కొరియానంలో చిన్న బ్రేక్ డాన్స్
Chapter 32 (Just teleport yourself to Chapter 13)
[dropcap]T[/dropcap]he Young Woman scans the restaurant with this new information. She sees all the PATRONS eating, lost in conversations. The tired WAITRESS, taking orders. The BUSBOYS going through the motions, collecting dishes. The MANAGER complaining to the COOK about something. A smile breaks out on the Young Woman’s face.
ఎదురుగ్గా ఉన్న అబ్బాయితో అంటుంది: ఎంత స్మార్ట్‌గా ఉన్నావురా!
ఇంకొంచెం తన చూపులో వేగం నింపి..
ఎదురుగ్గా ఉన్న అబ్బాయితో: ఇక మొదలెడదామా ఆట?
అప్పుడా అబ్బాయి అంటాడు: ఎప్పటిలాగానే. జనాన్ని నువ్వు చూసుకో. పనివాళ్ళ పని నేను పడతా.
అందుకా అమ్మాయి: సై!
అప్పుడా ఇద్దరూ 0.32 కేలిబర్ పిస్టళ్ళు బైటకు తీస్తారు. వాటిని ఒకేసారి టేబుల్ మీద పెడతారు. అతను ఆమె వైపు ఆకలిగా చూస్తాడు. ఆమె ఆ చూపునే తిరిగిస్తుంది.
అప్పుడా అమ్మాయి: I love you, Pumpkin.
అందుకా అబ్బాయి: I love you, Honey Bunny.
ఒక మూతినాకుడు.. er ముద్దు.
And with that, Pumpkin and Honey Bunny grab their weapons, stand up and rob the restaurant. Pumpkin’s robbery persona is that of the in-control professional. Honey Bunny’s is that of the psychopathic, hair-triggered, loose cannon.
అని రాస్తాడు screenplay లో Quentin Tarantino.
ఒక రెండు most famous డైలాగులు.
అమ్మాయి చక్కటి సంస్కారీ భాష వాడుతుండగా FREEZE.
వెంటనే మ్యూజిక్ మొదలౌతుంది. ఆ మ్యూజిక్ వింటున్నంత సేపూ మన శరీరం వైబ్రేట్ అవుతూనే ఉంటుంది. తెలియకుండా పాదాలు rhythmic గా కదులుతుంటాయి. రెండు నిముషాల ఏడున్నర సెకన్ల పాటూ మనకు తెలియకుండా ఒక మాయా ప్రపంచంలోకి వెళ్ళిపోతాము. స్క్రీన్ మీద టైటిల్స్.
ఆ పాట (shall we call it score?) Misirlou.
సినిమా పేరు మీకు తెలుసు.
ఈ పాటకు ముందు బోరు కొట్టించిన ఒక సాధారణ సంభాషణ. హఠాత్తుగా రాబరీ ట్విస్ట్. ఉన్నట్లుండి ఫ్రీజ్ అయిన విజువల్స్ మీద నుంచీ టైటిల్స్, వెనుక Misirlou. మన అటెన్షన్ పట్టేశాడు దర్శకుడు. కేవలం ఆ Misirlou ను ఈ సినిమాలో experience కావటం కోసం ఆ సంభాషణ అంతా వింటూ మరోసారి రివైండు చేసుకుని చూడని సినీ ప్రేమికుడు ఉండడు.
ఈ సీన్‌ను అనుకరించాలని ప్రయత్నం చేయని కుర్ర దర్శకులు ఉండరు.
ఒక రిథమ్‌లో స్మూత్‌గా సాగుతున్న సంఘటనను, హఠాత్తుగా మలుపు తిప్పి, చూపించే వైలెన్స్, లేదా సీన్ ఫ్రీజ్ చేసి ఎడిక్టివ్ మ్యూజిక్ వెయ్యటం.. టారంటినో సినిమాల్లో మామూలే. ఆ హఠాత్ మార్పులే మనల్ని తెలియకుండానే స్క్రీన్ మీద ఉన్న దానికి addict అయ్యేలా చేస్తుంది. ఒకవేళ ఆ మ్యూజిక్ వినాలని కానీ, లేదా ఆ వైలెన్స్ సీన్‌ను మరోసారి experience చేయాలన్నా మనం రివైండ్ చేస్తాం. లేదా థియేటర్లో అయితే మరోసారి చూడాలని ఫిక్స్ అవుతాము.
ఆ కిక్ కోసం ఆ బిట్లను చూడాలనుకున్నా, సెక్స్‌కు ముందు ఫోర్ ప్లే లాగా ఆ బిట్స్ ముందు anticipation (మరోసారి చూస్తున్నాం కనుక) అనుభవించటానికి మొదలంతా రివైండ్ చేస్తాం. కనీసం ఆ సెటప్ సీన్/సీక్వెన్స్ వరకూ. ఇలా రెండుసార్లు లేదా మూడుసార్లు చూశామంటే మనం ఆ సినిమా రిథమ్‌కు, ఆ నేరేషన్ ఇచ్చే high feel కు అలవాటు పడి, ఆ ఫ్లోలోకి వెళ్ళి పోతాం. అలా సినిమాను మరోసారి పూర్తిచేసే వరకూ వదిలి పెట్టం.
కావాలంటే కమల్ హాసన్ విక్రమ్ విషయంలో చూద్దాం. నిజానికి అంత గొప్ప కథా కాదు. సినిమా కూడా కాదు. Apparent గా చూస్తే ఓ మాదిరి సినిమా. కానీ, ఈ పైన వివరింపబూనిన టెక్నిక్ వాడి సినిమాను addictive గా మార్చే కొన్ని సీన్లు వాడాడు దర్శకుడు లోకేశ్ కనగరాజ్. దానికి addictive music కూడా.
ఉదాహరణకు ఇంటర్వెల్ సీన్. కమల్ అలా మాస్క్ డెలిబరేట్‌గా తీసి, అలా బైక్ మీద వెళ్తుండటం, మనమప్పటికే చాలా anticipation తో ఉంటాము, వెనకాల మ్యూజిక్ మ్యాజిక్. Chaotic music with a rhythm. Rhythmic music executed amidst chaos. ఇదంతా Zaigarnick Effect మన మీద పనిచేసేలా చేస్తుంది. అది కూడా passive level లో.
అప్పటికే మనం కథా కథనాల స్పీడ్‌కు అలవాటు పడి ఉంటాము.
ఇంకో సీన్ ఇలాంటిదే Agent Tina ది. అంత అద్భుతమైన మాస్ elevation ఇచ్చి ఎంత unexpected elevation ఇచ్చాడో అంతే unexpected గా లేపేస్తాడు ఆ పాత్రను. మనకు ఏదో అసంతృప్తి ఫీలింగ్. ఏదో మిస్ అవుతున్నాం. కానీ తెలియని కిక్. తెలియని high. కానీ ధడేలున కింద పడేస్తాడు.
ఇంతలో కమల్ ఎంట్రీ, పిల్లవాడిని తీసుకుని క్లైమాక్సు వైపు దూసుకుపోయి మన అటెన్షన్‌ను పూర్తిగా మార్చేస్తాడు. కానీ, సినిమా పూర్తయ్యాక మనకు ఏజంట్ టీనా గుర్తుకు వస్తే, ఆ anticipation, దాని తర్వాత రాబోయే హై ఫీల్ లేదా కిక్‌ను మరోసారి అనుభవించటానికి మరోసారి సినిమా చూస్తాం. మరి నాలుగు వందల కోట్లు వసూలు చేసిందంటే చేయదా? ఇక్కడైతే ఏజంట్ టీనా విషయంలో Zeigarnik Effect తో పాటూ, Oddly Satisfying అనే phenomenon కూడా పని చేస్తుంది.
(ఇదే high feel, కిక్ మనకు Agent Uppiliappan విషయంలో రాకపోవటానికి కారణం ఆలోచించండి!!).
సరిగ్గా ఈ జైగార్నిక్ ఎఫెక్ట్ వాడి హిట్ కొట్టిన సాధారణ కొరియన్ యాక్షన్ సినిమా గురించి మనం మొదట్లో చూశాం. City of Violence.
ఇదే పద్ధతిని (Zeigarnik + Oddly Satisfying) బాగా వాడుకుని ఒక Japanese నవల ఉంది. దాని పేరు బ్యాకుయాకో (Byakuyako). రాసింది కీగో హిగషినో.
ఇతనే ప్రపంచ ప్రసిద్ధి పొందిన Devotion of Suspect X నవల రాసింది. ఈ నవలను వాడుకునే దృశ్యం సినిమాలు, విజయ్ ఏన్టోనీ సినిమా Kolaigaran (తెలుగులో కిల్లర్) వచ్చాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినది బ్యాకుయాకో. దాన్ని ఇంగ్లీషులో Journey Under the Midnight Sun అనే పేరుతో విడుదల చేశారు. ఈ కథను ఆధారం చేసుకుని కొరియన్ హిట్ White Night తీశారు.
ఈ వైట్ నైట్ లో ప్రధాన పాత్ర వేసింది షిరీ లో కథానాయకుడు గా చేసిన హన్ సుక్-క్యు. అతను తన నటనలో వాడే టెక్నిక్ కూడా ఆశ్చర్యకరంగా ఈ Zeigarnik Effect + Oddly Satisfying phenome-non.
ఇప్పుడు Chapter 13 నుంచి బైటకు వచ్చేద్దాం.
బ్యాకుయాకో నవల గురించి..
ఈ నవల కీగో రాసిన ఇతర నవలల లాగనే ఇది కూడా Crime and Investigation జాన్రాకు చెందినదే. ముందు ముందు సినిమా కోసం ఎటూ కథ చెప్పుకోవాలి కనుక ఇక్కడ చిన్న వివరం ఇస్తాను. అక్కడికి ఆపి షిరీ లోకంలోకి వెళ్దాం తరువాత.
ఈ నవలలో కథానాయకుడు, కథానాయికలు antihero-antiheroine తరగతి కిందకు వస్తారు. వీరికి ఒక విషాద flashback ఉంటుంది. మామూలు క్రైమ్ నవలలో కూడా ఇలా ఉండవచ్చు. ఇక్కడ ఆ ఫీల్‌ను మనకు తెలియకుండానే మనం మోసేలా చేస్తాడు రచయిత. ఒకరకమైన oddly satisfying ఫీల్‌తో.
దానికి తోడు కథనంలో కొన్ని కీలకమైన చోట్ల closure ఇవ్వకపోవటమో, narrative gaps అలా వదిలేయటమో చేస్తాడు. అక్కడ Zeigarnik Effect పుడుతుంది. పాత్రల వల్ల Oddly Satisfying feel, కథనంలో gaps వల్ల Zeigarnik Effect. రెండూ కలసి మనల్ని లొంగదీసి, నవలకు దాసోహం అనేలా చేస్తాయి.
అదే ఫీల్ కొరియన్ సినిమాలో వచ్చినంత ప్రస్ఫుటంగా జాపనీస్ సినిమాలో ఉండదు. అందుకే కొరియన్ సినిమా చిన్న సైజు క్లాసిక్‌గా ముద్రపడింది. సినిమా పెద్ద నడవలేదు. ఎందుకంటే Journey Under the Midnight Sun ఎపిక్ నవల. రెండు గంటల సినిమాగా దాన్ని చదివిన వారికి ఆనదు. కానీ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. జాపనీస్ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందలేదు. కానీ బాగా ఆడింది.
కొరియన్ సినిమాకు వచ్చిన advantage అందులో తన నటనలో ఇదే టెక్నిక్ వాడుకునే Han Suk-kyu ప్రధాన పాత్రలో ఉండటం.
Let’s teleport ourselves out of Chapter 13. మన టైమ్ లైన్ 2010 మొదలు.
షిరీ (1999) చూసి అబ్బుర పడ్డాను. ఒక యాక్షన్ సినిమాను ఇంత లేయర్డ్‌గా, డెప్త్‌తో, ఒక సామాజిక వ్యాఖ్య లాగా, psychoanalysis లాగా తీస్తూనే, కథా కథనాలలో వేగం తగ్గకుండా చూసుకోవటమంటే మామూలు విషయం కాదు. Relentless pacing తో సినిమాను నడిపిస్తాడు. విజువల్స్‌లో kinetic energy కొట్టచ్చినట్లు కనిపిస్తుంది.
విచిత్రంగా దర్శకుడు Kang Je-gyu కూడా మన పార్క్, మరో దిగ్దర్శకుడు ఈ ఈ బాపతే. ముందటి సినిమాలు (ఈయన 1996లో ఒక్క సినిమా తీసి అది ఆడక చేతులు కాలితే, ఆకులు పట్టుకోకుండా ఆకు పసరు వాడి కొరియన్ సినిమాకు వైద్యం చేసాడు షిరీ పేరుతో). ఈ సినిమాను మించిన పేరు Pepperment Candy కి వచ్చి దర్శకుడు ఈ బాగా పేరు తెచ్చుకున్నాడు.
ఇదే షిరీని మించిన కమర్షియల్ హిట్ అయ్యి Joint Security Area or JSA పార్క్‌ను స్టార్‌గా మార్చింది. కానీ, విచిత్రంగా మరో ఇండస్ట్రీ హిట్ (విమర్శకుల ప్రశంసలు కూడా) కొట్టినా కొరియన్ వేవ్ మొదటి దశాబ్దంలో దర్శకాగ్రేసర త్రిమూర్తులలో Kang Jae-gyu చేరలేదు.
ఆ ఘనత సాధించింది ప్యూరార్టు దర్శకుడైన Kim Ki-duk. మిగిలిన ఇద్దరూ.. పార్క్ చాన్-వుక్, ఈ చాంగ్-డాంగ్.
షిరీ నిర్మాణంలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ జైంట్ సాంసంగ్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ పని వల్లే ఇప్పుడు Samsung వారి flagship line of smartphones అయిన Galaxy S series జననానికి దారి పడింది.
వచ్చేవారం కలుద్దాం.
ఈలోగా తెలుగూఫులం గరికిపాటి, చిరంజీవి ఇష్యూ మీద కొఠేస్కుందాం పనికొచ్చే పనులు వదిలేసి. ఒకవేళ దానికి క్లోజర్ వస్తే ఇంకో అగ్గి రాజేయటానికి మీడియా ఎటూ ఉండనే ఉందిగా.
(సశేషం)