సత్యం వధా ధర్మం జరా
Contratiempo or The Invisible Guest
Il testimone invisibile
Badla
Evaru?
మొదటి సినిమా తీసేస్తే, మిగిలిన మూడు కూడా దాని రీమేకులు. కర్మ సిద్ధాంతం, దాని పని తీరు, అసలు కర్మ సిద్ధాంతం ఎలా పని చేస్తుంది? ఇవీ ఈ సినిమాల్లో కామన్ పాయింట్. దాన్ని ఒరిజినల్ స్పానిష్ సినిమాలో ఎంతో meticulous గా narrate చేస్తారు. ఇక screenplay అయితే ఒక అద్భుతం. ప్రతి చిన్న వివరాన్నీ, మనం గమనించుకుంటూ చూడనిదే సినిమా మనకిచ్చే Enjoyment Quotient or Pleasure Quotient ని మిస్ అవుతూ పోతాం. ఒక సర్వే ప్రకారం, ఈ సినిమాలో detailing (plot కి పనికొచ్చే సమాచారం) ని మొదటిసారి చూసిన వాళ్ళు 25% మాత్రమే పట్టుకోగలిగారు. అంటే కనీసం 75% Enjoyment Quotient ని వాళ్ళకు తెలియకుండానే కోల్పోయారు.
అయినా కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అంటే అంత డిటెయిలింగ్ మిస్ అయినా కూడా సినిమా బేసిగ్గా అర్థమవుతూ, చూసిన వాళ్ళని సంతృప్తి పరచి పంపింది. అంటే ఎక్కడో emotional connect ఏర్పడింది. హీరోతోనా?
కాదు.
పార్క్ చాన్-వుక్ సినిమాల తరహాలో కథతో. We should not invest in characters, rather we better invest in the story itself.
ఆ తరహా కథ ఇది.
కథనం చాలా ఆర్గానిక్‌గా ఉంటుంది. కానీ, అన్ని సస్పెన్స్ సినిమాల మాదిరే ఇది కూడా ఒకసారి సస్పెన్స్ విడిపోగానే ఇక చూడబుద్ధి వేయదు.
నిజమా?
కాదు.
ఎన్నిసార్లు చూసినా తనివితీరని సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచింది. కారణం? పాత్రలకన్నా మనం కథా, కథనాల మీద మన emotional investment చేస్తాం. మరోసారి మనం ఆ కథను ఆస్వాదించాలనుకుంటాం. ఆ కథనమనబడే మేజ్‌లో చిక్కుబడాలనుకంటాం. అందుకు ఈ సినిమా background score కూడా బాగా ఉపయోగ పడింది.
అసలు మొదటి సీన్ నుంచీనే దర్శకుడు మనను మాయలో పడేస్తాడు. తొలి విజువల్ తోనే మనల్ని తన గ్రిప్ లోకి తీసుకుంటాడు.
ఈ సినిమా స్పానిష్ ఒరిజినల్ 6 జనవరి 2017 లో విడుదల అయింది. విడుదలై అత్యంత చెత్త సినిమాల్లో ఒకటిగా విమర్శలు పొందింది. మొదటి రౌండ్‌లో కేవలం పెట్టిన పెట్టుబడి మాత్రమే తెచ్చుకోగలిగింది ముక్కుతూ మూల్గుతూ. దీని ఇటాలియన్ రీమేక్ ప్రకటన వచ్చాక సినిమా మరో రౌండ్ వచ్చింది. ఈసారి విమర్శకులు కాదు. ప్రేక్షకులు దీని గతి నిర్ణయించారు. పెట్టిన పెట్టుబడికి ఐదు రెట్ల లాభాలు ఆర్జించింది.
ఇటాలియన్ రీమేక్ Il testimone invisibile కూడా విజయం సాధించింది.
2017 చివరి రోజులలో, ఈ సినిమా ప్రపంచ సినీ ప్రియుల కంటబడింది. ఒకరి ద్వారా మరొకరికి, వారి ద్వారా ఇంకొకరికి దీని గురించి తెలిసి చాలా గొప్ప పేరు పొందింది.
Contratiempo అంటే setback. మొదట సినిమా setback నే చవిచూసింది.
ఇటాలియన్ సినిమా టైటిల్ రఫ్ గా The Invisible Guest మారి ప్రపంచవ్యాప్తంగా అదే పేరుతో ఒరిజినల్ స్పానిష్ వర్షన్ మార్కెట్ అయింది.
తరువాత మజిలీ హిందీలో.
అమితాభ్ బచ్చన్!
తాప్సీ పన్ను!
దర్శకుడు… అపర సినీ మేధావి సుజొయ్ ఘోష్.
సుజొయ్ కి ఈ రీమేక్ బాధ్యత అప్పగించింది షా రుఖ్ ఖాన్.
ఈమధ్య కాలంలో రీమేక్ లకు వస్తున్నంత వ్యతిరేకత లేకపోయినా, ఈ రీమేక్ ఎనౌన్స్ కాకముందే ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ లో 80% ఈ సినిమా చూసేశారు. ఇక ఎవరికోసం తీయాలి?
సుజొయ్ ఇక్కడే తెలివిగా ఆలోచించి ఒక ట్రిక్ కమ్ టెక్నిక్ ఫాలో అయ్యాడు. ఒక కథ గొప్పదా కాదా? లేదా నిలబడుతుందా లేదా అన్నది తెలియాలంటే మొదట ఏ జండర్‌తో విజువలైజ్ చేసుకుంటామో దాన్ని రివర్స్ చేసి అప్లయ్ చేయాలి. అప్పుడు కూడా ఇదే తరహా కిక్ ఇస్తే, ఆ కథ నిలబడుతుంది. No matter what others think.
అలా జండర్ రివర్సల్ టెస్ట్ పెట్టటమే కాదు, ఆ టెక్నిక్‌నే సినిమా మీద ప్రయోగించాడు. ఎంత అమితాభ్ ఉన్నా కూడా, 80% టార్గెట్ ప్రేక్షకులు చూసిన కథను మళ్ళా చూసేలా చేయాలంటే అది కత్తి మీద సాము కాదు. కర్కోటకుడితో కేరమ్స్ ఆడటం లాంటి పని.
అందుకే, ఒరిజినల్ దర్శకుడు కథ మీద మనల్ని emotional గా invest చేసేలా చేస్తే, సుజొయ్ అమితాభ్‌తో అపూర్వ ప్రయోగం చేశాడు. National Institute అనదగ్గ లెజండరీ నటుడు అమితాభ్. కానీ, ఆయనలోని నటుడిని ఉపయోగించ తల్చుకోలేదు సుజొయ్ ఘోష్.
<<Director Sujoy Ghosh cleverly utilised gender reversal and then came up with the real masterstroke. That is, he didn’t use an actor and star of the stature and calibre Amitabh Bachchan. Not as an actor but as a prop.
He used the Shahenshah of Bollywood and hence Indian Cinema as the cinematic landscape in the film instead of an actor. This way, he invited the audience to experience a familiar Mr. Bachchan in a never seen before avatar. Not as an actor playing a character. But the major part of the atmosphere of the film>>.
Pycker.Com వెబ్సైట్ కు బద్లా రివ్యూ రాస్తూ yours truly రాసిన మాటలు.
ఏ అంచనాలు లేకుండా వచ్చిన బద్లా మీద నిర్మాతలకు కూడా అంచనాలు లేవనుకుంటా. ప్రీవ్యూ షోలు పడినా, రివ్యూల మీద ఎంబార్గో పెట్టేశారు నిర్మాతలు. ఈ సినిమాది మొదట ప్రచురింపబడిన రివ్యూ భవదీయుడిది కావటం ఒక అదృష్టం. అప్పటి మా టీమ్ రాసిన ఆర్టికిల్స్, వాటి ప్రభావాన్ని దర్శకుడు సుజొయ్ ఘోష్ స్వయంగా acknowledge చేశాడు.
కానీ సినిమా (2019 Women’s Day నాడు విడుదలైంది) కూడా క్రమంగా జనానికి ఎక్కేసింది. మొదట మామూలు ప్రేక్షకులు, తర్వాత mouth talk ద్వారా The Invisible Guest ప్రేమికులు సినిమాను చూశారు. అందరికీ ఏదోక రకంగా నచ్చింది.
ఒరిజినల్ స్పానిష్ వర్షన్ ఐదు రెట్లు పెట్టుబడి మీద సంపాదిస్తే, ఈ సినిమా 13 రెట్లు సంపాదించింది. చిన్న సినిమాలలో, అది కూడా అరిగిపోయేన్ని సార్లు చూసిన సినిమా రీమేక్ అయినా కూడా, బద్లా పెద్ద Blockbuster గా నిలిచింది. కానీ ఎంత తక్కువగా ఈ సినిమాకు నిర్మాతలు promotions చేశారంటే.. ఒక చిన్న 18 మంది ఫాలో అయ్యే ఒక ట్విటర్ హేండిల్, దాన్ని ఆధారం చేసుకుని బాక్సాఫీస్ ఎనాలిసిస్ చేసే ఒక మధ్యస్థాయి వెబ్సైట్, ఏవో కొన్నిసార్లు చెదురుముదురుగా మరికొన్ని చోట్ల తప్ప ఈ సినిమా బాక్సాఫీస్ విజయాన్ని acknowledge చేసిన వాళ్ళు కూడా లేరు.
అందుకే April 10 న ఆ 18 మంది ఫాలో అయ్యే ట్విటర్ హేండిల్ పబ్లిష్ చేసిన బాక్సాఫీసు డేటాను స్వయంగా నిర్థారించుకున్నాక స్వయంగా అమితాభ్ బచ్చనే Shah Rukh Khan తో లడాయి వేసుకున్నాడు ట్విటర్ సాక్షిగా సినిమాను సరిగ్గా promote చేయటం లేదని.
దానికి Shah Rukh సమాధానం, అమితాభ్ ను సంతృప్తి పరచటం కోసం Aukaat (28 February 2019 నాడు ఆన్లైన్ లో విడుదల) పాటను మరోసారి promote చేస్తూ రంగంలోకి దిగాల్సి వచ్చింది.
అంటే.., promotions ఉన్నా లేకున్నా, మెరిట్ ఒక్కసారి కళ్ళబడితే దాన్ని ఏదోక రూపంలో జనానికి పరిచయం చేసే వాళ్ళు ఉంటారు. కాకపోతే వాళ్ళ ప్రభావం ఇతరుల మీద ఎంత అన్నదాని బట్టి ఫలితాలు వస్తాయి.
ఇదే కథ మరో టెక్నిక్ వాడి మన అడివి శేష్ “ఎవరు?” అనే సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాడు. అస్సలు ఫామ్‌లో లేని రెజీనాను తాప్సీ లాగా వాడుతూ, కథలో కొత్త కోణాలను కలుపుతూ, తెలుగు వారికి తగిన మార్పులు చేస్తూ కాస్త మసాలా జోడించి చేసిన ప్రయత్నం వల్ల ఒరిజినల్‌ను మించి విమర్శకుల ప్రశంసలు పొందేలా చేసింది. అదే భాగ్యం బద్లాకు కూడా దక్కింది.
ఇక The Invisible Guest తర్వాత మజిలీ మన కొరియన్ సినిమా.
26 అక్టోబర్ 2022 న విడుదలైన Confession ఈ కాంట్రాటియెంపో రీమేకే. దీనికి కూడా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించే అవకాశాలు ఎక్కువే. ఇది కూడా బద్లా, ఎవరు లాగా ఒరిజినల్‌తో సమాన స్థాయి హోదా పొందింది.
కారణం?
సినిమాను కొరియన్ వాతావరణానికి తగ్గట్లు మార్చినా, ఆత్మ దెబ్బ తినకుండా చూసుకున్నారు. కొరియన్ filmmaker Yoon Jong-seok mostly followed the template set by the original director Oriol Paulo. Means, he didn’t go with gender reversal. But instead of physical landscape, he used psychological landscape as the prominent basis of this film. కాంట్రాటియెంపో కానీ, బద్లా కానీ landscape ని కథలో బాగా వాడుకున్నారు. అందుకో బద్లాను బాలీవుడ్ టిపికల్ మైండ్సెట్‌తో విదేశాల్లో జరిగిన కథగా ఆలోచించారు. అదృష్టవశాత్తూ దర్శకుడు సుజొయ్ ఘోష్ తన మేధను ఉపయోగించి, subtle changes తో సినిమాను గట్టెక్కించాడు. కొరియన్ దర్శకుడు Yoon Jong-seok subconscious landscape ను బాగా వాడాడు.
సరిగ్గా ఇదే పనిని కాంతారా సినిమాలో రిషభ్ శెట్టి చేశాడు. కథలో visual landscape ను మనకు చూపిస్తూ, కథనాన్ని మనకు తెర మీద కాకుండా మన ఉపచేతనలో తిష్ట వేసుకునేలా చేశాడు. అందుకే సినిమా మధ్యలో బోర్ కొట్టిందన్నా కూడా బాగా ఆడుతోంది.
ఇదే కదూ The Medium ను అంత గొప్ప సినిమాగా మార్చింది!
రాంగ్జాంగ్ సినిమా official film summary:
<<Based on an original story developed by Korea’s Na Hong-jin, the visionary auteur behind The Wailing, The Yellow Sea, and The Chaser, The Medium (aka Rang Zong) is a bizarre and horrifying saga of demonic possession that centres around the belief in shamanism practised in the northeastern part of Thailand.>>
కాంతారా సినిమా official movie summary:
<<Based on an original premise developed by Kannada filmmaker and actor Rishab Shetty, Kantara tells the story of a wayward youth Shiva in the interior lands of coastal Karnataka, with its roots – proper showcasing of the Bhoota Kola – and culture explored. Shiva who is at loggerheads with an upright looking forest officer Murali to save the possession of the forest surrounding his native village.>>
రెండు సినిమాల్లోనూ possession అన్నది కామన్. Pun is certainly intended in both cases.
అటు రాంగ్జాంగ్ అయినా, ఇటు కాంతారా అయినా కొన్ని ప్రత్యేక ప్రదేశాలకు పరిమితమైన సంస్కృతులను, వాటియొక్క Universally resonating beliefs ను ఆధారంగా చేసుకుని రాయబడ్డ స్క్రిప్టులు, తీయబడిన సినిమాలు.
రెండు విభిన్నమైన సినిమాలు. రెండూ రెండు దేశాల్లో రెండు మారుమూల ప్రాంతాలలో సెట్ చేయబడిన కథలు.
రెండిటిలోను దైవం మనుషులను ఆవహించి, వారిని ఒక మీడియమ్‌లా వాడుకుని తాము చేయాల్సిన పనులను చేస్తారు. ఒకదానిలో, ఆ మీడియమ్ చివరలో నమ్మకం కోల్పోతారు. మరొకరు మొదటి నుంచీ నమ్మకం లేనట్లో, ఆ మీడియమ్‌గా మారటానికి సిద్ధంగా లేనట్లో కనిపిస్తారు. వారి వారి నమ్మకాల కనుగుణమైన ఫలితాలను ఇస్తారు ఆ యా దేవతలు.
రెండిటిలో మరో సారూప్యం అడవి. చెట్లు. ప్రాణులు. వారసత్వం. దాన్ని తప్పింతబూనుకోవటం. ఆ వారసత్వాన్ని అందుకున్న వారికి కలిగే లాభనష్టాలు, దాన్ని తప్పించుకోజూచిన వారికి కలిగిన లాభనష్టాలు వారికి కర్మ ఫలాల రూపంలోనే ఈ జీవితంలోనే అందటం విశేషం.
అక్కడ రాంగ్జాంగ్ లో కుక్క సన్నివేశం కీలకం. ఇక్కడ వరాహం కీలకం. రెండు చోట్లా ఆ జీవుల భక్షణం కథలో కీలక మలుపులే.
రెండు సినిమాల్లోనూ రతి క్రియ గురించిన రిఫరెన్సులుంటాయి. రాంగ్జాంగ్ లో అపవిత్రత గురించి ప్రాధాన్యం. మింక్ పాత్ర ద్వారా. ఇక్కడ కాంతారాలో కూడా ఆ క్రియే కీలకం. పవిత్రం.
కారణం..
జయ జనని సుధా సముద్రాంతరుద్యన్ మణిద్వీప సంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్ప కాదంబకాంతార వాసప్రియే కృత్తివాసఃప్రియే సర్వలోకప్రియే।
ఎవరా సర్వ జన (లోక) ప్రియ?
లీల.
లీలతో ఏకమయ్యాకే శివకు సరైన మార్గంలో వెళ్ళే అవకాశం వస్తుంది. కళ్ళకు కట్టిన తాళాలు ఊడిపడి.. మనసు వాకిళ్ళు తెరుచుకుంటాయి. దేవుడు లేదా భగవచ్ఛక్తికి వాహకంగా మారే పవిత్రత సంతకించుకుంటుంది. అందుకే ఆఫీసర్ మురళి శివలీల అంటాడు.
అక్కడ మింక్ అపవిత్ర కాంక్షల వల్ల దుష్టశక్తులకు వాహకంగా మారుతుంది.
శివ మరణిస్తాడు. భగవంతునిగా మారి మార్గ నిర్దేశనం చేస్తాడు.
మింక్ మరణించదు సరి కదా, విలయం సృష్టిస్తుంది. మరి ఆమె చేసిన పనికి పరిష్కారం? అది మొదట్లోనే పడాల్సింది అని కథ మొదట్లోనే చెప్పారు. చివరి ఇమేజ్ ద్వారా చూపారు.
సత్యం వద ధర్మం చర – కాంతారా
సత్యం వధ ధర్మం జరా – రాంగ్జాంగ్.
కాంతారా ఎందుకంత హిట్టయ్యింది? వివరాలు రాయపెద్ది గారు చక్కటి ఆర్టికిల్‌లో వివరించారు. అది సంచికలోనే వచ్చింది.
కాంతారా సినిమాటిక్ మెరిట్స్ గురించి సికందర్ గారు వారి బ్లాగ్ లో రాశారు.
ఇకపోతే మీడియమ్ సినిమా ద్వారా దర్శకులు చెప్పాలని అనుకున్న విషయం, నేను డిస్కవర్ చేశానని చెప్పిన మరో విషయం వచ్చే ఎపిసోడ్‌లో!
అప్పటిదాకా మనమెటూ ఎమ్మల్యేలను కొనలేము కనుక ఆ విషయాలను సోషల్ మీడియాల్లో చర్చిస్తూ కాలహరణం చేసుకుందాం.
P.S.:
F1: రాంగ్జాంగ్ లేదా మీడియమ్
F2: Contratiempo లేదా The Invisible Guest
F3: కాంతారా
మీడియమ్, F3యుమ్, కాంతారమ్.. సంపూర్ణమ్॥
(సశేషం)