Site icon Sanchika

కొంగ్రొత్త వేకువకై ప్రేమతో..

[dropcap]ను[/dropcap]వ్వు ఎవ్వరినైనా ప్రేమిస్తున్నప్పుడు
అలా.. ప్రేమిస్తున్నావని చెప్పక దాచడం
అది ప్రేమకు ఉరి లాంటిదేనని నీకు తెలుసా ప్రియతమా.. కృష్ణా !!!

నువ్వు చెప్పావని ఆ ప్రేమ కరిగి నీదౌతుందని
కోరుకోవడం తప్పేనని నీకు తెలియదా రాధా!!!

అమావాస్యనాడు వెన్నెల లేదని వెన్నెలకాడు
పౌర్ణమినాట తిరిగిరాడని నీవు నాతో
గిల్లికజ్జాలెట్టుకొని చెప్పడం నీకు తగునా కన్నయ్యా!!!

నీ హృదయాన్ని పరిచి నువ్వు స్వాగతించినప్పుడు
నిన్ను తృణీకరించి కొంగ్రొత్త వెలుగులకై నే పయనిస్తుంటే
బిడుస్సువారిన మనస్సు పై నీకెందుకు వలపు
ప్రియ.. రాధా.. ఓ నా మనోహరిణి!!!
నక్షత్రపు వెలుగులు నాకై వేచి ఉన్నాయని
తృణీకరింపు సెగలను తుడిచివేసి
కొంగ్రొత్త వేకువకై ప్రేమతో ఎదురు చూస్తా
యుగాంతం దాటి నా చెలికాడా.. నల్లనయ్యా!!!!

Exit mobile version