కొరియానం – A Journey Through Korean Cinema-52

3
1

డింక చికా హేయ్ డింక చికా అహా డింక చికా

Chapter 45

[dropcap]ఈ[/dropcap]మధ్య అప్పుడప్పుడూ వచ్చే కామెంట్లను బట్టీ చూస్తే మొత్తం కొరియానం చదువుతున్న వారి సంఖ్య 3 నుంచి 8 లేదా 9 మందికి పెరిగిందిలా ఉంది (ఆ భాష ఏంటి అనకండి. నాకు మాత్రం విజయవంతమైన మేధావీ యువ రచయితలలా రాయాలని ఉండదా) అనే అనుమానం వస్తోంది. ఒక నాలుగైదు మెసేజులను బట్టీ, అది నిజమే కామోసు అనే ఇంకో అనుమానం కలిగింది.

The City of Violence చూశాము. చాలా నచ్చింది. దాని లాంటి సినిమాలు కొరియన్‌వి మంచివి సజస్ట్ చేయమని అడుగుతున్నారు. అప్పుడే చెప్పాను. ఆ టెక్నిక్ ఉపయోగించిన సినిమాలు చాలా ఎడిక్టివ్‌గా ఉంటాయి. గొప్ప కథా కథనాలుండకపోవచ్చు. కానీ, they serve the purpose. ఒకరకమైన orgasmic entertainment అయితే ఇస్తాయి.

అలాంటి సినిమాలు కొరియన్ సినిమాలో చాలానే ఉన్నాయి. మాంఛి పాప్కార్న్ entertainers. కాకపోతే వాటిలో కథ కోసం తీసుకునే పాయింట్ ప్రస్తుత సమాజానికి, కాలానికి relevant గా ఉంటుంది. అవసరమైనంత వరకు కొన్ని subplots – అవి కూడా కథనంలో అంతర్భాగమై కథకు పరిపుష్టిని చేకూరుస్తాయి, యూనివర్సల్ ఎమోషన్లు. వీటన్నిటినీ సరైన పాళ్ళలో మిక్సీలా వేసి తీస్తారు. పైన తాలింపు లాగా కాస్త వైలెన్స్ ఎలాగూ ఉండనే ఉంటుంది.

MY WIFE IS A GANGSTER అలాంటి ఒక సినిమా. దాని గురించి మొదట్లోనే చెప్పాను. ఈమధ్య కాలంలో వచ్చిన అలాంటి సినిమా ON THE LINE.

చాలా విచిత్రంగా ఇది మన యాక్షన్ మసాలా సినిమాల కోవకు చెందినదే అయినా ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న cyber crimes, especially online scams related to passwords and OTP related scams with elderly people and ladies అనే అంశాల మీద ఫోకస్ అధికంగా పెట్టింది. ఈ సమస్యకు మూలం కనిపెట్టి సమూలంగా నాశనం చేయాలనుకునే పాత్రలో మన హీరో స్యో-జున్ పాత్రలో Byun Yo-han నటించాడు. ఒంటి చేత్తో పోరాటం. మాస్ మసాలా. సినిమా అదిరిపోతుంది.

2021లో కరోనా దెబ్బకు సినిమాలు కుదేలైన సమయంలో విడుదలైన ఈ చలనచిత్రం మంచి విజయం సాధించి థియేటర్‌లు క్రమంగా ఊపులోకి రావటంలో తన పాత్ర పోషించింది. ఎంచక్కా హోమ్ థియేటర్‌లో చూడదగ్గ పసందైన సినిమా. ఇందులో చాలా సన్నివేశాలు మనల్ని educate చేయటమే కాదు, మన తెలివితేటలను గౌరవిస్తూ రూపొందించబడ్డాయి.

Voice (or Boiseu or On the Line) in whatever way you come across this film, it is a highly entertaining, frightening, and thrilling watch which is a rarity in modern day films. It is at once a cautious tale and acts as an infotainment. Highly recommended. (Review conclusion – NaThing.xyz website).

CONFIDENTIAL ASSIGNMENT 2: INTERNATIONAL. ఇదింకో చూడదగ్గ సినిమా. దీని మొదటి భాగమైన CONFIDENTIAL ASSIGNMENT కూడా బాగుంటుంది. ఒక ఉత్తర కొరియా అధికారి, దక్షిణ కొరియా డిటెక్టివ్ కలిసి ఒక అంతర్జాతీయ క్రిమినల్ ను పట్టుకోవటం కథ. మన पठान, एक था टाइगर, टाइगर ज़िंदा है, वार.. లాంటి సినిమాలు. మన బాలీవుడ్ Pak-India collaboration fetish మాదిరిగానే అక్కడా North South Koreas collaboration fetish.. filmmakers కు ఎక్కువ. తప్పేమీ కాదు. సోదర దేశాలు పరస్పర విశ్వాసం కలిగి ఉండి కలిసి పనిచేయటం మంచిదే కదా. కనీసం సినిమాలలో అయినా.

ప్రస్తుతానికి ఈ వారాంతంలో ఓ లుక్కేసుకోండి వాటి మీద. మరీ సిటీ ఆఫ్ వైలెన్స్ లాంటివి కాకపోయినా, ఆ తరహా popcorn entertainments. హాలీవుడ్ స్టైల్ లో తీసినా కొరియన్ మూలాలు మరువనివి. పఠాన్ లాగా హాలీవుడ్ సినిమాల నకలు లాగా ఉండవు.

***

అనగనగనగా ఒక కొరియాలో ఒక ఊరు (కొరియాలో బోలెడు ఊళ్ళున్నాయి. నాకు తెలుసు. వాటిలో ఇది ఒకటి). అక్కడ ఒక ఇల్లు. ఆ ఇంట్లో ఆమ్మకు బద్ధకం. బాధ్యతలు పట్టవు. ఆ అమ్మకు ఒక కూతురు. ఆ పిల్లను ఆ పిల్ల అమ్మమ్మో/నాయనమ్మో పెంచుతారు. ఆ ముసలావిడకు ఆ పిల్ల అంటే ప్రాణం. ఆ పిల్లకు కూడా ఆ ముసలి జీవి అంటే అంతే ఇది కూడానూ.

వయసు పెరుగుతున్న కొద్దీ ఆ ముసలవ్వకు తను ఒక ఎలుకను అనే అనుమానం వచ్చి అది భ్రాంతి స్థాయి దాటేసి నమ్మకంగా మారుతుంది. షరా మామూలుగా ఆమెను ఒక మెంటల్ హాస్పిటల్‌కు తరలిస్తారు బలవంతంగా. అది చూసిన ఆ మనవరాలుకు ఆ తెల్ల బట్టల వాళ్ళంటే కసి పెరుగుతుంది. తనను జాగ్రత్తగా చూసుకునే ఏకైక మనిషి ఆ ముసలవ్వను పట్టుకెళ్ళినందుకు గానూ. వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుటుంది.

ఎంతైనా పార్క్ చాన్-వుక్ సినిమా కదా. ఎక్కడైనా revenge ఉంటుంది. కథలో అంతర్భాగంగా ఎక్కడోక్కడ ఇరికిస్తాడు. కానీ ఈ సినిమాలో ఈ ప్రతీకారం వ్యవహారం పూర్తిస్థాయి సెటైర్. తన మీద, తన సినిమాల మీద.

సినిమా కూడా భలే తమాషాగా మొదలౌతుంది.

మన హీరోయిన్ పేరు Young-goon (యంగ్ గూన్ లేదా రౌడీ పిల్ల అని కాదు. పలకాల్సింది …యూంగూన్).

సరే! ఆమె చేసే అల్లరికి మనం రౌడీ పిల్ల అనుకుందాం. మన రౌడీ పిల్ల అమ్మమ్మ వియోగం జరిగాక కొంత కాలం గడుస్తుంది. గడిచిందా మాస్టారూ? గడిచింది కదా! ఆఁ అట్టనే ఉండండి.

కాలం గడిచింది కనుక పిల్ల కూడా పెరిగి పెద్దదవుతుంది. ఒక ఫేక్టరీలో వర్కర్‌గా చేరి పొట్ట పోసుకుంటుంటుంది.

Channelling my inner Ravi Teja: అన్నట్లు చెపటం మరచితిని. ఈ సినిమాలో కాస్త మేజిక్ రియలిజమ్, ఇంకాస్త ఫేంటసీ కూడా కలుస్తాయి.

అదే! అన్నిటి మీదా సెటైరే.

ఇంతలో మన రౌడీ పిల్లకు తనొక Android Machine లేదా ఒక రోబోవతి అని అనుమానం వస్తుంది. అది క్రమంగా బలపడి భ్రమ స్థాయికి, ఆ పైన నమ్మకం స్థాయికి చేరుతుంది. దాంతో ఒక శుభ ముహూర్తాన మామూలు ఆహారం తీసుకోవటం మానేసి పారేసిన బేటరీలు నాకటం, కరంట్ శరీరంలోంచీ పంపుకుంటం లాంటి చిన్న చిన్న ఘనకార్యాలు మొదలెడుతుంది.

అలాంటి ఒక ప్రయోగం టైటిల్ సీక్వెన్స్‌గా వస్తుండగా సినిమా మొదలౌతుంది. మన రౌడీ పిల్ల చేతులు కోసుకుని, అక్కడ పాజిటివ్ నెగటివ్ కనక్షన్లు కాపర్ కాయిళ్ళతో ఇచ్చుకుని, ఇంచక్కా కరంటు వదులు కుంటుంది తన శరీరంలోకి.

ఇంకేముంది? ఒక వైపు కరంటు షాకు. మరోవైపు రక్త నష్టం. శరీరం నీలి రంగులోకి మారుతుండగా సినిమా టైటిల్ పడుతుంది.

싸이보그지만 괜찮아

(Ssaibogeujiman Gwaenchana).

దర్శకుడి విజువల్ క్రియేటివిటీకి అబ్బుర పడాలా? ప్రజంట్ చేసిన టోన్‌కు వచ్చే నవ్వు నవ్వాలా? లేదా రౌడీ పిల్ల చావు మీదకు తెచ్చుకుందని బాధపడాలా?

పార్క్ చెప్పిన టెక్నిక్ ఉంది కదా. పాత్ర కాదు. కథలో ఎమోషన్‌ను ఫాలో కండి అని. కథ ప్రకారంగా నవ్వాలి.

నవ్వగలమా?

ఆ తరువాత మనం మన రౌడీ పిల్లను మాంఛి హుషారుగా మెంటల్ ఎసైలమ్‌లో చూస్తాం. అక్కడ అందరూ ఎవరెవరి రేంజులలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ పిచ్చిని ఆస్వాదిస్తూ ఉంటారు.

డింక చికా హేయ్ డింక చికా అహా డింక చికా! అనుకుంటూ.

ఇక్కడే మన హీరో గారు పరిచయం అవుతారు. మన రెయినబ్బాయ్‌కి సినిమాలో పేరు Il-soon. మన వాడికి స్కిజోఫ్రెనియా ముదురు స్టేజ్‌లో ఉంది. అందుకే ఇక్కడ ఉన్నాడు. తనకు ఎదుటివారిలో ఉన్న ప్రాథమిక లక్షణాన్ని దొంగతనం చేయగలిగే శక్తి ఉందని నమ్మకం.

అలా ఆ ఎసైలమ్ కమ్ హాస్పిటల్‌లో ఉన్న పేషంట్లను వారి శక్తులను దొంగిలించటం ద్వారా ఏడిపిస్తూ కాలక్షేపం చేస్తుంటాడు. అప్పుడప్పుడూ ఎవరైనా దొరికించుకుని మర్దనా చేస్తుంటారు.

ఇక్కడ మన హీరోయిన్, తనను తాను పూర్తి మెషిన్గా భావించుకుంటూ, electrical ఆహారం కోసం అర్రులు చాస్తూ ఉంటుంది. మొదట్లో కాస్త ఏడిపించినా, ఇల్-సూన్ లేదా మన రెయినబ్బాయి రౌడీ పిల్ల మీద సానుభూతి కలిగించుకుంటాడు.

అటు ఆహారం తినకా, ఇటు ఎలక్ట్రిక్ షాకుల ప్రయోగాల వల్ల రౌడీ పిల్ల బాగా బలహీన పడుతుంది. దాంతో డాక్టర్లు కట్టేసి ఆహారం ఇస్తుంటూరు. దాన్ని కూడా తన సిస్టమ్‌కు పడదు అని మొండికేస్తుంటుంది.

అప్పుడు మన హీరో కొత్త ట్విస్ట్ ఇస్తాడు. తను ఒక గొప్ప సైంట్విస్టుననీ, డాక్టర్లు ఇచ్చే ఆహారం ఎలక్ట్రిక్ సిగ్నల్ గా మారి తనను చార్జ్ చేసే యంత్రం ఒకదాన్ని రౌడీ పిల్ల పొట్టలో పెట్టానని చెప్తాడు. దాంతో తిండి తీసుకుంటం ప్రారంభిస్తుంది.

ఒక రోజు ముసలవ్వ మన రౌడీ పిల్ల కలలో కనపడి, పాపా యూంగూనూ, నీ ఇల్లు బంగారం కానూ, ఏం చిక్కిపోయావే అని తనలోని Inner Suryakantham ను చానల్ చేసుకుని ఒక రహస్యం చెప్తుంది. అది నిజానికి బ్రహ్మ జ్ఞానం.

దాన్ని మన రౌడీ పిల్ల misunderstand చేసుకుని తనను తాను ఒక న్యూక్సియర్ బాంబు అనీ, తుఫాను రోజున పడే పిడుగు డైరక్టుగా తన నెత్తిన పడితే తాను న్యూట్రలైజ్ అవుతాను అని భ్రమలో పడుతుంది. అదే విషయాన్ని మన రెయినబ్బాయి ఇల్-సూన్ కు చెప్తుంది. సరే! డన్! అని ప్రామిస్ చేస్తాడు.

ఈ పిచ్చిదాన్ని ఆ వెర్రి వెధవ కాపాడి కథను ఎలా సుఖాంతం చేస్తాడనేది మిగిలిన కథ.

సినిమాలో రెండు spectacular action sequences ఉంటాయి. ఒకటి తెల్ల చొక్కాల మీద హీరోయిన్ ప్రతీకారం. ఇక క్లైమాక్సు అయితే వేరే లెవెల్.

Total Cinema అనే phenomenon ను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే చూసి తీరాల్సిన సినిమా. Visuals are extraordinarily choreographed. Editing is gold standard. Storytelling at its best.

కానీ ఒక కాషన్. మొదటి ఏడున్నర నిముషాలు సినిమా ఎక్కి నచ్చితే చూడండి. లేదా better skip. There are 100% chances that you’ll misunderstand an ultimate comedy/romance/satire classic, and spoil the fun for the others.

రెండున్నర మిలియన్ డాలర్ల లిమిటెడ్ బజట్‌తో తీసిన ఈ సినిమా 4.5 మిలియన్ల కలక్షన్లతో హిట్ అయింది. కాకపోతే ఇంత weird creativity ని అర్థం చేసుకోలేక సినిమా ఎక్కువ మంది చూడలేదు. కానీ తక్కువ థియేటర్లలో లాంగ్ రన్ ఎంజాయ్ చేసింది.

దర్శకుడు పార్క్ తన నోట్సులో తనకు అత్యంత ప్రీతిపాత్రమైన సినిమాగా దీన్ని పేర్కొన్నాడు.

చెప్తే ఆశ్చర్యం కలుగుతుంది కానీ, ఈ సినిమాలో ముసలవ్వ చెప్పే బ్రహ్మ జ్ఞానం సనత్సుజాతీయీనికి దగ్గరగా ఉంటుంది.

మళ్ళీ కలిసే లోగా మీ కౌ హగ్గు ఎలా జరిగిందో చెప్పండి. గొడవలు, వివాదాలు లేకపోతే మరీ సప్పగా ఉంది మన తెలుగూఫులకు. ఏదైనా కొత్త వివాదం మన సోషల్ మీడియా దొరకాలని ప్రార్థిద్దాం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here