Site icon Sanchika

కొరియానం – A Journey Through Korean Cinema-14

పూవరసం పీపీ – 1

Chapter 13

[dropcap]ఎ[/dropcap]వరికన్నా ఒకటి ఎందుకు నచ్చుతుంది?

ఎందుకంటే అన్నిటికంటే ముందుంటుంది కాబట్టి. ఒకటి లేదా ఒకటవ స్థానం అంటే సాటిలేని అని కాబట్టి. అంతేనా?

కాదు. ఒకటి అంటే ఒకటి అనే సంఖ్య కాదు. ఏదైనా ఆని. (ఈ మూడు వాక్యాలు గుర్తుపెట్టుకోండి).

నచ్చటానికి చాలా కారణాలుంటాయి. అది గొప్పది కావటం వల్ల. అది గొప్పది అని మనం అనుకోవటం వల్ల. లేదా అలా మనం నమ్మింపబడటం వల్ల.

అది బాగుండటం వల్ల (చూడటానికి… వినటానికి…). ఇలా రకరకాల కారణాలుంటాయి. ఒకదాన్ని ద్వేషించటానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. కారణాలు లేకుండా ఏ భావమూ కలుగదు. ఏవో కొన్ని సందర్భాల్లో తప్ప. మన సినిమాల్లో చెప్పే,

“ప్రేమించటానికి ఒక్క కారణం చాలు. ద్వేషించటానికి వెయ్యి కారణాలుంటాయి.”

“ద్వేషించటానికి ఒక్క కారణం చాలు. ప్రేమించటానికి వెయ్యి కారణాలుంటాయి.”

ఇవన్నీ అసమగ్రాలు. రచయిత కాస్త దమ్మున్న వాడైతే పాత్ర పరిధి బట్టీ రాస్తాడు. విడిగా తన ప్రతాపం చూపగలడు. లేకపోతే రవితేజ కృష్ణ సినిమాలో త్రిష పాత్ర చెప్పినట్లు… కీలాద్రి అంటే కొండ అయిపోతుంది.

కొరియన్ సినిమాలు, కొరియన్ పాటలు, కొరియన్ భాష, కొరియన్ సెలబ్రిటీలు, కొరియన్ కల్చర్… ఇవన్నీ ఎందుకు ప్రపంచ వ్యాప్తంగా ఈమధ్య బాగా నచ్చుతున్నాయి? మనవాళ్ళలో కూడా విపరీతమైన క్రేజ్ ఎందుకు వచ్చింది? కొరియన్ అన్న మాట విబడకుండా మన రోజు గడవని స్థితి ఎందుకు కనిపిస్తోంది?

సరే! దాన్ని కాసేపు పక్కన పెడదాం. ఎందుకంటే ఈ విషయాన్ని డిస్కస్ చేయకుండా వదిలే ప్రసక్తి లేదు కనుక. మరి మన సినిమాల్లో (తెలుగు కాక పోయినా కనీసం ఇండియన్ సినిమాల్లో) వారికి నచ్చినవి ఏవి? వెబ్ అంతా జల్లెడ పడితే popular (వాయ్య! ఇంగ్లీషు వాడకుండా ఒక పేజీ రాసేశాను. కొంపదీసి తెలుగు వచ్చేస్తోందా ఏంటి?) culture కాకుండా సాధారణ కొరియన్‌కు మన సినిమాలు లేదా కథలు ఎలాంటివి నచ్చాయి? లేదా నచ్చుతాయి? లేదా నచ్చబడబడిస్తాయి? సరే! Present continuous tense లో నచ్చుతున్నాయి కూడా.

ముందుగా popular culture లెక్కన చూస్తే 3 Idiots కొరియన్లకు బాగా నచ్చిన భారతీయ సినిమా. BTS నుంచీ, కనుముక్కు తీరు బాగున్న ప్రతి కొరియన్ సెలబ్ ఆటో ట్యూన్ లాగా చెప్పే సినిమా ఇది. దీనికి కారణం కూడా ఉంది. దాన్ని గట్టిగా విశ్లేషిస్తే మనకు కొన్ని అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. గరికిపాటి వారి భాషలో చెప్పాలంటే బాంబులు పేల్తాయి.

ఈ 3 ఈడియట్స్ కాకుండా IN2IT (తెలియని వారికి కొరియన్ పాప్ గ్రూప్… ఆరుగురు మెంబర్స్. Boy-band) కు సమూహంగా బాగా నచ్చిన సినిమా రణ్వీర్ సింగ్‌ది గల్లీ బాయ్. కారణం చాలా obvious. అది గల్లీ పాప్ సింగర్ గురించిన కథ. సంగీత ప్రాధాన్యం. సినిమా నిజంగానే బాగుంటుంది కనుక. అది కాకుండా IN2IT లో లీడ్ సింగర్ Yoo Ji-ahn కు, “ఆమీర్ ఖాన్ సినీమాలూ అంటే చ్ఛాలా ఈషాటామూ.” ప్ఫడి చచ్చిపోతాడనుకోండీ. (పీఆర్ ప్రకారం). సీరియస్‌గా చూస్తే… లగాన్, దంగల్, ధూమ్ 3, మంగళ్ పాండే అతనికి నచ్చిన సినిమాలు.

కొరియన్ పాప్ గ్లోబలైజేషన్‌లో ప్రాముఖ్యం వహిస్తున్న కొరియన్ అమెరికన్ అలెక్సా క్రిస్టీన్‌కు ప్రియాంకా చోప్రా చాలా ఇష్టంట. అలాగే బాలీవుడ్ సినిమాలు పాటలు తక్కువ, నిడివి తక్కువ అయితే ఇంకా నచ్చుతాయట! 1996లో పుట్టిన ఈ పిల్ల ఈ మాట అనటంలో ఆశ్చర్యం లేదు. ప్రియాంకా, ఇప్పుడు ఒక గ్లోబల్ ఐకన్ అన్నది సుస్పష్టం.

***

వీళ్ళ సరే! 3 Idiots ఆ రోజుల్లో internet sensation కూడా కావటం వల్ల సినిమాను టోరెంట్లలో వివిధ రూపాలలో కొరియన్లు చూశారు. సినిమా అక్కడ రిలీజై బాగనే ఆడినా, అప్పటికే అందరూ చూసేయటం వల్ల సినిమా థియేటర్లలో ఆడాల్సినంత ఆడలేదు. అందుకే జపాన్లో బాహుబలి గురించి, జూనియరెంటీయార్ సినిమాలు ఆడటం గురించి వచ్చినంత కవరేజ్ రాలేదు.

ఇక సామాన్యులు లేదా నాన్-సెలబ్రిటీల మాటేంటి? వాళ్ళకెలాంటి సినిమాలు నచ్చుతాయి? కొరియన్లకు మెలోడ్రామా అంటే బాగా ఇష్టం. ఈ విషయం లోకవిదితం. ఎంత ఇష్టమంటే నాకు, కొరియన్ సినిమాకు ద్వారంలా నిలిచే మిత్రుడు (వెన్జన్స్ ట్రైలాజీ బాక్స్ సెట్ పంపినాయన) తనకు నచ్చిన తెలుగు సినిమా… lo behold…

“రక్త సంబంధం” అని చెప్పాడు. అలాగే ప్రేమాభిషేకం, ప్రేమ్ నగర్ కూడా నచ్చాయట. ఒకసారి నాతో అన్నాడు. ఎంతసేపూ మీరు మాకిది కావాలి. నాకు దీని గురించి చెప్పు అంటారే తప్ప మీ సినిమాల గురించెక్కువ మాట్లాడరెందుకు? అనడిగాడు. అప్పటి వరకూ మా మధ్య జరిగిన సంభాషణలు గుర్తుకు తెచ్చుకుంటే నేను ఫలానా సినిమా గురించి చెప్పు, ఈ సినిమా ఎలా చూడాలి? ఇదెక్కడ దొరుకుతుందని అడగటమే తప్ప మన సినిమాల గురించి అతనితో మాట్లాడింది లేదు. రికమెండ్ కూడా చేయలేదు.

అలాంటిదేమీ లేదు. నేను నా తుత్తుర వల్ల ఏదో సోర్స్‌లా ఉన్నారని అడుగుతున్నాను తప్ప అంత ఆలోచించలేదు. చెప్పండి. Now I am in a position where I too can spend a bit to gift my friends. I’ll send a few good films. అన్నాను. ఆశ్చర్యకరంగా అల్లూరి సీతారామరాజు డీవీడీ ఉంటే పంపమన్నాడు. అతని రిసెర్చిలో మనదేశం నుంచీ mainstream style of cinema లో అత్యున్నత బయోపిక్ అల్లూరి సీతారామరాజుట. దానితోపాటూ మహేశ్‌ది (నేను కొనుక్కుంటూ) 1: నేనొక్కడినే పంపాను.

చాలా కాలానికి సమాధానం వచ్చింది. అల్లూరి సీతారామరాజు పంపినందుకు thanks అంటూ. 1: నేనొక్కడినే చూసి ఆశ్చర్యపోయాడట. నిజంగా మీ వాళ్ళు ఇలాంటి సినిమాలు తీశారా? కొత్తతరం దర్శకులు అన్నాడు.

Yes. Our filmmakers are capable. Provided they are given independence by fans. అని చెప్పాను. చాలాకాలానికి అల్లూరి పేరు విని అమెరికా ట్రిప్‌లో ఉండగా ఆర్ఆర్ఆర్ చూసి డిజప్పాయింట్ అయ్యాను. It doesn’t have Baahubali flamboyance. Shouldn’t have used the name of Sitaramaraju అన్నాడు.

గతంలో మా భూమి నచ్చిందని చెప్పి అవకాశం ఉంటే డిస్క్ పంపమన్నాడు. నేనలాంటి సినిమాలు ఎక్కువ చూడను అన్నా. కొన్నాళ్ళకు సీడీ పంపితే చాలా ఎమోషనల్‌గా కృతఙ్ఞతలు చెప్పాడు. అందుకే నేను ముందే చెప్పాను కొరియన్లకు, మనకు కల్చరల్ ఎమోషనల్ రూట్స్ దాదాపు ఒకటే. వేవ్ సంగతి, మన తెసుగూఫుల వేలంవెర్రి సంగతి పక్కన పెడితే, మన వాళ్ళకు కొరియన్ సినిమాలు నచ్చటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కాకపోతే ఎలాంటి సినిమాలు చూస్తారు. ఎలాంటివి అందుబాటులో ఉన్నాయి. ఎవరి వల్ల influence అవుతున్నారు అన్నదే ప్రశ్న.

చిత్రంగా ఫేస్బుక్‌లో పరిచయమైన కొరియన్ మిత్రురాలు తనకు ఈమధ్య చూసిన వాటిలో తమిళ సినిమా పూవరసం పీపీ బాగా నచ్చిందని చెప్పింది. అప్పుడే ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తీసిన స్వరూప్ దర్శకత్వంలో వచ్చిన Mishan Impossible రిలీజైంది. ఆందులో ముగ్గురు పిల్లలు దావూద్ ఇబ్రహీమ్‌ను పట్టుకోవాలని ప్లాన్ వేస్తారు. పిల్లలు ప్రధాన పాత్రలుగా వచ్చిన క్రైమ్ కామెడీ.

ఆ పూవరసం పీపీ కూడా ఇలాంటి పిల్లలతో తీసిన క్రైమ్ కామెడీనే. కథనంలో కాసిని లోపాలున్నా సినిమా భలే ఉందే అనిపిస్తుంది. అది చూశాక మన Mishan రికమెండ్ చేద్దామనుకున్నా. అబ్బే! మన తెలుగు వారికే స్వంతమైన good attempt gone wrong తరహాలో, అద్భుతమైన premise చేతిలో పెట్టుకుని, తాప్సీ పన్ను లాంటి నటిని తెచ్చుకుని సరైన output ఇవ్వలేకపోయాడు దర్శకుడు.

వివరంగా చూస్తే… సెలెబ్, మీడియా, pop culture కళ్ళద్దాలు దాటి చూస్తే చాలా ఆశ్చర్య పరిచే విశేషాలు తెలుస్తాయి. మనం చూడమంతే. మన కళ్ళజోడే మనకు ప్రామాణికం.

***

పోయెట్రీని Superstar Krishna ప్రధాన పాత్రలో తక్కువ బజట్‌లో తీస్తే బాగుంటుంది అని ఒకసారి నేను చక్రధర్ అన్నతో అన్నాను. (చాలామంది బ్లాగ్ మిత్రులకు, ఫేస్బుక్ మిత్రులకు తెలిసిన చక్రధర్ రావు… మంచి సినిమాటోగ్రాఫర్. అవకాశాలు రావటం లేదంతే. అద్భుతమైన టెక్నిక్, మంచి కలర్ సెన్స్, లైటింగ్ వాడటంలో చక్కటి నేర్పు ఉన్నాయి. తొలి తెలుగు crowd funded independent cinema ఎడారి వర్షంకు పని చేశాడు చక్కన్న. కెమిస్ట్రీ, కేస్ నెం॥ 666/2013 అనే చుట్టబెట్టేయబడిన టాలీవుడ్ సినిమాల్లో కూడా మంచి output ఇచ్చాడు).

తీయవచ్చు. నేనీ మాట అన్నది 2012 మొదట్లో. దశాబ్దం దాటేసింది. ఈ పోయెట్రీ అనేది నేటి సమాజంలో మన తెలుగునాట బాగా అవసరమైన సబ్జక్ట్‌ను చర్చించిన సినిమా. మంచి ప్రతిభ ఉండి, good attempt gone wrong సినిమాలు కాకుండా make it count అనుకోదగ్గ సినిమాలు తీస్తున్న యువ దర్శకులు ఎవరన్నా ఈ సినిమాను తీయాలి.

కృష్ణ ఇక చేసే ఓపిక లేనట్లున్నాడు కనుక ఇంకెవరన్నా వెటరన్ స్టార్‌తో (కొరియన్ వర్షన్‌లో ప్రధాన పాత్ర మి-జా గా వేసిన నటి స్టేచర్ చాలా ఎక్కువ. ఒకానొక సమయంలో కొరియన్ సినిమాను ఏలేసింది. అలాంటి నటుడు ఎవరన్నా కావాలి. ఎవరు బాగుంటారు? మనమధ్య ఇంకా ఉండి ఉంటే తమిళ నటుడు వివేక్ బాగా సరిపోయేవాడు).

నాకు పోయట్రీ సినిమాను పరిచయం చేసింది, చేసి రివ్యూ రాయమని ప్రోత్సహించింది చక్రధర్ రావు.

Exit mobile version