Site icon Sanchika

కొరియానం – A Journey Through Korean Cinema-27

It’s A Maud Maud World

[dropcap]M[/dropcap]an Booker Prize కి Shortlist కాబడిన ఈ నవల, క్రైమ్ రైటర్స్ ఎసోసియేషన్ వారి హిస్టారికల్ డేగర్ అవార్డ్ గెలుచుకున్నది. ఆ సంవత్సరానికి వచ్చిన హిస్టారికల్ నవలలలో క్రైమ్ ఫిక్షన్ మేళవించి ప్రభావవంతమైన కథనాన్ని అందించిన పుస్తకాలకు ఈ అవార్డు ఇస్తారు. ఏదోక రూపంలో ఇచ్చే వందల లిటరరీ అవార్డుల్లో ఇదీ ఒకటి అనుకునేందుకు లేదు. ఈ అవార్డులో ప్రతిభే కొలమానం. కనీసం ఇప్పటి వరకూ ఇచ్చిన 23 అవార్డుల వరకూ.

సారా వాటర్స్ రచించిన ఈ Fingersmith సినిమాగా రాకమునుపే బాగా ఫేమస్. ఆ పైన దీన్ని పదునైన టీవీ సీరీస్‌గా మలిచారు. కానీ, ఒక పరిధి దాటి ఇది జనసామాన్యానికి పరిచయమైనది మటుకూ The Handmaiden గా రూపాంతరం చెందాకే.

ఒక మాదిరి సోర్స్ మెటీరియల్ దొరికితేనే చెలరేగిపోయే పార్క్ చాన్-వుక్ ఇంత గొప్ప నవల అందేసరికి తన కెరియర్ లోనే మైలురాయిగా నిలిచే సినిమాగా మలిచాడు. కానీ, Oldboy తనను ప్రపంచానికి మొదటిసారి పరిచయం చేయటం, అప్పటికి అలాంటి తరహా filmmaking ను ప్రపంచం అరుదుగా చూసి ఉండటం వల్ల దాని అంత సంచలనం సృష్టించకపోయినా, పార్క్ చేతి నుంచి వచ్చే ఏ సినిమా అయినా ఉన్నతశ్రేణిలో ఉంటుందని, అదొక విజువల్ masterpiece అన్న విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని నిరూపించింది ఈ సినిమా.

అందువల్లే దీని తరువాత వచ్చిన డెసిషన్ టు లీవ్ ను ఒక aspiring లేదా about-to-be-great filmmaker తీసిన సినిమాగా కాక ఒక master at the peak of his artistic prowess తీసిన సినిమాగా evaluate చేశారు. అందుకే ఎవరో కొద్దిమంది తప్ప మిగిలిన వాళ్ళు సినిమాను ఎలా చూడాలో అలాగే చూసి, ఎలా ఆస్వాదించాలో అలాగే ఆస్వాదించారు. అందుకే ఆ సినిమాకు వచ్చినన్ని పాజిటివ్ రివ్యూలు పార్క్ తీసిన ఏ సినిమాకూ రాలేదు.

అజంటిల్మన్ Richard Rivers, టక్కులాడి Mud Lily మొత్తానికీ, Sue ను ఎసైలమ్ లో వేసి తమ దారిన తాము చక్కా పోయారు.

ఇప్పుడు మన అంచనాలను మరోసారి తారుమారు చేస్తూ రచయిత్రి సారా వాటర్స్ కథను మాడ్ దృక్కోణంలోకి మార్చి చెప్తుంది.

మాడ్ తన అంకుల్‌తో కలిసి చేసే డిక్షనరీ ప్రాజక్ట్ ప్రధాన పాత్ర వహిస్తుందిక్కడ.

అందరూ అనుకునేలా అది ఏదైనా ఒకటి లేదా రెండు భాషలకు సంబంధించిన వ్యవహారం కాదు. అదొక ‘యూనివర్సల్ లాంగ్వేజ్’కు సంబంధించిన బృహత్తరమైన పని. రామ్ గోపాల్ వర్మ హర్షిస్తాడు.

Christopher Lily మాటలలోనే చెప్పాలంటే… it’s his job to assemble a bibliography of literary pornography, for the reference of future generations. తనున్న సమయంకన్నా వంద సంవత్సరాల ముందు చూపు ఉన్న ‘మహనీయుడు’ క్రిస్ లిలీ.

తనను తాను వర్ణంచుకునే ప్రకారం మానసిక శాంతినిచ్చే పదునైన విషాలను సేకరించి భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత ఆయనదట. ఒక వేళ ప్రకాశ్ రాజ్ ఆ పాత్ర వేయాల్సి వస్తే అదొక భాద్యత. ఈ కథను మన దేశంలో తీస్తే ప్రకాశ్ రాజ్‌కు సరిగ్గా సరిపోయే పాత్ర అన్నది ఇక్కడ చెప్పుకోకూడని విషయమేమీ కాదు.

Masculine Theories – ఈ మధ్య కాలంలో విపరీతమైన woke culture, and metrosexual male race కు counter గా వస్తున్న సిద్ధాంతం – ప్రకారం పోర్న్ అన్నది మానవజాతిని, ప్రత్యేకించి పురుషులలో (వేదిక్ పురుషః కాదు) పౌరుషపు శక్తినే కాదు, ఏ రకమైన ప్రొడక్టివ్నెస్‌ను కూడా చంపివేస్తోంది.

తనకంటూ కొన్ని ఊహలు, ప్రపంచమంటే పెరుగుతున్న అవగాహనను ఈ అంకుల్ పూర్తిగా చిదిమివేశాడు అంటుంది మాడ్ చాలా సందర్భాలలో.

తనకు ఎటువంటి మానసిక అనారోగ్యాలు లేకపోయినా, మాడ్ మెంటల్ ఎసైలమ్‌లో పెరుగుతుంది. తన తల్లి తన చిన్నతనంలోనే మరణించిన ఆ ఎసైలమ్ లోనే మాడ్‌ను అక్కడి నర్సులు సాకుతారు. వారు తనను ఒక్కొక్కరూ ఒక్కొక్క రకంగా తనను ట్రీట్ చేస్తారు. అందరు ఆడపిల్లల లాగానే తనను కూడా ఎవరన్నా రక్షించకపోతారా అని ఎదురు చూసిందో లేదో అన్నది మాడ్ చెప్పదు. ఇంతలో ఈ అంకుల్ దిగబడి, చూపాల్సిన ఆధారాలు చూపి తనను అతి నిశ్శబ్దంగా ఉండి, మానవ వికాసానికి అవకాశం లేని చోటుకు తీసుకెళ్ళాడు అన్నది మాత్రం నిజం.

అక్కడ ఎన్నో చిత్రహింసల మధ్య మాడ్ పెరుగుతుంది. పుస్తకాల మీద biological secretions of any type ఉండకూడదు అనే మిష మీద క్రిస్ మాడ్ చేతులను ఎప్పుడూ గ్లోవులలో ఉండేలా చూస్తాడు. దానికి మరో కారణం కూడా ఉందనుకోండి.

అక్కడ (బ్రయర్‌లో) తన పదకొండవ ఏట నుంచీ, స్యూను మోసం చేసి, క్రిస్ ను ఏమార్చి తప్పించుకునే వరకూ పెరుగుతుంది మాడ్.

అంకుల్ క్రిస్‌కు సెక్రటరీగా ఆ పోర్న్ పుస్తకాల లిస్టును తయారు చేయటమే కాకుండా, కొన్నిసార్లు అక్కడకు వచ్చే మర్యాదస్తులకు అందులో కొన్ని passages చదివి వినిపించాలి. ఎక్కడ ఏ పొరబాటు చేసినా శిక్ష దారుణంగా ఉంటుంది. కొన్నిసార్లు సరైన ఆహారం కూడా ఇవ్వడు అంకుల్ క్రిస్.

గత కాలము మేలు వచ్చుకాలము కంటెన్ అని మనం ఎంత అనుకున్నా కొన్నిసార్లు కొన్ని విషయాల మీద అవగాహన పెరిగిన ఈ కాలమే నయమనిపిస్తుంది మాడ్ కథ చదువుతుంటే.

దీనికన్నా తను పెరిగిన మెంటల్ ఎసైలమే మేలు అని చాలాసార్లు అనుకుంటుంది మాడ్. చుట్టూ ఉన్న వాతావరణం, పెరుగుతున్న పరిస్థితులు, ఏ మాత్రం ఆశ కలిగించని భవిష్యత్ ఇవన్నీ ఆమెను శాడిస్ట్‌గా మారుస్తాయి. కానీ ఎక్కడో విచక్షణ తనను పూర్తిగా సైకోగా మారనివ్వకుండా అడ్డుపడుతుంటుంది.

తన నానీ మిసెస్ స్టైల్స్‌ను, చెలికత్తె ఆగ్నెస్‌ను అకారణంగా కొట్టటం, కొరకటం, passive methods లో హింసించటం ద్వారా ఆ శాడిస్టిక్ లక్షణాలు చూపినా, స్యూ తో ఉన్న సమయంలో బైటకు వచ్చే మాడ్ వేరు. మరి అలాంటి మాడ్ ఎందుకు స్యూను మోసం చేసింది?

జీవితం మీద ఆశలు అడుగంటి పోయిన సందర్భంలో డ్రగ్ ఎడిక్ట్ అయిన అజంటిల్మన్ Richard Rivers వచ్చి తనను ఆకట్టుకుని, ఇంకెవరినైనా తన బదులు ఇరికించి, తనకు రావలసిన ఆస్తిని పొందగలిగితే, జీవితాన్ని సుఖంగా గడపవచ్చని అతను చెప్పిన విధానం నచ్చుతుంది మాడ్‌కు. ఈ విషయం మీద తనకు రిజర్వేషన్లు ఉన్నా కూడా, మాడ్ అందుకు ఒప్పుకుంటుంది కానీ, ఎంత క్రిమినల్ అయినా, స్యూలో ఉన్న స్వచ్ఛత తనను ఆమెతో ప్రేమలో పడేలా చేస్తుంది. ఇక్కడ కూడా పరిస్థితుల ప్రభావమే మనుషులను మలుస్తుందని అని రచయిత్రి చెప్తుంది.

ఇక్కడే పార్క్ తనదైన మార్కు ప్రదర్శించి మనలను ఆశ్చర్య పరుస్తాడు (గుర్తు పెట్టుకోండి).

అయినా, మానవ సహజాతమైన స్వార్థం వల్ల ఆమె అజంటిల్మన్ మాయలో పడి, స్యూను మోసం చేస్తుంది. ఆ ఎసైలమ్‌లో స్యూ నే అసలైన Maud Rivers nee Lily అని, ఆమె తనను తాను తన పనిమనిషి అయిన స్యూ ట్రిండర్ అనుకుని చిత్తభ్రాంతిలో ఉందని ప్రూఫులిచ్చి, లండన్ కు వెళ్తారు.

ఆ మహా నగరంలో కొద్ది రోజులున్నాక చెల్సీ వెళ్ళాలని వాళ్ళ ప్లాన్. కానీ, అజంటిల్మన్ మాడ్ మోసం చేసి, బరోలో ఉన్న Mrs. Sucksby దగ్గరకు తీసుకు వెళ్తాడు. అక్కడ మాడ్ ను Mrs. Sucksby కి స్వాధీనం చేస్తాడు.

షాక్ తిన్న మాడ్‌కు Mrs. Sucksby అసలు నిజం చెప్తుంది. నిజానికి మాడ్ లిలీ కుటుంబానికి చెందదు. తను ఒక అనాథ. పదిహేడేళ్ళ క్రితం మేరియన్ లిలీ పూర్ణ గర్భవతిగా Mrs. Sucksby దగ్గరకు వస్తుంది. కాన్పయ్యాక తన తండ్రి అన్నలకు తనకు కూతురు పుట్టిందన్న విషయం తెలియ కూడదని, తన కూతురు సూసన్ (స్యూ) ను Mrs. Sucksby దగ్గర ఉంచుకుని, ఆ పసికందు బదులు మరొక పిల్లను తనకు ఇమ్మని అడుగుతుంది. ఆ పిల్లే మాడ్. అలా స్యూ అనాథలా Mrs. Sucksby దగ్గర juvenile career criminal గా పెరగగా, మాడ్ మొదట ఎసైలమ్‌లో తల్లి కాని తల్లి వల్ల నర్సుల సంరక్షణలో ఉంది.

పరిస్థితుల వల్ల వ్యక్తిత్వ నిర్మాణం మాడ్ కేస్‌లో నిజం కాగా, మన ఆలోచనలు, మన విచక్షణ అసలైన వ్యక్తిత్వ నిర్మాణంలో పాత్ర పోషిస్తాయని స్యూ పాత్ర ద్వారా తెలుస్తుంది. అలాంటి స్యూ పాత్రని చిత్రంగా మార్చివేసి ఒకరకమైన femme fatale గా మార్చి, కాస్త డల్‌గా అనిపించే ఆమె కథకు సుఖీ రూపంలో వేగాన్ని అందిస్తాడు పార్క్. కాస్త ambiguity ని add చేయటం ద్వారా dynamic గా మలుస్తాడు. అందుకే సుఖీని Maud equivalent in the Korean film హింసిస్తున్నా, మనకు సానుభూతి కన్నా, కోపం కన్నా ఒకింత నిర్లిప్తతే వస్తుంది. అలా ఆ పాత్రల మధ్య వచ్చే violent interactions ను gratuitous affairs గా మారకుండా జాగ్రత్త వహిస్తాడు.

తన జీవితం అధోగతి పాలు కావటానికి తన తల్లి మేరియన్ కారణమని ఇంతకాలం నమ్మిన మాడ్ ఆమెను ద్వేషిస్తుంది. ఎంతలా అంటే ప్రతిరోజూ రాత్రిళ్ళు పడుకునే సమయంలో మేరియన్‌ను తను ఎంత ద్వేషిస్తుందో మాడ్ మేరియన్ లాకెట్‌కు చెప్తుంటుంది. కానీ, మేరియన్ తన అసలు తల్లి కాదు. సరిగ్గా ఇక్కడే మాడ్ కు మరో అదిరిపోయే దెబ్బ తగులుతుంది.

నిజానికి స్యూ తన స్వంత కూతురైనా, మేరియన్ తన ఆఖరి విల్లులో స్వంత కూతురైన స్యూ తో బాటూ, ఆపదలో అక్కరకొచ్చిన మాడ్ కూడా సమానమైన వాటా ఇస్తుంది.

అన్ని అపసవ్యపు పాత్రలన్న ఈ కథలో మేరియన్ ఒక మనసున్న దేవతలా నిలుస్తుంది.

ఈ విధంగా ఉన్న రెండు వాటాలను, అటు స్యూ ను అడ్డు తొలగించుకోవటం ద్వారా అజంటిల్మన్ ఒకటి, మాడ్ ను అదుపులో పెట్టుకోవటం ద్వారా రెండో వాటాను Mrs. Sucksby పొందవచ్చని ప్లాన్ చేసి నడిపిన కథ ఇదంతా.

Using Charles Dickens style of narrative elements, in a Victorian setting, writer Sarah Waters added all the modern day twists and plot elements like lesbianism, feminism, to create a modern day literary masterpiece. But all these things can be observed after taking an eagle eye purview of the subject. Otherwise, we end up reading this as a period set mishmash of modern day isms attributed to the older times.

పార్క్ చాన్-వుక్ కథను, కథనాన్ని పెద్దగా కదిలించలేదు సినిమా కోసం. నవల మూడు భాగాలు లేదా Acts రూపంలో ఉంటే, సినిమాను కూడా మూడు యాక్టులలోనే ఉంచాడు. ప్రధాన ట్విస్టులను improvise చేసి, కొన్ని చోట్ల ఎరోటిక్‌గా అనిపించే నవలలోని అంశాలను షాక్ వేల్యూ exaggerate చేసి వాడాడు. దాని వల్ల సినిమాకు పూర్తిగా వేరొక texture వచ్చేసింది.

ఇక్కడ మనం రెండు రకాలుగా సినిమాను పరిశీలించాలి. ప్రస్తుతం జాపనీస్-కొరియన్ సెటింగ్, ఒకవేళ ఈ సినిమాను కొరియన్‌లో కాకుండా విక్టోరియన్ సెటింగ్ లోనే ఆంగ్లంలోనే పార్క్ తీసి ఉంటే ఎలా ఉండేది అని.

అప్పుడే ఇటు నవలను, అటు పార్క్ సినిమాటిక్ టెక్నిక్‌ను సంపూర్ణంగా అవగాహన చేసుకోగలం.

వచ్చే వారం కలుద్దాం!

వైరల్ ఫీవర్లు ఎక్కువవుతున్నాయి ఆరోగ్యం జాగ్రత్త.

(సశేషం)

Exit mobile version