Site icon Sanchika

కొరియానం – A Journey Through Korean Cinema-49

Ephemeral Moonshine On The Shadows of the Past

Chapter 44

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి.

హఠాత్తుగా కళ్ళ ముందో దృశ్యం. ఏదో తెలియని జ్ఞాపకం. అంతు చిక్కని వేదనో అర్థం కాని ఆనందమో మనల్ని వేధిస్తుంది.

ఏదైనా పోగొట్టుకున్నదో.. లేదా దూరమైనదో కళ్ళముందాడుతుంది. అందుకోవాలని చూస్తాం. అందదు. కొంతసేపు టీజింగ్ నడుస్తుంది. మనసుకైన గాయపు మచ్చల మీద తాండవమాడి మరొక్కసారి రేపటమో, లేదా హృదయాంతరాళాలలో ఉన్న తీపి జ్ఞాపకాలను మరొక్కమారు గురుతుకు రప్పించటమో జరుగుతుంది.

ఇంతలో మెలకువ వస్తుంది.

ఆదాముకు లాగా.

ఆ వచ్చిన కల మధురమైనదా? చేదైనదా అన్న విషయం కూడా గుర్తులేదు. తనకు తెలియకుండానే పక్కకు తిరిగి ఎడమ చేత్తో తడిమి చూశాడు. అవ్వ అక్కడ లేదు. తన కోసం పది నిముషాలు పైన వేచి చూశాడు. జాడ లేదు.

లేచాడు. కొన్ని వందల అడుగులు తన హృదయపు మడుగు మీద వేల ప్రశ్నలు వస్తుండగా అలా దూరంగా అవ్వ కూర్చొని ఉంది. అప్పటికి కయీను దూరమై ఏడేళ్ళంది. అంటే Abel అతని చేతిలో విగత జీవుడై కూడా అంతే సమయం.

మధ్యలో దేవుడు కనబడలేదు. పామూ రాలేదు.

నిర్వేదం.

తెలియని తపన. మరణం. ఒకరి మరణం ఇంత బాధ పెడుతుందా? ఎందుకు? కొడుకు కాబట్టే ఆ?

“డాళింగ్,” ఆదాము కేక వినబడింది. జీవితపు తొలినాళ్ళలో అతని పిలుపులో ఉన్నంత తీయందనమూ ఉందీసారి కూడా. ఇప్పుడు చరమాంకానికి చేరుతున్న దశ (అది మనకు తెలుస్తుంటుంది కానీ, ఆదాము అవ్వలకు తెలియదు). అవ్వ తల తిప్పి చూసింది. ఆ తిప్పటంలో అప్పటి సొగసింకా పోలేదు అని ఆదాము అనుకున్నాడు.

కానీ ఏదో తేడా.

అవ్వ కంట కన్నీరు. తన కోసమైతే కాదు. పిల్లల గురించి. వెళ్ళి పక్కన కూర్చున్నాడు. ఆ రాతి మీద. రాతిరి ముగియ లేదు. దేవుడు బిగించిన చంద్రుడు నిండు శరీరంతో వెలుగుతున్నాడు. ఆ వెలుతురుకు కారణం సూర్యుడని తెలియదిద్దరికీ. కానీ వారి వేదనకు కాస్త సాంత్వన అయితే అందించగలుగుతున్నాడు.

మనోహరమైన దృశ్యం (Jeethu Joseph ది కాదు). ఇంతలో అవ్వకు మరో జీవి జ్ఞప్తికి వచ్చింది.

పాము. ఆ పాము కనబడటంలేదు. ఏమై ఉంటుంది?

అది సాతానని వీరికి తెలుసు అన్న విషయం మనకు తెలియదు అన్న విషయం భవదీయుడికి తెలియదు. అర్థం కాలేదా? కలంటే అంతేగా?

దేని అంతు? ఆనందపు అంతా? విషాదపు అంతా?

అంతా! అన్నిటి అంతు.

అంతే!

***

కొరియన్ దర్శకులలో Kim Ki-duk ది విభిన్నమైన శైలి. మన భారతీయ దర్శకులతో పోల్చి సామాన్య సినిమా అభిమానులకు అర్థమయ్యేలా చెప్పాలంటే తమిళ దర్శకులలో బాలా ఎలాంటి వాడో, కిమ్ కి-డుక్ అలాంటి వాడు. He always strays away from the path and creates a trekking route for the audience. The trek is horrible to begin with. Tough to follow. Painful to complete. But the final view is either disgustingly beautiful or beautifully disgusting. So much worth of our trek.

Aesthetisation of Violence ని క్వెన్టిన్ టారంటినో సినిమాలు promote చేస్తున్నాయని ఉన్న విమర్శ లాగానే కిమ్ కి-డుక్ సినిమాల గురించి కూడా కొరియాలో చాలా విమర్శలున్నాయి. అంతంత వైలెన్స్‌తో ఉన్న సినిమాలను చులాగ్గా చూసే, తీసే కొరియన్లు కూడా కిమ్ కి-డుక్ సినిమాలను వైలెంట్ సినిమాలు అని ముద్ర కొట్టి పడేశారు.

కానీ, ఆ వైలెంట్ ఇమేజరీ వెనుక ఉన్న ఆర్ద్రతను గుర్తించరు. అతని సినిమాల కల్ట్ followers కూడా. వారి ఆలోచనలు కూడా celebration of violence దగ్గరే ఆగిపోయిందని వాపోయాడు కిమ్ కొన్నిసార్లు.

అందుకే… more than any other Korean filmmaker, the films and reputation of Kim Ki-duk have been characterized by a sense of disconnect. Kim himself disavows any commonalities with other Korean filmmakers of his generation such as Hong Sang-soo or Lee Chang-dong, due to his lower-class upbringing and lack of formal training in film. సరిగ్గా అలాంటి marginalised people మీదనే, ఎవరికీ పట్టని జీవితాలు మీదే అతని కథలు ఉంటాయి.

***

అవ్వా, ఆదామూ ఆ రోజు కలిసి అడవిలోకి వెళ్ళారు. ఆ పాము గురించి ఆరా తీశారు. ఎవరూ ఆ పామును చూడలేదని చెప్పారు. ఇలా నాలుగు రోజులు జరిగే సరికి అసలు నిజంగా ఆ పాము ఉందా? అన్న అనుమానం అవ్వకు వచ్చింది. ఆ పాము నిజంగానే తనకు Apple ఇచ్చిందా? లేక తనకే ఆ ఆలోచన కలిగి దారిన కనిపించిన పాము మీదకు నెట్టేసిందా అని ఆలోచించటం మొదలు పెడుతోంది.

కానీ అవ్వకు తెలియని రహస్యం. మీకు చెప్పనా? ఆ పాము..

***

ఈడెన్ పాముకు ఎలా మూడెన్?

కొరియాలో ఒకానొక చోట ఒక మానెస్టరీ ఉంది. అందులో ఒక గురువు, ఒక శిష్యుడు ఉన్నారు. ఆ మానెస్టరీ ఒక దట్టమైన అరణ్యంలో ఉన్న ఒక పెద్ద సరస్సులో తేలుతూ ఉంది. చుట్టూరా అందమైన కొండలు. ఒక డ్రీమ్ landscape.

వారక్కడ ప్రశాంత జీవనం సాగిస్తుంటారు. ప్రతి రోజూ ఒక చిన్న పడవ మీద ఒడ్డుకు చేరుకుని కావలసినవి తెచ్చుకునే వారు. అక్కడే ఏవన్నా వన మూలికలు దొరుకుతాయా అని చూసేవారు.

ఒక శుభ ముహుర్తాన ఆ గురువు తన శిష్యుడు చెరువులో చేపకు రాయి కట్టి వినోదించటం గమనిస్తాడు. కొన్నాళ్ళకు ఒక కప్ప కాలికి కూడా రాయి కట్టి ఉంటం చూసి, తన శిష్యుడికి ఎలా తెలియజెప్పాలా అని ఆలోచిస్తాడు. కర్మ ఫలం అనుభవించాల్సిందే అని నిశ్చయిస్తాడు. కానీ మనసొప్పక మారతాడేమో అని వేచిచూస్తాడు.

***

అదే టైమ్‌లో దేశ బహిష్కృతుడైన కయీను అటుగా వెళ్తుంటాడు. అక్కడ ఒక పాము యమ యాతన అనుభవించటం చూస్తాడు. అది కయీనును పిలుస్తుంది. వచ్చి తనకు సహాయం చేయమని అడుగుతుందా పాము (ఇది అబద్ధం సినిమా వరకు. కానీ కొరియానంలో నిజం). అందుకు ప్రతిఫలంగా అతనికి అద్భుతమైన ఏపిల్ ఇస్తానని మాట ఇస్తుంది. యాపిల్ కథ తెలిసిన కయీను దూరం తొలగి వెళ్ళిపోతాడు.

ఆ రాత్రి గురువు శిష్యుడి కాలుకు పెద్ద రాయి కడతాడు. పొద్దున్నే చూసుకుని బాధపడుతున్న (physical pain) శిష్యుడితో తను హింసించిన జీవులను విడదల చేయమని, లేకపోతే ఆ జీవుల వేదనలన్నీ అతనికి జీవితాంతం జ్ఞాపకాల రూపంలో వేటాడతాయని చెప్తాడు.

కాలికున్న భారాన్ని అలాగే భరిస్తూ శిష్యుడు కొండ మీదకు వెళతాడు. అప్పటికే చేప మరణించి ఉంటుంది. కప్ప చావుబతుకుల మధ్యన ఉంటుంది. రక్తపు మడుగులో.

అన్నిటికంటే ఘోర పరిస్థితిలో పాము ఉంటుంది.

దానిపక్కనో బంగారు apple (ఇది కూడా సినిమాలో అబద్ధం కొరియానంలో నిజం) పడి ఉంటుంది. రక్తం కాల్వలలాగా కారుతుంటుంది. ఇతర జంతువేదో మొదలే కదలలేని పామును మరింత హింసించిన ఆనవాలు ఉంటుంది.

ఆ పామును చూసి శిష్యుడి దుఃఖం కట్టలు తెంచుకుంటుంది. ప్రాణం ఉండీ వేదనతో కదలలేని స్థితిలో దాని రోదన అతని మస్తిష్కంలో ముద్రించుకు పోతుంది.

This is all in contrast to the beautiful Spring atmosphere around the monastery.

ఈ గురు శిష్యుల కథ Spring, Summer, Fall, Winter.. and Spring అనే కిమ్ కి-డుక్ సినిమాలోది.

ఎన్నో వసంతాలు గడుస్తాయి. కానీ ఆ పాము దృశ్యాన్ని ఆ శిష్యుడు మర్చిపోలేడు. అచ్చు తమ్ముడిని చంపిన కయీను పడే వేదనలా.

(సశేషం)

Exit mobile version