కొరియానం – A Journey Through Korean Cinema-5

0
2

Chapter 3

[dropcap]ఇ[/dropcap]ప్పుడొకసారి Oldboy సినిమా మొత్తం కథ చూద్దాం. స్పాయిలర్లు ఉన్నాయి. కనుక చదువుతారో లేదో మీ ఇష్టం. సినిమా చూడకపోతే, దీని గురించి వినకపోతే (ఏ కొండ కింద గుహలో దాక్కున్నారో చెప్తే నేను కూడా అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకుంటా. ఈ కాంక్రీట్ జంకిల్ కనక్టెడ్ జీవితం నుంచి విరామం కొరకు) ఇది చదివి సినిమా చూసినా మీకు ఆ థ్రిల్ మిస్ కాదు. నాదీ హామీ. దర్శకుడిచ్చిన దృశ్యీకరణ అంత బలంగా ఉంటుంది. లేదూ అనుకుంటే ఈ కొన్ని పేరాలు సినిమా చూసేదాకా స్కిప్ చేయండి.

Oldboy As It Is (Purport by Yours Truly)

ఓ డే-సు మన మెట్ల సుబ్బారావు లాంటి సాధారణ సక్సెస్ఫుల్ మిడిలేజ్డ్ మిడిల్ క్లాస్ మనిషి. అందరిలాగానే పెళ్ళి చేసుకుని కూతురిని కంటాడు. కథా కాలం 1988-2003 కనుక అప్పట్లో మగ పిలకాయలకు పెళ్ళి పెద్ద సమస్య కాదు కనుక పొట్టి, పొట్ట, బట్ట లేకపోయినా పెళ్ళి అవుతుంది. అదేమీ అన్నాచురల్ కూడా కాదు. అందరు మెట్ల సుబ్బారావుల్లాగానే ఓ డే-సు కు కూడా అశక్త దుర్జనత్వం ఎక్కువ. అవకాశం ఉంటే వంకర చూపులు (Hi Sam!), లేకపోతే సతివ్రతాయ్య తండ్రి కబుర్లు. సినిమాలో మనకు హింట్ ఇచ్చిన ప్రకారం మాంఛి గ్రంధసాంగుడు (గ్రంధ్ సాంగ్-డు కొరియన్ పేరులా లేదూ?). దీని వల్ల భార్యతో friction. చెట్టుకు చీరె కట్టినా చొంగలా కార్చే మనస్తత్వం ఉన్నా, కూతురంటే అమితమైన ప్రేమ. మన సినిమా కథ మొదలైన రోజు ఆ పిల్ల పుట్టినరోజు.

ఆఫీస్ నుంచీ బైటకు వచ్చి, పూటుగా తాగి, కూతురు కు ఒక Winged Angel కాస్ట్యూమ్ బొమ్మ కొంటాడు (గుర్తు పెట్టుకోండి). తాగి చేసిన గలభాకి పోలీసులు అరస్టు చేస్తే స్నేహితుడు విడిపించుకుని వెళ్తాడు. దారిలో ఫోన్ బూత్ దగ్గర కూతురుకు కాసేపటిలో ఇంటికి వస్తున్నానని, తనకు మంచి బహుమతి తెస్తున్నానని చెప్తాడు. ఇంతలో, అవతల భార్య రిసీవర్ అందుకోవటంతో పక్కింటి అన్నయ్యగారి లాంటి తన ఫ్రెండ్‌ను మాట్లాడమని తను బైట వానలో నించుంటాడు. చూస్తుండగానే ఓ డే-సు మాయమౌతాడు. స్నేహితుడు బైటకు వచ్చి ఆతుర్దాగా వెతుకుతున్నప్పుడు కెమేరా ఒక్క క్షణం ఒక పసుపు పచ్చ గొడుగు, అది వాడుతున్న మనిషి మీద contemplative shot అన్నట్లు మనకు సజషన్ ఇచ్చి వదులుతుంది. Detailing detailing!!!

ఓ డే-సు జైలులో. మొదట డిప్రషన్లో నాలుగు స్టేజులూ అనుభవించి, చివరకు తనను ఇలా బంధించాలనే కోరిక ఎవరికి ఉండవచ్చో ఒక పుస్తకంలో పేర్లు రాస్తాడు. ఆ లిస్టు అనంతం. మెట్ల సుబ్బారావుల గురించి… “అయ్యో మా వాడికి శతృవులెవరూ ఉండరండీ” అని చెప్పే స్టాక్ డైలాగ్ బైటకు వచ్చి చూస్తే ఏదో క్షణంలో ఎవరోకరిని అఫెండ్ చేయని వారుండరు. ఒకసారి unpublished “Book of Blood” లో డైలాగ్ గుర్తు తెచ్చుకోండి. క్రమంగా కాంప్రమైజ్ అయ్యి, తనను తాను ట్రయిన్ చేసుకుంటాడు. ఒకవేళ బైటకు రావటమంటూ జరిగితే తనను బంధించిన వ్యక్తి మీద ప్రతీకారం తీర్చుకునేందుకు. గోడను ఎన్నిసార్లు bare knuckles తో గుద్దుతాడో అంతే ఉండదు. ఎన్ని లీటర్ల రక్తం కారుతుందో లెక్క తేలదు. చేతులు గట్టిపడతాయి. మనిషి రాటుదేలతాడు.

బైట ప్రపంచంతో ఉన్న ఒకే ఒక కాంటాక్ట్… రూమ్‌లో ఉన్న టీవీ. దానిలో వచ్చే వార్తల ద్వారా తన భార్య హత్యకు గురైందని, తన కూతురిని వేరెవరో దత్తత తీసుకున్నారని, భార్య హత్య కేసులో తననే అనుమానిస్తున్నారని తెలుస్తుంది. సో, బైటకు వచ్చినా నిలువ నీడ ఉండదు. He’s completely cornered. He’s now a cornered cat.

ఎలా వచ్చాడో అలాగే బైటకు పంపేయబడతాడు 15 సంవత్సరాలు గడిచాక. He becomes more like an animal and lost the sense of basic human courtesy and lacks the ability to interact with people on a normal scale. ఒక రెస్టరెంట్ లోకి వెళ్ళబోతుండగా ఒక ఎలక మొహం వ్యక్తి వచ్చి చేతిలో కొంత క్యాష్, ఒక సెల్ ఫోన్ పెడతాడు. He’s still on observation. The villain or the antagonist, to be precise, is all pervading and knows every little movement of Oh Dae-su. In fact, we will learn he orchestrated each and every move of Oh Dae-su. అక్కడ సుషి అనే జాపనీస్ వంటకం చాలా ఫేమస్. తన కసి అంతా nervous energy రూపంలో తీర్చుకునేందుకు I want to eat something alive అంటాడు షెఫ్ పిల్లతో. అతనికి బతికున్న ఆక్టోపస్ ఇస్తుంది (గుర్తు పెట్టుకోండి).

ఇంతలో ఫోన్ మోగుతుంది. తనని కిడ్నాప్ చేసిన వ్యక్తి పలకరిస్తాడు. తను ఎవరో కనుక్కోమని చాలెంజ్ విసురుతాడు. ఇంతలో ఆ Live Octopus ను పీక్కుతింటాడు. Because of all this ordeal he loses his control and passes off. ఆ షెఫ్ పిల్ల పేరు మిడు (Mi-do). అతని మీద సానుభూతితో తన ఇంటికి తీసుకు వెళ్తుంది. 1980ల అచ్చ తెలుగు సినిమాల్లో హీరోయిన్ లాగా (గుర్తు పెట్టుకోండి).

అక్కడ తన కథ చెప్తాడు. ఆమె తన ఒంటరి జీవితం, తన భయాలను చెప్తుంది. వాళ్ళ మధ్య క్రమంగా ఒక బంధం ఏర్పడుతుంది. మొదట వైలెంట్‌గా. మిడు కు చీమలంటే భయం. తనను బంధించినప్పుడు ఒకానొక సందర్భంలో చీమలు తన ఒంటి మీద పాకినట్లు భ్రమ పడిన సందర్భం గుర్తు చేసుకుంటాడు (గుర్తు పెట్టుకోండి).

తనను బంధించినపుడు తనకు ఇచ్చిన ఆహారం ఒకే రెస్టరెంట్ నుంచీ తెచ్చి ఉంటారనే assumption తో వెతుకులాట మొదలు పెట్టి, దాన్ని కనుక్కుంటాడు మిడు సహాయంతో. అక్కడి డెలివరీ బాయ్ ను ఫాలో అయ్యి ఆ జైలును కనిపెడతాడు. చాలా కూల్‌గా ఒక్కొక్క పన్నూ ఊడబెరుకుతూ ఆ జైలర్ దగ్గర Information రాబట్టే ప్రయత్నం చేస్తాడు. ఆ వార్డెన్ పేరు పార్క్ (పేరు గుర్తు పెట్టుకోండి). అతను ఆ టార్చర్ భరిస్తూ చెప్పేది ఓ డే-సు బంధింపబడింది అతని అతి వాగుడు వల్ల అని. ఇంతలో ఆ ప్రైవేట్ ప్రిజన్ గార్డ్ లు ఓ డే-సు మీద ఎటాక్ చేస్తారు. పాతికమంది. After the iconic 25:1 action sequence… వెన్నులో దిగిన కత్తి, మరో రెండు బలమైన గాయాలు, లెక్కలేనన్ని దెబ్బల తరువాత ఓ డే-సు ఒక అలసిన యోధుడిలా బైటపడతాడు. బైటకొచ్చాక తన పరిస్థితి తల్చుకుని నవ్వుతాడు. మన ప్రతినాయకుడే చచ్చేలా ఉన్న కథానాయకుడిని రక్షించి ఇంటికి పంపుతాడు.

కొన్నాళ్ళకు మిడు మీద మిస్టర్ పార్క్ దాడి చేస్తాడు. ఓ డే-సు అతన్ని ఎదుర్కొనబోతే Lee Woo-jin వస్తాడు. అతనే అసలు ఓ డే-సు ను బంధించిన వ్యక్తి. తనను తాను పరిచయం చేసుకుని, ఐదు రోజుల్లో తను అతన్ని ఎందుకు బంధించాడో కనుక్కోకపోతే అతను ప్రేమించిన ప్రతి స్త్రీని చంపేస్తానని హెచ్చరిస్తాడు (గుర్తు పెట్టుకోండి). ఒకవేళ ఓ డే-సు కనుక వివరాలను కనుక్కోగలిగితే తనను తానే చంపుకుంటానని చెప్తాడు. ఓ డే-సు మిడు క్షేమం కోసం ఆమెను జాగ్రత్త పరచి, తన స్నేహితుడు Joo-hwan (పూర్వాశ్రమంలో పక్కింటి అన్నయ్య గారు, ప్రస్తుతం Internet cafe owner) సహాయంతో తన అన్వేషణ కొనసాగిస్తాడు. ఒక breakthrough వచ్చి, ఓ డే-సు కు సమాచారం ఇద్దామని అనుకున్నప్పుడు Joo-hwan ను Lee Woo-jin చంపేస్తాడు. మీరు చేసే ప్రతి పనీ నాకు తెలుసు. మీ ప్రతి అడుగూ నా కనుసన్నలలోనే ఉంటుంది అని వక్కాణిస్తాడు.

ఇంతలో ఓ డే-సుకు Lee Woo-jin (ఈ వు-జిన్ అని చదవాలి) తను చదివిన స్కూల్ మేట్ అని తెలుస్తుంది. వెతుక్కుంటూ స్కూల్ కు వెళతాడు. 35 ఏళ్ళ క్రితం సంగతి. అక్కడ అందరు మెట్ల సుబ్బారావుల లాగానే ఓ డే-సు తన టీనేజ్ ను రకరకాలుగా ఎన్జాయ్ చేస్తాడు. అవకాశమున్న చోట బలహీనులతో ఆడుకుంటాడు. బలవంతులతో బాన్చెన్ అంటూ కాంప్రమైజ్ అవుతాడు. అక్కడ ఒకానొక రోజు వు-జిన్, అతని సోదరిని compromised position లో చూసి ఆ incest గురించి Joo-hwan తో కలిసి టాంటాం వేస్తాడు (don’t remember Tom Tom maps). ఆ రూమర్ల వల్ల ఆ పిల్లకు phantom pregnancy వచ్చి ఆత్మహత్య చేసుకుంటుంది. రక్షించబోయి, ఫెయిలైన వు-జిన్ ట్రామా అనుభవిస్తాడు. ఇంతలో తండ్రికి ట్రాన్ఫర్ అయ్యి ఓ డే-సు ఇవేమీ పెద్ద ఐడియా లేకుండా స్కూలు మారుతాడు. ప్రస్తుతం ఈ వివరాలు తెలుసుకుని విజయం సాధించబోతున్నా అనే ఉత్సాహంలో మిడు ను కలుస్తాడు. విజయం సాధించి తిరిగి వస్తానని చెప్తాడు. ఇప్పటి ఓ డే-సు ప్రేమైక మూర్తి (questionably though). వు-జిన్ మీద పగకన్నా మిడు మీద ప్రేమ ఎక్కువైంది. కేవలం తనను రక్షించికునేందుకే వు-జిన్ తో పని.

ఇంతలో మిస్టర్ పార్క్ ఓ డే-సు ను రహస్యం తెలుసుకోకుండా ఆపలేనందుకు చెయ్యి నరికేస్తాడు వు-జిన్. ఆ పగతో పార్క్ ఓ డే-సు తో కలుస్తాడు. అతని ప్రిజన్ లో మిడు ను క్షేమంగా ఉంచి ఓ డే-సు తన మహాప్రస్థానం మొదలు పెడతాడు. ఓ డే-సు విషయం చెప్పగానే వు-జిన్ పెద్ద బాంబు పేలుస్తాడు. పార్క్ ఇప్పటికీ తన మనిషే అనీ, అతనికి బంగారు పళ్ళు కూడా కట్టించానని చెప్తాడు. మిడు ఇప్పుడు నిజానికి తన బందీ అంటాడు. తిరగబడిన ఓ డే-సు ను వు-జిన్ బాడీగార్డ్ హన్ చితకబాత్తాడు. చచ్చీచెడీ అతన్ని neutralise చేసి వు-జిన్ మీదకు దూకుతాడు సింహంలా ఓ డే-సు. ఇప్పుడు అణబాంబు వేస్తాడు వు-జిన్. మిడు ఓ డే-సు కన్న కూతురని తెలియజేస్తాడు. ఈ విషయం ఆ పిల్లకు మిస్టర్ పార్క్ చెప్పకూడదంటే… అని అంటుండగనే సింహంలా లంఘించిన ఓ డే-సు గ్రామసింహంలా అతని కాళ్ళ మీద పడతాడు. తన కూతురుకు అలాంటి ట్రామాటిక్ విషయం చెప్పి ఇప్పటికే ఎన్నో కష్టాలు అనుభవించిన ఆ పిల్ల జీవితం నాశనం చేయవద్దని వేడుకుంటాడు.

ఇదంతా తన grand plan అని, హిప్నాటిక్ సజషన్స్ ద్వారా ఓ డే-సు, మిడులు కలుసుకునేలా, incest relationship డెవలప్ (1980ల తెలుగు సినిమా హీరోయిన్ రిఫరెన్స్ resolved) తనే చేశానని అంటాడు. ఓ డే-సు వు-జిన్ కాళ్ళ మీద పడతాడు. కుక్కలా పాదాలను నాకి తన లాయల్టీని ప్రమాణం చేస్తాడు. ఈ రహస్యం మాత్రమే కాదు, తన నాలుక వల్ల (అతి వాగుడు) ఇక ఎలాంటి తప్పూ జరుగకుండా తన నాలుకను కోసేసుకుని, అతనికి ఇస్తాడు. వు-జిన్ మిస్టర్ పార్క్ ను రహస్యం చెప్పకుండా మిడు ను వదిలేయమని చెప్పి లిఫ్ట్ లోకి వెళ్తాడు. తన పగ తీరటంతో గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. Implicit గా తన సోదరి మరణంలో తన చేయి కూడా ఉండటం గుర్తొచ్చి, తనను శిక్షించుకునేందుకు కణతలో కాల్చుకుని మరణిస్తాడు. నిజానికతని జీవితంలో ఇక ఏమీ మిగలలేదు కూడా. దీనికి ముందు ఓ డే-సు ఒక చిన్న పొరబాటు చేస్తాడు (గుర్తుపెట్టుకోండి).

ఎంతకాలం గడుస్తుందో తెలియదు. ఓ డే-సు వు-జిన్ hire చేసిన hypnotist దగ్గరకే వెళ్ళి మిడు తన కూతురని మర్చిపోయేలా చేయమని వేడుకుంటాడు. “Even though I’m no more than a monster – don’t I, too, have the right to live?” అంటాడు. అక్కడ మనకు పసుపురంగు గొడుగు కనిపిస్తుంది (umbrella reference resolved). కొంత కాలానికి మిడు మంచు మైదానంలో ఉన్న ఓ డే-సును కలుస్తుంది. అతనికి తన ప్రేమను వెల్లడిస్తుంది. ఓ డే-సు సంతోషంగా నవ్వుతాడు. అది దుఃఖం మీదుగా వేదనకు మారుతుండగా ఫేడవుడ్ అవుతారు.

ఎందుకింత కథ చెప్పాను?

Oldboy వివరాలు, విశేషాలు, ఎందుకీ సినిమాకు ఇంత ప్రాధాన్యం? ఎందుకు ఇలాంటి ఘోరమైన కథను, సినిమాను కథను గొప్పగా పొగుడుతున్నారు? తెలియాలంటే కథ తెలియాలి. దాని అంతరార్థం తెలియాలి. ప్రేమ పశువుకన్నా (sorry Amala garu and other animal lovers, వేరే expression దొరక్క) హీనంగా మారిన మనిషిని కూడా కాస్తైనా మనిషిలా మారుస్తుందన్న నిజాన్ని గురించి చెప్పిన సినిమా కనుక.

పార్క్ చాన్-వుక్ అంతరంగం పరిశీలిద్దాం రాబోయే ఎపిసోడ్ లో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here