Site icon Sanchika

కొరియానం – A Journey Through Korean Cinema-2

ప్రోలోగ్

[dropcap]ఆ[/dropcap]దామూ, అవ్వా, లేదా మనువూ, అతని భార్య, లేదా ఇంకెవరైనా తొట్టతొలి మానవులు, ఎవరైనా సరే! మళ్ళా మనువూ, గినువూ అంటే నువ్వూ నీ మతతత్వ పోకడలూ అంటారు కనుక సిమ్పులుగా ఆది మానవుడూ, ఆది మానవీ ఉన్నారనుకుందాము. వాళ్ళ పేర్లు కాసేపు ఆదామూ, అవ్వా అనుకుందాము. పామొచ్చి అవ్వ చేత Apple పండు తినిపించింది. బాగనే ఉంది. ఆదాము ఆచ్చి నుంచీ రాగానే విషయం చెప్పి, “డాళింగూ లిటుకూ లేకుండా ఈ Apple తినేసెయ్! సూపర్ టేస్టుంది,” అంది. “దేవుడు వద్దన్నాడు కదా బ్యూటీ!” “పర్లేదు డాళింగ్! తినేసెయ్. టేస్టు చూస్తే నీకే అర్థమవుతుంది.” “అస్సరే కానీ బ్యూటీ, నీకు ఇది తినమని ఎవరు చెప్పారు?” “ఒక పాము డాళింగ్.”

“ఎవరా పాము? ఏమా కథ?”

“అగో, నువ్వు ఆచ్చెళ్ళినప్పుడు ఒక పామొచ్చింది డియర్! అది దీన్ని చూపించి కోసి ఇవ్వమంది డియర్. నా దగ్గర చాకు లేదు కదా! అన్నాను డియర్. అప్పుడది నీ పేరు గీతాచార్యనా అంది డియర్. అదేంటి అట్లా అన్నావ్! ఇంతకీ ఆడెవడు? అన్నాను డియర్. ఆడా? రైట్రు. ఇప్పుడిదంతా రాస్తోంది ఆడే. కాస్త తింగరోడు. అని జనం అనుకుంటారు అని ఆడనుకుంటాడు. నేను కోసివ్వ మంది చెట్టు నుంచీ కాయని. చాకుతో పండుని కోసివ్వ మని కాదు. ఆడిట్లా అంటుంటాడు ఎప్పుడూ. అందుకే అలా అడిగాను. అన్నది డియర్. అప్పుడు సరే! అని నేను చెట్టుకి ఉన్న కాయ కోసిచ్చాను డియర్! అప్పుడది ఆ కాయని తిని సూపర్ టేస్ట్! అంది డియర్. పామూ, పామూ సూపర్ టేస్ట్ అంటే ఏంటిరా? అన్నాను డియర్. అప్పుడది ఇంకో పండు కొయ్ అంది డియర్. అప్పుడు నేను కోశాక కొరికి చూడు అంది డియర్. ఒక్కసారి కొరికానో లేదో, సూపర్ టేస్ట్! అన్నాను డియర్. ఇప్పుడర్థమైందా? సూపర్ టేస్ట్ అంటే అంది డియర్. అవును అని తలూపాను డియర్. అప్పుడది, ఇదిగో చూడు పిల్లా! అంది డియర్. నేను పిల్లను కాదు. నా పేరు అవ్వ అన్నాను డియర్! అప్పుడది ఛప్! ఇదే గీతాచార్య గోలంటే. చెప్పేది వినడు. ఉన్నట్టుండి డిస్టార్షన్ ఇస్తాడు. అంది డియర్! సరే చెప్పరా అన్నాను డియర్. ఇంకా లోహ యుగం రాలేదు. కనుక చాకులూ గట్రా అనకు. చాకును మెటల్ తో చేస్తారు. అవింకా కనిపెట్టబడలేదు. కథలో ఇంటిగ్రిటీ దెబ్బతింటుంది. కనుక ఇప్పటి వాతావరణానికి తగ్గట్టు మాట్లాడు. ఇక నుంచీ రోజుకొక ఆపిల్ నైనా తిను. An Apple a day keeps the doctor away. నా మాట విను. అంది డియర్. పాము చెప్పింది అర్థం కాకపోయినా తలూపాను డియర్. అది డాళింగ్ జరిగింది.” అంటూ అవ్వ ముగించింది.

“అంతా బాగానే ఉంది కానీ, ఆ గీతాచార్య రాస్తోంది ఏవిటట?” ఆదాము అన్నాడు.

Chapter 1 పూర్వ కథ

ఇంతలో దేవుడు రావటం, రెస్ట్ ఈజ్ హిస్టరీ. అంటే విశ్రాంతి చరిత్ర అయింది అని కాదు. ఇక మిగిలింది అందరికీ తెలిసిందే అని కవి హృదయం.

పైన అవ్వ ఆదాముకు ఉన్నది ఉన్నట్టుగానో, లేనిది ఉన్నట్టుగానో, లేదా ఉండీ లేనట్టు ఉన్న దాన్ని అలాగేనో చెప్పింది కదా! దాన్నే narration అంటారు. అలా జరిగిన దాన్నో, లేదా జరుగని దాన్నో, ఒకరు ఇంకొకరికి చెప్పటం అన్నది ఎప్పుడు మొదలయిందో, అప్పుడే కథ, కథనాలన్నవి పుట్టాయని విలియమ్ బాయ్డ్ మహాశయుడు చెప్పారు. అలా పుట్టిన కథ ఎన్ని మలుపులనో చవి చూసి, ప్రస్తుతం నవలలూ, సినిమాల రూపంలో అలరిస్తున్నది. షార్ట్ స్టోరీస్, లేదా షార్టీస్ అన్నది మరొక పేరొంది, జనాదరణలో ఉన్న రూపం. ఈ షార్టీస్ లేదా మామూలుగా మనం పిలుచుకునే కథ అన్నవి లేని, రాని పత్రికలంటూ ఉండవంటే అతిశయోక్తే! ఎందుకంటే సైన్సు, బిజినెస్, ఇలాంటి వాటిలో ఎక్కడో ఉదాహరణ కోసం తప్ప రావు కదా! చెప్పింది కదా అవ్వ తమ ట్రూలీ ఎలాంటి వాడో అని.

ప్రస్తుతం ఇక్కడ నేను చర్చిస్తున్నది సినిమాల గురించి కనుక ఆ విషయానికొద్దాము, ఏన్షియంట్ హిస్టరీనొదలి.

సినిమా అన్నది ఒక విజువల్ మీడియమ్. ఈ విజువల్ మీడియమ్ అన్నది చూట్టానికి ఆపరెంట్‌గా ఈ మధ్య కాలంలోనే వచ్చినట్టు అనిపించినా, అని మనము అనుకున్నా, విజువలైజేషన్ అన్న ప్రక్రియ కథ అన్నది పుట్టినప్పుడే ఉంది. అంటే చెప్పే వారు వారి మనో ఫలకం మీద ఒక ఊహాత్మకమైన కాన్వాస్‌ను నిర్మించుకుని అక్కడ తాము చెప్పే దాన్ని విజువలైజ్ చేసుకుంటారు. అన్ని కేస్‌లలోనా అంటే చెప్పలేము. But ninety per cent of narrators easily visualise what they are narrating. అలాగే, వినే వాళ్ళు కూడా విజువలైజ్ చేసుకోక మానరు. ఈ విజువల్ స్టోరీ టెల్లింగ్ అని పేరొందిన సినిమా ప్రధానంగా ఆధారపడేదీ, పడాల్సిందీ కథ అన్న దాని మీదే. ఆ కథ అన్నది లేకపోవటం వల్ల సినిమాలెంత దెబ్బతింటాయో మనకు తెలిసిందే. మా సినిమాలో కథే హీరో అన్న పడికట్టు పదమూ మనం వింటూనే ఉంటాము.

అలాంటి కథను సినిమాకు తగ్గట్టుగా, అంటే విజువలైజ్ చేసి, జనానికి చేర్చే బాధ్యత దర్శకునిది. ఒక కథకుడు కథను వ్రాస్తాడు. ఆ వ్రాసిన కథను, విస్తరించి, సినిమాకు తగ్గట్తుగా స్క్రీన్ ప్లే వ్రాస్తాడు స్క్రీన్ ప్లే రచయిత, లేదా చిత్రానువాదకుడు. దాన్ని దృశ్యాత్మకంగా ఊహించుకుని, ప్రాక్టికాలిటీస్‌కు లోబడి తెరకెక్కించే వాడు దర్శకుడు. అంటే ఎవరో వ్రాసిన కథనూ, ఇంకెవరో వ్రాసిన స్క్రీన్ ప్లేనూ ఆధారంగా చేసుకుని తన చేత ఉన్న కథను దృశ్య రూపంలో ప్రేక్షకులకు చేర్చే వాడు దర్శకుడు. ఇక్కడో చిత్రం చూడండి. కథ ఒకరిది. స్క్రీన్ ప్లే మరొకరిది. తీరా చూస్తే, దాన్ని విజువలైజ్ చేసి జనాన్ని మెప్పించాల్సిన బాధ్యత మటుకూ దర్శకునిది. అంటే ఎక్కువ మంది చేసుకునే దానికన్నా లేదా వారి ఊహలకు తగ్గట్టో లేదా ఊహించినదానికన్నా మిన్నగానో తయారు చేసి జనానికి చేర్చాల్సింది దర్శకుడే.

ఒక్కోసారి కథకుడే దర్శకుడవుతాడు. అతనే స్క్రీన్ ప్లే కూడా వ్రాసుకోగలుగుతాడు. అంటే కథా, కథన సంవిధానాలు కూడా అతని ఊహలకు తగ్గట్టు గానే ఉంటాయి. అంటే తాను ఊహించుకుంటూ వ్రాసిన దాన్ని అలాగే తెరకెక్కించి జనాలకు అందించాలని చూస్తాడు దర్శకుడు. అతని విజువలైజేషన్నే చూసి, నచ్చితే ఆనందించి, ఆదరిస్తారు ప్రేక్షకులు. అలాంటి దర్శకులలో ఒక్కొక్కరిదీ ఒక్కో పంథా.

ఏదీ ఏమైనా ఒక సినిమా తీయాలంటే (ఇదేమన్నా తలుపనుకున్నావా తీయటానికి అంటే, బాబులూ, పాపలూ, వారి బిడ్డలూ తీయటం అంటే… making a film అని) ముఖ్యంగా కావాల్సింది కథ. ఎక్కడో ఎప్పుడో ఒక ఆలోచనో, ఐడియానో తళుక్కున మెరుస్తుంది. దానికి మరికొన్ని చేర్పులు చేర్చి, అంటే ఒక మాదిరిగా చెప్పాలంటే ఇలా… ఎవరి గురించి? దేని గురించి? ఎందుకు ఇలానే? అన్న ప్రశ్నలను ఆధారంగా చేసుకుని కథలల్లుతారు. అలాంటి ఒక కథే, Oldboy అనే Manga. మాంగా అంటే జపనీస్ కార్టూన్ లేదా కామిక్స్. పిల్లల కన్నా సాధారణంగా పెద్దలను టార్గెట్‌గా పెట్టుకుని వస్తాయవి. వాటికో ప్రత్యేకమైన డిజైన్ లాంగ్వేజ్, narrative style ఉంటుంది. ఆ Oldboy అనే మాంగాను ఆధారం చేసుకుని కొరియెన్ డైరక్టర్ పార్క్ చాన్-వుక్ (Park Chan-wook) అదే పేరుతో తీసిన సినిమా గురించి మీకు తెలియని విశేషాలు.

Chapter 2 దర్శకుని కథ

జాయింట్ సెక్యూరిటీ ఏరియా (2000) అనే సూపర్ హిట్ సినిమాతో జనాన్నీ, నిర్మాణ సంస్థలనూ ఏకకాలంలో తన వైపు తిప్పుకున్న కొరియెన్ డైరక్టర్ పార్క్ చాన్-వుక్. అంతకు మునుపు వేరే సినిమాలను తీసినా, ఈ సినిమాతో అతనికి వచ్చిన పేరు, పరపతి అంతా ఇంతా కాదు. ఒక రకంగా బ్లాంక్ చెక్‌ను అతనికిచ్చేశాయి నిర్మాణ సంస్థలు. ఆ క్రితం సంవత్సరమే వచ్చిన Shiri అన్న సూపర్ హిట్ (అప్పట్లో అది కొరియాలో అత్యంత సంచలనం సృష్టించి, టైటానిక్ రికార్డులను ఆ దేశంలో తిరగ రాసింది. కొరియన్ సింహాసనం అనుకోండి. ఎందుకంటే బాహుబలి ఇంకోటుంది కాబట్టి). అది నార్త్ కొరియా, సౌత్ కొరియాల మధ్య ఉన్న సంబంధాలను తడిమి చూసింది. హాలీవుడ్ బిగ్ బజెట్ సినిమాల స్థాయిలో ఉందనే పేరు పొంది ఒక లాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోయింది. వెంటనే ఒక సంవత్సరం లోపే అదే థీమ్‌ను బేస్ చేసుకుని ఉన్న సినిమాను, ముందు సినిమా ఛాయలేమాత్రం కనిపించకుండా అంతకు మించిన కథన నైపుణ్యంతో నడిపించటం, మెగా హిట్ చెయ్యటం సామాన్యమైన విషయం కాదు. అలాంటి ఘనతను సాధించిన పార్క్ తరువాత ఎలాంటి సినిమాను తీస్తాడో అని జనం ఎదురుజూస్తున్నారపుడు.

పార్క్ ఆలోచనలు సుమారుగా పుష్కర క్రితం తనకొచ్చిన ఒక ఆలోచన వైపుమళ్ళాయి. ఇప్పుడు దాన్ని తెరకెక్కిస్తే ఎలా ఉంటుందనుకున్నాడు. ఒక చిన్న పిల్లను కిడ్నాప్ చెయ్యటం, ఆ పిల్ల తండ్రి ఆ కిడ్నాపర్ల మీద ప్రతీకారం తీర్చుకుంటం అన్నదా కథాంశం. 1995 నాటికి ఆ కథకు ఒక రూపం తెచ్చిన పార్క్‌కు అప్పటి పరిస్థితులలో నిర్మాతలు దొరకటమే గగనం. అలాంటిది తను వ్రాసుకున్న అత్యంత భయంకరమైన (విపరీతమైన వయలెన్స్) scenario ను సినిమాగా తీయటమంటే కలలో కూడా సాధ్యం కాని పని. కానీ జేఎస్ఏ తెచ్చిన క్రేజ్ వల్ల తనకు లభించిన క్రియేటివ్ ఫ్రీడమ్‌ను ఉపయోగించుకుని అదే కథను సినిమాగా తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన మొదలయి, చివరకు One of the most violent and pessimistic tales of revenge ever seen on the big screen గా బయటకొచ్చింది. దాని ఫలితం…

Viewers who may have expected a Joint Security Area 2 largely stayed away from the movie. Also there was some pessimistic nature in his previous film, but in this, it exceeded the levels of bearability for many. Actually at one time yours truly vomited twice, and stayed away from it for more than 6 months. JSA had some light hearted episodes of humor, and warmth, which this movie Sympathy for Mr. Vengeance lacking.

అయితే అనుకున్న దానిని అనుకున్నట్టు తీశాడు పార్క్. అలా పడ్డది వెన్జెన్స్ ట్రైలాజీకి పునాది. అందులోని రెండవ భాగమే మనం చెప్పుకుంటున్న Oldboy! బాక్సాఫీసు దగ్గర మిస్టర్ వెన్జెన్స్ బొక్కబోర్లా పడటమే కాకుండా క్రిటికల్‌గా కూడా హింసాత్మక దృశ్యాల గురించి కూడా బాగా విమర్శలెదుర్కున్న పార్క్ ఈ సారి కాస్త సేఫ్ గేమ్ ఆడాడు. కానీ, ఎంతైనా క్రియేటివిట్టీ 😉 ఉన్న మనిషాయే.

సరి అయిన కథ కోసం చూశాడు. స్టార్లను రంగంలోకి దింపాడు. వాళ్ళంతా మన వాళ్ళలా పుట్టుకతో స్టార్లు కాదు. చాలా వరకూ స్వయం కృషితో ఎదిగున వాళ్ళు. నటనలో తల పండిన వాళ్ళు. కోతికి కొబ్బరి కాయ దొరికినట్లు, వీవీఎస్ లక్ష్మణ్‌కు ఆస్ట్రేలియా దొరికినట్లు, మహేంద్ర ధోనీకి గంగూలీ తయారు చేసి, పటిష్ట పరచిన టీమ్ దొరికినట్లు, జపనీస్ మాంగా అయిన Oldboy దొరికింది. ఉన్న దాన్ని ఉన్నట్లు తీస్తే ఇక్కడ మనం మాట్లాడుకునేందుకు ఏమీ లేదు. మరి పార్క్ ఏమి చేశాడు?

వెయిట్ అండ్ సీ!

Exit mobile version