Site icon Sanchika

కొరియానం – A Journey Through Korean Cinema-44

భూతేర్ భవిష్యత్

[dropcap]స[/dropcap]రే!

సినిమా నుంచే లాగిద్దాం. మాయాబజార్ షూటింగ్ జరుగుతోంది. ఆ రోజు షూటింగ్ సావిత్రి మీదే. సెట్ అంతా టెన్స్‌గా ఉంది. కేవీ రెడ్డి సినిమా తీతలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఇది మహానటి సినిమా కాబట్టి, మరో నటుడి ఎలివేషన్ల మీద దృష్టి పెట్టాల్సిన పని లేదు కనుక దర్శకుడు క్రిష్ సినిమా మీదే ఫోకస్ ఉంచి, కేవీ రెడ్డిగా కంపీటెంట్ పెర్ఫమెన్స్ ఇస్తున్నాడు.

ఇంకోసారి సరే!

నటిస్తోంది కీర్తీ సురేశ్ అయినా, చేస్తోందక్కడ సావిత్రే.

సందర్భం.. ‘నీకోసమె నే జీవించునది’ పాట చిత్రీకరణ. దర్శకుడి దృష్టి కోణం ప్రకారం సావిత్రి ఒకవైపు విషాదం, మరోవైపు ఆనందం చూపించాలి. దానికి విజువల్‌లో ఒక కంటిలో (ఎడమ) కన్నీరు, మరో కంటిలో ఆనందం చూపాలి. గ్లిజరిన్ సీసా పగిలిపోవటం సమస్య. కేవీ రెడ్డి కోపంగా ఉన్నాడు. ప్రత్యేకించి సింగీతాన్ని మందలిస్తున్నాడు.

సావిత్రిగా చేస్తున్న కీర్తీ సురేశ్ స్క్రీన్ మీదకు వచ్చింది. పాపం బ్రీడ్ కాకపోవటం వల్ల background score తో ఓవర్ ఎలివేషన్ ఇవ్వలేదు. కానీ, సీన్‌కు తగిన శబ్దాలను సంగీత దర్శకుడు మికీ జే మేయర్ అందించాడు.

సావిత్రి సురేశ్ నేను మీరు అడిగిన విధంగా చేయగలను అని ఆ రోజుకు పేకప్ కాకుండా అడ్డం పడి సింగీతం శ్రీనివాసరావును రక్షించింది. పైగా ఎన్ని కన్నీటి బొట్లు కావాలని ఎదురు ప్రశ్నించింది. క్రిష్ కేవీ రెడ్డి రెండు అని సమాధానం చెప్పాడు. కాస్త వెటకారంగా (ఎలివేషన్ కోసం. ఎలివేషన్ కోసం).

మూడోసారి సరే!

(ఎడిటర్ గారు లెక్క పెట్టే శ్రమ లేకుండా గీతాచార్యే చెప్పేస్తున్నాడు ఎన్ని సార్లు సరే అంటున్నాడో 😀😉😂).

సరే! 4

కెమేరా రోల్ అయింది. సావిత్రి సురేశ్ జీవించింది. రెండంటే రెండే కన్నీటి బొట్లు అలా ఎడమ కంట్లోంచీ చులాగ్గా చెంప మీదకు రాలాయి. ఇక్కడ లేడీస్ ఎంపోరియమ్ శ్రీకాంత్, చిట్టి లేరు కనుక ఎవరి చెంపా పగల లేదు.

సరే! 5

క్రిష్ కేవీ రెడ్డి సావిత్రి సురేశ్‌ను ఇంకో పది జనరేషన్ల తరువాత కూడా నటి అంటే నువ్వే అని జనం చెప్పుకుంటారు అని ఆశీర్వదిస్తాడు కీర్తీ సురేశ్ క్రిష్ కాళ్ళకు నమస్కారం చేస్తే.

Kim Byeong-soo ను Tae-joo strangle చేస్తుంటాడు. కిమ్ బ్యుంగ్-సు తన ప్రాణాల కోసం పెనుగులాడుతుంటాడు. అతనికి ఆరోగ్య సమస్య. మానసిక సమస్య. శారీరక పటుత్వం తగ్గిపోతుంది. పూర్వాశ్రమంలో అతనొక పరమ నిష్ఠాగరిస్టుడైన సీరియల్ కిల్లర్. కుల తిలకుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడా ఆ స్థాయికి పోలీస్ ఆఫీసర్‌గా ఉన్న Tae-joo చేయాలని ప్రయత్నాలు.

ఇంతకీ బ్యుంగ్-సు ఎందుకు ఇతని పాల పడ్డాడు అంటే తన కూతురును రక్షించుకునేందుకు. అదంతా ఓ పేద్ద కాంప్లికేటెడ్ కథ. సినిమా రివ్యూ అంటూ ఫేస్బుక్‌లో, వెబ్ మేగజీన్లలో స్పాయిలర్సు కూడా వదలకుండా కథ మొత్తం రాసేసి చివర్లో ఏవో నాలుగు మాటలు రాసేసి గొప్ప రివ్యూ అనిపించుకునే సందర్భం కాదు కనుక ఇప్పుడు ఆ సంగతి వదిలేద్దాం. అసలేమీ గుర్తు లేని బ్యుంగ్-సు తన ప్రాణాల కోసం మాత్రమే పెనుగులాడుతూ, ఇక ప్రాణాలు వదిలేద్దాం. ఎంతసేపు ఈ బాధ భరించాలి అనుకునే సమయమది.

ఇంతలో కూతురు యూన్ హీ వస్తుంది. ఆమె పిలుపుతో మళ్ళా జ్ఞాపకాలు ట్రిగ్గర్ అవుతాయి. ప్రాణాల కోసం పోరాటం మొదలు పెడతాడు. పెనుగులాట మొదలౌతుంది. ఆ పాత్ర వేస్తున్న నటుడు ఇప్పుడు తన పడుతున్న బాధను (strangling వల్ల) చూపాలి. అలాగే situation is under my control అని కూతురుకు సిగ్నల్ ఇవ్వాలి.

ఆ క్షణంలోనే ఆ నటుడు ఒక అద్భుతం చేస్తాడు. సావిత్రి ఒక కంటిలో నుంచీ రెండే కన్నీటి బొట్లు రాల్చినట్లు ఆ నటుడు ఎడమ కంటి కింద ఉన్న చర్మాన్ని అలా వైబ్రేట్ చేస్తాడు. సినిమాను జాగ్రత్తగా ఇన్వాల్వ్ అయి చూస్తుంటే ఈ సన్నివేశంలో ఆ నటుడి నటన చూస్తే మతి పోతుంది. అదేదో యాక్సిడెంటల్ మూమెంటా అని మనం అనుకోవచ్చు. కానీ ఈ విషయాన్ని దర్శకుడు Won Shin-yun కూడా ఎక్నాలజ్ చేశాడు.

ఆ నటుడే…

Sol Kyung-gu (సోల్ క్యుంగ్-గు)!!!

సినిమా పేరు Memoir of a Murderer.

No. 3 విడుదల అయ్యే సమయానికి రెండు చిన్న పాత్రలు మాత్రమే ధరించాడు. 1996లో. ఆ సినిమాలు…

A Petal

Love Story

వీటిలో A Petal అన్నది: the story of a girl who experienced the Gwangju Uprising at the age of 15. దాని ఫలితమైన Post Traumatic Stress Disorder ఆమెను జీవితాంతం ఎలా వెంటాడింది అన్నది కథ. ఆ సినిమాలో ఆ పిల్ల అన్న పాత్రలో వేశాడు సోల్. మరో మూడున్నరేళ్ళకు తనను కూడా టాప్ లీగ్ లోకి పంపిన Peppermint Candy లో కథాంశం కూడా Gwangju Uprising and the massacre.

A Petal లో ఆ పిల్ల పాత్ర వేసిన Lee Jung-hyun తొలితరం కొరియన్ అంతర్జాతీయ నటీమణులలో ఎన్నదగినది.

ఈ సినిమా చేసే నాటికి ఆమె టీనేజర్. గట్టిగా పదిహేనేళ్ళు. పాత్రలో జీవించి ఎన్నో అవార్డులు కొల్లగొట్టింది. నటనతో పాటూ తన గాత్రంతో కొరియన్లను మంత్రముగ్ధులను చేసింది ఈ పిల్ల. (Lee Jung-hyun – ఈ జుంగ్-హ్యున్). కొరియన్లు ఈ పిల్లను (pun absolutely intended) ముద్దుగా The Tech-no Queen అని పిలుచుకుంటారు.

Let’s Go To My Star

Magic To Go To My Star

I ❤️ Natural

Fantastic Girl

ఈమె డిస్కోగ్రఫీలో ఎన్నదగినవి. విని చూడండి. మీకే తెలుస్తుంది.

ఎ పెటల్ తరువాత నటన మీద పెద్ద దృష్టి పెట్టని ఈ పిల్ల పదిహేనేళ్ళ (ఏంటో ఈ కొరియన్ల 15 ఏళ్ళ పిచ్చ ప్లస్ కనక్షన్) తరువాత మన పార్క్ చాన్-వుక్ ఐఫోన్ 4 తో తీసిన short film Night Fishing లో ఒక Shaman గా జీవించింది. ఆ తర్వాత కొరియన్ సినిమా చరిత్రలో అతి పెద్ద బాక్సాఫీస్ హిట్ అయిన The Admiral: Roaring Currents లో ప్రధాన పాత్ర పోషించింది. అక్కడి నుంచీ మళ్ళీ మంచి సినిమాలలో ప్రముఖ పాత్రలు వేస్తోంది.

అలా చిన్న పాత్రలో తన సినీ ప్రస్థానం మొదలు పెట్టిన సోల్ క్యుంగ్-గు 1998లో సంచలనం సృష్టించిన వివాదాస్పద సినిమా (erotic thriller) Girls’ Night Out లో ఇంకో చిన్న పాత్ర పోషించాడు. అందులో ఒక చోట అతని expressions చూసి దిగ్దర్శకుడు ఈ చాంగ్-డాంగ్ Peppermint Candy లో అవకాశం ఇవ్వటంతో దశ తిరిగింది.

షిరీతో మన చోయ్ మిన్-సిక్ స్టార్డమ్, సాంగ్ కాంగ్-హో నటుడిగా గుర్తింపు పొందేనాటికి అనామకుడిగా ఉన్న సోల్, ఏడాది కాకుండానే టాప్ లీగ్ లోకి చేరాడు.

ఇలా సోల్ స్టార్డమ్ పొందాడు, అలా హన్ సుక్-క్యు నాలుగేళ్ళ విరామం తీసుకున్నాడు. క్రమంగా తన సూపర్ స్టార్డమ్ పోగొట్టుకున్నాడు. కానీ, నటుడిగా అతని విలువ ఎన్నడూ తగ్గలేదు.

అదందుకే కొరియన్ల స్టార్డమ్ మీదకన్నా తమ తమ బేసిక్‌ల మీద దృష్టెక్కువ పెడతారు.

హన్ సుక్-క్యు superstardom ను స్థిరీకరించి, చోయ్‌ను టాప్ లీగ్ లోకి తోసి, సాంగ్ కాంగ్-హో కు నటుడిగా ఫుటింగ్ ఇచ్చిన No. 3 గురించి తరువాత ఎపిసోడ్ లో.

By the way, అవతార్ 2 ను iBomma లో చూద్దామని ఎంతమంది ఫిక్సయ్యారు?

(సశేషం)

Exit mobile version