Site icon Sanchika

కొరియానం – A Journey Through Korean Cinema-36

మీడియమ్, F3యుమ్, కాంతారమ్

Chapter 33, Part-1

[dropcap]1[/dropcap]992 లో ఒక సమయం.

ఉత్తర కొరియా నడిమధ్య భూభాగాల్లో.

సైనిక శిక్షణ కేంద్రాలు.

అలాంటి ఒక శిక్షణా కేంద్రాలలో flagship అనదగ్గ చోటది. కరుడుగట్టిన మిలిటరీ నాయకుడు పార్క్ ము-యూంగ్ వారికి నాయకుడు. దక్షిణ కొరియాలో స్లీపర్ సెల్స్‌గా పని చేస్తూ, సమయం వచ్చినప్పుడు యాక్టివ్ అయ్యి తాము చేయాల్సిన పని తాము చేయాలి. అలా ము-యూంగ్ శిక్షణలో రాటుదేలిన యువ సైనికులలో అగ్రగణ్యురాలు ఈ బాన్-హీ (Lee Ban-hee). ఒక స్నైపర్ గా ఆమెను కొట్టేవారు లేరు. Hand to hand combat లో మంచి ప్రావీణ్యం ఉంది. పురుషులు అధికంగా ఉండే రంగంలో ఆకట్టుకునే అందంతో పాటూ వారిని ఆకర్షించగలిగే శక్తియుక్తులు కూడా ఆమె స్వంతం.

ఇక ఆమె రాబోయే ఆరు సంవత్సరాలలో దక్షిణ కొరియాలో అత్యంత ప్రధానమైన నాయకులను, ఆఫీసర్లను, శాస్త్రవేత్తలను చంపుతుంది. చంపేది బాన్-హీ. అంతం చేసే ముందు కనిపిస్తుంది. యముని రాక తెలిపే మహిషంలా. తర్వాత మాయమైపోతుంది. ఆమెను ఎవరూ కనిపెట్టలేరు. ఇంతలో దక్షిణ కొరియా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాల్సిన ప్రాజక్ట్ ఒకటి దగ్గర పడుతుంటుంది.

వారి పునరుజ్జీవనాన్ని, పెరుగుతున్న వైభవాన్ని, అంతర్జాతీయ సమాజం ముందు ప్రదర్శన చేయటానికి మంచి అవకాశమది. 2002 సాకర్ ప్రపంచ కప్. జపాన్‌తో కలిసి నిర్వహించే అవకాశం. దానికంటే ముందు కొరియన్ల సమైక్యత చాటాలన్న ఒక ఆలోచన. అది సాధ్యమై, 2002 ప్రపంచ కప్‌లో రెండు కొరియాలు కలిసి నడిచాయి. దానికన్నా ముందరే కొరియన్ల సమైక్యత కోరుతూ 1998లో ఒక ప్రత్యేక మ్యాచ్ రెండు దేశాల మధ్యా జరుగుతుంది.

ఆ మ్యాచ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ ఉత్తర కొరియా స్లీపర్ సెల్స్ ప్రయత్నాలు ప్రారంభిస్తాయి. వారి ప్రయత్నాలు ఫలిస్తాయా? వీళ్ళకు మిలిటరీ కార్యక్రమాలుగా అనిపించిన పనులు దక్షిణ కొరియన్లకు తీవ్రవాద కార్యకలాపాలుగా కనిపిస్తాయి. వారు ఎలా ఎదురుకొన్నారు?

ఇదీ షిరీ కథ.

దీనిలో ఎన్నో మలుపులు. ట్విస్టులు. బోలెడంత హ్యూమన్ డ్రామా. ఎడతెగని వేగంతో కూడిన యాక్షన్ సన్నివేశాలు. యాక్షన్ సన్నివేశాలలోను అతి అనిపించకుండా మెలోడ్రామా.

కొన్ని విశేషాలు

  1. మన తెలుగు సినిమాల బజట్‌కు, బాలీవుడ్ సినిమాల బజట్‌కు మధ్యస్తంగా ఉంటుంది సాధారణంగా కొరియన్ సినిమాల బజట్. 1996 నుంచీ దీనికి సంబంధించిన డేటా పరిశీలించాక తెలిసిన సంగతి.
  2. అప్పట్లో మన భారీ సినిమాలు 5-10 కోట్ల రూపాయిలలో ఉండేవి. 2001లో వచ్చిన మన దేశపు అత్యంత ఖరీదైన సినిమా లగాన్ 20 కోట్ల బజట్.
  3. కానీ, షిరీ బజట్ 1997 చివర షూటింగ్ ప్రారంభించే సమయానికి మన రూపాయిలలో 85 కోట్లు. అంటే ఒక సాధారణ కొరియన్ సినిమాకు దాదాపు పది రెట్ల బజట్.
  4. మనకు ఒక భాషలో ఎక్కువ బజట్‌తో తీసినా ఇతర భారతీయ భాషలలోకి డబ్ చేసి విడుదల చేసి కలక్షన్లు తెచ్చుకునే ప్రయత్నం చేయవచ్చు. హిందీ సినిమాలు అయితే ఆ రోజుల్లో (1990లలో) దేశవ్యాప్తంగా pop culture ని నిర్దేశించేవి. సల్మాన్ ఖాన్ దేశ్ కా బేటా కదా రాజ్ శ్రీ వారి ప్రేమ పావురాలు, ప్రేమాలయం సినిమాలతో. అలాంటి అవకాశం కొరియన్లకు లేదు కనుక ఖచ్చితంగా విదేశీ మార్కెట్ మీద ఫోకస్ పెట్టాలి.
  5. ఆసియాలో తమ సినిమాలతో విదేశీ మార్కెట్లను ఏలుతున్నది హాంగ్‌కాంగ్ వారి సినిమాలు. కనుక వైరి శైలిలో తీస్తే అక్కడ ఆడదు. కానీ, ఎక్కువ కలక్షన్లు రాబట్టగలిగేది అక్కడే. వారికి కొత్తగా ఉండాలి. లేదా వారిని మించి ఉండాలి.
  6. హాంగ్‌కాంగ్‌కు కొత్తగా ఉండాలంటే నేటివ్ కొరియన్ శైలి ఒక మార్గం. హాంగ్‌కాంగ్‌ను మించాలంటే హాలీవుడ్ శైలి.
  7. దీని వల్ల దర్శకుడు కాంగ్ జే-గ్యు హాలీవుడ్ శైలి ఎంచుకున్నాడు. కొరియన్ల ప్రత్యేకమన మెలోడ్రామా వాడి తన నేటివ్ టచ్ ఇచ్చాడు. ఇలా మార్కెట్ సమస్యను అధిగమించాడు.
  8. షిరీ తరువాత కొరియన్ మేకర్లు పోటీపడి బజట్లు పెంచుకుంటూ పోలేదు. తమ క్రియేటివిటీకి పదును పెట్టుకుంటూ పోయారు. అందుకనే Sustained Success వచ్చింది.
  9. షిరీ తరువాత మరోసారి బాక్సాఫీసు బద్దలు కొట్టిన కొరియన్ సినిమా (అంటే అంత సంచలన రికార్డులతో) టేగుకి. దానికి మాత్రమే మళ్ళా అంత బజట్ వాడారు. ఆ తరువాత అలా భారీ బజట్ సినిమాలు వచ్చినా, మనలాగా one upping one another లేదు కొరియన్ filmmakers లో. ఎంత క్రియేటివిటీ అన్నదే ప్రధానం. ఎంత బజట్ అన్నది కాదు.
  10. అందుకే వారు సినిమా సక్సెస్ ను వరుసగా critical appraisal, audience appreciation (audience attendance), ROI ద్వారా అదే ప్రాధాన్య క్రమంలో కొలుస్తారు. నేటివ్ కొరియన్ సినిమాలకు కొన్ని రాయితీలు అవీ ఉంటాయి. అది తరువాత చూడవచ్చు.
  11. కొరియన్ జనాభా నాలుగు కోట్లు ఉన్న సమయంలో ప్రతీ 7 మంది కొరియన్లలో ఒకరు ఈ సినిమాను థియేటర్లలో చూశారు. రిపీట్ ఆడియన్స్ తీసివేస్తే. అంత సక్సెస్ ఈ సినిమా.
  12. అంతకు ముందు కొరియాలో అంత సక్సెస్ అయిన సినిమా జేమ్స్ కామరాన్ తీసిన టైటనిక్. దాన్ని ప్రతి 9 మంది కొరియన్లలో ఒకరు చూశారు. 2009లో అవతార్ వచ్చి నిన్న మొన్నటిదాకా కొరియాలో అత్యధికులు చూసిన సినిమాగా చరిత్రలో నిలిచింది.
  13. అవతార్‌ను ప్రతి ఐదుగురు కొరియన్లలో ఒకరు చూశారు. ఆ రికార్డు 2014లో కొద్ది తేడాతో కోల్పోయినా, 2022 రీమాస్టర్ వర్షన్ రీరిలీజ్‌తో తిరిగి పొందింది. ఇప్పుడు మరో సినిమాతో కలిసి తొలిస్థానంలో నిలుచున్నది.
  14. షిరీ ఇంత విజయం సాధించినా, దాన్ని కేష్ చేయుకుంటూ దర్శకుడు కాంగ్ సినిమాల మీద సినిమాలు తీయలేదు. 2004లో టేగుకి వచ్చింది.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కమర్షియల్ సినిమాల వల్ల సినిమాలో ఆర్ట్, హార్ట్ రెండు లేకుండా పోతున్నాయనేది ఇంకో సమస్య, విమర్శ. అలా కాకుండా ఎంత కామర్స్‌ను దృష్టిలో పెట్టుకుని తీసినా, షిరీ ఒక ఆర్ట్ సినిమా కూడా. సినిమా అనే ఆర్ట్ ను అలాగే చూస్తూ తీసిన అద్భుతమైన సినిమా. అందుకే ఇన్నేళ్ళైనా ఆ సినిమా గురించి కొరియన్ల చాలా గర్వంగా చెప్పుకుంటారు.

Chapter 34 మీడియమ్ F3యుమ్ కాంతారమ్

ఇకపోతే, దర్శకులు చెప్పిన కోణమే కాకుండా రాంగ్జాంగ్ గురించి మరో గొప్ప విషయం చెప్పాలి. ఈమధ్యనే మరోసారి చూస్తుంటే నాకు తట్టింది. దాన్ని నా స్నేహితులతో డిస్కస్ చేసి.. చాలా వివరాలు సేకరించాను. మరింత మథిస్తే గొప్ప సత్యం ఆవిష్కరింపబడే అవకాశం ఉంది. వాటి గురించి ముందు ముందు చూద్దాం. టైమ్ రావాలి కదా.

గుర్తున్నాయా ఈ వాక్యాలు?

ఎలా గుర్తుంటాయిలే, నాక్కూడా exact గా గుర్తులేవు. హహహహహహహ హహహహహహహ హహహహ హహహహహహహహహహహహహహహ!

ఎప్పుడో 16 వారాల క్రితం సంగతి.

మనలో మన మాట! నాకు గుర్తుంది కాబట్టే వెతక్కుండానే పట్టుకొచ్చాను. ఒక్కసారి బుర్రను గిలక్కొడదాం అందరండి.

న హి నిమ్బాత్ స్రవేత్ క్షౌద్రమ్అని టైటిలున్న ఎపిసోడ్ 20.

మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ।

కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ॥

జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే।

జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే॥

।దండకమ్।

జయ జనని సుధా సముద్రాంతరుద్యన్ మణిద్వీప సంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్ప కాదంబకాంతార వాసప్రియే కృత్తివాసఃప్రియే సర్వలోకప్రియే।

పీఎస్:

  1. రాస్తున్న ఊపులో ఇంకా ఇంత ఈ ఎపిసోడ్‌లో రాయవచ్చు కానీ, ఎందుకాపానో చదువుతున్న వారికి అర్థమయ్యే ఉంటుంది.
  2. కాంతారా సినిమా విడుదల కోసమే, అప్పుడు మనం మీడియమ్ నుంచీ బైటకు వచ్చింది. అర్థంతరంగా.
  3. Next episode వేరే లెవెల్! Don’t miss…

(సశేషం)

Exit mobile version