కొరియానం – A Journey Through Korean Cinema-38

1
2

దేవరే బల్ల

Chapter 35 – Prologue

[dropcap]న[/dropcap]మ్మకం ముఖ్యమా? Rational thought process ముఖ్యమా?

సాధారణంగా ఎక్కువ మంది నమ్మకానికే వోటు వేస్తారు (ఇక్కడ వోటును అమ్ముకోవటాలు ఉండవు).

ఎంత రేషనల్ అని చెప్తున్నా, చెప్పకున్నా, చెప్పుకున్నా, rational thoughts ను ఎంచుకునే వారు అయినా కూడా ఏదోక దానిని నమ్మక తప్పదు. కనీసం వాళ్ళ ఆలోచనలను అయినా. ఈ విధంగా చూస్తే, నమ్మకం లేదా belief system అనేది all pervading. ఇక రేషనల్ థాట్ అనేది కేవలం నాస్తికత్వానికే సంబంధించినది కాదు. ఆది శంకరులు తర్కానికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మన సనాతన సంప్రదాయక విద్యలలో తర్కం కూడా ఒక శాస్త్రమే. రామానుజాచార్యుల వారిది ఒక రకంగా చెప్పాలంటే it’s a precursor to Ayn Rand’s Objectivism.

విగ్రహారాధన, భగవంతుడు బదులు డాలర్ సైన్, Unto self ఉంచండి. విశిష్టాద్వైత సిద్ధాంతం more or less objectivism లాగనే ఉంటుంది. In all practical purposes. Western school కనుక ఐన్‌ ర్యాండ్ laissez faire capitalism అంటుంది. మన వాళ్ళు భగవంతుడు కర్మ సాక్షి. చూస్తుంటాడు. అవసరమైనప్పుడు interfere అవుతాడు అంటారు. ర్యాండ్ అక్కడ ఆ రోల్‌ను ప్రభుత్వానికి వదిలేస్తుంది.

ఉభయవేదాంతాలను ఆధునిక పద్ధతులలో చదివిన వారు శ్రీవైష్ణవ సిద్ధాంతాన్ని ఇలా condensed form లో చెప్పారు.

Three fundamental Principles of SriVaishnavism, and The Philosophy to live on Earth (Rand also calls her objectivism as: the philosophy to live on earth అంటుంది)

  1. Live in the present moment, and Idea… Once an Idea strikes, never let it go in the flow of time. It must be realised into action with immediate effect. Else prepare for failure. రెండు సార్లు సమాశ్రయణం చేయించుకునే సందర్భాలలో, అలాగే తిరుమంత్రార్థాన్ని సామాన్య జనాలుకు చేర వేసే సమయంలో).
  2. Question must be your friend, and question everything you want to learn, and seek the right answers (యాదవ ప్రకాశకులు – కప్యాసం). Stop not till you die. Be a learner, and share your knowledge (కూరత్తాళ్వార్‌తో సంబంధం. శంకరులైతే మనీషా పంచకం). Stick to the truth. Condemn the wrong. No matter who they are, be it your Guru or your father or anyone else, fight for the truth, and fight against the wrong doers.
  3. Deal with personalities. Not with persons (అటు శంకరులైనా, ఇటు రామానుజులైనా వ్యక్తులతో శత్రుత్వం ఏనాడూ లేదు. Even John Galt helps those who try to torture him by repairing the torture machine when it breaks down). After all everyone has their sense of life. Either you correct it, or let them correct it. (ఎదురు వెళ్ళి మరీ నా సిద్ధాంతం స్వీకరించమని చెప్పిన సందర్భాలు తక్కువ. అవతలి వారే వీరిని అడిగి మరీ శిష్యులవుతారు). No individual is your enemy.

These are the three doctrines of SriVaishnavism, and are proposed, and practiced by Bhagavad Ramanuja.

ఇక Ayn Rand famous saying.. “You may avoid reality by faking your views but you cannot avoid the consequences of avoiding the reality” అని చెప్పనే చెప్పింది. ఇక్కడ Rand అనే కాదు. చాలామంది తత్వజ్ఞులు కర్మ గురించి ఆ ఫలితాల గురించి డైరక్టుగానో, ఇన్డైరక్టుగానో చెప్పే ఉన్నారు.

రాంగ్జాంగ్ సినిమా అంతా ఆ కర్మ ఫలాన్ని గురించే. బాధ్యతల గురించే. హక్కుల గురించి మాట్లాడే ముందు బాధ్యతల గురించి ఆలోచించాలి.

Chapter 35

Speaking broadly,

The Medium is primarily an exotic and indigenous experience of Southeast Asian shamanism. It documents the marriage and homogenising of the horror film traditions of both Thailand and South Korea. The shamanic beliefs of the Isan region (Interior portions of North-Eastern Thailand) believes that not only humans but also everything in nature has a soul. Any action committed by ancestors becomes a curse or a boon and will be passed down the generational lineage to the posterity. Here, in the context of this film it is the character of Mink.

ఎంత థాయిల్యాండ్ షమనిజమ్ గురించి అయినా, universally resonating విషయాలను గురించిన direct and indirect చర్చలను ఈ సినిమాలో మన ముందుంచుతారు దర్శకులు.

ఈ సినిమాలో మింక్ తల్లి నోయ్ నిజానికి షమన్ లేదా మీడియమ్‌గా కావలసిన వ్యక్తి. ఆమె తరతరాలుగా వస్తున్న కుటుంబ సంప్రదాయాలను కాలదన్ని, క్రిస్టియానిటీ పుచ్చుకుని, షమన్ కాకుండా తప్పించుకుంటుంది. దానికి తగిన ఫలితం అనుభవిస్తుంది. షమన్ కాకుండా తప్పించుకుని తన జీవితపు రియాలిటీని evade చేసినా, ఆ రియాలిటీ తాలూకు ఫలితాలను తప్పించుకోలేక పోయింది.

తను వివాహం చేసుకుని వెళ్ళిన కుటుంబం రూపంలో ఆమె తప్పించుకోజూచిన కర్మ ఫలం రెట్టింపు సైజులో అందింది. ఒక బంపర్ పేకేజ్ రూపంలో. అటు నోయ్ భర్త తాలుకు వంశం వారు తరతరాలుగా ఎన్నో అకృత్యాలు చేశారు. ఆ అకృత్యాల ఫలితాలు, నోయ్ చేసుకున్న కర్మ అంతా కలిసి ఆమె జీవితాన్ని అస్తవ్యస్తం చేసి పారేస్తాయి. అంతే కాదు. ఆమె కూతురు జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి.

ఇటు నోయ్ చెల్లెలు నిమ్ తప్పని సరి పరిస్థితులలో షమన్‌గా మారి బాయన్ దేవతకు అంకితమవుతుంది. తన చేతనైనంతలో నిర్వర్తించాల్సిన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. కానీ ఈమె రెండు ప్రధానమైన తప్పులు చేస్తుంది. వాటిలో ప్రథమం.. నోయ్ కూతురుకు సహాయం చేయబూనటం.

దీనికి ఫలితం.. జీవితంలో అప్పటి వరకు ఉన్న ప్రశాంతత కోల్పోవటం. తన జీవితం దారి తప్పటం. తనకు సంబంధం లేని విషయంగా వదిలేసి ఉంటే సరిపోయేది.

వేర్వేరు కారణాల వల్ల నిమ్ మింక్‌ను రక్షించే పని చేస్తుంది. ఆ యా కర్మల ఫలితాలను అనుభవిస్తుంది.

పెద్దలు చేసిన తప్పులైనా, ఒప్పులైనా పిల్లల మీద ప్రభావం చూపుతాయి అనేది నమ్మటం కాకపోయినా అర్థం చేసుకుని తీరాల్సిన విషయం. Whether you believe it or not, it’s the case in the universe. మనం చేసిన తప్పులైనా ఒప్పులైనా మన పిల్లల లేదా వారి పిల్లల మీద ప్రభావం చూపుతాయి. Generational curse as a concept should be understood as is. Not to be underestimated.

నోయ్ కుటుంబంలో కథ ప్రకారం తొలిసారి దారితప్పింది నోయ్ మాత్రమే. కానీ, దానికి ఎంచుకున్న మార్గం, పూర్తిగా తన సంప్రదాయనికి దూరమైపోవటం ఆమె జీవితం మీదే కాదు. ఆమె తర్వాత తరం మీద కూడా ప్రభావం చూపించింది.

That’s why you should embrace your cultural roots first. Then add whatever flavour you want to it, to customise your life with your own choice tweakings. ఈ మాటలను అన్నది ఈ సినిమా దర్శకుడు Bangjong Pisanthanakun.

చేసిన తప్పుల వల్ల ఇంటి యజమానురాలుగా నోయ్ వెళ్ళిన కుటుంబం తరతరాల అకృత్యాలకు అలవాలమైనది. ఆ ఫలితాలన్నీ నోయ్ జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. ఆ విధంగా జనరేషనల్ కర్స్ నోయ్‌ను వదలలేదు.

తిరిగి తన కూతురు కోసం ఆమె తన cultural roots ను embrace చేసుకోక తప్పలేదు. అయినా ఫలితం దక్కలేదు. కానీ, అహంతో మరో తప్పు చేస్తుంది. నిమ్ సహాయం తీసుకోకుండా వేరొక మార్గంలో మింక్ కు నయం చేయాలనుకుని, Acceptance Ceremony ని చేయబూనుతుంది.

ఫలితం?

Noi is convinced that Ba Yan is punishing Mink for Noi’s refusal to be the descendant and arranges for the Acceptance Ceremony without Nim’s knowledge in which Mink will accept Ba Yan to be the next shamaness. Mink’s condition deteriorates after the ceremony and she runs away after she bludgeons Noi with a camera from the crew.

అసలు మింక్ షమన్ గా మారాలంటే అక్కడ కచ్చితంగా నిమ్ హస్తం ఉండాలి. మరి నోయ్ నిమ్ లేకుండా Acceptance Ceremony చేయబూనటం ఏమి పని? ఎన్నడూ లేని విధంగా కొన్ని వేల దుష్ట శక్తులు మింక్‌లో దూరతాయి. చివరలో మహా విలయం సృష్టించి ఎవరూ మిగలకుండా చంపి పారేస్తాయి. మింక్ తల్లి నోయ్, సాయం చేయ వచ్చిన మహా మంత్రవేత్త లాంటి సాంటీతో సహా.

వీరందరిలో తక్కువ effect అయింది నిమ్. కనీసం ఈ ఘోరం చూడకుండా నిద్రలోనే ఒక మాదిరి ప్రశాంతతతోనే మరణిస్తుంది.

నిమ్ చేసిన రెండవ తప్పిదం బాయన్ దేవత మీద తన నమ్మకాన్ని ప్రశ్నించుకోవటం.

మింక్‌తో రెండు ప్రధాన encounters తరువాత బాయన్ దేవత మీద నమ్మకం సడలుతుంది. అందుకే దేవత నుండీ కావలసిన స్థాయిలో సహాయం రాదు.

ఇక దేవత విగ్రహం పగలగొట్టబడటానికి కారణం కూడా ఆ దేవతే.

ఆశ్చర్యంగా ఉందా? ఈ కథకు ముగింపు ఇవ్వాల్సిన బాధ్యత దేవత మీదే ఉంది. నోయ్ బదులు నిమ్ వచ్చింది. ఆమె బదులు రావలసిన వారు లేరు. మింక్ కర్మను అనుభవిస్తోంది. పైగా తల్లి చేసిన మహా తప్పిదం వల్ల (నిమ్ ప్రమేయం లేకుండా Acceptance Ceremony చేయబూనటం) ఆమె పూర్తిగా అపవిత్రమై దేవత ఆమెలోకి ఆవాహన అయ్యే అవకాశం లేకుండా పోతుంది. నిమ్ చేసిన తప్పులకు ఆమె మరణం అనివార్యం. ఒక అదృష్టమేంటంటే ఆమె చేసిన నిస్వార్ధ సేవ వల్ల ఆ మరణం అనాయాసమైంది. చివరలో జరుగబోయే ఘోర కలి చూడకుండా తప్పించుకోవటం.

అంతటితో తన పని ముగిసింది కనుక, ఆవాహన అవ్వాల్సిన మనుషులు లేరు కనుక దేవత అక్కడి నుంచీ వెళ్ళి పోతుంది.

When the God leave, what’s left in the wake of the event is the dance of Satan.

అందుకే Epic Exorcism was doomed from the beginning. దానికి తగినట్లు poetic Justice లాగా ఆ doomed epic exorcism జరిగే ప్రదేశం కూడా మింక్ వంశీకులు చేసిన అకృత్యాలకు సాక్షీభూతమైన భవనమే.

ఇక కుక్కను మించే పీక్కుతినే సన్నివేశం చాలా controversial అయింది. చాలా రకాల వ్యాఖ్యానాలు వచ్చాయి.

ఆ సన్నివేశం చెప్పేది:

కుక్క విశ్వాసానికి, నమ్మకానికి చిహ్నం. వాటిని ధ్వంసం చేసింది మింక్ తల్లి నోయ్. అందుకే దానికి తగ్గట్లు మింక్ ఆ నమ్మకానికి చిహ్నమైన కుక్కను పీక్కు తింటుంది.

దాన్నే గట్టిగా చూపారు దర్శకులు.

Chapter 35 – Epilogue

నిమ్ జీవితం ఎందుకు అర్ధంతరంగా ముగిసింది? ఎందుకు దేవత ఆమె ప్రార్థనలను కీలక సమయంలో విస్మరించింది?

ఇంత విలయం జరుగుతుంటే దేవత చూస్తూ ఎందుకు ఊరుకుంది?

ఇవన్నీ జనాలు వారి విశ్వాసాలు సడలినప్పుడో, ఆస్తికులను వెక్కిరించటానికో, ప్రశ్నించటానికో, కన్ఫ్యూజ్ చేసి దారికి తెచ్చికోనటానికో చేసే వితండ వాదాలు.

సమాధానం..

దేవుడు/దేవత/భగవంతుడు సత్యం మీద ఆధారపడి మనకు సహకరిస్తారు. మన నమ్మకంలో ఏ మాత్రం లోపమున్నా ఆ లోపం అసత్య దోషాన్ని కలుగజేస్తుంది. దానికి తగిన ఫలితం అందుతుంది మనకు negative result రూపంలో.

కొన్నివేల మంది అయ్యప్పలు మరణించినా, చార్ధామ్ యాత్రికులు గల్లంతైనా, కారణం దేవుడు లేదా భగవత్ శక్తి లేకపోవటం కాదు.

దేవరే బల్ల!

God knows (pun certainly intended).

God sees. It waits. కొన్నిసార్లు Collateral Damage ఉంటుంది. వందలాది మంది తపస్వులను రాక్షసులు పీక్కుతిన్నటులు.

అవతార పరమార్థం ముగియగానే, అక్కడ క్షణం ఉండదు దైవ శక్తి. శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా.

Is this for real?

దేవరే బల్ల!

కొరియానంలో మరో అంకం ముగిసింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here