Site icon Sanchika

కొరియానం – A Journey Through Korean Cinema-39

Be Go पल – 1

Chapter 33, Part-2 – Prologue

[dropcap]మొ[/dropcap]న్నే కద స్వామీ Chapter 35 – Prologue, Chapter 35, Chapter – Epilogue అని చావగొట్టావు. మళ్ళీ ఇప్పుడు 33 అంటావ్?

అంటే అది పార్ట్ వన్. ఇది పార్ట్ టూ.

ఇలా కూడా ఉంటుందా?

ఎందుకుండదూ? యవసాయం మానేసి ఎలకలు పట్టమని చెప్పే నాయకులు లేరూ?

ఏ నాయకులు? ఎవరు చెప్పారూ?

చెప్తారు చెప్తారు. ఎందుకు చెప్పరూ? ఇంగ్లీషులో అహోబిల పండితీయం కూడా చెప్తారు.

సరే! ఏదైతే ఏమైంది. మీరెటూ చదివేది లేదు. ఉన్న ముగ్గురు రీడర్లు ఊఁ!

అప్పుడా పాము, ఇదిగో చూడు పిల్లా! అంది డియర్. నేను పిల్లను కాదు. నా పేరు అవ్వ అన్నాను డియర్! అప్పుడది ఛప్! ఇదే గీతాచార్య గోలంటే. చెప్పేది వినడు. ఉన్నట్టుండి డిస్టార్షన్ ఇస్తాడు. అంది డియర్! సరే చెప్పరా అన్నాను డియర్. ఇంకా లోహ యుగం రాలేదు. కనుక చాకులూ గట్రా అనకు. చాకును మెటల్‌తో చేస్తారు. అవింకా కనిపెట్టబడలేదు. కథలో ఇంటిగ్రిటీ దెబ్బతింటుంది. కనుక ఇప్పటి వాతావరణానికి తగ్గట్టు మాట్లాడు. ఇక నుంచీ రోజుకొక ఆ౨పిల్ నైనా తిను. An Apple a day keeps the doctor away. నా మాట విను. అంది డియర్. పాము చెప్పింది అర్థం కాకపోయినా తలూపాను డియర్. అది డాళింగ్ జరిగింది.” అంటూ అవ్వ ముగించింది.

“అంతా బాగానే ఉంది కానీ, ఆ గీతాచార్య రాస్తోంది ఏవిటట?” ఆదాము అన్నాడు.

“కొరియానం డియర్!”

అలా ఆదామూ, అవ్వా కొరియన్ సినిమాలు చూసి కబుర్లాడుకున్నారు. అవే మనమిప్పటిదాకా చెప్పుకున్నాము. మళ్ళీ వాళ్ళ కాలానికి కొరియన్ సినిమాలు ఉన్నాయా అని అడగొద్దు. ఆ పామిచ్చిన యాపిల్ తిన్నాక అవ్వకు ఫ్యూచర్ లోకి తొంగి చూసే పవర్ వచ్చింది. అదక్కమాట సంగతి.

అలా ఆ రోజంతా కబుర్లు చెప్పుకున్నాక రెండవ రాత్రి మాత్రం కాస్త తెలివి వాడి చెయ్యాల్సిన పని చేశారు. అదేంటో రాద్దామంటే సెన్సార్ వాళ్ళు బీప్ అన్నారు. సరే బీప్‌లు, పీప్‌లు మనకెందుకు?

అలా ముందుకు పోతా ఉన్నారు. మూడు సినిమాలు, నాలుగు సీరీస్ లతో. కాలక్షేపం. చేస్తూ.

వాళ్ళకు ప్రభుత్వం వాళ్ళు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇచ్చిన డబ్బులను పొదుపుగా వాడుతూ, ఓటీటీలలో మాత్రమే సినిమాలు చూస్తున్నారు. కానీ, ఆదామూ, అవ్వా రాత్రిపూట పక్క పక్కనే ఉంటే మన్మథుడూరుకోడు కదా! ఒక బాణం వేశాడు.

వీడెవడ్రా ఇప్పుడు బాణం వేస్తున్నాడనుకుని అచ్చ తెలుగు సినిమా హీరోయిన్ లాగా ఆదాముకు తగలకుండా తను అడ్డం పడింది. దెబ్బకు పొట్టలో బాణం గుచ్చుకుని, కడుపున కాయ కాసింది. ఇలా అడ్డు రావటం వల్లే స్త్రీలకు మాత్రమే గర్భం వస్తుందని దేవుడన్ శపించాడు. అదే ఆ బాణం ఆదాముకు తగిలి ఉంటే జమ్ బలకిడి పమ్‌బ అయేది. ఆ కాయ పండై, కేన్ లేదా కయీను అనే కొడుకు పుట్టాడు.

పుట్టటం పుట్టటం పురుషాహంకారంతో ఆకలేసి తల్లి రొమ్ము పట్టుకున్నాడు. ఠాఠ్ఠ్! కామ పిశాచీ! అని గద్దించటానికి అప్పటికి అబుసంలు లేరు. అదే అభ్యుదయ బుక్ సంఘం వారు. అందువల్ల హాయిగా తల్లిపాలు తాగుతూ ఆరోగ్యంగా పెరిగాడు.

మన్మథుడిని చూసి అటు క్యూపిడ్ కూడా బాణాలాట మొదలెట్టాడు. వాడి బాణానికింకో కాయ కాచింది అవ్వ కుడుపులో. ఈ సారి ఏబల్ లేదా హెబల్ పుట్టాడు. అన్నకొండకు తమ్ముడు పోటీ. తల్లిపాలు పంచుకుంటం దగ్గర నుంచీ, తండ్రి ప్రేమననుభవించేదాకా.

ఇలా అన్నగారు కొట్టబూనటం, తమ్ములుంగారు తప్పించుకోబూనటం.. జరుగుతూ ఇద్దరూ పెరిగి పెద్దయ్యారు. అన్నకొండ కు అహంకారం, అసూయ వచ్చాయి. తమ్ముడికి ఇగో, తెలివీ మరియూ తేటలు వచ్చాయి. అన్నకొండ వైలెంట్. తంబి రామయ్య సైలెంటు.

కారణాన్ని మన సిగ్మండ్ ఫ్రాయిడిలా వాకృచ్చాడు.

కయీను కడుపున ఉన్నప్పుడు ఆదాము అవ్వ కుర్ర పీచులు. అందుకే ఎక్కువ ఓటీటీల్లో కొరియన్, మలయాళం సినిమాలు చూశారు. కొరియన్ సినిమాల్లో ఉన్న వైలెన్స్ అదీ కాస్త మోతాదు మించి ఉండటం వల్ల వైలెంటు నేచరు ఎంబ్రియోగా ఉన్న కయీను మీద ఆవాహన అయింది. మలయాళం సినిమాల్లోని రాజకీయాల గోల వల్ల కయీనుకు నిప్పులు చెరిగే తత్వం వచ్చింది. కూట నీతి కూడా అలవడింది.

హెబల్ కడుపున పడే సమయానికి అవ్వ అవ్వ వయసు కాదు కానీ, సినిమాలు చూసే ఇంటరెస్టు తగ్గి, పనికీ పనికీ మధ్య ఇంటrest అవసరమయ్యే స్థితిలో ఉంది. అందుకే ఏదో కృష్ణారామా అనుకునేది. అందువల్ల కాస్త లౌక్యం, కాస్త ఇగో (Ego = knowing one’s self) అలవడ్డాయి హెబల్‌కు. మధ్యలో కుర్రాడు యమగోల చూసి, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అమాయకంగా నమ్మాడు.

ఇంతలో ప్రభుత్వం వారు నాలుగు లక్షల గొర్రెలను కొని కయీను, హెబల్ లకు సమానంగా పంచారు.

కబ్జాలలవాటైన కయీను అన్నకొండ, గొర్రెల తిండి కూడా తనే తినటం వల్ల అవి బక్కచిక్కాయి. జాగ్రత్తగా పెంచటం వల్ల హెబల్ గొర్రెలు బాగా బలిశాయి… I mean… అదే not intended to body shame…

కాస్త బొద్దుగా ఉన్నాయి అని కవి హృదయం. ఇదయం మురళికి సంబంధం లేదు.

అలా ఒక రోజున దేవుడయ్య పండగ వచ్చింది. ఇద్దరన్నదమ్ములూ వారి వారి గొర్రెల్ని బలి ఇచ్చారు. కాకపోతే బాగా బొద్దుగా మాంఛి కండపట్టి ఉన్న గొర్రెను బలి ఇచ్చినందుకు దేవుడు హెబల్‌కు భూమి య్యిలా వ్వుందని య్యెలా కనిపెట్టారు పుస్తకం బహుమతిగా య్యిచ్చాడు.

దాంతో అన్నకొండకు అసూయ పుట్టింది.

నేను పెద్దవాడిని కనుక ఏదైనా సరే ముందు నాకే చెందాలి అన్నాడు. కష్టపడి సంపాదించాను కనుక నాది నాదే. కావాలంటే గీతాచార్య వాళ్ళ Ayn అమ్మమ్మనడుగు అన్నాడు హెబల్.

ఐన్ అమ్మమ్మ దున్నేవాడిదే భూమి కాకపోవచ్చు కానీ, ఒరిజినల్‌గా దేవుడు బహుమతిగా ఇచ్చింది హెబల్‌కే కాబట్టి ఆ పుస్తకం హెబల్‌దే అని చెప్పింది. అయినా కయీను వినలేదు. కానీ, పైకి మాత్రం తగ్గినట్లు నటించాడు. రాత్రిపూట ఆ పుస్తకం కొంత చదివి తెల్లవారి మిగతాది పూర్తి చేసి 2 లక్షలవ పుస్తకం చదవిన landmark రీచ్ అవ్వాలని కంకణం కట్టుకున్న హెబల్ ఆ పుస్తకాన్ని వెల్లకిలా పడుకొని అలా పొట్ట మీదే పెట్టుకున్నాడు.

అప్పటికింకా ఐటీ జాబ్స్ రాలేదు కాబట్టి బొజ్జలు పెరగలేదు. అందరివీ flat టమ్మీలే.

తంబి రామయ్య ఆదమరిచి నిద్ర పోతుండటం చూసిన కయీను పుస్తకం ఎత్తుకుని పారిపోయాడు. కాసేపటికి మెలకువ వచ్చిన హెబల్ చూస్తే పుస్తకం లేదు. కచ్చితంగా అది తన అన్నకొండ కయీను పని అని నిర్థారించుకున్న (అప్పటికింకా ఈనాడు పత్రిక లేదు కనుక నిర్థరించుకున్న అని రాయటం లేదు) హెబల్ వెతుక్కుంటూ కొండల్లోకి వెళ్ళాడు. అన్నదమ్ముల మధ్య పెద్ద ఫైట్. బలమెక్కువ ఉన్న, వైలెంట్ మైండ్ అధికంగా ఉన్న కయీను హెబల్ గొంతు పిసికి చంపేస్తాడు. అదే చరిత్రలో తొలి హత్య.

కయీనును దేవుడు దూరాన ఉన్న కొండల్లో ద్రిమ్మరిలా తిరగమని శపిస్తాడు.

ఒక కొడుకు శిక్ష వల్ల దూరమయ్యాడు. ఇంకో కొడుకును స్వంత అన్నే చంపేసాడు. దాంతో వేదన చెంది అవ్వ డిప్రషన్ లోకి వెళ్ళిపోయింది. అవ్వకు సపర్యలు చేయగా చేయగా ఆదాము ఎక్కడ తను మరీ ఎక్కువ చేస్తే Bang Kok వెళతాడో అనే భయంతో త్వరగా కోలుకుంది. అయినా Post Traumatic Stress Disorder అలాగే ఉంది.

“అన్నదమ్ములంటే ఎంత సఖ్యంగా ఉండాలి. ఇలా చంపుకుంటారా?” అంటూ అవ్వ కన్నీళ్ళ పెట్టుకుంది. ఎదురుగా కెమేరా లేకపోయినా.

“అది కాదు డాళింగ్. అన్నదమ్ములు ఒకరి సుఖం కోసం ఒకరు ప్రాణమిచ్చే వారు కూడా ఉంటారు,” అని ఆదాము అన్నాడు. అవ్వ ఆశ్చర్యంతో, “నిజంగానా?” అని అడిగింది.

“అవును,” అంటూ ఆదాము ఆ అన్నదమ్ముల కథ మొదలెట్టాడు. అదే టే గుక్-గి (Taegukgi). దీన్ని తీసంది షిరీ దర్శకుడు Kang Jae-gyu నే.

Chapter 33, Part-2

Taegukgi remains the most successful film in the career of director Kang Jae-gyu. షిరీ తరువాత ఐదేళ్ళకు తీశాడీ సినిమా. కొరియన్ సినిమా చరిత్రలో కోటింబాతిక మంది (అంటే నాలుగింట ఒకరు) థియేటర్లలో చూసిన తొలి సినిమాగా చరిత్ర సృష్టించింది.

ఇంతకు ముందు చెప్పుకున్నట్లు కొరియన్ వేవ్ రావటంలో ప్రధాన పాత్ర పోషించిన సినిమాలు తీసిన దర్శకులలో కాంగ్ ఒకరు. పార్క్ చాన్-వుక్, ఈ చాంగ్-డాంగ్, కాంగ్ వూ-సుక్ (Kang Woo-suk) మొదలైన వారితో కొరియన్ సినిమాల వైపు ప్రపంచం ఆశ్చర్యానందాలతో చూసేలా చేసిన వారిలో ఒకడు. కానీ, విచిత్రంగా అంతకు ముందు అనామకుడు, ఆ తరువాత కూడా అదే పరిస్థితి, మధ్యలో ఒక కార్యం నిమిత్తం ఊహించిన దానికన్నా గొప్ప ఫలితాన్ని అందించిన సాధారణ మానవుడు అంటారే.. అలా కొరియన్ వేవ్ బల పడటంలో తన పాత్రను ప్రముఖంగా పోషించి ఆ తరువాత తెరమరుగయ్యాడు ఒక రకంగా.

మొదట చాలా తక్కువ బజట్ లో ఒక హరర్ సినిమా తీశాడు. The Gingko Bed. ఇందులో కొంత భాగాన్ని కార్తీ సినిమా కాష్మోరాలో వాడారు. ఇంకొంచం భాగాన్ని అక్షయ్ కుమార్ కెరియర్‌లో పెద్ద కమర్షియల్ హిట్‌గా నిలిచిన డైరక్ట్ హిందీ సినిమా Housefull 4 లో వాడారు. ఈ సినిమా (The Gingko Bed) పెద్దగా నడవలేదు. అయినా ఎంతో పరిశోధన చేసి షిరీ స్క్రిప్టు తయారు చేసి నాలుగేళ్ళ ప్రయత్నం తరువాత కొరియన్ సినిమాను ప్రపంచ పటం మీద పెట్టాడు.

ఆ తరువాత తన Most Personal Project అయిన Taegukgi మీదకు దృష్టి మరల్చాడు. షిరీ యాక్షన్ ప్రధానంగా సాగే espionage, investigative thriller. టే గుగ్-కి కొరియన్ దేశాల మధ్య యుద్ధం, దాని పర్యవసానాలు, మానవ సంబంధాల మీద అల్లుకున్న కథ. యాక్షన్ ఉంటుంది. కాకపోతే గ్లోరిఫైడ్ ఫామ్‌లో కాదు.

షిరీ సక్సెస్ వల్ల కొరియా యువతలో మంచి క్రేజ్ ఉన్న నటులందరూ ఈ సినిమా చేయటానికి ఎగబడ్డారు. షిరీలో నార్త్ కొరియా మిలిటరీ శిక్షకుడిగా నటించిన చోయ్ మిన్-సిక్ తనను superstar గా మార్చిన కాంగ్ కు కృతఙ్ఞతగా ఈ సినిమాలో దాదాపు అలాంటి పాత్రే చేశాడు. ఒకసారి చేసిన తరహా పాత్రను మళ్ళా చేయటానికి ఇష్టపడని మన Oldboy, తన సినీ జీవితాన్ని మలుపు తిప్పిన దర్శకుడి కోసం తన నియమాన్ని పక్కన పెట్టాడు.

ఇక పోతే కథానాయకులుగా Jong Dong-gun, Won Bin లు ఎంపికయ్యారు. కొరియాలోనే అందగాడుగా పేరు పొందిన Won Bin ది ఒక fascinating జీవితం. ముందు ముందు చూద్దాం. Jong Dong-gun అప్పటికి రెండు బ్లాక్బస్టర్లలో నటించాడు. వాటిలో Friend అనేది చాలా గొప్ప సినిమా. Taegugki కి ముందు Silmido కొరియన్ సినిమా చరిత్రలో అతి గొప్ప హిట్ గా నిలిచింది (విమర్శకుల ప్రశంసలు + కాసుల వర్షం). ఆ సిల్మిడో కు ముందు అంతటి హిట్ అయి దాదాపు కోటి మంది థియేటర్లలో చూసిన సినిమా Friend. సిల్మిడో కోటి మంది చూసిన తొలి కొరియన్ సినిమా.

మరీ లెంత్ ఎక్కువైపోతోంది. కథాకథనాలు వచ్చే ఎపిసోడ్‌లో చూద్దామని అంటున్నాడు మన వ్రైటరు అని ఆదాము అనటంతో అవ్వ కన్నీళ్ళు తుడుచుకుంటూ లేచింది. ఎంతైనా ప్రేగు తీపి కదా. కబుర్లు చెప్తూనే హెబల్ పెంచిన Apple చెట్టుకు కాసిన కాయతో జూస్ చేసి అవ్వకు అందించాడు ఆదాము.

అవ్వ కోసమైనా వచ్చేవారం డైరక్టుగా కథా కథనాలలోకి వెళ్దాం.

(సశేషం)

Exit mobile version