Site icon Sanchika

కోపూరి శ్రీనివాస్ స్మారక సింగల్ పేజీ కథల పోటీ విజేతల బహుమతి ప్రదానోత్సవ సభ

[dropcap]”మం[/dropcap]చి కథలు రావడం వల్ల మంచి సమాజం ఏర్పడుతుంది, ఇటువంటి కథల పోటీలు నిర్వహించడం ద్వారా మంచి కథలు వెలువడతాయి” అని రమ్య భారతి సాహిత్య త్రైమాస పత్రిక గౌరవ సంపాదకులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య అన్నారు. ఆదివారం ఉదయం స్థానిక ఠాగూర్ గ్రంథాలయంలో రమ్య భారతి పత్రిక ఆధ్వర్యంలో జరిగిన కోపూరి శ్రీనివాస్ స్మారక విశిష్ట పురస్కారాలు జాతీయ స్థాయి సింగిల్ పేజీ కథల పోటీ విజేతల బహుమతి ప్రదానోత్సవ సభకు అధ్యక్షత వహించి ప్రసంగించారు.

సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి శాంతి శ్రీ ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వివిధ రంగాలలో ప్రముఖులు శ్రీ గుమ్మా సాంబశివరావు, కావూరి సత్యవతి, పులిపాటి దుర్గారావు లకు ఒక్కొక్కరికి 5000 నగదుతో పాటు, శాలువా, దండ,  జ్ఞాపికలతో కోపూరి శ్రీనివాస్ స్మారక విశిష్ట పురస్కారాలను అతిథులు ప్రధానం చేశారు.

అలాగే జాతీయస్థాయిలో నిర్వహించిన సింగల్ పేజీ కథల పోటీ విజేతలైన ఖమ్మం జిల్లాకు చెందిన వేణు మరీదుకు ప్రథమ, అనకాపల్లికి చెందిన జి రంగబాబు కు ద్వితీయ, విజయవాడకు చెందిన బివీ శివప్రసాద్‌కు కన్సోలేషన్ బహుమతుల కింద నగదు, శాలువ, దండ, ప్రశంసా పత్రాలతో సన్మానించారు. కార్యక్రమాన్ని రమ్య భారతి సంపాదకులు చలపాక ప్రకాష్, పోపూరి పుష్పా దేవి నిర్వహించారు.

Exit mobile version