Site icon Sanchika

కొరియానం – A Journey Through Korean Cinema-45

పూవరసం పీపీ 2

Chapter 40

[dropcap]రో[/dropcap]జు వారీ సంపాదనతో పొట్ట పోసుకునే వ్యక్తుల నుంచీ, రోజు సంపాదన కోట్లలో ఉండే శ్రీమంతుల (మహేశ్-నాగేశ్వరరావు) వరకూ, ఎవరైనా జీవితంలో ఎదగాలనే కోరుకుంటారు. కాకపోతే ఆ ఎదిగేందుకు ఏమి చేసారు? ఎంత కృషి చేశారు అనేది వారి ఎదుగుదలను డిసైడ్ చేస్తుంది. (యమలీల తోట రాముడు కాదు. తోట రాముడంటే గుర్తొచ్చింది ప్రముఖ నటుడు, మా చిన్నతనంలో పెద్ద హిట్ అయిన యమలీలలో యముడిగా అలరించిన నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ ఇక లేరు అన్న విషయం తెలిసింది. ఆయనకు నివాళులు).

ఈ ఎదుగుదలకు కృషి చేసేవారిలో Gangsters కూడా ఉంటారు. ఇంట్లో అన్నకొండ స్థానం నుంచీ ఆకు రౌడీ వరకు, ఆకురౌడీ నుంచీ వీధి గూండా వరకూ, ఆ పైన రౌడీ షీటర్, ఏదైనా గ్యాంగులో ప్రముఖ స్థానం (తన కిందో నులుగురుండేలా – ఆ నలుగురు కాదు), ఆ పైన పైవాళ్ళకు కుడి భుజంలా నుంచీ.. తనకంటూ ప్రత్యేక దందా ఉండేలా.. అలా అన్నమాట. చూశారా? అన్నమాట ఎక్కడైనా ఈ అన్నకొండల డామినేషన్ ఎక్కువైంది. అందుకేగా రౌడీలను, నక్సల్స్‌ను అన్నలు అనేది. దౌర్జన్యానికి ప్రతిరూపాలు ఈ అన్నకొండలు. డౌన్ డౌన్!

ఇలా ఒక గ్యాంగులో No. 3 గా ఉన్న వాడే మన టే-జు (Tae-ju). ఈ పాత్రను పోషించింది హన్ సుక్-క్యు. ఎలాగైనా తన కమిట్మెంట్‌తో పై వారిని మెప్పించి మొదట No. 2 గా ఆ పైన.. అలా కృషి చేస్తుంటాడు. చూస్తుంటే శేఖర్ కమ్ముల అనే naiveన్నర దర్శకుడు తీసిన గోదావరి సినిమాలో కథానాయకుడు సుమంత్ రోజకీయోద్యోగం చేయాలనుకున్నట్లు. ఇతనో professional gangster.

ఇకపోతే (ఎవరూ కాదు) డాంగ్-పాల్ అనే చిన్న పోలీస్ ఆఫీసరుంటాడు. అతనికి కూడా ఎలా అయినా తన వృత్తిలో కమిట్మెంట్ చూపి ప్రమోషన్ కొట్టి పైకెదగాలనుకుంటాడు. అతను మన టే-జు కు వృత్తి ఎదుగుదలలో అడ్డం పడుతుంటాడు. ఈ పాత్రను మన Oldboy చోయ్ మిన్-సిక్ వేశాడు.

చివరగా సాంగ్ కాంగ్-హో! ఈయన పాత్ర ఒక assassin trainer. అంటే వాళ్ళ గ్యాంగులో assassination programmes కు అవసరమైన కుర్రకారుకు ట్రైనింగిచ్చే వ్యక్తి. అతనికి కూడా ఏనాటికైనా పైకెదిగి గట్టి మర్డర్లు చేయాలని తపన. కానీ ట్రైనింగే సరిగ్గా ఇవ్వలేడు.

విషయమర్థమైంది కదా. ఈ సినిమా ఒక black comedy cum satire on the gangster genre.

సినిమా అంతా అతుకుల బొంతలా ఉంటుంది. అప్పుడప్పుడే ప్రపంచ వ్యాప్తంగా popular అవుతున్న non-linear narration, hip hop montage లను యువ దర్శకులు అతిగా అర్థం పర్థం లేకుండా వాడేస్తున్న తీరు మీద కూడా సెటైర్‌గా ఈ రకం సెట్టింగ్ చేశాడు మన సినిమాను దర్శకుడు Somg Nung-han.

ఉన్నట్టుండి కొత్త పాత్రలు వస్తుంటాయి. వాటికి subplots. ఒక్కో పాత్రకు ఒక్కో మేనరిజమ్. ఉన్నట్లుండి పొట్టచెక్కలు చేసే హాస్యం. అంతలోనే లీటర్లు లీటర్లు టొమాటో రసం తెర మీద పోయాల్సినంత వైలెన్స్. కాస్త సెంటిమెంట్. కాస్త రొమాన్స్. ఇలా సాగి సాగి ఉన్నట్లుండి ఆగిపోతుంది. దానిలోనే చిత్ర విచిత్రమైన ప్లాట్ ఉంటుంది. ఎవరో హాలీవుడ్ దర్శకుడు గుర్తొచ్చాడు కదా?

అదిరిపోయే నట విన్యాసాలుంటాయి. నాకెందుకిలాంటి ఆలోచన కాలేదని కుళ్ళుకునే మూమెంట్స్ ఉంటాయి. మొత్తమ్మీద ఫాలో అవగలిగే వాళ్ళకు క్లాసిక్. కాలేని వాళ్ళకు మలయాళ సినిమాలిష్టపడే ఫేస్బుక్ మేఝావులకు రవితేజ తరహా మసాలా సినిమా.

మన ముగ్గురు కథానాయకులూ వారి వారి పాత్రల్లో అదరగొట్టి స్టార్డమ్ సంపాదించారు. పాత్ర స్థాయిని బట్టీ. నట హర్క్యులిస్ అయిన చోయ్ ఒక్క దెబ్బకు ఐదారు సినిమాలు కొట్టేశాడు.

సాంగ్ కాంగ్-హో మరో మంచి అవకాశం ఈ సినిమా వల్ల పొందాడు. అదే.. The Quiet Family. చోయ్ మిన్-సిక్ కూడా ఈ సినిమాలో నటించాడు. It’s a black comedy horror. యాదృచ్ఛికమో ఏమో కానీ, Song Kang-ho acted in several genre satires too.

  1. The Good The Bad and The Weird
  2. Parasite (ఆఁ అదే ఆస్కార్లు కొల్లగొట్టిన కొరియన్ సినిమా)
  3. A Taxi Driver
  4. The Host

ఇలా మరికొన్ని ముసుకేయబడ్డ సెటైర్లున్నాయి.

సాంగ్ కాంగ్-హో కొరియన్ నటుల్లో అత్యధిక బ్లాక్బస్టర్ విజయాలు సాధించిన సినిమాల్లో నటించాడు. ఎలాంటి స్క్రిప్టైనా అటు సెటైరికల్ టోన్ కానీ, లేకపోతే మంచి కమర్షియల్ ఎలిమెంట్లు కానీ దట్టించిన సినిమాలు చేస్తూపోయాడు. ఆనాటి నుంచీ ఈనాటి వరకూ ఈ ఫార్ములానే నమ్ముకున్నాడు.

నా మొహమే దేవుడి సెటైర్‌లా ఉంటుంది. అందుకే దాన్నే ఉపయోగించి ఎదగాలని ప్రయత్నాలు చేసాను అంటాడు సాంగ్. సీరియస్ పాత్రల్లో ఎంత సీరియస్‌గా కనిపిస్తాడో కామికల్ సన్నివేశాలలో అంతే కామికల్‌గా ఉంటాడు. మొత్తానికీ ఒక యునిక్ పీస్.

Chapter 41, Part – 1

పదమూడేళ్ళ క్రితం అంటే 2009 సెప్టెంబర్ టైమ్‌లో అవతార్ టీజర్లు, లీకులు, పోస్టర్లు వస్తున్న టైమది. నాకు అప్పుడప్పుడే ప్రపంచ సినిమా కూడా పరిచయం అవుతున్న సమయమది. అప్పటికి కొరియన్ సినిమా పరిచయం అయింది. పిపర్మింట్ కేండీ రివ్యూ నవతరంగంలో రాశాను. కథ అక్కడికే ఆగిన టైమ్ అది. ఇంకా ఆరు నెలలకు కానీ ఇదే సినిమా రివ్యూ Passion for Cinema లో రాయలేదు. ఆ తర్వాత కానీ కొరియానం మొదలు కాలేదు. కనుక నా సినీ అవగాహన పరిమితమే.

నేను, నా స్నేహితుడు అవతార్ ఇన్నాళ్ళకు వస్తోంది. కామరాన్ చివరి సినిమా వచ్చి 12 సంవత్సరాలు అవుతోంది. అవతార్ తీయటం మొదలు పెట్టి కూడా నాలుగేళ్ళయింది. ఈ సారి సిన్మా గల్లంతైతే పరిస్థితేంటి అని మాట్లాడుకుంటున్నాము.

దగ్గరలోనే కూర్చుని కాఫీ తాగుతున్న మా నాన్న, “కామరాన్ సినిమా కదా. కచ్చితంగా ఆడుతుంది.” అన్నాడు. Trust Cameron!

నా చిన్నతనంలో నా బలవంతం మీద టెర్మినేటర్ 2: జజ్మెంట్ డే చూపించాడు నాన్న. మా ఇళ్ళలో అప్పటికి ఇంగ్లీషు సినిమాలంటే బూతు సినిమాలని అపోహ. ఇంట్లో కుర్రకారు అర్థరాత్రిళ్ళు కంబైండ్ స్టడీస్ అని చెప్పి రహస్యంగా చూసి వచ్చే సినిమాలని ఒక మాదిరి విశ్వాసం. మా ఇంట్లో అప్పట్లో 16 మంది ఉండేవాళ్ళు. ఉమ్మడి కుటుంబం.

ఆ అపోహను బద్దలు కొట్టటమే కాదు. కామరాన్ అంతకు ముందు తీసిన మూడు సినిమాలు కూడా గొప్ప కథా కథనాలున్నవని తెలిసింది. ఆ తర్వాత సెలక్టివ్‌గా మా ఊళ్ళో రిలీజైన మంచి ఇంగ్లీషు సినిమాలు, స్టార్ మూవీస్, ఎచ్బీవో (HBO) ల్లో వచ్చేవి కలిసి చూశాము.

అందుకే మా నాన్నకు కామరాన్ అంటే ఇష్టం, గౌరవం కూడాను. అలా బలపడ్డ నమ్మకమే అవతార్ విషయంలో Trust Cameron అన్న మాటగా బైటకొచ్చింది.

నాకు కొరియన్ సినిమా పరిచయమయ్యాక తెలిసిన విషయం ఏమిటంటే చాలాకాళం పాటూ అటు టైటనిక్, ఆ తర్వాత అవతార్ కొరియాలో అత్యధిక కలక్షన్లు సంపాదించిన సినిమాలుగా నిలిచాయి. Not just foreign films on Korean land. But in terms of all time gross.

Avatar is still the highest grossing film on Korean land. If we consider pure Korean films, The Admiral: Roaring Currents. కొందరి లెక్కల ప్రకారం ఈ సినిమానే పెద్ద హిట్ అంటారు. అవతార్ రెండవ స్థానం అంటారు. ఏది ఏమైనా ప్రతి ఇద్దరు కొరియన్లలో ఒకరు ఈ రెండు సినిమాలనూ చూసే ఉంటారు. చివరిగా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలక్షన్లు వసూలు చేసిన కొరియన్ సినిమా Parasite. Multiple Oscar winner.

చిన్నప్పుడు టెర్మినేటర్ వచ్చినప్పుడు స్కూల్లో ఫ్రెండ్స్ ఆ సినిమా గురించి చాలా ఊరించారు. హీరో ఒక మెషిన్ అనీ, తన తలకు తానే ఆపరేషన్ చేసుకుంటాడని, విలన్ తలుపుల్లోంచీ గోడల్లోంచీ వచ్చేస్తాడనీ చిత్ర విచిత్రాలుగా.

పైన చెప్పకున్న కారణాల వల్ల మా ఇంట్లో ఇంగ్లీషు సినిమాలు నిషిద్ధం. దాంతో నన్ను మరపించేందుకు మానాన్న కొబ్బరి ఆకులతో ఒక బూరా లాంటిది చేసి ఊదటం నేర్పాడు. అదీ, దానిలోంచీ వచ్చే శబ్దం నాకు బాగా నచ్చినా, టెర్మినేటర్ ఆలోచనలు వదలలేదు.

మా నాన్నతో నేన చూసిన చివరి సినిమా అవతార్. అవతార్ 2 ఎటూ ఇంకో పదేళ్ళైనా పడుతుంది కనుక నాతో, వీలుంటే నా పిల్లలతో కలిసి చూడాలని మా నాన్న అన్నాడు. అప్పటికి నా పీజీ పూర్తయి ఏడాదైంది. ఇంజనియరింగ్ కాలేజ్‌లో చేస్తున్నాను. After a Baker’s Dozen years, అవతార్ 2 వచ్చింది. కానీ ఇప్పుడు నాన్న లేడు. నాకు పిల్లలు కూడా లేరు.

కామరాన్ అనగానే నా ఆలోచనలు ఎటెటో పోతుంటాయి.

తమిళంలో పూవరసం పీపీ అని ఒక పిల్లల సినిమా వచ్చింది. ఒక క్రైమ్ డ్రామా. పూవరసం పీపీ అంటే పూవరసం ఆకులతో చేసిన బూర అని.

అవతార్ 2 ఇప్పటికి ప్రతి ఎనిమిది మంది కొరియన్లలో ఒకరు చూసేశారని బాక్సాఫీసు నంబర్లు చెపుతున్నాయి. దాదాపు నలభై మిలియన్ డాలర్ల గ్రాస్ కలక్షన్లతో ఆ దేశంలో ఈ సంవత్సరపు టాప్ టెన్ సినిమాలలో ప్రస్తుతానికి 4వ స్థానంలో నిలిచింది. అవతార్ 117 మిలియన్లు వసూలు చేయగా అవతార్ 2.. అంత వసూలుచేయలేక పోవచ్చు కానీ కొరియాలో ఇప్పటికే పెద్ద హిట్.

మరి అవతార్‌తో పోటీపడి కొరియన్ సినిమా జండా ఎగరేసిన సినిమా విశేషాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా..? చలో! వచ్చే వారమే చూద్దాం.

ఈలోగా ‘కైకాల సత్యనారాయణ ఆస్తుల విలువ తెలిస్తే మీరు షాక్ తింటారు.’ ఇలాంటి న్యూసులను చదివి ఎంకరేజ్ చేద్దాం.

P.S.:

By the way, పూవరసం పీపీ అయినా, కొబ్బరాకుల బూర అయినా కొరియానం కవర్ పేజ్‌లో ఉంది. చూడండి.

(సశేషం)

Exit mobile version