Site icon Sanchika

కెరటాలు

సముద్రంలోని అలలను, మానవ జీవితంలోని సుఖదుఃఖాలను పోలుస్తూ, శాంతి పొందే మార్గం సూచిస్తున్నారు దినవహి సత్యవతికెరటాలు” కవితలో.

ఒక పున్నమి రేయిన
చల్లని వెన్నెల తాకినంతనే
పరవశించి పులకరింతతో
ఉవ్వెత్తున ఎగిసిపడి ప్రశాంత
తీరాన్నితాకి మురిసిన కెరటాలు

ఒక అమవస నిశిన
చంద్రుడు కానరాక
అలజడి చెంది కలత నొంది
కలవరపాటుతో తడబడి
తీరాన్నితాకి శాంతి చెందిన కెరటాలు

పున్నమి అమవసల ఆటుపోటులకు
ఉవ్వెత్తున ఉప్పొంగి ఎగిసిన కెరటాలు
సాగర తీరాన్ని తాకినంతనే శాంతించినట్లు
సుఖదుఃఖాలనే కెరటాల ఆటుపోటులకు
అలసి సొలసిన మానవ జీవితం సైతం
ఆధ్యాత్మిక తీరాన్ని చేరినంతనే సేదదీరగలదు

Exit mobile version