Site icon Sanchika

కొరియానం – A Journey Through Korean Cinema-46

ఓ మహాత్మా ఓ మహర్షీ

Chapter 42

జపాన్ ఈనాడు (మన ఆ రెండు పత్రికల్లో ఒకటి కాదు) శాంతి పాఠాలు వల్లిస్తూ, యుద్ధాలకు వ్యతిరేకంగా ఉంటూ వస్తోంది కానీ (ఇది రాస్తున్న సమయానికి – 29 డిసెంబరు 2022 4:58 AM – సరిగ్గా పది రోజుల ముందు నుంచీ జపాన్ తిరిగి తన సైనిక సంపత్తిని నిద్ర లేపాలని ఆలోచనలో ఉందని, అణ్వాయుధాలను పరీక్షించాలనే తన కోరికను అమెరికన్లకు తెలుపగా వారు కర్సరీ నాడ్ ఇచ్చారని ఇండికేషన్లు వస్తున్నాయి), ఒకప్పుడు ఇతర దేశాలను, రాజ్యాలను ఆక్రమించుకోవటంలో.. జగమెరిగిన జాపనీయుల మిలిటరీ దాహానికి సాక్ష్యాలేల? PEARL HARBOUR says Hi!

పోతే (ఎక్కడికీ వెళ్ళద్దు, ఏమీ తే నక్కరలేదు), మనం మన చరిత్ర పుస్తకాలలో చదవకపోయినా, ఈ విషయాలన్నీ బాగా రికార్డెడ్. ప్రత్యేకించి జాపనీయుల మిలిటరీ పవర్ ప్రతాపం కొరియన్ల మీద బాగా చూపారు. మన భారతదేశానికి అంతర్జాతీయ సమాజంలో ప్రస్తుతం ఎవరు సహకరిస్తున్నారు లాంటి పొలిటిగేషన్ విషయాలు పక్కన పెడితే, జాపనీయుల imperialistic tendencies ను చైనా, కొరియా, ఒకానొక సందర్భంలో రష్యా కూడా రుచి చూశాయి.

రెండో ప్రపంచ యుద్ధం తరువాత శాంతియుత, మిలిటరీ రహిత దేశమైన జపాన్, లిటరేచర్, సినిమాల ద్వారా విదేశీయులకు చేరువయ్యింది. ప్రపంచ యుద్ధానంతరం అకీరా కురొసావా సినిమాలు దేశ దేశాల్లో ప్రభావం చూపాయి. మన దేశంలో (ఎన్టోడి తెరంగేట్రం కాదు) సత్యజిత్ రాయ్ మీద కురొసావా ప్రభావం హెచ్చు. రాయ్ రాసిన రషోమన్ రివ్యూ చాలా గొప్పగా ఉంటుంది. Our Films Their Films పుస్తకంలో రాయ్ కురొసావా గురించీ, ఆయన సినిమాటిక్ టెక్నిక్ గురించీ చాలా గొప్పగా చెప్తాడు.

అలాగే సినిమా, పాప్ కల్చర్ లో కే-వేవ్ లేదా కొరియన్ వేవ్ లాగా సాహిత్యంలో జాపనీస్ వేవ్ వల్ల మన జనాలు వారితో సహానుభూతి చెందగలుగుతున్నారు. హరూకీ మురాకమీ, కీగో హిగషినో, కానే మినాటో లాంటి పాప్యులర్ రచయితలకు మన వైపు మంచి మార్కెట్ ఉంది. వారి కల్చర్ ను, జీవన విధానాలను ఈ రూపంలో మనకు చేరువ చేస్తున్నారు subconscious level లో. అదే పని మన వారు చేస్తే ఎంత బాగుంటుందో ఆలోచించాలి.

ఈ విధంగా మనిండియా సాహిత్యం, సినిమా విదేశీయులకు చేరువైతే వారు కూడా మన సామాన్య ప్రజతో empathise కాగలరు. రాజమౌళి సినిమాలు ఆశలు రేపుతున్నాయి.

సరే! ఇక మన కథ విషయానికి వద్దాము.

The Admiral – Roaring Currents

The film recorded 10 million admissions only 12 days. Its premiere was a huge success internationally. It then went on to set a record in South Korea for achieving such a high number of viewers in the shortest amount of time. The movie also surpassed Avatar’s record of 13 million viewers (14.1 M after Release of remastered 4K version) to become the most-watched and highest-grossing film of all time in South Korea with 17.6 million admissions. A worldwide gross of US$138.3 million. In Korea itself $122 M collected.

బాహుబలి విడుదలైనప్పుడు భవదీయుడు గీతాచార్య (ఉస్తాద్ గీతాచార్య అని పెడదామంటే పవన్ కళ్యాణ్ తరహాలో fans లేరు. పైగా చెప్పుచ్చుకు కొడతారు. కనుక భవదీయుడు చాలు. డైరక్ట్ చేసేందుకు మనకు హరీశ్ శంకర్ ను భరించేంత బజట్ కూడా లేదు)

ఈ సినిమాతో బాహుబలిని పోలుస్తూ రాసిన వాక్యాలు.

<<<Meanwhile in Korea, they measure the success of the film in terms of number of tickets.

The Admiral-Roaring currents

A Korean film starring Choi Min-sik was watched by 1.6 crores. That means 1.6 crore tickets. Korean population is 5.5 crores. That means 40 percent of the population watched the film. On a budget of 120 crores, that single part film collected 600 crores. (బాహుబలి: The Beginning తో పోల్చదగినా నంబర్‌లే ఇవి).

2 out of 5 Koreans watched the film.

Now tell me about Baahubali.

A technical marvel, with 10 crore potential audience, are there at least 1 crore people who watched it?>>>

ఇవన్నీ అప్పటి లెక్కలు. ఇప్పటి లెక్కలు కూడా తేలుద్దాం. తరువాత. ఈ రోజు pan-India సినిమా కనుక అంత గొప్ప బాహుబలిని నూటికి ఒక్కరైనా చూసి ఉంటారా? Unique audience!! లేదు.

కానీ ఈరోజున 90% ఊహ తెలిసిన ప్రతి కొరియన్ కనీసం ఒక్కసారైనా The Admiral Roaring Currents ను చూసి ఉంటారు. అంత సన్నివేశం మన సినిమాలకు ఈ రోజున ఉన్నదా? లేకపోతే లోపం ఎక్కడ ఉంది?

మరి ఇంత పెద్ద హిట్ అయి కొరియన్ల నేషనలిజాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమాలో హీరోగా చేయాలంటే అంతే ఉన్నతమైన స్టేచర్ కలిగిన నటుడు కావాలి. చోయ్ మిన్-సిక్ తప్ప అలాంటి నటుడు దొరకడు. అందుకే మన Oldboy చోయ్ మిన్-సిక్ ఈ సినిమాలో కథానాయకుడిగా వేశాడు.

ఇంతకీ ఈ సినిమా కథ ఏంటి? నేపథ్యం ఏమిటి?

16వ శతాబ్దంలో, జనరల్ టొయోటోమి హిడెయోషి సుదీర్ఘమైన అంతర్యుద్ధం తరువాత జపాన్ దేశాన్ని ఏకఛత్రం కిందకు తెచ్చాడు. ఆ తరువాత సహజంగానే ఇంట గెలిచాక రచ్చ గెలవాలన్న ఆలోచన మొదలై కొరియాను ఆక్రమించాలనే కాంక్ష పుట్టింది. అప్పుటి రోజుల్లో చాలా మంది కొరియన్లు జపాన్ వారి దేశం మీద దాడి చేసే అవకాశం గురించి ఆలోచించలేదు. అందుకే ఆదమరచి ఉన్నారు జపాన్ విషయంలో. యుద్ధానికి సంసిద్ధత కూడా లేదు. అసలా యుద్ధం అనే మాటనే విస్మరించారు.

ఒక్క ఎడ్మిరల్ యి సున్-సిన్ మినహా!

సైన్యం కానీ, నౌకా దళం కానీ జపాన్ నుండి ఎటువంటి దండయాత్రను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేవు. అడ్మిరల్ యి సున్-సిన్ (Yi Sun-sin) మాత్రమే నౌకలను నిర్మించడం, కొత్త తరపు ఆయుధాలను అభివృద్ధి చేయడం ద్వారా జపాన్పై యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దేశాల మధ్య యుద్ధమంటే ఒక్కడి వల్ల అయ్యే పని కాదు కదా.

అందుకే 1592లో జపాన్ కొరియాపై దండెత్తినప్పుడు ఇమ్జిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, అంతర్యుద్ధం ఫలితంగా బాగా రాటుదేలి ఉన్న జాపనీస్ సైన్యం, కొరియా సైన్యాన్ని సులభంగా ఓడించి, ఉత్తరం వైపు వేగంగా ముందుకు సాగుతోంది. అయితే, సముద్రంలో, అడ్మిరల్ యి సన్ సిన్ యొక్క జోస్యున్ నావికా దళం జాపనీస్ నావికాదళాలను పలు చిన్న చిన్న వరుస యుద్ధాల్లో నాశనం చేసింది.

ఇది కొరియన్ ద్వీపకల్పం గుండా జపనీయుల పురోగతికి అడ్డుకట్ట వేసింది. సైనిక బలగాలను, ఇతరత్రా నిత్యావసరాలను (నిత్యా మీనన్ కు ఏమాత్రం సంబంధం లేదని మనవి) తిరిగి సరఫరా చేయడానికి అవసరమైన సముద్ర మార్గాలను కత్తిరించింది.

పక్కలో బల్లెం (కాంతారావు సినిమా కాదు) లాగా తయారై సముద్ర మార్గంలో తేరుకోనీయకుండా చేస్తున్న సున్-సిన్ ను ఎలా అడ్డుకోవాలి అని జాపనీయుల అనేక ప్రయత్నాలు చేశారు. అన్నీ వృథా అయ్యాయి.

అయితే, 1597లో, జపనీస్ గూఢచర్య పన్నాగం, అదే సమయంలో కొందరు అసూయాపరులైన కొరియన్ సభాసదుల మంత్రాంగాలు, కొరియన్ రాజు న్యాయస్థానంలో జరిగిన రాజకీయ కుట్ర కారణంగా, అడ్మిరల్ యి సున్ సిన్ కొరియా ప్రభుత్వంచే ఖైదు చేయబడ్డాడు.

అతని స్థానంలో అసమర్థుడైన వన్-గ్యున్ కొరియా నావికాదళానికి నాయకత్వం వహించడానికి నియమించబడ్డాడు. అడ్మిరల్ వన్-గ్యున్, తన మొదటి మరియు చివరి నౌకాదళ యుద్ధంలో, జపనీస్ మీద దాడికి పోయి ఘోర ఓటమి పాలయ్యాడు. అంతే కాకుండా 200 పైగా మేలు రకపు అత్యాధునిక నౌకలను సముద్రం పాలు చేశాడు. పనిలో పనిగా ప్రాణాలను కూడా కోల్పోయాడు.

ఆ ఓటమి తరువాత, కొరియా ప్రభుత్వం ఎడ్మిరల్ యి సున్-సిన్ ను విడుదల చేసి, అతన్ని తిరిగి అడ్మిరల్ స్థానంలో ఉంచింది, అయితే వన్-గ్యున్ చర్య కారణంగా నౌకాదళంలో కేవలం 12 యుద్ధనౌకలు మాత్రమే ఉన్నాయి. దీనివల్ల కొరియా ప్రభుత్వం అడ్మిరల్ యి కి సముద్ర యుద్ధాన్ని వదిలి ఏదైనా భూ-ఆధారిత యుద్ధంలో చేరాలని సూచించింది.

అయినప్పటికీ, జపాన్ నౌకాదళం సముద్రం గుండా ముందుకు రాకుండా నిరోధిస్తేనే తప్ప కొరియన్ల విజయం గురించి కూడా ఆలోచించటం నష్టదాయకం అని యి నమ్మాడు. Numbers don’t always tell the whole story అని బలంగా నమ్మిన యి భయాన్ని దరిచేరనీయలేదు. అక్టోబర్ 1597లో, 330 నౌకలతో కూడిన జాపనీస్ నౌకాదళం 12 నౌకలతో కూడిన చిన్న కొరియా నౌకాదళంపై దాడి చేయడానికి ప్రయత్నించింది.

జాపనీయులు కొరియన్ నౌకాదళం వైపు వెళ్ళినప్పుడు, అడ్మిరల్ యి జాపనీస్ నౌకాదళాన్ని వేగవంతమైన, బలమైన ప్రవాహంతో ఉండే పొడవైన, ఇరుకైన జలసంధి వైపు నడిచేలా వల పన్నాడు. అతను ఉక్కు గొలుసులతో జలసంధిని అడ్డుకోవడం ద్వారా జపనీస్ నౌకాదళ కదలికలను అడ్డుకున్నాడు. అందువల్ల, అనేక జాపనీయుల నౌకలు ఇరుకైన జలసంధిలో చిక్కుకుపోయాయి.

జలసంధి వెలుపల కాచుకు కూర్చున్న కొరియా యుద్ధనౌకలపై ఉన్న ఫిరంగులు జపాన్ నౌకలపై బాంబు దాడులు చేశాయి. జాపనీస్ నౌకాదళం, 31 కంటే ఎక్కువ యుద్ధనౌకలను కోల్పోయిన తర్వాత కానీ తాము యి సున్-సిన్ ఉచ్చులో చిక్కుకున్నామని గ్రహించలేదు. తూర్పు వైపుకు తూర్పు వైపు తిరోగమించాలన్న సోయి కూడా రాలేదు. అంత దెబ్బ కొట్టాడు యి. మిగిలిన నౌకలను కూడా త్వరగానే చప్పరించేశాడు. ఆ తరువాత భూమి మీద జరిగిన యుద్ధంలో యి సున్-సిన్ ఇచ్చిన ప్రేరణతో కొరియన్లు  జాపనీయులను తోక ముడిచేలా చేశారు.

దీన్నంతటినీ సినిమాలో ఎలా చూపించారు?

హేనామ్ వద్ద యుద్ధం ప్రారంభమైనప్పుడు, టోడో టకటోరా ఆధ్వర్యంలోని జాపనీస్ ఇంపీరియల్ సైన్యం కింగ్ సియోంజోను పట్టుకోవడానికి హాన్సాంగ్ మీదకు తమ ప్రణాళికాబద్ధమైన దాడి విజయవంతం అవుతుందని నమ్మకంగా ఉన్నారు. కారణం అప్పటికి కుట్రల వల్ల యి సున్-సిన్ జైలులో ఉన్నాడు.

ఏది ఏమైనప్పటికీ, చిల్చోల్యాంగ్ (Chilchollyeong) వద్ద బడసిన నష్టాల తరువాత జోస్యూన్ ల గొప్ప అడ్మిరల్ యి సున్-సిన్ తన మునుపటి హోదాకు పునరుద్ధరించబడ్డాడు. కానీ అంతకు ముందు వన్-గ్యున్ చేసిన పిచ్చి పని (Chilchollyeong) వల్ల కొరియన్ నౌకాదళంలో కేవలం డజను turtle ships మాత్రమే యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి.

ఈ పన్నెండు నౌకలను ఎలా వాడి జాపనీయుల పని పట్టాడు అన్నది దర్శకుడు అత్యంత ప్రభావవంతంగా చూపాడు.

Kim Han-min ఈ తరం కొరియన్ దర్శకులలో grandstand filmmaking కి ప్రసిద్ధుడు. ఇప్పటి వరకూ కొరియన్ సినిమా చరిత్రలో అతి పెద్ద కమర్షియల్ హిట్ అయిన The Admiral: Roaring Currents కి ముందు, తరువాత ఎన్నదగిన సినిమాలే తీశాడు. వాటి గురించి తరువాత చూద్దాం. కొరియాలో గొప్ప సైన్యాధ్యక్షులలో ఒకడైన Yi Sun-sin సాధించిన అతి గొప్ప నౌకా యుద్ధ విజయం గురించి తీసిన ఈ సినిమాలో యుద్ధం మీద పెట్టిన శ్రద్ధ ఆ సైన్యాధ్యక్షుడి ఆలోచనలు ఎలా సాగాయి అనేదాని మీద పెట్టలేదని నా కొరియన్ మిత్రుడి ఫిర్యాదు.

సరే!

ఇంతకీ మీకు డోన్ట్ స్టాప్ డాన్సింగ్ పూనకాలు లోడింగ్ పాట ఎలా అనిపించింది?

(సశేషం)

Exit mobile version