Site icon Sanchika

కొరియానం – A Journey Through Korean Cinema-4

[dropcap]మ[/dropcap]నకు వై (Y) అనే అక్షరం తెలుసు కదా. దాన్ని capital letters లో రాస్తే ఒక మనిషి, విజయం సాధించాను అన్నదానికి సంకేతంగా చేతులు పైకి ఎత్తి నిలుచున్నట్లు కనిపిస్తుంది. ఒక గొప్ప సింబల్ అది. Oldboy టైటిల్ వేసేప్పుడు, ఆ అక్షరాన్ని మొదట నిలువుగా వేసి తరువాత పడుకోబెడతాడు దర్శకుడు. మొదట నేను కూడా అందరిలాగానే అదేదో మామూలుగా గ్రాఫి‌క్ స్టైలైజేషన్ వర్క్ అనుకున్నాను. కానీ, ఆ పడుకోబెట్టటం ఎడమ వైపుకు ఉంటుంది. తరువాత మూడోసారో, నాలుగోసారో సినిమా చూస్తున్నప్పుడు హఠాత్తుగా వేరొక సీన్‌కు లింక్ ఉంది అనిపించింది (గుర్తుపెట్టుకోండి). అంతే కాదు. సినిమా కథ మొత్తాన్నీ ఫోర్షాడో చేసింది కూడా. మన ఆలోచనల్ని, పర్సెప్షన్లనీ మడతెట్టేస్తాడు దర్శకుడు పార్క్.

టైటిల్స్ మధ్యలో ఒక అర్జెన్సీని సూచిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నడుస్తున్నప్పుడు తెరమీద ఒక ఎత్తైన బిల్డింగ్. దాని మీద ఒక భయం భయంగా చూస్తున్న వ్యక్తి. చేతిలో కుక్క పిల్ల. అతను తల్లక్రిందులుగా ఆ భవనం మీద నుంచీ పడబోతుంటే మరొక వ్యక్తి అతని నెక్ టై పట్టుకుని ఆపుతాడు. నువ్వు నా కథ వినాలి అంటాడు. ఎవడ్రా నువ్వు? #₹@%€$£€}€}€}}€ అంటాడు ఆ పడబోతున్న వ్యక్తి. అతని మొహంలో grief కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది. దాని తాలూకు చిరాకు, frustration, తనను అనవసరంగా ఈ వ్యక్తి ఆపాడు అన్న అసహాయతతో కూడిన fury వినిపిస్తుంది అతని మాటలలో.

ఇక రెండో వ్యక్తి మొహం మనకు స్పష్టంగా కనపడదు. దాదాపు Silhouette లో ఉంటుంది. అతని గొంతు దాదాపు impersonal గా ఉంటుంది. సింహపు జూలు లాగా జుట్టు మొహం మీద పరుచుకుని ఉంటుంది. మొదటి వ్యక్తి ప్రశ్నకు సమాధానంగా తన గురించి చెప్తాడు ఓ డే-సు. ఒక అద్భుతమైన, ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యమిది. మాటల్లో చెప్పటం కుదరదు. అందుకే సినిమా దృశ్యీకరణ చూడాల్సిందే. సినిమా గొప్పతనమదే కదా. మాటల్లో గీతల్లో చెప్పలేని దాన్ని సామాన్యునికి కూడా అర్థమయ్యేలా చెప్తుంది. అవసరాన్ని బట్టీ.
ప్రముఖ సినీ విశ్లేషకులు, స్క్రీన్ రైటింగ్ గురు సికందర్, “గొప్ప సినిమాల మొదటి దృశ్యం సినిమా మొత్తానికీ ట్రైలర్ లాంటిది,” అని అంటుంటారు. దానికి అద్దం పట్టే మొదటి దృశ్యమిది Oldboy లో. సినిమా ఇలా ఉండబోతోంది, మీ పర్సెప్షన్లను మడత పెడుతుంది. ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తుంది. మన కంటికి కనిపించే దృశ్యం చాలా చిన్నది పూర్తి పిక్చర్ తో పోలుస్తే. మీరొక రోలర్కోస్టర్ రైడ్‌కు సన్నద్ధులు కండి. ఈ ప్రపంచంలో ప్రేమ, సానుభూతి, సహానుభూతి అనేవి ఉండవు. ఉండేదల్లా, నేను… నా… అనేవే. వీటన్నిటినీ కేవలం 54 సెకన్లలో సూచిస్తుంది.

అతన్ని అలా పట్టుకునే ఓ డే-సు తన కథ చెప్తాడు. తనను పోలీసులు అరస్టు చేయటం, స్టేషన్‌లో తను తీన్మార్ వేయటం, తన కూతురు పుట్టిన రోజు, స్నేహితుడు వచ్చి విడిపించి తీసుకుని వెళ్ళటం, తను కిడ్నాప్ కాబడటం, ఒంటరిగా హోటల్ రూమ్‌లో ఉండాల్సి రావటం, పదిహేనేళ్ళపాటూ ఒక్క టీవీ తప్ప బాహ్య ప్రపంచంతో సంబంధం లేకపోవటం, ఒట్టి పిడికిళ్ళతో గోడను గుద్ది గుద్ది తనను తాను బలిష్టంగా మల్చుకోవటం, ఎలా తీసుకెళ్ళారో అలాగే హఠాత్తుగా తనను విడిచి పెట్టటం, లేచి చూస్తే కుక్క మనిషి దూకబోవటం, తను ఆపి తన కథ చెప్పటం ఒకదాని వెంట మరొక సీన్ ఒక డ్రీమ్ సీక్వెన్స్ లా నడిచిపోతాయి. ప్రతి దృశ్యంలో ఎంతో సమాచారం అందిస్తాడు పార్క్. ప్రతి షాట్‌లో ఉన్న డిటెయిలింగ్ చూస్తే మనం అబ్బురపడకుండా ఉండలేం. అందుకే నా కొరియన్ మిత్రుడు ఈ సినిమాలో ఒక్కొక్క షాట్ గురించి ఒక్కొక్క పుస్తకమే రాయవచ్చు అంటాడు.

పెట్టెలో నుంచీ లేస్తాడు ఓ డే-సు. వెలుతురు చూసి తట్టుకోలేడు. పెద్దగా అరుస్తాడు. డ్రాకులా లా. కాసేపటికి శరీరం బాహ్య ప్రపంచానికి అలవాటు పడుతుంది. కళ్ళు మాత్రం తెరిపిడి పడవు. అలా తెరిచీ తెరవని కళ్ళతో తడబడుతున్న అడుగులతో నడుస్తుండగా మన కుక్క పిల్ల మనిషి కనిపిస్తాడు. అతన్ని చూసి, చేత్తో తడిమి, వాసన చూసి, మానవ స్పర్శ సుఖాన్ని, అది ఇచ్చే సాంత్వనను అనుభవిస్తాడు. ఇంతలోనే స్పర్శ ద్వారా అతనిలో ఉన్న నిస్సహాయ వేదనను గ్రహిస్తాడు. బలహీనతను గుర్తిస్తాడు. ఇక్కడే ఓ డే-సు లో మనిషి వెనక్కి జరిగి అతనిలో ప్రతీకారేచ్ఛతో రగిలిపోయే మృగం ముందుకు వస్తుంది. సానుభూతి బదులు ఆ వ్యక్తి నిస్సహాయ మనస్తత్వం మీద ఏహ్యభావంతో నిండిన చిరాకు మనసంతా పరుచుకుంటుంది. తన కథ చెప్పి తన మనసులో భారం తగ్గించుకున్నాడు కనుక ఇక అతనితో తనకు ఉపయోగం లేదని అనుకుంటాడు.

నీ కథ నేను విన్నాను కనుక నా కథ నువ్వు వినవా అని జాలిగా అడుగుతాడా కుక్క పిల్ల మనిషి. పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు ఓ డే-సు. అంతే. అవసరం తీరే వరకే. తీరాక అవతల వాళ్ళ సంగతి చాలామందికి పట్టదు. ABCD మామయ్యను ఎప్పుడు అడిగినా డబ్బులు ఇస్తాడు కనుక అడగటమే తప్ప, ఆ మామకూ కుటుంబం ఉంటుందని, అతనికీ కష్టాలు రావచ్చని, అతను మాత్రం ఎంతవరకూ చేయగలడని చాలామంది ఆలోచించరు. That’s human nature. Man and his needs (వాయ్యా! Man అన్నది human race కు ప్రతీకగా వాడాను తప్ప పుంలింగ man గా వాడలేదని ఫెమినిస్టక్కలకు మనవి). That’s all. Others doesn’t matter much in this ultra competitive world. ఏ కాలమైనా చాలావరకు అంతే. బలహీనులను ఎవరూ లెక్కచేయరు. వారి తరఫున పోరాడే వ్యక్తులు కూడా. లోకరీతి.

Oldboy టైటిల్, నెక్ టై సీన్, flashback ముగిశాక కుక్క పిల్ల మనిషిని చూడటం, అతన్ని రక్షిస్తూ తన కథ చెప్పటం, తరువాత అతని బలహీనతను గ్రహించి, వదిలేసి వెళ్ళటం, అతను నా కథను వినమని వేడుకున్నా విననట్లు ఉండటం… కేవలం 22 నిముషాల స్క్రీన్ టైమ్‌లో విస్తరించి ఉన్న ఈ మూడు నిముషాల సీక్వెన్స్ ద్వారా ఎంతో సమాచారం ఇవ్వటమే కాదు, మనకు ఈ సినిమా ఎలా చూడాలి కూడా బల్లగుద్ది చెప్తాడు దర్శకుడు పార్క్. మనల్ని కూడా సినిమా చూసేసి, ఓ డే-సు ను చివరికి ఇలాగే వదిలేసి వెళ్ళమంటాడు. అస్సలు పట్టించుకోవద్దంటాడు. ఈ ప్రపంచంలో మన జీవితం మనది తప్ప, ఇతరుల గురించి అనవసరం అనీ, కాలికంటిన దాన్ని నెత్తికి పూసుకోవద్దని (ఓ డే-సు తో కలిపి), it’s your duty to move on. I have cautioned and warned you. Don’t blame me later. అని చెప్పేస్తాడు. చెప్పు వేస్తాడు.

నిస్సహాయులు కూడా ఆ క్షణం వరకే నిస్సహాయులని, వారి అవసరం తీరుతే వారెలాంటి వారో చెప్పలేమని, వారివల్లే మనకు ఆపద రావచ్చని, పైకి కనిపించేదల్లా సత్యం కాదని, అందుకే ఏ బంధంలోనూ emotional attachment ఉండకూడదని సూచిస్తాడు.

దానిని సపోర్ట్ చేస్తూ తరువాత దృశ్యం వస్తుంది.

భవనం మీద నుంచీ కిందకు వస్తూ లిఫ్ట్ వాడతాడు ఓ డే-సు. అందరిలాగానే. అందులో అతనితో పాటూ ఒక నడివయసు మహిళ ఉంటుంది. ఆమెతో ఓ డే-సు passive interaction is an example of how the ingrained misogyny couldn’t be suppressed for long. ఈ దృశ్యంతో ఓ డే-సు మీద మనకు కలగబోతున్న సానుభూతిని బద్దలుకొట్టి, ఈ సినిమా చూసి బతికి బట్టకట్టాలంటే (బతక్కపోతే బట్టకట్టమా? దయ్యాలకు బట్టలుండవా అని అడగకండి. అది వేరే డిస్కషన్) ఓ డే-సు కథను impersonal గా, ఒకరకమైన detachment తో చూడమని జెల్లకాయ కొట్టి మరీ చెప్తాడు పార్క్.

ఒకపక్క పదిహేనేళ్ళ తరువాత లిఫ్ట్ ఉపయోగించటంలో తన solitary confinement కలిగించిన ట్రామాను మరొకసారి చవిచూస్తూనే, తనను, తన అవతారాన్ని, తనలో కనీకనిపించని animalistic (feline to be precise) tendencies ని చూసి భయపడుతున్న ఒక ఒంటరి మహిళను చూసి sexual arousal ను బహిరంగంగా ప్రదర్శిస్తాడు.

లిఫ్ట్ దిగి వస్తాడు. కళ్ళకు goggles పెట్టుకుంటాడు. ఒక నిస్సహాయ మహిళను ఠాకెత్తించి తన ఆధిపత్యాన్ని చాటిన విజయాన్ని celebrate చేసుకుంటూ ఒకరకమైన స్వాగ్‌తో ముందుకు కదులుతాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ మహిళ తనను ఈ అపరిచితుడు తనను intimidate చేసిన విషయం అక్కడి వారికి చెప్తుంటుంది. ఒకరకమైన suppressed వెకిలి నవ్వుతో ఓ డే-సు నడుస్తుంటాడు. ఇంతలో మన కుక్కపిల్ల మనిషి దిక్కులేని స్థితిలో భవనం పైనుంచీ దూకేస్తాడు. అతను కింద పడి ప్రాణాలు కోల్పోయిన క్షణంలో ఓ డే-సు నవ్వు సినిమా చివరి దృశ్యంలో ఓ డే-సు నవ్వుకు పూర్తి contrast గా ఉంటుంది.

భయంకరం. భయానకం. కంపరం. అదే దర్శకుడు పార్క్ మనల్ని మొదట నుంచీ హెచ్చరించేది. Don’t take things on face value. A mere mortal maybe an arrogant animal with a face yet to be unmasked. Or a seemingly dangerous person maybe a friendly beast. మీరు చూస్తున్నది ఓ డే-సు కథ. అంతే. అది సినిమాలో భాగం. మీరు సినిమా చూసి ఒక ట్విస్టెడ్ entertainment పొంది వెళ్ళిపోండి. Don’t try to identify yourself with Oh Dae-su. సినిమాలో మీరు తెలుసుకోలాల్సింది వేరే ఉంది. కావాలంటే దాని గురించి ఆలోచించుకోండి. That’s all.

మూడే నిముషాలు. ఎన్నో జీవిత సత్యాలు.

ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, లైటింగ్ స్కీమ్, కలర్ పేలెట్స్, షాట్ మేకింగ్, కెమేరా angles, framing, focus and unfocused, సంగీతం, నిశ్శబ్దాలు… ఇలా ఒక్కొక్క క్రాఫ్ట్‌ను ఒక్కొక్క రీతిలో తన కథను చెప్పటానికి ఉపయోగించిన తీరు గురించి చెప్పాలంటే ఈ మూడు నిముషాల భాగం కోసమే 300 పేజీల పుస్తకం రాయాలి. అంత గొప్పగా ఆలోచించి, ఊహించి, అమలుపరిచాడు కాబట్టే ఒక సాధారణంగా బాగుంది అనిపించే action manga ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే అత్యున్నత సినిమాలలో ఒకటిగా నిలిచింది.

This diabolically talented South Korean filmmaker is not just a director. He’s an auteur. ఇతను పూర్వాశ్రమంలో ఉన్నతశ్రేణి సినీ విమర్శకుడు. గొప్ప orator. క్రూరమైన కళాపిపపాసి. ఇదీ దర్శకుని కథ.

ఇక వచ్చేభాగంలో Oldboy సినిమా గురించిన కొన్ని విశేషాలు చూద్దాం.

Exit mobile version