కొరియానం – A Journey Through Korean Cinema-22

0
3

వచ్చిండన్నా వచ్చాడన్నా

Chapter 20

[dropcap]6 [/dropcap]June 1992,

Roland Garros,

French Open Women’s Final

Paris.

మన నరసరావుపేటలో సాయంత్రం ముగిసి చీకటైతే పడింది.

స్టెఫీ గ్రాఫ్, మోనికా సెలెస్ హోరాహోరీ పోరు. ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో అత్యుత్తమ ఫైనల్‌గా, స్టెఫీ-మోనికాల రైవల్రీలో అత్యుత్తమ ఫేజ్‌గా గుర్తింపు పొందబోతున్న మ్యాచ్ అది. ఆ సమయంలో మోనికా లేని ప్రపంచంలో స్టెఫీనే నంబర్ వన్. స్టెఫీ కూడా ఉన్న ప్రపంచంలో మోనికా నంబర్ వన్. అర్థమైందనుకుంటాను!!!

స్టెఫీ దాదాపు ఏడేళ్ళు తిరుగులేని ఆటతో టెన్నిస్ అంటే స్టెఫీ, స్టెఫీ అంటే టెన్నిస్ అనేంత స్థాయిలో ఉన్నత శ్రేణి ఆటతో వెలుగొంది క్రమంగా 7 Years’ Itch వల్ల కాస్త వెనుకంజ వేస్తున్న సమయం. అయినా కూడా స్టెఫీని పూర్తిగా నిలువరించే వాళ్ళు లేరు. అలాంటి సమయంలో వచ్చింది మోనికా సెలెస్.

తిప్పించి మళ్ళించి కొట్టింది అనే మాట నేను నేర్చుకుంటున్న సమయం 😉. సెలెస్ డామినేషన్ వల్ల స్టెఫీ తన ప్రభను పూర్తిగా కోల్పోతోందా అని టెన్నిస్ అభిమానులు చర్చిస్తున్న ఆ సమయంలో జరిగిన ఫైనల్.

కానీ, అనుకున్నదానికన్నా ఉధృతమైన ఆట తీరుతో స్టెఫీ సెలెస్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. చెరొక సెట్ గెలిచారు. మూడో సెట్ 6-6 దాటి వెళ్ళిపోయింది. 7-7.

క్రమంగా అది 8-8 అయింది. అప్పుడు సెలెస్ కీలకమైన బ్రేక్ సంపాదించింది.

Monica Seles is now serving for the match!

కానీ, అప్పటిదాకా కాస్త మన్ను తిన్న పాములా ఉన్న స్టెఫీ విజృంభించింది. అయినా సెలెస్ ముందే 40 సాధించి మ్యాచ్ పాయింట్ పొందింది. విజయం ముంగిట నిలిచింది. కానీ ఇక్కడే స్టెఫీ ఆటను తన కంట్రోల్ లోకి తీసుకుంది. విజయం సాధిస్తున్నాం మరో క్షణంలో అన్నదాని కన్నా పెద్ద ఒత్తిడి కలిగించే విషయం ఈ భూప్రపంచంలో మరణం ఒక్కటే. సెలెస్ ఆ మానసిక స్థితిలో ఉన్న వేళ స్టెఫీ వీలైనన్ని షాట్లను ఫోర్ హేండ్లుగా మార్చుకుంది. ఆటను తను డామినేట్ చేస్తోంది. పాయింట్ స్టెఫీ ఖాతాలో.

సెలెస్ వైపు నుంచీ స్కోరు… (సర్వ్ తనది కనుక).

6-2, 3-6, 9-8 (15-40).

Chorus: Still it’s Match Point 5 for Monica.

సెలెస్ సర్వ్ చేసింది. నెట్. ఆమె ప్లాన్ స్టెఫీకి బలహీనమైన బేక్ హేండ్ వైపు కొట్టాలని.

రెండో సర్వ్ ఇన్ అయి, స్టెఫీ backhand shot ఆడాల్సిన పరిస్థితి ఏర్పడినా, వెంటనే తరువాత షాట్ forehand గా మార్చుకుంది. ఆటను డామినేట్ చేస్తూ పాయింట్ గెల్చుకుంది.

Chorus: Still it’s Match Point 6 for Monica.

Score: 6-2, 3-6, 9-8 (30-40).

మరోసారి ఇదే pattern repeat అయింది. ఆట స్టెఫీ కంట్రోల్‌లో ఉంది. రెండు slice shot back hands తరువాత తరువాత షాట్‌ను forehand గా మల్చుకుంది. ఇంకేముంది? ఒక విన్నర్ కొడితే ఆట డ్యూస్. స్టెఫీ ఇప్పుడున్న ఊపు మీద బ్రేక్ సాధించి, చాంపియన్షిప్ గెలిచే అవకాశాలను మెరుగు పరచుకుంటుంది అన్న ఆశ నాలో చిగురించింది.

కానీ, ఆ ఆశలను ఛిన్నాభిన్నం చేస్తూ, స్టెఫీ తన forehand ను నెట్ లోకి కొట్టింది.

Seles Creates History: First Woman to Win 3 French Open Championships On A Trot.

అప్పుడే నాకు హ్యాట్రిక్ అన్న పదం పరిచయమైంది. తెల్లవారి న్యూస్ పేపర్‌లో ‘స్టెఫీ కంట తడి’ అన్న సబ్ హెండింగ్ చూడటం, దాని గురించి ఇంట్లో చర్చ జరగటం, మన ఇంట్లో పిల్ల కొద్దిలో ఓడిపోయిందన్న రీతిలో అందరూ బాధపడటం నాకు ఇప్పటికీ గుర్తు.

THIS UNFORCED ERROR STINGS STEFFI MORE THAN ANYTHING ELSE KFOR SOMETIME.

కామెంటరీలో విన్నాను. Unforced error అంటే?

ఆటను తను డిక్టేట్ చేస్తూ, తను గెలుచుకోవాల్సిన పాయింట్‌ను అప్పనంగా సెలెస్ effort ఏమాత్రం లేకుండా అప్పగించటానికి కారణమైన error shot నే unforced error అంటారని మూడు రోజుల తరువాత తెలుసుకున్నాను.

That unforced error stung me too. ఒక వారం పాటూ తెలియని బాధ. మనం అభిమానించే వారి గెలుపోటనములు మనని ప్రభావితం చేస్తాయని తెలియని వయసది. తెలియనంత మాత్రాన సత్యాలు సత్యాలు కాకుండా పోవు కదా.

Chapter 21

Unforced Comedy.

అర్థమయ్యే మాటే ఇది.

ఇప్పుడు మనం కలవబోతున్న సినిమా ఈ స్ట్రాటజీ పైపూతగా వచ్చింది. ఈ వాక్యంలో ఓ విశేషముంది. క అనే అక్షరం పలకం రానివారు చదివినా అర్థంలో మార్పు ఉండదు. వ్యాకరణ పరంగా కాస్త మెరుగ్గా ఉందనిపిస్తుంది కూడా.

అదే…

DECISION TO LEAVE.

దర్శకుడు… పార్క్ చాన్-వుక్. మన పార్క్ చాన్-వుక్.

చాలా కాలం తరువాత… తనను ప్రపంచానికి పరిచయం చేసిన జాన్రాను (Police Procedural) మరోసారి పలకరిస్తూ తీసిన సినిమా ఇది. ఇరవై రెండేళ్ళ తరువాత ఏ విధంగా ఆ జాన్రాను మళ్ళా కదిలించగలిగాడు? ఏమైనా ఎదుగుదల ఉన్నదా? లేదా పైబడుతున్న వయసు వల్ల పదును తగ్గిందా? జాయింట్ సెక్యూరిటీ ఏరియాతో పాత వైఫల్యాలను దాటుకుని ఒక దర్శకునిగా తనదైన ముద్రను వేశాడు పార్క్. Police Procedural లా అనిపించే పొలిటికల్ థ్రిల్లర్‌లో మానవీయ సంబంధాల లోతుల ఆధారంగా ఉత్తర-దక్షిణ కొరియాలో సంబంధాలను చర్చిస్తాడు ఆ సినిమాలో. అందుకే ఆ విషయం మీద ఎన్ని సినిమాలు వచ్చినా, JSA ను మించలేదు.

సరికొత్త పార్క్‌ను జనానికి తెలియజేసిన ఆ సినిమాను చాలామంది సినీ పండితులు అతని డెబ్యూ మూవీగా పరిగణిస్తారు. ఆ తరువాత Oldboy తో దిగ్దర్శకుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పార్క్ చాన్-వుక్ ఈసారి అదే జాన్రాకు సరికొత్త సొగసులద్దిన సినిమా…

డెసిషన్ టు లీవ్. లేదా Heeojil Gyeolsim.

కొరియన్ టైటిల్ నుంచీ literal translation చేస్తే ఇంగ్లీషు టైటిల్ వచ్చేసింది.

పూర్తి స్థాయి థ్రిల్లర్‌గా మారాల్సిన సినిమాను చిన్న improvisations, idiosyncrasies సహాయంతో రొమాంటిక్ డ్రామాగా మార్చాడు. తనదైన dark humour ను వదిలి, Unforced Comedy ని పైపూతగా వాడాడు.

ఇంకేముంది? 4/4, 4.5/5 రేటింగ్ లతో…

వచ్చిండన్నా వచ్చాడన్నా

వరాల పార్కూ తెచ్చిండన్నా…

Cinematic magic back to the theatres in Korea అని స్వాగతం పలికారు.

As usual for his films, the Wei Jing and Park Tae-il starrer was selected to compete for the Palme d’Or at the 2022 Cannes Film Festival. మరో మాట లేకుండా మన పార్క్ ఉత్తమ దర్శకుడిగా నిలిచాడు. జూన్ 29, 2022 న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ భయాలను దాటి. ఈ సమస్య లేకపోతే సినిమా కమర్షియల్‌గా మరింత పెద్ద విజయం సాధించేదే.

ఇప్పుడు కాదు కానీ (16 July 2022 10:46 AM), మరో ఆరు నెలల తరువాత మన film buffs ఈ సినిమా గురించి హోరెత్తిస్తారు. ఈ లోగా మనం ఈ సినిమా గురించి ముందే తెలుసుకుందాం. అవకాశం దొరికింది. వదిలేస్తామా ఏంటి?

తిక్కన విరాట పర్వం ఉత్తర దక్షిణ గోగ్రహణాల సందర్భంలో విజృంభించిన చందాన పార్క్ తన కవితాత్మక చిత్రీకరణంలో శిఖరాగ్రాన్ని చేరతాడు ఈ సినిమాతో.

Decision to Leave is not just the tile of the film. It’s also the filmmaker’s (Park) decision to leave the mere mortals of the ordinary filmmakers to reach the next plane. Currently, there’s no better filmmaker than Park Chan-wook on the planet.

If cinema is an art of visual storytelling, currently he’s one of the three or 4 masters in the world whose even a smallest gesture speaks volumes.

అలాంటి సినిమాలు సాధారణంగా mainstream లో పెద్దగా ఆడవు. కానీ, Park Chan-wook is a magician. He’s not exactly the master of imagination like Jame Cameron nor has he shown the cerebral visceral energy topping Chris Nolan’s. కానీ, ఒక ఆర్టిస్టుగా తనదైన శైలి చిత్రీకరణలో, అతను ఇప్పుడిప్పుడే పీక్‌కు చేరుతున్నాడు. మరి ఆ పీక్ ఇంకెంత గొప్పగా ఉంటుందో?

వచ్చేవారం కలుద్దాం ఈ సినిమా గురించి తెలుసుకునేందుకు.

అప్పటిదాకా, వానలు పడ్డప్పుడు కుప్పలుగా మిగిలిన బట్టలు ఉతుక్కుందాం. Let’s turn on the Washing Machines!

😀😀😀

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here