Site icon Sanchika

కొరియానం – A Journey Through Korean Cinema-15

రక్తపు మడుగులో పన్నీటి వర్షం

Chapter 14

[dropcap]2[/dropcap]021, మే 15.

కరోనా కొట్టిన దెబ్బకు అయిన గాయాలను నాక్కుంటూ, వీలైనంతగా డేమేజ్ కంట్రోల్ మోడ్‌లో ఉన్న సమయం. ఆత్మీయుల timely intervention, స్నేహితుల సహాయం, పని చేస్తున్న ఆఫీస్ వారి సహకారంతో ఎలాగోలా నడవలేకపోయినా, దేకుతూ కదిలేంత శక్తి అయినా మిగుల్చుకోగలిగాము. అలాంటి ఒక రోజున చాలా హడావిడిగా ఒక స్నేహితుని దగ్గర నుంచి పొద్దున్నే కాల్. త్వరగా మన గ్రూప్ వాళ్ళ కాల్ ఎటెండ్ కమ్మని. ఏం కొంపలు మునిగాయా అని ఆలోచిస్తూ అప్పటికి చేతిలో ఉన్న పనులు చేసుకుంటూ ఆ విషయాన్ని subconscious లో పక్కకు నెట్టేశాను.

ఇది కొరియానంలో ఇప్పటి దాకా నడిచిన టైమ్లైన్‌కు సరిగ్గా దశాబ్దం తరువాత. హఠాత్తుగా మా ఆఫీస్ టీమ్ content department లో Entertainment విభాగం లీడ్ నుంచీ కాల్. నీకు మాంఛి excitement ఇచ్చే న్యూస్, కాస్త early గా పని పెట్టే వ్యవహారం అని. ఊరు, ఇల్లు కదలకుండా ఏ పని కావాలన్నా చేస్తా అన్నాను. Rangjong అనే కొరియన్ సినిమా గురించి విన్నావా అని అవతలవైపు నుంచీ ప్రశ్న. కాస్త తెలుసు. ఇంకా విడుదల కాలేదు కదా అన్నాను.

ఫుటేజ్ చూసే అవకాశం ఉంటే చూస్తావా? అని మళ్ళీ ప్రశ్న. ప్రస్తుతం వీలు కాదు.

దేనికి? అది చాలా గొప్ప సినిమా అని చెప్తున్నారు. అని అవతల నుంచీ కాస్త మందలింపు స్వరంలో.

కావచ్చు. నా పరిస్థితి తెలుసు కదా. పెండింగ్ పనులు చాలా ఉన్నాయి. పైగా నేను ప్రస్తుతమున్న మూడ్‌లో అలాంటి విషయాలు చూసే మూడ్ కూడా లేదు అన్నాను. కొన్నాళ్ళా సినిమా గురించి మర్చిపోయాను. రెండు నెలలకు వేరే మిత్రులు నడిపిస్తున్న ఒక incubator style international website లో ఆ సినిమాది రివ్యూ వచ్చింది. దాన్ని రాసిన ఇద్దరిలో ఒకరు నాకు బాగా క్లోజ్. లింక్ పంపిస్తే చదివాను. రివ్యూ బాగుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కానీ, క్రమంగా ఆ సినిమా మీద బాగా ఆసక్తి కలిగింది.

ఇక్కడో చిన్న వివరం. ఈ సినిమా Rangjong నిజానికి కొరియన్ సినిమా కాదు. తీసింది ఒక Thailand దర్శకుడు. దీనికి బీజం వేసింది కొరియన్ దర్శకుడు Na Hong-jin. ఇతను తీసిన The Wailing సినీ ప్రేమికులను బాగా మెప్పించింది. ఎందరో సినీ దర్శకులు కావాలనుకునే వారిని వెర్రెత్తించింది. ఒకానొక సందర్భంలో ఈ సినిమా మీద చాలా డిస్కషన్ జరగటమే కాదు, సోషల్ మీడియా రివ్యూలు కూడా వచ్చాయి. హారర్ సినిమాల్లో కొత్త డైమెన్షన్ చూపిన సినిమా.

అతనను తన తరువాత సినిమా కథ కోసం వెదుకుతుండగా థాయిలాండ్ పల్లెల్లో ఉండే కొన్ని ఆచార వ్యవహారాల మీద సినిమా తీయాలనే ఆలోచన కలిగింది. ఇన్నర్ థాయిలాండ్‌లో షమనిజమ్ మీద అతను ఎంతో సమాచారం సేకరించి రాసుకున్న కథను తెర మీదకు తీసుకు రాగలిగిన సత్తా థాయిలాండ్‌లో అత్యంత ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు పొందుతున్న Banjong Pisanthanakun కు మాత్రమే ఉందని భావించి ఆ బాధ్యతను అప్పగించాడు.

2019 డిసెంబరులో మొదలై, 2020 మార్చి నాటికి ప్రపంచవ్యాప్తమై, ఎందరి జీవితాలలోనో పెను విషాదాలను నింపి రెండున్నర సంవత్సరాలు జనజీవనాన్ని అతలాకుతలం చేసిన కరోనా pandemic గా విలయ తాండవం చేస్తున్నప్పుడు, సినీ పరిశ్రమ అన్ని దేశాల్లోనూ బాగా దెబ్బతిన్నది. జనాలు ఓటీటీలకు అలవాటు పడుతున్నారు. క్రమంగా పడ్డారు కూడా. కానీ, పెద్ద తెర మ్యాజిక్ పెద్ద తెరదే. దానికి రీప్లేస్మెంట్ రాదు.

ప్రపంచంలో ఉన్న 36 మేజర్ film industries లో ఒకటైన కొరియన్ సినిమా కూడా చాలా దెబ్బ తిన్నది. అది కూడా అలాంటి ఇలాంటి సమయంలో కాదు. వారి ఖ్యాతి విశ్వవ్యాప్తమై, విదేశీ విభాగంలోనే కాదు, ప్రధాన విభాగాలలో కూడా ఆస్కార్ అవార్డులు గెలుచుకుని సంచలనం సృష్టించిన పారాసైట్ సినిమా Parasite సినిమాల హద్దులను చెరిపివేస్తున్న తరుణం అది.

సినిమా అంటే హాలీవుడ్ అన్న దశ నుంచీ కొరియన్ సినిమా ప్రపంచ సినిమా ముఖచిత్రంగా తయారౌతున్న అపూర్వ ఘట్టానికి నాంది పడుతున్న సమయం. చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధిస్తూ, పెద్ద సినిమాలు విశ్వవ్యాప్తమవుతూ కొరియన్ సినిమా అభిమానుల మనసులు ఉప్పొంగుతున్న వేళ… కొరియాలో కరోనా వల్ల సినిమాలు ఆగిపోయాయి. ప్రొడక్షన్ మాత్రమే కాదు, విడుదలలు కూడా.

Netflix లో సంచలనం సృష్టించిన Squid Game లాంటివి తప్పిస్తే, పెద్ద తెర పైన ఆడదగ్గ సినిమాలన్నీ మూలకు వెళ్ళాయి. విడుదలలు ఆగిపోయాయి. బాగుంది అన్న టాక్ వస్తే దేశవ్యాప్తంగా కనీసం 10 మిలియన్ల మంది (కొరియా జనాభా 68 మిలియన్లు కాగా సినిమా చూసే వయసున్నా వారు 60 మిలియన్లు) చూసే సినిమాలు కూడా కనీసం లక్ష, లక్షన్నర టికెట్లు కూడా తెగక ఇబ్బంది పడ్డాయి.

Pandemic కు ముందు Parasite ను సినిమా హాళ్ళలో ఒక్క కొరియాలోనే మొదటి విడత రిలీజ్లో 16 మిలియన్ల మంది చూశారు. ఆ దేశంలో ఈ సినిమా $125 మిలియన్ డాలర్లు వసూలు చేసి చరిత్రలో ఆ ఘనత సాధించిన రెండవ సినిమాగా నిలిచింది. అలాంటిది Pandemic తరువాత పట్టుమని పాతిక మిలియన్ల డాలర్లు కూడా థియేటర్ల ద్వారా ఇప్పటికీ రావటం లేదు.

కొరియన్ సినిమా రక్తపు మడుగులో అల్లల్లాడుతున్న సమయం అది. అలాంటి melancholic వాతావరణంలో మరింత melancholic కథాంశంతో వచ్చిన సినిమానే Rangjong లేదా Rang Zong. కానీ రక్తపు మడుగులో పన్నీటి జల్లు కురిపిస్తూ, కుదేలై పడి ఉన్న సినిమాకు కొత్త ఊపిరి పోసే సంజీవని లాగా వచ్చిన సినిమా ఇది. చూస్తే తెర మీదే చూడాలి అనిపించుకున్న ఈ సినిమా BIFAN లేదా Bucheon International Fantastic Film Festival సిల్వర్ జూబిలీ సంవత్సరంలో ఉత్తమ హారర్ సినిమాగా అవార్డు గెలుచుకున్నది. రివ్యూయర్లు గంగవెర్రులెత్తి పోయారు. మూడు సార్లు ఈ సినిమాను ప్రదర్శించాల్సి వచ్చింది ఈ సినిమాను. అంతమంది ఎగబడ్డారు ఈ సినిమా చూడటానికి.

ఒక Exorcist, ఒక The Omen, ఒక The Evil Dead… ఒక Rangjong. అంతే. జనాలు చూశారు. ఒకరికొకరు కథలు కథలుగా చెప్పుకున్నారు. వెర్రెత్తినట్లు ఎగబడి చూశారు. ఇంతకి మించిన భయంకరమైన సినిమా రాలేదన్నారు. హారర్ వెటరన్సు కూడా జీవితంలో ఇంత భయ భ్రాంతులకు గురి చేసిన సినిమా చూడలేదన్నారు. Oldboy, Sympathy for Mr. Vengeance లాంటి సినిమాలలో చూపిన వైలెన్స్ కు కూడా చలించని ఒక మిత్రుడు చెప్పిన anecdote.

అతని మాటల్లోనే:

సినిమా గురించి విని, చూద్దామని వెళ్ళాను. మధ్యలో టాయిలెట్ బ్రేకులు రెండుసార్లు తీసుకోవాల్సి వచ్చింది. హారర్ అనే కాదు. ఈ సినిమా పేరు విన్నా వెన్నులో వణుకు ఎంత పుట్టిందంటే వెన్నెముక శరీరంలోంచీ బైటకు వచ్చేస్తుందేమో అన్నంత భయం వేసింది. సగం సినిమా కాగానే బతికుంటే భరతనాట్యం అరంగేట్రాలు చూసుకుని బతికేయవచ్చు (ఈ అరంగేట్రాల గురించి కృష్ణశాస్త్రి దేవులపల్లి – he’s the grandson of the legendary poet – విసిరే చెణుకులు చదివి తీరాలంతే), అని ఇంటికి పరుగో పరుగు.

తరువాత స్ట్రీమింగ్ లో చూశాడట. అది కూడా నాలుగైదు installments గా.

Oldboy లో వైలెన్స్ చూసి ఝడుసుకున్నాను అని నువ్వు చెప్తే నవ్వుకున్నాను. కానీ Rangjong నాకు గొప్ప గుణపాఠం నేర్పింది అని చెప్పాడు.

ఈ ప్రచారం వల్ల సినిమాను మరీ ఎక్కువ మంది చూడలేదు కానీ, మంచి లాభాలు గడించి సినిమా థియేటర్లకు కొత్త ఊపు ఇచ్చింది. పనిలో పనిగా మరో మాట… భవదీయునికి ఈ సినిమా చూడటానికి 5 installments పట్టింది. ఎంత ప్రిపేర్ అయి చూసినా, తట్టుకోవటం చాలా కష్టం. కానీ ఎప్పటికైనా uncut వర్షన్ చూసి తీరాలి. Making పరంగాను, తీసుకున్న సబ్జక్టుకు న్యాయం చేయటంలోనూ దర్శకుడు Banjong Pisanthanakun, కథకుడు-నిర్మాత Na Hong-jin నూటికి నూరు శాతం విజయవంతమయ్యారు. జీవితంలో ఇంత గొప్పగా ఒక సినిమా తీయగలిగితే జన్మ ధన్యం అని చాలామంది aspiring filmmakers అన్నారు.

ఈ సినిమా ఇచ్చిన ఊపు వల్ల కొరియన్ థియేటర్లు కాస్త కోలుకున్నాయి. మరో సంవత్సరమైనా పడుతుంది పూర్తిస్థాయిలో విజృంభించటంలో. అలా అని మంచి సినిమాలు మరికొన్ని రాలేదు అని కాదు. ఈ రెండేళ్ళలో కనీసం అరడజనుకు పైగా క్లాసిక్స్ వచ్చాయి. కమర్షియల్‌గా నిలబడటానికి పట్టే సమయం గురించి.

మరి ఇలాంటి Rangjong సినిమా గురించి తెలుసుకోవాలి కదా… వచ్చేవారం కలుద్దాం.

Exit mobile version