Site icon Sanchika

కొంచం తగ్గిద్దామా

[box type=’note’ fontsize=’16’] కావలి లోని రెడ్‌ఫీల్డ్స్ హైస్కూల్‍లో తొమ్మిదో తరగతి చదువుతున్న వి. అనులాస్య వ్రాసిన కథ “కొంచం తగ్గిద్దామా“. పిల్లల్లో వ్యసనంగా మారిన వీడియో గేమ్స్ ఆటడం కొంచం తగ్గించుకుందామని చెబుతోంది ఓ పాప.  బాల/యువ రచయితలను ప్రోత్సహించే పథకంలో భాగంగా ఈ కథను అందిస్తున్నాము. [/box]

అనిత్ ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు, చెల్లెలు అర్చనతో బెంగుళూరులో ఉంటున్నాడు. అనిత తల్లిడండ్రులు ఎప్పుడూ ఆఫీస్ పనులు చేసుకుంటూ ఉంటారు. అర్చన ఎప్పుడూ చదువులోనైనా లేకుంటే ఆటల్లోనైనా లీనమై ఉంటుంది. తనకు తన అన్నయ్య అంటే చాలా ఇష్టం.

కానీ అనిత్ ఎప్పుడూ వీడియో గేమ్స్ ఆడుతుంటాడు. పాఠశాలకు కూడా సరిగ్గా వెళ్ళడు. అర్చన తన అన్నయ్యను “అన్నయ్యా! ఏంటిది? ఎప్పడూ వీడియో గేమ్స్ అడుతుంటావు. అలా చేస్తే నీ కళ్ళు పోతాయి. మానసికంగా కూడా నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇలా ఆడటం కొంచం తగ్గించ్చొచ్చు కదా?” అని  అడిగింది. అనిత్ దానికి ఏ సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే  అప్పుడు తను వీడియో గేమ్ ఆడుతున్నాడు.

కొన్ని రోజులు కడిచాయి. అనిత్‌కి తన వీడియో గేమ్‌లో చూసిన మనుషులు, వస్తువులూ అన్ని ఇంట్లో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. తను వాటిల్ని తాకాలని ప్రయత్నించడం, అవి కింది పడటం – ఇవన్నీ అర్చన గమనించింది. తనకు భయం వేసింది. వెంటనే విషయం తల్లిదండ్రులకు చెప్పింది.

వాళ్ళ తల్లిదండ్రులు వెంటనే అనిత్‌ను మానసిక వైద్యుల దగ్గిరికి తీసుకెళ్ళారు. వైద్యుడు అక్కడున్న 10-15 పిల్లలకు కూడా ఇదే సమస్య అని చెప్పి అది వారి తప్పు కాదు, వారిని మందలించకపోవడం వారి తల్లిదండ్రుల తప్పు. “మీరు పనిలో పడిపోయి పిల్లలని పట్టించుకోవడం మానేశారు. ఇది చాలా తప్పు. ఇంక ఈ రోగానికి అంతులేదు. కానీ కొంచం తగ్గించగలం. అంతే!” అని చెప్పారు.

అనిత తల్లిదండ్రులకు ఇంక బాధ మాత్రమే మిగిలింది. ఇంక వారు తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు.

ఈ సమస్య అనిత్‌ది మాత్రమే కాదు. చాలా మంది ఇలాగే బాధ పడుతున్నారు. వీడియోగేమ్స్ ఆడటం  తగ్గించుకోవడం అనేది మన చేతిలో ఉంది. దీన్ని మనమంతా పాటించాలి. ఇలా చేస్తే అందరం సంతోషంగా ఉంటాము.

వి. అనులాస్య

Exit mobile version