[dropcap]కొ[/dropcap]ల్లాయిగట్టితేనేమి మా గాంధి
కోమటై పుట్టితేనేమి
నాల్గు పరకల పిలక
నాట్యమాడే పిలక
నాలుగు వేదాల
నాణ్యమెరిగిన పిలక
బోసి నోరిప్పితే ముత్యాల తొలకరే
చిరునవ్వు నవ్వితే వరహాల వర్షమే
చక చక నడిస్తేను
జగతి కనిపించేను
కొల్లాయిగట్టితేనేమి మా గాంధి
కోమటై పుట్టితేనేమి