కోడి

0
3

[box type=’note’ fontsize=’16’] ప్రకృతి కథలలో భాగంగా కోళ్ళ గురించి, వాటిలోని రకాల గురించి విజ్ఞానం కలబోసి బాలలకు కథగా అందిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]

[dropcap]సె[/dropcap]లవులకు హైదరాబాద్ నుండి తాత, నానమ్మల దగ్గరికి పల్లెటూరికి వచ్చిన పిల్లలు కౌశిక్, కీర్తి, కిరణ్, కావ్య ఎప్పటిలాగే ఊరి చెరువు చూడటానికి స్వామితో వెళ్లారు. అందమైన సూర్యోదయం, చుట్టూ పచ్చని

పొలాల్లో పిల్లగాలికి తలూపుతున్న పైర్లు, పొలం గట్ల దగ్గర్లో ఉన్న పెద్ద చెట్లు, దూరంగా రైలు పట్టాలు, పంటపనులు చేసుకుంటున్న రైతులు. ఈ దృశ్యం పట్టణవాసులు ఊహామాత్రమే కదా? లేదంటే సినిమాలో మాత్రమే కనిపిస్తుంది. ప్రకృతి ప్రేమికులైన పిల్లలు చెరువు గట్టుమీద నుంచుని నిశ్శబ్దంగా ఎదురుగా ఆవిష్కృతమైన దృశ్యాన్ని చూసి ఆనందపడుతున్నారు. ఇంతలో కుక్కలు వెంటపడితే పరిగెత్తుతున్న కోళ్ల గుంపును చూసారు.

స్వామితో పాటు వాటిని చెదరగొట్టటానికి పిల్లలు ప్రయత్నించారు. ఈ సందడిలో కొంటె కిరణ్ ఒక కోడిని పట్టుకోవటానికి ప్రయత్నించాడు. అసలే ప్రాణభయంతో పరిగెడుతున్న కోడికి షాకింగ్‌గా అనిపించి కిరణ్ నుండి కూడా తప్పించుకునే ప్రయత్నంతో కిరణ్ ముఖం మీద గోళ్ళతో గీకి గాయపరచి పారిపోయింది.

బాధ భయంతో కిరణ్ అరచిన అరుపులకి పిల్లలు, స్వామి, దగ్గర్లో ఉన్నవారు పరుగెత్తుకువచ్చారు. సంగతి తెలిసి మందలించి ఇంటికి తీసుకువచ్చారు. తాత బామ్మా కంగారుపడి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ తరవాత ఇంటికి వచ్చాక నానమ్మ దగ్గరకు తీసుకుని బాధపడ్డారు.

“నానమ్మా! ఆ కోడి దొరికితే పట్టి చంపి తింటాను” అన్నాడు కిరణ్.

“అవునా? పాపం కోడి తన లైఫ్ సేవ్ చేసుకోవటానికి ట్రై చేసింది. అయినా తప్పు నీదే, అసలే కుక్క భయపెట్టింది కదా! నువ్వు పట్టుకోవటానికి ట్రై చేస్తే ఇంకేమి చేస్తుంది? లంచ్ తరువాత మీకు కోడి గురించి సంగతులు చెబుతాను” అన్నారు.

అన్నట్లుగానే పిల్లల్ని కూర్చో బెట్టి చెప్పటం మొదలుపెట్టారు.

“కిరణ్ కోడిని తింటున్నావు కదా? అవి ఎప్పటినుండి ఉన్నాయో తెలుసా?”

“నో. కోడిని తినటం తెలుసు. డిటైల్స్ తెలీవు” అని నిజాయితీగా చెప్పాడు.

“కోళ్లు దాదాపు అంటే నియర్లీ 7000 ఇయర్స్ నుండి మనుషులకు తెలుసు. వాటిని పెంచుతున్నారు.”

“మై గాడ్! 7000 యియర్సా?” అన్నారు పిల్లలు.

“ఫస్ట్ టైం వాటిని ఆసియా లోని ఇండియా, చైనాలో పెంచటం మొదలుపెట్టారట. కోళ్ళని ఆహారంగా పెంచుతారు. ఎగ్స్, మాంసం, కొన్ని కోళ్ళని కేవలం కోడి పందాల కోసమే పెంచుతారు. కోళ్లు సాధారణంగా మనుషులతో స్నేహంగా ఉంటాయి. అందువల్ల పెంచటం సులువు. కోడి రెడ్ జంగల్ ఫౌల్ అనే ఉప జాతికి/ఫ్యామిలీకి చెందినది. ప్రపంచంలో పక్షులకన్నా ఎక్కువ సంఖ్యలో ఉండేది కోడి.”

“నానమ్మా! కోడికి ఫుడ్ ఏమిటి?”అంది కావ్య.

“కావ్య బంగారు! కోడి అన్నిటిని తింటుంది. గింజలు, మనం తినే ఫుడ్, ఇన్సెక్ట్స్, గడ్డి, పళ్లు, కూరలు, బల్లులు, కొన్నిరకాల పాములు… అన్ని. నువ్వు సరిగ్గా అన్నం తినకపోతే కోడి వచ్చి నీ ఫుడ్ మొత్తం తినేస్తుంది. జాగ్రత్త!  కోళ్ల గుంపును coop/flocks అంటారు. కోళ్ల గుడ్లు పెట్టేటప్పుడు, పెట్టాక cluck అని శబ్దం చేస్తాయట. తమాషాగా అరుస్తాయి. ఆహారం కనిపించినప్పుడు మగ కోడి ఒక విధమైన అరుపు ఇతర కోళ్లను పిలిచి పంచుకుంటుందిట.  కోళ్ళు సాధారణంగా 5-10 ఏళ్ళు బ్రతుకుతాయిట. ఒక కోడి 16 ఏళ్ళు బ్రతికి చనిపోయిందిట. కోడి గుడ్లు పెట్టె చోటును clutch అంటారు. ఒక క్లచ్‌లో 12 దాక ఉండవచ్చు. గుడ్లను పొదిగేటప్పుడు ఆడ కోడి గుడ్లమీద కూర్చుని వాటిని కాపాడుతూ కావాల్సిన టెంపరేచర్‌ని, తేమని ఇస్తుంది. సాధారణంగా గుడ్లని వదిలి వెళ్ళదు. కోడి కొన్ని ప్రపంచ సంస్కృతుల్లో పవిత్రంగా భావించబడింది. గ్రీకులు రూస్టర్‌ని పెర్షియన్ బర్డ్ అన్నారుట. గ్రీకులు కోడిని exoti /అపురూపమైన పక్షిగా చూసారు. సింహాలు కూడా వాటికి భయపడతాయని నమ్మేవారుట.

ఇండోనేషియా ద్వీపంలో హిందూ క్రియాకర్మల్లో కోడికి ముఖ్యపాత్ర వుండేది. కోడి చెడుశక్తులకు గుర్తుగా భావించి అంత్యక్రియల్లో ఉంచి పూర్తయిన తరువాత వదిలిపెడతారుట. అందువల్ల కుటుంబ సభ్యులకు చెడు జరగదని నమ్మకం. బైబిల్ కధల్లో కూడా కోడిని గురించిన ప్రస్తావన ఉంది. జీసస్ తనను తల్లి కోడిగా పోల్చుకున్నారట. అనేక యూరోప్ దేశాల్లో కోడి తోలి కూతకు చెడు శక్తులు పారిపొయ్యేవని నమ్మేవారు. చైనీయుల జాతక చక్రంలో కోడి ఒక గుర్తు. zodiac sign. కోళ్లకు జ్ఞాపక శక్తి ఎక్కువట. రంగులను సులువుగా గుర్తించగలవు. దాదాపు 24 రకాల శబ్దాలతో మాట్లాడుకుంటాయిట.

వాటికీ మనలా నొప్పితెలుస్తుందిట. పాపం. వాటికీ పరుగులు పెడుతూ ఆడటం చాల ఇష్టం. వాటిని పట్టాలంటే మనం వెంట పరుగెత్తి పట్టాలి. వాటికీ మనలా కలలు… డ్రీమ్స్ వస్తాయి. కోడి తన యజమాని ఎవరో యిట్టే పసిగట్టగలడు. అంటే గుర్తుపడుతుంది. కోడి తన సహజ స్వేచ్ఛా వాతావరణంలో దాదాపు 11 ఏళ్ళు బ్రతుకుతుందిట. ఇప్పుడు తెలిసిందా? కోడి నిన్ను ఎందుకు గీరిందో? మనకున్నట్లే జంతువులూ, పక్షులకి భయాలుంటాయి. భయంలో ఉన్నప్పుడు ఫ్రెండ్ కూడా శత్రువా? అనిపిస్తుంది. అంతే. మీకు చికెన్ తినటం మాత్రమే తెలుసు, సిటీలో ఉంటారు గనక. కోళ్లను పెంచటం తెలియదు. కిరణ్ నీకొక చిన్ని కోడి పిల్లను ఇస్తాను, ఇక్కడున్నన్ని రోజులు పెంచాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది నిన్ను గుర్తుపట్టి నీతో ఆడుతుంది. సరేనా?”

“నానమ్మా! మాకు కావాలి” అన్నారు మిగతావాళ్ళు.

“సరే! రండి. సెలెక్ట్ చేసుకుందురు” అని వాళ్ళని కోళ్లు వున్నచోటికి తీసుకెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here