Site icon Sanchika

కొరియానం – A Journey Through Korean Cinema-50

Jim vs Min

[dropcap]Y[/dropcap]esTe: కొరియన్ సినిమాలో అత్యధిక వసూళ్ళు, అత్యధిక వీక్షకులను (in theatres) సాధించిన సినిమాల గురించి.

YesTe కొత్త పదమేమీ కాదు. 50వ ఎపిసోడ్ కదా.. ఎత్తుకుంటమే నకార ఓకారాలతో మొదలెట్టటమెందుకని, ఇలా. ఫాలో అయిపోండి. కారా? సరే! శంఖంలో పోసినప్పుడే తీర్థమవుతాయి.

ఇడ్లీ తింటున్నా అని అమ్మాయి ఎవరన్నా పోస్ట్ చేస్తే లైకులు కొట్టుకునే వాళ్ళ మీద బాధ్యతాయుతంగా సెటైర్లేసుకుంటూ కూర్చోండి. James Cameron doesn’t care 😀

Chapter 41, Part 3

2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన (అమంగళం ప్రతిహతమగుగాక. టైగర్ ష్రాఫ్ నటించలేదు. కనపడ్డాడంతే. Pinocchio says hi) వార్ రిలీజయ్యే వరకూ ఆ సంవత్సరం ఒక్క హిందీ సినిమా కూడా దేశంలో టాప్ గ్రాసర్లలో నిలువ లేదు.

బాలీవుడ్ ఆధిపత్యానికి బీటలు వేస్తూ, 2015లో బాహుబలి బాలీవుడ్‌లో దూసుకుపోయి టాప్ 3లో నిలిచాక 2017లో బాహుబలి 2 దేశంలోనే అత్యధిక వసూళ్ళు రాబట్టిన సినిమాగా (చరిత్రలో, ఆ సంవత్సరానికి కూడా HGOTY) రికార్డులకెక్కింది.

2018లో కలక్షన్ల విషయంలో బాక్సాఫీస్ సక్సెస్ కేటగిరీ మీద వివాదాలున్నా, శంకర్ దర్శకత్వంలో వచ్చిన 2.0 800 కోట్ల గ్రాస్‌తో (multiply with 0.62 for actual gross అని జోకులు కూడా ఉన్నాయి తమిళ డిస్ట్రిబ్యూటర్ల సర్కిళ్ళలో. ఇప్పుడు ఇదే జోక్ పఠాన్ విషయంలోనూ జరిగింది) ఆ సంవత్సరానికి మన దేశంలో (పెద్దెన్టీఆర్ మొదటి సినిమా కాదు) అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా నిలిచింది. మన దేశం తరఫున కూడా.

కొంత కాలం పాటూ అక్షయ్ కుమార్ కెరియర్‌లో హిందీ వర్షన్ వరకూ అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమా కూడా ఇదే. తరువాత కొన్నాళ్ళకు 2019లో మంగళ్‌యాన్‌తో 200 కోట్ల క్లబ్ లో చేరాడు.

ఇలా దక్షిణాది దెబ్బలు తిన్న హిందీవాలాలకు 2019లో హాలీవుడ్ సినిమా Avengers: Endgame కొరకారాని కొయ్య కింద మారింది. 475 కోట్ల క్రాస్, 383 కోట్ల నెట్ కలక్షన్లతో అటు అత్యధిక వసూళ్ళు సాధించిన హాలీవుడ్ సినిమాగానే కాదు, ఆ సంవత్సరం భారతదేశంలో అత్యధిక కలక్షన్లు సంపాదించి పెట్టిన సినిమాగా కూడా నిలిచింది.

పులి మీద పుట్రలా ప్రభాసొకడు తయారయ్యాడు. Even with 1 star ratings, he with his stardom saved Saaho from becoming an ultimate disaster. మనవైపు పెద్ద ఆడకపోయినా, హిందీలో బ్లాక్బస్టర్ అనిపించుకుని 400 పైన కోట్ల గ్రాస్ సంపాదించి హిందీ బాలీవుడ్ సినిమాలకు చాలెంజ్ విసిరింది. అదే కనుక కనీసం సినిమాకు యావరేజ్ అన్న టాక్ వచ్చి ఉంటే ఎలా ఉండేది అన్న ఊహకే బాలివుడ్ జనాలకు ఒణుకు పుట్టింది.

ఆలాంటి నేపథ్యంలో వార్ ముక్కీ మూలిగీ, అటు ఇండియా నెట్, టోటల్ గ్రాస్ విషయంలో అవెంజర్స్ ను దాటి మమ అనిపించింది.

ఒక దేశంలో విదేశీ సినిమాకు వచ్చిన ఆదరణ స్వదేశీ సినిమాకు రాకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆ సంవత్సరం బాలీవుడ్ విర్రవీగుడు గాళ్ళకు తెలిసి వచ్చింది. ప్రపంచంలో కనీసం 40 దేశాలలో ఆ దేశ చరిత్రలో అత్యధిక కలక్షన్లు సాధించిన సినిమాలు విదేశీవే. చాలా వరకూ హాలీవుడ్‌వే. వీటికి కారణాలనేకం.

అలా కొరియాలో చాలా కాలం వరకూ అంటే దాదాపు 3 సంవత్సరాలు కొరియన్ వేవ్ జనరేషన్ జనాలకు కొరియాలో అతి పెద్ద బాక్సాఫీసు హిట్ అంటే టైటనిక్.

చివరికి దర్శకుడు కాంగ్ జే-గ్యు కల ఫలించి homegrown technology తో home-collected funds తో ప్రభత్వ సబ్సిడీ వాడుకోకుండా తీసిన మెగా బజట్ షిరీ టైటనిక్ రికార్డులు బద్దలు కొట్టింది. కొరియాలో కొరియన్ సినిమాల హవా మొదలైంది.

ఎంత Nationalistic mindset ఉన్నా కూడా, కొరియాలో జేమ్స్ కామరాన్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. దానికి వేరే కారణం కూడా ఉంది.

షిరీ తరువాత కొరియన్ బాక్సాఫీస్ వికసించింది.

వాడని పూలే వికసించెను.. అనుకుంటూ బాహుబలి తరువాత అన్నీ పానిండియా సినిమాలే అన్నట్లు కాక ఎవరెవరి రేంజ్‌లో వారి వారి artistic merits ను సినిమాల రూపంలో explore చేయటంతో తనదైన ముద్ర వేస్తూనే కొరియన్ సినిమా బాగా ఎదిగింది.

షిరీ మీదుగా జాయింట్ సెక్యూరిటీ ఏరియా, తరువాత సిల్మిడో, ఆ పైన టే గుక్-గి, ద హోస్ట్.. ఇలా కొరియన్ సినిమాలే ఒక దాని కలక్షన్ల రికార్డులు ఒకటి బద్దలు కొట్టుకుంటూ (ఆళ్ళాళ్ళ తొడలు ఆళ్ళాళ్ళే కొట్టుకునే తరహా కాదు) కొరియన్ సినిమా అభిమానులను ఆనంద డోలికలలో ముంచెత్తాయి.

కానీ కాలం ఆగదుగా. దాని పని అది చేసుకుంటూనే ఉంటుంది.

జేమ్స్ కామరాన్ మరోసారి దండెత్తాడు. ఈసారి అవతార్ రూపంలో. మన తెలుగూఫ్‌ల మాదిరిగా కొరియన్లు కూడా they recognise merit and give it its due without hesitation. దాంతో అవతార్ కొరియాలో 100 మిలియన్ డాలర్ల మార్క్ అందుకున్న తొలి సినిమాగా నిలిచింది. అలా అని మన తెలుగూఫుల్లా కొరియన్లు వాళ్ళను వాళ్ళే కించపరుచుకుంటూ ఇతరులను పైకెత్తేయరు. As said before, they call a spade a spade. మెరిట్‌ను ఆదరిస్తారు. వాళ్ళకు వీలైతే సాధిస్తారు. అంతే కానీ స్వంత వాళ్ళకు తాటాకులు కట్టి నిప్పెట్టరు. మన మల్లభిమానుల లాగా.

అంతే కాదు అంత వరకూ సాధ్యం కాని 10 మిలియన్ల టికెట్ సేల్స్ కూడా రుచి చూపించింది. ఆ జిమ్ సినిమా (జిమ్ = జేమ్స్ కామరాన్). అక్కడితో ఆగక 15 మిలియన్ల టికెట్లు కూడా తెగేలా చేసి 120 మిలియన్ డాలర్ల దగ్గర పరుగు ముగించింది.

ఈ రికార్డును కొట్టిన మొనగాడింత వరకూ రాలేదు. Literally on to the scene. ఆ కొట్టగలిగిన ఒకడు నాలుగేళ్ళు గ్యాప్ తీసుకు వచ్చి, niche సినిమాలు చేసుకుంటూ తన రిలవెన్సీ కోసం struggle అవుతున్నాడు. Han Suk-kyu. ఇంకొకడున్నాడు. వాడు సన్యాసుల్లో కలిసిపోయి సినిమాలను పూర్తిగా వదిలేశాడు.

ఈ రెండోవాడే మన Oldboy చోయ్ మిన్-సిక్ లేదా మిన్.

జిమ్ vs మిన్

In 2005, మన చోయ్ మిన్-సిక్ కు కెరియర్ పరంగా చాలా గొప్ప సంవత్సరం. కానీ, ఈ outspoken actor కొందరికి కంటగింపుగా మారాడు. He and Song Kang-ho were accused by filmmaker and Cinema Service head Kang Woo-suk of demanding a share of profits for so-called “contributions” when no contributions were made.

ఈ రకంగా చోయ్ integrity మీద దెబ్బకొట్టి వారికి కావలసిన మార్పులు కొరియన్ సినిమాలో తెచ్చుకోవాలని కొన్ని శక్తులు పన్నిన పన్నాగమది. Kang later rescinded the statement and apologized to Choi Min-sik and Song Kang-ho. Song Kang-ho చోయ్‌కి అప్పట్లో మంచి మిత్రుడు. ఈ సంఘటన తరువాత పరస్పరాగీకారంతో చోయ్ మిన్-సిక్, సాంగ్ కాంగ్-హో లు కాస్త ఎడాన్ని పాటిస్తున్నారు.

మన వైపు రజినీకాంత్, కమల్ హాసన్‌లు కలిసి నటించకూడదన్న నియమం లాగా.

దీనికి తోడు స్టీఫెన్ స్పీల్బర్గ్, విల్ స్మిత్‌తో Oldboy remake చేయటం కోసం ఆ సినిమాను అమెరికాలో wide release కాకుండా అడ్డుకున్నారు. This despite the support of Quentin Tarantino for that film.

సినిమా రీమేక్ హక్కుల విషయంలో కూడా passive pressure tactics ఉపయోగించారని చోయ్ మిన్-సిక్ ఒక ఫ్రెంచ్ మీడియా ఇంటర్వ్యూలో నిర్మొహమాటంగా చెప్పాడు. పైగా లోకల్ సినిమాలకు కచ్చితంగా కేటాయించాల్సిన theatrical days కోటాను 147 నుంచి 73 రోజులకు తగ్గించేలా అమెరికన్ స్టూడియోల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గటాన్ని గట్టిగా నిలదీశాడు. ఇలా అయితే ఇప్పుడిప్పుడే పురివిప్పుతున్న కొరియన్ సినిమా రెక్కలు తెగుతున్న పక్షిలా మారుతుందని మండిపడ్డాడు.

As is the case with corporates, several corporations that support local cinema (Korean films) financially pressured makers not to cast the outspoken and controversial actor Choi Min-sik in their films.

<<<At various points during 2006, Choi and other South Korean film industry professionals, together and separate from Choi, demonstrated in Seoul and at the Cannes Film Festival against the South Korean administration’s decision to reduce the Screen Quotas from 147 to 73 days as part of the Free Trade Agreement with the United States – from press records>>>

మహామహులైన సినీ జర్నలిస్టులు, మన పార్క్ చాన్-వుక్ పూర్వాశ్రమపు మిత్రులు రాసిన వివరాల ప్రకారం…

<<<As a sign of protest, Choi returned the prestigious Okgwan Order of Cultural Merit which had been awarded to him, saying, “To halve the screen quota is tantamount to a death sentence for Korean film. This medal, once a symbol of pride, is now nothing more than a sign of disgrace, and it is with a heavy heart that I must return it.”>>>. మన అవార్డు వాపసీ గేంగుల మాదిరి కాకుండా అతను ఈ మెడల్‌తో పాటూ తనకు వచ్చిన monetary benefits అన్నీ వదిలేసాడు. తిరిగి ఇచ్చేసాడు.

<<<Over the next four years, Choi went on a self-imposed exile from making films>>>.

లిటరల్‌గా నడిరోడ్డున పడ్డాడు.

ఇలా నాలుగేళ్ళు గడిచాయి. క్రమంగా చోయ్ తనకు జన్మనిచ్చిన నాటక రంగం వైపు మళ్ళాడు. Tarantino కెలుకుడు, ఆలస్యమవుతున్న హక్కుల పని, కొరియన్ సినిమాకు indirect గా జేమ్స్ కామరాన్ ఇచ్చిన సపోర్టు వల్ల Oldboy రీమేక్ చోయ్ లాంటి వారి అభ్యంతరాలకు తలొగ్గింది. దాదాపు దశాబ్ద కాలం ఆగింది. Spielberg, Will Smith too left the project to show their support to Korean Cinema. దీన్ని పాశ్చాత్య మీడియా వేరేలా రాసుకోవటం మామూలుగానే జరిగిపోయింది.

2007లో The Pillowman కొరియాలో స్టేజ్ చేసినప్పుడు అందులో చోయ్ నటించాడు. The Pillowman is a 2003 play by British-Irish playwright Martin McDonagh.

కానీ చోయ్ లాంటి mightily talented and committed నటులను చిత్ర పరిశ్రమ ఎంతకాలం వదులుకుంటుంది?

From various sources:

<<<During the retrospective on Choi held at the 14th Lyon Asian Film Festival in November 2008, the actor was asked his reaction to the then upcoming remake of Oldboy, and he admitted to the French reporters present that he was upset at Hollywood for using what he described as pressure tactics on Asian and European filmmakers so they could remake foreign movies in the United States.>>>

In 2009..

పారిస్ నగరంలోని ప్రతిష్ఠాత్మక Paris Diderot University లో filmmaking and film studies లో డాక్టరేట్ చేసిన Jeon Soo-il (జ్యూన్ సూ-ఇల్) తన డ్రీమ్ ప్రాజక్ట్ అయిన Himalaya: Where the Wind Dwells (Himalayaeui sonyowa) లో ప్రధాన పాత్రకు చోయ్ ను ఒప్పించి (గు॥ స్వాతి ముత్యం, కమల్ హాసన్, సోమయాజులు) మళ్ళా నటజన జీవన స్రవంతిలోకి పట్టుకొచ్చాడు. మనకు చాలా మేలు చేశాడు. లేకపోతే చోయ్ తన పని తాను చేసుకుంటూనే ఉండేవాడు. ప్రపంచమే ఆ స్థాయి నటుడి పీక్ చూసే భాగ్యాన్ని కోల్పోయేది.

తరువాత సంవత్సరం సీరియల్ కిల్లర్ అభిమానులు మహ గొప్పగా చెప్పుకునే, ఏక్ విలన్ అనే బాలీవుడ్ సినిమాకు స్ఫూర్తి అయిన I Saw The Devil తో మునుపటి వాడి ఏ మాత్రం తగ్గలేదని చాటుతూ హిట్ల మీద హిట్లు వదులుతూ 2014లో మనమింతకుముందు డిస్కస్ చేసిన The Admiral: Roaring Currents సినిమాతో జేమ్స్ కామరాన్ అవతార్‌తో స్థాపించిన రికార్డును కొద్ది తేడాతో అధిగమించాడు.

అప్పట్లో టైటనిక్ రికార్డు బద్దలు కొట్టిన షిరీలో ప్రధాన పాత్ర (antagonist) Choi Min-sik దే. ఇప్పుడు అవతార్ రికార్డులు అధిగమించిన The Admiral లో ప్రధాన పాత్ర (protagonist) మన Oldboy చోయ్ మిన్-సిక్ దే.

కామరాన్ దర్శకుడుగా ఎంత పరిపూర్ణుడో, చోయ్ మిన్-సిక్ నటనలో అంతటి పరిపూర్ణుడు. అసలు నిజానికి ఇద్దరూ పిచ్చ perfectionists. ఇద్దరూ తమ తమ రంగాలలో ఎప్పుడూ నూత్నాన్వేషణలు, ఆవిష్కరణలు చేస్తూనే ఉంటారు. ఇద్దరూ వారి వారి దేశాల బాక్సాఫీసు రికార్డులు బద్దల్ కొట్టిన సినిమాలు చేసిన వారే.

ఇప్పుడు అవతార్ 2 కూడా 100 మిలియన్ల పైన కొరియాలో (ఇంకా పేండమిక్ నుంచీ పూర్తిగా తేరుకోలేదు) సంపాదించింది. 11 మిలియన్ల మంది యునిక్ ఆడియన్స్ ఆ సినిమాను చూశారు.

ఈ రాస్తున్న సమయానికి ప్రపంచవ్యాప్తంగా అవతార్: ద వే ఆఫ్ వాటర్ (Avatar: The Way of Water) 2.075 బిలియన్ల డాలర్లు వసూలు చేసి Top 4 Highest Grossers of the World లో సగర్వంగా చోటు సంపాదించింది.

కుటుంబ విలువల్ని, పెద్దలను గౌరవించటాన్ని, అనుబంధాలను బాగా చూపిన అవతార్ 2, అటు కొరియాలోనూ, ఇటు మన దేశంలోనూ గొప్ప విజయాలను సాధించింది. మన తెలుగూఫులు కనీసం ఈ విషయంలో అయినా తెలివి చూపి అవతార్ 2 ను బాగా ఆదరించారు. తెలుగు నాట అవతార్ 2 వంద కోట్లు సంపాదించింది. దేశవ్యాప్తంగా చూస్తే 480 కోట్ల పైన సంపాదించి Avengers: Endgame రికార్డును అధిగమించింది.

చైనాలో సినిమాకు లభిస్తున్న ఆదరణను, సినిమా చూపిన కుటుంబ విలువలను మెచ్చి తమ దేశపు నూతన సంవత్సర సీజన్‌లో వచ్చే సినిమాలతో పాటూ అవతార్ కూడా మరో నెల పాటూ ఆడేందుకు వీలుగా పర్మిట్లు ఇచ్చింది. కొరియాలో కనీసం తక్కువ థియేటర్లలో అయినా మరో నెల తక్కువ కాకుండా ఆడుతుంది. ఫ్రాన్సులో 130 మిలియన్ డాలర్ల వసూళ్ళు సాధించి ఇంకా నడుస్తోంది. అమెరికాలో వరుసగా 7 వీకెండ్లు తొలిస్థానంలో నిలిచి ఈ శతాబ్దంలో లాంగ్ రన్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అది కూడా తన చుట్టూ విడుదలైన నాలుగైదు సినిమాలు హిట్ అయినా కూడా.

ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా కూడా నామినేషన్ పొందింది కనుక అక్కడ కనీసం 700 మిలియన్ల మార్కు దాటుతుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాలలో తొలి మూడు స్థానాలలో నిలుస్తుంది. 2.350 బిలియన్ డాలర్లు కనీసం సాధిస్తుంది.

మరో విశేషమేమిటంటే తెలుగులో కేవలం డైరక్టర్ పేరు మీద మార్కెట్ అయి వంద కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాలు 4. అవన్నీ రాజమౌళివే.

ఇప్పుడు ఆ అరుదైన ఘనత సాధించిన ఐదవ సినిమా అవతార్ 2. ఈ achievement కేవలం అమెరికాలోనే 100 మిలియన్లు వసూలు చేసిన తెలుగు సినిమా లాంటి ఘనత. కామరాన్‌కు మాత్రమే సాధ్యమైంది.

మరోవైపు కొరియాలో 400 మిలియన్ డాలర్ల పైన వసూలు చేసిన సినిమాలో ప్రధాన పాత్రలో (ముఖ్య విలన్ గా) నటించిన ఘనత కేవలం చోయ్ మిన్ సిక్ కే దక్కింది. లూసీ (2014 – స్కార్లెట్ జొహాన్సన్).

కొరియానంలో అవతార్ త్రెడ్ సమాప్తం!

అర్రెర్రే! బాలకృష్ణ-నాగేశ్వరరావు వివాదం పెద్దగా ముదరలేదే! సరే, ఇంకేమన్నా స్పైసీ న్యూస్ వెతకాలి మనవాళ్ళు. అప్పటి దాకా రవితేజ ధమాకా ఓటీటీలో దిగింది. బాగా చూస్తున్నారు జనాలు. ఓ లుక్కేసుకుని రంధ్రాన్వేషణ చేసి రివ్యూలు రాద్దామా?

(సశేషం)

Exit mobile version