Site icon Sanchika

కోపూరి శ్రీనివాస్‌ స్మారక సింగిల్‌పేజీ కథల పోటీల ఫలితాలు ప్రకటన

[dropcap]ఇ[/dropcap]టీవల ‘రమ్యభారతి’ పత్రిక ఆధ్వర్యంలో కోపూరి శ్రీనివాస్‌ స్మారకార్థం నిర్వహించిన సింగిల్‌ పేజీ కథల పోటీలకు జాతీయస్థాయిలో 131 కథలు వచ్చాయి. వాటిలో న్యాయనిర్ణేతల నిర్ణయం మేరకు మరీదు వేణు, ఖమ్మం రాసిన ‘ఒక రిప్‌తో సరి’కు ప్రథమ బహుమతి లభించింది. జి.రంగబాబు, అనకాపల్లి రచించిన ‘అసలైన పూజ’ కథకు ద్వితీయ, పాణ్యం దత్తశర్మ, హైదరాబాద్‌ రచించిన ‘నేను వస్తలేను’ కథకు తృతీయ బహుమతి లభించాయి.

అలాగే వురిమళ్ళ సునంద (ఖమ్మం), ఆర్‌.ఎస్‌. వెంకటేశ్వరన్‌ (ఉత్తరప్రదేశ్‌), ఎం.వి.ఎస్‌. రామశేషు (గుంటూరు), శైలజామిత్ర (హైదరాబాద్‌), తులసి బాలకృష్ణ (హైదరాబాద్‌), బి.వి.శివప్రసాద్‌ (విజయవాడ), దొండపాటి కృష్ణ (హైదరాబాద్‌), గంటి రాజేశ్వరి (గుంటూరు), కె.వి.లక్ష్మణరావు (మానేపల్లి), వియోగి (కర్నూలు) రాసిన కథలు ప్రోత్సాహక బహుమతులకు ఎన్నికైనాయి. విజేతలకు నగదు, ప్రశంసాపత్రాలతో ఆగస్ట్‌ 7 ఉదయం విజయవాడలో జరిగే ప్రత్యేక సభలో బహుమతీ ప్రదానం జరుగుతుంది.

చలపాక ప్రకాష్‌

ఎడిటర్‌, రమ్యభారతి

Exit mobile version