప్రవహిస్తుంది. నైల్ నదీతీరంలో నడవాలనే కోరికతో హైదరాబాదు నుండి కెన్యా బయలుదేరాము.

మేము ముంబయి నుండి నైరోబీకి తక్కువ రేట్లలో టికెట్లు బుక్ చేసుకున్నాము. ఒక ఫ్రెండ్ కూతురు నైరోబీలో నివసిస్తుంది. తను మాకు చాలా తక్కువలో ఓపెన్ జీప్ ప్యాకేజ్ మాట్లాడి మమ్మల్ని ఆహ్వానించారు. రెండు జంటలు, ఒక లేడీ డాక్టరు, మరో మహిళా వ్యాపారవేత్త… మొత్తం ఆరుగురం కలిసి ఓపెన్ టాప్ జీప్‌లో ప్రయాణం చేశాం.

నిజంగా కెన్యా తప్పనిసరిగా చూడవలసిన ప్రాంతం.

మేము ఆ వెహికల్ తీసుకుని masai mara, amboseli national park, lake nakuru, tsavo east national park, mount kenya, nairobi national park, samburu national park, Diam beach, Hell’s Gate National Park, giraffe centre, ఇంకా elephant and rhinos orphanage చూశాము. ఈ ట్రిప్‌లో భాగంగా టాంజానియాలోని కిలిమంజారో, ఇంకా Seychelles Islands కూడా వెళ్ళాము.

మొదట మేము ఓపెన్ జీప్ తీసుకున్నామన్నా కదా, కెన్యా వెళ్ళే ముందు వికారాబాద్ అడవిలో ట్రెక్కింగ్ చేస్తూ క్రింద పడ్డాను. కొద్దిగా నడుము నొప్పి వుంది. అందుకని నేను జీపులో ముందు సీట్లో కూర్చున్నాను.

మేము మొదటగా lake nakuru వెళ్లాము. ఇది భూమధ్యరేఖకి దగ్గరగా ఉంది. ఇక్కడి ప్రకృతి దృశ్యాలను చూడాలంటే రెండు కళ్ళూ చాలవు. వర్ణిస్తే ఒక దృశ్యకావ్యం అవుతుంది. ఈ లేక్ చుట్టూ euphorbia చెట్లు ఉన్నాయి. యల్లో ఫీవర్ చెట్లు కూడా ఎంతో అందాన్నిస్తున్నాయి. దూరంగా కొండలు. ఈ చెరువు అందాల్ని చూడాలని ఎక్కడెక్కడి నుంచో పెలికాన్ పక్షులు వందలు, వేలు వస్తాయి. సూర్యరశ్మి కిరణాలకు – ఇక్కడికి దూరంగా ఉండే కొండల ప్రతిబింబాలు తెల్లగా మిలమిలా మెరిసే ఈ చెరువు నీటిలో డైమండ్స్ పొదిగారా అనిపించేలా కనిపిస్తాయి. అందంలో మాతో పోటీ పడతావా అని పెలికాన్ కొంగలు పొడుగాటి ముక్కులతో, పింక్ కలర్‌లో వుండి అన్ని చేపల్ని, ఆల్గే మొక్కల్ని తింటూ అవి నడుస్తూంటే, ఈ సామ్రాజ్యమంతా మాదేనని ఠీవిగా ఒళ్ళు విరుచుకుని నడుస్తున్న ఆ పక్షుల్ని చూసి ముగ్ధులమైపోయాము.

రెండు గంటలు ఆ చెరువు వెంట అటూ ఇటూ పరుగెత్తి, పక్షులతో ఫోటోలు తీసుకుని ఆనంద డోలికలలో ఊగిసలాడాము. ఈ దృశ్యాన్ని వదలలేకపోయాము. ‘ఇక చాలు, వెళ్ళిపొండి’ అన్నట్టుగా వర్షం మొదలైంది. అంతే పరుగో పరుగు మా జీప్ లోకి.

అక్కడి నుంచి lake naivasha వెళ్ళాము. ఇక్కడ తెల్లటి కొంగలు ఎక్కువగా వున్నాయి. ఈ చెరువులోని తెల్ల కొంగలు మరో రకమైన అందం. చూసి ఆనందించాము.

ఇక్కడి నుండి masai mara national park కి వెళ్ళాము. ముందు మాకు మసాయి మారా గిరిజనులు స్వాగతం పలికారు. అక్కడివారు భోజనం ఏర్పాటు చేశారు. అక్కడి వంట లావు బియ్యముతో అన్నం, మటన్ వండారు. బ్రెడ్, వెన్న,జామ్ పెట్టారు. అందరం అక్కడ భోం చేసి masai mara national park కి వెళ్ళాము.

మేము వెళ్ళిన రోజే migration అనేది జరిగింది. మైగ్రేషన్ అంటే ఏమిటి? wild beasts (బర్రెల్లా ఉంటాయి, జుట్టు కూడా వుంటుంది) అన్నీ కలిసి లక్షల సంఖ్యలో పోగవుతాయి. అవి నడిచే దార్లు చూస్తే ఎవరో పేరంటానికి పిలిచినట్లుగా పిలిస్తూ వుంటే అవి పరిగెత్తుకుంటూ వెళ్తున్నట్లు వుంటుంది. ఇవి అన్నీ ఒకే వరుసక్రమంలో ఎక్కడెక్కడి నుండి వందల కిలోమీటర్లు నడిచి అన్ని ఒకచోటకి చేరుతాయి. ఈ wild beasts అన్నీ ఒక చోటకి చేరాక – ‘ఈ మసాయి కాలువ అవతలి గట్టులో మనకు పచ్చగడ్డి కనిపిస్తుంది. మనం అక్కడికి వెళ్దాం’ అని ఆ జంతువులు మాట్లాడుకుంటాయట. నిజంగా అలాగే అనిపిస్తుంది.

అవి ఎప్పుడైతే ఈ మసాయి నది దగ్గరికి వస్తాయో, వాటి ల్లోంచి 5, 6 beasts నీటిలోకి తొంగిచూస్తాయి. అలా రోజంతా ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నీటిలోకి తొంగి చూస్తూ, వాటిల్లో అవి మాట్లాడుకున్నట్లు అన్నీ చేరుతాయి.

ఎప్పుడైతే మొసళ్ళు తక్కువగా ఉన్నాయి, అవి కన్పించడం లేదు అని వాటికి అనిపిస్తుందో అప్పుడు అన్నీ కలిసి ఒకదాని వెనుక ఒకటిగా నదిలోకి దూకుతాయి ఆవలి ఒడ్డు చేరడానికి. దీనినే మైగ్రేషన్ అంటారు. మేము మధ్యాహ్నం ఒంటిగంటకి వెళ్ళి నాలుగు గంటల వరకు ఈ మైగ్రేషన్ దగ్గర ఉన్నాము. ఆ క్షణం ఎంత ఉద్విగ్నంగా వుందో చెప్పలేను. ఈ మైగ్రేషన్‌ని చూడడానికి  కొంతమంది నెలల తరబడి ఎదురుచూస్తారు.

మేము వెళ్ళిన గంటలో ఇది చూడటం మా అదృష్టం అనీ, చాలా సంతోషంగా అనిపించింది.

అక్కడి నుండి వెళ్తూ వుంటే వందల ఏనుగులు, జీబ్రాలు, సింహాలు, పులులు అన్నీ చూస్తూ – వాటి ఆహారం, beast లను సింహాలు అన్నీ కలిసి తినడము చూశాము. మాకు అడుగు దూరంలో ఒక పెద్ద సింహం తిరుగుతూ వుంటే దానినే చూస్తూ ఒక గంట గడిపాము. ఆ రోజు ఒక 60 సింహాల వరకూ చూశాము. అవి కూడా 4, 5 గుంపులుగా వుంటున్నాయి.

ఈ మైగ్రేషన్ అప్పుడు మొసళ్ళు కూడా ఎక్కడో దాక్కుని, అవి నది దాటుతున్నప్పుడు వాటిని చంపి తింటున్నాయి. అవి తినడం మొదలవగానే మిగతా జంతువులు ఆగిపోతున్నాయి, ఎంతటి ఆశ్చర్యమో!

లక్ష జంతువులు గుమిగూడటమేమిటి? అవి ఎవరో చెప్పినట్లుగా దాటటమేంటి? చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది.

అన్ని సింహాలు వున్నా, వందల మంది యాత్రికులు చూడడానికి వచ్చినా, సింహాలు ఏమీ అనడం లేదు. స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అవి అన్నీ చూసి మేము రాత్రికి మా బస చేరాము మసాయి గిరిజనులు మా గుడారాలకి వచ్చారు. ఆ రాత్రి వారి డాన్స్ చూశాము. వారే వండిన అన్నం, కూరలు తిన్నాము. గుడారంలో పడుకున్నాం.

మర్నాడు కిలిమంజారో వెళ్ళి తిరిగి వచ్చేశాము. ఆ తర్వాత Hell’s Gate National Park వెళ్ళాము. అక్కడి నుంచి ఒక గుట్ట ఎక్కి దిగాము. తర్వాత ఒక వాటర్ ఫాల్ దగ్గరని వెళ్ళడానికి బయల్దేరాం. ఎన్నో కొండల మధ్య ఒక్కొక్కరం దాటాలంటే, అంతా పాచిగా వుంది. జాగ్రత్తగా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఆ కొండకి ఆనుకొని ఒక్కొక్క అడుగూ జరుగుతూ ఎంతో కష్టంగా ఆ వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్ళి, మరలా తిరిగి వచ్చాము. దీనికి Hell’s Gate  అనే పేరు నిజంగా సార్థకమే.

అక్కడి నుంచి ఎలిఫెంట్స్ ఆర్ఫనేజ్‍కి వెళ్ళాము. అక్కడ చాలా పిల్ల ఏనుగులు ఉన్నాయి. వాటికి స్నానం చేయించటం, వాటితో చిన్న చిన్న ఫీట్స్ చేయించటం అన్నీ చూసి మేము తిరిగి వచ్చేశాం.

కెన్యాలో నైల్ నదీ ప్రవాహం చూశాము. పరీవాహక ప్రాంతంలో నడక సాగించాము. కెన్యా లేక్ నుంచి వైట్ వాటర్స్‌లా నది ప్రవహిస్తుంది.

   

లేక్ విక్టోరియా:

దీనిని source of Nile అంటారు. విక్టోరియా లేక్‍లో పుట్టి బురుండీ, రువాండా, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, టాంజానియా, కెన్యా, ఉగాండా, ఇథియోపియా, సూడాన్, సౌత్ సూడాన్, ఇంకా ఈజిప్టులలో ప్రవహిస్తుంది.

Murchison Falls:

ఉగాండాలో ఉన్న ఈ జలపాతం నైలు నదీ ప్రవాహంతో ఏర్పడింది. నైలు నది ప్రవహిస్తున్న అన్ని ప్రాంతాలలోను జంతువులు, నీటి జంతువులు, చింపాజీలు, బర్రెలు, ఏనుగులు ఉంటాయి. వీటిని Murchison Falls వద్ద కూడా చూడవచ్చు. ఈ ప్రాంతమంతా ఒక నేషనల్ పార్క్.

నైలు నదిలో ప్రయాణించడానికి క్రూజెస్, వైట్ వాటర్ రాఫ్టింగ్ వంటివి ఈ ప్రాంతాలలో ఉన్నాయి. ఈ నైలు నది వెంట ఆఫ్రికాలో kruger park, కెన్యా సఫారీ ఉన్నాయి. ఈ నైలు నది ‘ father of African rivers’ అనే పేరుతో ప్రసిద్ధి అంటారు. ఈక్వేటర్ ప్రాంతమైన ఉగాండాలో మెదలుపెడితే, వైట్ నైల్, బ్లాక్ నైల్ గా మారుతుంది. ఈజిప్టులో నైలునది  మట్టి నల్లగా ఉండి, ‘Kem or Kemi’ అనే పేరుతో ప్రసిద్ధి నొందింది. ‘Kem or Kemi’ అంటే ‘black’ అని అర్థం. అంటే ఎప్పుడైతే వరదలు వస్తాయో ఈ ప్రాంతమంతా నల్లటి మట్టి కొట్టుకొస్తుంది. అందుకు ‘black’.

7వ శతాబ్దికి చెందిన ప్రఖ్యాత గ్రీసు రచయిత హోమర్ నైలు నదిని నల్లటి దృఢమైన పురుషుని (masculine) గాను, ఈజిప్టును స్త్రీ (feminine) గాను తన రచన ‘ఒడిస్సీ’లో అభివర్ణించాడు. ఇది అద్భుతమైన కల్పన.

నాకు ఈ నైలు నది గురించి కొత్తగా వర్ణించాలని అనిపించింది. బ్లూ నైల్, వైట్ నైల్‌ని చూసినప్పుడు, ఈ బ్లాక్ నైల్‌ని చూసినప్పుడు ఇంద్రధనుస్సులోని రంగులతో ‘rainbow verse’ అవుతుంది. ఎలాగంటే అది ఇథియోపియాలో బ్లూ నైల్, కెన్యాలో వైట్ నైల్, ఈజిప్టులో బ్లాక్ నైల్.

ఈ జలపాతం గుండా ఈ నది పారి ఇంద్రధనస్సులు ఏర్పడి ఏడు రంగులతో అందరినీ మురిపిస్తుంది. ఇన్ని రంగులమయంతో అలరారే నది ప్రపంచంలో ఇది ఒక్కటేనేమో.

నైలు నది హంగులు, పొంగులు అందాలు, నేషనల్ పార్క్‌లు అన్నీ చూచి సంతోషంతో తిరిగి వచ్చాము.

Exit mobile version