Site icon Sanchika

కొరియానం – A Journey Through Korean Cinema-55

భగవద్గీతను జగమందు విన్నదొక్కడే

Chapter 41 Conclusion

[dropcap]T[/dropcap]he Riemann (రాయమన్) hypothesis is one of the most famous and important unsolved problems in mathematics. It is named after the German enigmatic mathematician Bernhard Riemann, who first proposed it in 1859 in a paper “On the Number of Primes Less Than a Given Magnitude.”

In other words, the Riemann hypothesis is a statement about the distribution of prime numbers. It suggests that there is a precise pattern or formula that governs the occurrence of primes among all the natural numbers.

The Riemann hypothesis is significant because it has profound implications for the distribution of prime numbers, including estimates for the frequency of prime numbers and the gaps between them. It also has important connections to other are-as of mathematics, such as the theory of elliptic curves, algebraic geometry, and the Langlands program.

Despite the efforts of many mathematicians over the past century and a half, the Riemann hypothesis remains unsolved. It is one of the seven Millennium Prize Problems, a set of unsolved problems in mathematics for which the Clay Mathematics Institute has offered a one-million-dollar prize for a correct solution. ఈ రాయ్మన్ హైపాతిసిస్ చుట్టూనే మన Oldboy Choi Min-sik నటించిన పాత్ర ఈ హాక్-స్యుంగ్ కథ నడుస్తుంది.

సరే! దాని గురించి చూడబోయే ముందు అవతార్ 2 గురించి వివరాలు చూద్దాం. ఈ ఎపిసోడ్ ప్రచురణ జరిగే సమయానికి కొరియాలో ఆడుతూనే ఉంది. పది వారాలు దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా $2.253 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. నామినల్‌గా టైటనిక్ కలక్షన్లు దాటినట్లే. అంటే ప్రపంచ సినిమాలో మూడవ అత్యధిక కలక్షన్లు సాధించిన సినిమా ఇది. టైటనిక్ 4K remastered రీరిలీజ్ అనుకున్నంత సక్సెస్ కాలేదు. కేవలం Valentine’s Day week లో మాత్రం దడదడలాడించింది. ప్రసాద్ ఐమాక్స్ సోమవారం రోజు (13 February 2023) కూడా ఫుల్ అయింది. 14న కూడా బాగా షోలు నడిచాయి. తరువాత పెద్ద effect లేదు.

తొలి నాలుగు స్థానాల్లో ఉన్న సినిమాలలో మూడు జేమ్స్ కామరాన్‌వే.

నేను మొదటి నుంచి చెప్తున్నట్లు తక్కువలో తక్కువ $2.250 బిలియన్లు సాధించింది. కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న కొద్దీ స్క్రీన్ల సంఖ్య తగ్గుతోంది. అదే రేషియోలో కలక్షన్లూ తగ్గుతున్నాయి. మొత్తం మీద $2.3 బిలియన్ మార్కు టచ్ చేయవచ్చు. కేవలం సినిమా గొప్పతనం వల్ల ఆడింది. అంతే. దర్శకుడి పేరు మీద మార్కెట్ అయింది. మొదట వచ్చిన నెగటివ్ propaganda కు చెంపపెట్టులాంటి రిజల్ట్ ఇది.

కొరియాలో గత పది సంవత్సరాలలో ఏ సినిమా సాధించని రీతిలో దాదాపు $10,000 per theatre average సాధించింది. మొత్తంగా $107 మిలియన్ డాలర్లతో బాక్సాఫీసు పరుగును ముగిస్తుంది. ఈ సినిమా చాలామంది కొరియన్లకు సాంత్వన చేకూర్చింది. ప్రత్యేకించి సామ్ వర్దింగ్టన్ చేసిన జేక్ సలీ పాత్ర తండ్రి అంటే ఇలా ఉండాలి అనిపిస్తూ సాగిన విధానం చాలామందికి నచ్చింది. His taskmaster style of behaving with his sons created unintended humour among the teens who are otherwise indulged in academics.

అలాగే టైటనిక్ రీరిలీజ్ లో మన దేశంలో (ఎన్టోడి సినిమా కాదు) 2.5 కోట్లు వెనకేసుకుంది. అమెరికాలో $14.5 మిలియన్లు, ప్రపంచవ్యాప్తంగా $53.77 మిలియన్లు సంపాదించి ఆ వారానికి ఒక పెద్ద హిట్ కింద నిలిచింది. రీమాస్టరింగ్‌కు అయిన ఖర్చులు పోగా, ఈ హడావిడి వల్ల కదిలిన డీవీడీలు, బ్లూరేలు, థియేటర్లలో వచ్చిన డబ్బుల లెక్క చూస్తే టైటనిక్ 40 మిలియన్ల పైనే లాభాలు తెచ్చింది.

ఇక కొరియాలో అయితే ఇంకా పెద్ద సక్సెస్‌గా నిలిచింది. $8.5 మిలియన్లు సాధించి. అమెరికాలో ఇప్పటికీ డెయిలీ బాక్సాఫీసు రిజల్ట్స్‌లో టాప్ 10 లో నిలుస్తోంది. అవతార్ 2 3వ స్థానంలో ఉంది. మన దేశంలో 60 మిలియన్ డాలర్ల మార్కు టచ్ చేసిందా లేదా అన్నది అనుమానంగానే ఉంది. డాలర్ కన్వర్షన్ మీద అది ఆధారపడి ఉంటుంది.

ఈ విధంగా 13 ఏళ్ళ తరువాత మొదలైన జేమ్స్ కామరాన్ బాక్సాఫీసు దండయాత్ర విజయవంతంగా ముగిసింది. కొరియా, ఇండియాలలో. ప్రపంచవ్యాప్తంగా 40 చిల్లర దేశాలలో ఆ దేశ సినిమాల చరిత్రలో అత్యధిక వసూళ్ళ రికార్డులు నెలకొల్పుతూ. మన కొరియాలో దాదాపు 11 మిలియన్ల యునిక్ ఆడియన్స్ చూసారు.

Chapter 48

ఈ హాక్-స్యుంగ్ ఒంటరి జీవి. ఇతరులు తన ప్రైవసీకి అడ్డం రావటం ఇష్టపడడు. అందుకే ఎవరినీ తనకు చేరువ కానీయడు. అతని ఇంట్లో అతను ఒక్కడే ఉంటాడు. తోడుగా ఒక తాబేలు. ఎందుకు పెంచుతున్నాడో. చేస్తున్న వృత్తి రీత్యా రాత్రిళ్ళు మేలుకుని పగళ్ళు నిద్రపోవటం తప్ప వేరే ఏ దురలవాట్లూ లేవు. కాకపోతే ప్రతి రోజూ ఒకసారైనా స్ట్రాబెరీ మిల్క్ తాగుతాడు. అప్పటిదాకా జి-వూ మాత్రం ఒక్క రాత్రి అతనితో అతను ఉండే చోట ఉండగలిగాడు.

జి-వూ ను హాస్టల్ నుంచీ సస్పెండ్ చేయటం, అతను వెల్ఫేర్ మీద బతుకుతున్నాడని తెలియటం, అతని తల్లి ఒంటరిగా అతన్ని పెంచుతోందని, చదువు తప్ప జీవితంలో ఎదిగేందుకు అతనికి వేరే అవకాశాలు లేవని అర్థం కావటంతో ఈ హాక్-స్యుంగ్ జి-వూ తన దగ్గర లెక్కలు నేర్చుకునేందుకు అంగీకరిస్తాడు.

అందుకు అతను అడిగే ఫీ రోజుకొక స్ట్రాబెరీ మిల్క్.

అదే జి-వూ ఈ హాక్-స్యుంగ్ దగ్గర లెక్కలు నేర్చుకుంటున్నాడని బో-రామ్ కు తెలిసేలా చేస్తుంది. బో-రామ్, జి-వూ రోజూ స్ట్రాబెరీ మిల్క్ తీసుకుని వెళుతుండటం గమనిస్తుంది. అతను దానికి ఎడిక్ట్ అవుతున్నాడేమో అని మొదట హెచ్చరిస్తుంది. తరువాత తరువాత కూడా అతను కొంటుండటాన్ని చూసి అతన్ని వెంబడిస్తుంది. అలా వెళ్ళి వెళ్ళి జి-వూ ఈ హాక్-స్యుంగ్ దగ్గరకు గణిత శాస్త్రం నేర్చుకునేందుకు వెళ్తున్నాడని తెలుసుకుంటుంది. అనుకోకుండా జరిగిన ఈ ఉపద్రవం తరువాత జి-వూ కు మేలు చేస్తుంది.

కాస్త ఇబ్బందిగా కదిలినా, ఇద్దరినీ తన దగ్గరకు వస్తున్నట్లు వేరెవరికీ చెప్పవద్దని కండీషన్ పెట్టి, ఈ హాక్-స్యుంగ్ తన పని తాను చేసుకుపోతుంటాడు.

ఇంతకు కొంత ముందరే జి-వూ ను నువ్వు మన స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్‌కు transfer అయితే మంచిదని చెప్తాడు ప్రొఫెసర్ కిమ్. అయినా పట్టుదలగా తన మేధమేటికల్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటాడు జి-వూ. ఎంతలా అంటే ప్రొఫెసర్ కిమ్ చేసిన లెక్కలో తప్పు ఉన్న చోట ఆ తప్పును ఎవరూ పట్టుకోలేక పోయినా తను పట్టుకోగలిగేంత.

ఇంతకు కొంత కాలం క్రితమే, గవర్నమెంట్ వెల్ఫేర్ ద్వారా వచ్చిన జి-వూ మిత్రుడు transfer అయి వెళ్ళిపోతాడు. అక్కడ నెగ్గలేక. అక్కడ అందరు విద్యార్థులకూ ఏదో ఒక రకంగా ట్యూషన్లు ఉంటాయి. అదృష్టవశాత్తు జి-వూ కు ఈ హాక్-స్యుంగ్ నేర్పటానికి అంగీకరిస్తాడు. ఆ అవకాశం లేని ఆ పిల్లాడు వెళ్ళక తప్పదు. ఆ విధంగా జీవితంలో ఉన్నత స్థితికి చేరే అవకాశాన్ని అతను కోల్పోయాడు.

ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. పైథాగరస్ ప్రోగ్రామ్! చాలా ప్రెస్టీజియస్ అయిన ఈ ప్రోగ్రామ్‌లో compete చేయాలని, దాని ఫలితాలు వారి గ్రేడ్ పరీక్షల బదులు స్వీకరిస్తామని చెప్తాడు ప్రొఫెసర్ కిమ్. ఎక్కువ సమయం లేకపోవటంతో చాలామంది పిల్లలు కిమ్ వద్దే కోచింగ్‌కు చేరతారు. అది ఇల్లీగల్ అయినా.

ఇటువైపు ఈ హాక్-స్యుంగ్ దగ్గరకు ఒక మిత్రుడు వస్తుంటాడు. అతను An Gi-cheol. ఈ హాక్-స్యుంగ్ దక్షిణ కొరియాలో ఉండేందుకు అతను సహాయం చేస్తుంటాడు. An మన ఈ హాక్-స్యుంగ్ కు ఒక మొబైల్ ఫోన్ ఇస్తాడు.

కొంత కాలం క్రిందట పాత తరం గాడ్జట్‌తో పాటలు వింటుంటాడు ఈ హాక్-స్యుంగ్. దానిలో పాటలు సరిగ్గా రావు. అప్పుడు జి-వూ అతనికి తన మొబైల్‌లో పాటలు పెడతాడు. అది ఎంతో నచ్చుతుంది ఈ హాక్-స్యుంగ్‌కు. ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా నిదురిస్తాడు ఆ రాత్రి. అందుకోసమే ఈ మొబైల్ తెప్పించుతున్నాడు (ఇక్కడ నాకు “క” పలకలేదు) అని అనుకుంటాడు జి-వూ.

బో-రామ్ కు సంగీతమంటే ఇష్టం. తనకు పియానో వాయించటంలో నేర్పు ఉంది. గణిత శాస్త్ర పరిజ్ఞానంతో సు స్వరాలను ఎలా పలికించాలో అర్థమయ్యేలా చేస్తాడు ఈ హాక్-స్యుంగ్. అందుకు కృతఙ్ఞతగా తమ కుటుంబానికి ఆప్తుడైన వ్యక్తి ద్వారా ఒక అద్భుతమైన కన్సర్ట్ కు హాజరయ్యేలా అవకాశం కల్పిస్తుంది. ఆయనతో పాటూ జి-వూ కూడా వెళతాడు. ఆ కన్సర్ట్‌ను ఈ హాక్-స్యుంగ్ ఆస్వాదిస్తాడు.

కన్సర్ట్‌కు బో-రామ్ హాజరు కాదు. కారణం ఆమెను ఆమె తల్లి కిమ్ వద్ద ట్యూషన్‌కు పెడుతుంది. పైగా వెల్ఫేర్ మీద చదువుకునే జి-వూ తో స్నేహం చేయటం ఇష్టం లేదన్నట్లు మాట్లాడుతుంది. ఆమెకు బో-రామ్ సమాధానమిస్తుంది కానీ అది పెద్దగా ప్రభావం చూపదు.

చదువు, హోదా అన్నవి కొరియన్ సమాజంలో ఎంత ముఖ్యమో ఈ సన్నివేశాలు చెప్తాయి.

ఒకసారి తన కొత్త మొబైల్‌లో ఈ హాక్-స్యుంగ్ రీసెర్చి పేపర్లు చదవటానికి అవస్థ పడుతుంటాడు. అప్పుడు బో-రామ్ సలహాతో తన మిత్రుల సహాయం తీసుకుని స్కూల్ ప్రింటర్ నుంచీ ప్రింటవుట్లు తీసుకుని వచ్చి ఇస్తాడు జి-వూ. చదవటానికి తేలికగా ఉండటంతో ఈ హాక్-స్యుంగ్ సంతోషిస్తాడు.

కొన్నాళ్ళకు ఒక సూపర్ మార్కెట్‌లో ఈ హాక్-స్యుంగ్ శిష్యుడు ఆయన్ను గుర్తుపట్టి పలకరిస్తాడు. జి-వూ ను ఆయన కొడుకనుకుని అదే అడుగుతాడు. గత జ్ఞాపకాలతో సతమతమవుతాడు ఈ హాక్-స్యుంగ్.

ఈ లోగా రాయమన్ హైపాతిసిస్ మీద ఈ హాక్-స్యుంగ్ పరిశోధనలు దేశంలో న్యూస్‌గా మారతాయి. దెబ్బకు ఉత్తర కొరియా ఆయనను బలవంతంగా తమ దేశానికి రప్పించుకోవాలనుకుంటుంది. తమ దేశ సంపద అయిన ఈ హాక్-స్యుంగ్ పరిశోధనలు తమ దేశానివిగా వాడుకోజూస్తున్నదని దక్షిణ కొరియా మీద నిందలు వేస్తుంది. దక్షిణ కొరియా ఎన్ఐఎస్ (NIS) ఈ హాక్-స్యుంగ్ ను వెంటాడుతుంటుంది ఇన్నాళ్ళు. సరైన పర్మిట్లు లేకుండా దేశంలో ఉంటున్నందుకు.

An Gi-cheol ను దక్షిణ కొరియా ప్రభుత్వం పురమాయించి ఈ హాక్-స్యుంగ్ ను టెలివిజన్ ప్రోగ్రామ్‌కు ఒప్పించమంటుంది. రాయమన్ హైపాతిసిస్‌కు ఆయనకు ఉన్న సంబంధం గురించి అడిగినందుకు జి-వూ ను కోప్పడి దూరం పెడతాడు ఈ హాక్-స్యుంగ్. అటు An తో ప్రోగ్రామ్ చేయటానికి ఇష్టపడడు. తను చేసిన పరిశోధనలు గురించి మాట్లాడవద్దంటాడు. ఈలోగా ఉత్తర కొరియా పురమాయించిన ఈ హాక్-స్యుంగ్ ఇంకో పాత మిత్రుడు అతన్ని తమ దేశానికి తీసుకు వెళ్ళాలని చూస్తాడు.

దీనంతటికీ కారణం ఆయన కొడుకు ఈ టే-యోన్ (Lee Tae-yeon). మెరుగైన జీవితం కోసం ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకు వచ్చేప్పుడు తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ జరుగుతుంది. కేవలం తన స్వార్థం కోసమే ఇక్కడికి వచ్చాడని, తన పరిశోధనలు తప్ప ఇతరాలు పట్టవని, తన తల్లి ఆరోగ్యం బాగోనప్పుడు దక్షిణ కొరియాకు రాబూనని తన తండ్రి, ఆయన పరిశోధనల కోసం మాత్రం దేశం విడవటానికి సిద్ధమయ్యాడని నిందించి తను రెండు దేశాల మధ్యా ఉన్న నీటి సరిహద్దు ద్వారా అటు వెళ్ళాలని చూస్తాడు.

అప్పుడు సరిహద్దు సైనికులు ఈ టే-యోన్ ను కాల్చి చంపుతారు. దాంతో హతాశుడవుతాడు ఈ హాక్-స్యుంగ్. కొడుకుకు ఇష్టమని స్ట్రాబెరీ మిల్క్ తాగుతుంటాడు. ఆరోగ్యానికి సరిపడక పోయినా. ఆ తాబేలే తనకు సర్వస్వంగా జీవిస్తుంటాడు. కారణం అది కొడుకు మరణించిన నీటిలోనిది.

ఇక కథ క్లైమాక్సుకు చేరుతుంది. పైథాగరస్ టెస్ట్ పూర్తవుతుంది. We shouldn’t look at the solution. But the path we traveled to reach the solution is more important అని చెప్పిన తన గురువు చెప్పిన మార్గంలో పరీక్షలు రాసిన జి-వూ కు కోలుకోలేని దెబ్బ తగులుతుంది.

టెస్ట్ పేపర్ లీక్ అయినట్లు వార్తలు గుప్ఫు మంటాయి. ప్రొఫెసర్ కిమ్‌కు అది prestigious issue గా మారుతుంది. సీసీ ఫుటేజ్ లో ఒకరాత్రి జి-వూ ప్రింట్లు తీసుకు రావటం కనిపించటంతో అతన్ని కార్నర్ చేసి గవర్నమెంటు స్కూల్ కు వెళ్ళక పోతే ఈ లీక్ చేసింది అతనే అని ప్రచారం చేస్తా అని బెదిరిస్తాడు.

ఇటువైపు ఈ హాక్-స్యుంగ్ స్కూలు వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్ళే ప్రయాణం మొదలుపెడతాడు. తల్లికి తెలియకుండా transfer papers మీద సంతకం కానిచ్చి జి-వూ స్కూలు వదిలేసేందుకు సిద్ధమవుతాడు. పెట్టే బేడా సర్దుకుని పైథాగరస్ కాన్ఫరెన్స్ కోసం స్కూలు వద్దకు వెళతాడు. వెంటనే పేపర్లు సబ్మిట్ చేద్దామని. కానీ, అతని లగేజ్ ను లాక్కుని కాన్ఫరెన్స్ హాల్ కు పరిగెడుతుంది బో-రామ్.

అంతకు ముందే ఆ పిల్ల ఈ హాక్-స్యుంగ్ కు జి-వూ నిర్ణయం గురించి ఫోన్ చేస్తుంది. ఇక తను కలుగజేసుకోక తప్పదని ఈ హాక్-స్యుంగ్ తన తాబేలును సురక్షితంగా నీటిలో వదిలి స్కూలుకు బయలుదేరుతాడు.

జి-వూ ఆ పిల్ల వెంట పరిగెడుతూ కాన్ఫరెన్స్ హాల్‌కు చేరతాడు. అక్కడ ఒక గొప్ప Mathematician మాట్లాడుతుంటాడు.

సరిగ్గా అదే సమయంలో వస్తాడు మన ఈ హాక్-స్యుంగ్. ఆ mathematician కు తనను తాను పరిచయం చేసుకుని తన దగ్గర ఉన్న ఒక ప్రత్యేకమైన కలాన్ని చూపుతాడు. తన చిన్ననాటి స్నేగితుడే (కాసేపు తమిళ్ అనుకుని పూడుద్దాం) ఆ mathematician. ఇద్దరికీ వాళ్ళ ప్రొఫెసర్ బహుమతిగా ఇచ్చిన కలమది.

అది చూసి స్టేజ్ దిగి వచ్చి, రాయమన్ హైపాతిసిస్ మీద కృషి చేసిన మహా శాస్త్రవేత్త ఈ ఈ హాక్-స్యుంగ్ అని అందరికీ పరిచయం చేస్తాడు.

ముందుగా తను సెక్యూరిటీ గార్డుగా ఉన్నప్పుడు తనను Commie Officer అని పిలిచిన విషయాన్ని గుర్తు చేసి నవ్విస్తాడు. తరువాత తను రాయమన్ హైపాతిసిస్ మీద చేసిన కృషిని deadly weapons గా ఎలా తన దేశం మార్చాలనుకుందో వివరిస్తాడు. అందుకే తను దేశాన్ని విడిచిపెట్టి వచ్చానని, ఇక్కడ ఎవరికంటా పడకుండా జీవించానని చెప్తాడు.

ఇప్పుడు వచ్చింది ఈ విషయం చెప్పటానికి కాదని, టెస్ట్ పేపర్‌ను తన వద్ద ట్యూషన్ కు వచ్చే విద్యార్థుల కోసం ప్రొఫెసర్ కిమ్ లీక్ చేశాడని, ఫుటేజ్ లో జి-వూ తెస్తున్నది తన కోసం ఒక మేధమేటిక్స్ పరిశోధన పత్రమని తెలియజేస్తాడు.

మూడేళ్ళ తరువాత స్కూలు చదువు విజయవంతంగా ముగించుకుని మేధమేటిక్స్ స్కాలర్ అయిన జి-వూ ఈ హాక్-స్యుంగ్ ను ఆయన పని చేస్తున్న prestigious university లో కలుస్తాడు. ఈ హాక్-స్యుంగ్ ఎందుకు దక్షిణ కొరియా వచ్చాడో నిజం తెలుసుకున్న An ఆయనకు పాస్పోర్ట్ ఇప్పిస్తాడు. మంచి యూనివర్సిటీలో పరిశోధన కొనసాగించే అవకాశం కల్పిస్తాడు తన కెరియర్‌నే రిస్కులో పెట్టుకుని. ఈ హాక్-స్యుంగ్ ఇచ్చిన రాయమన్ హైపాతిసిస్ మీద పరిశోధన మొదటి ప్రతిని జి-వూకు బహుమతిగా అందిస్తాడు ఆయన తరఫున. ఆ గొప్ప కలాన్ని కూడా.

ఈ హాక్-స్యుంగ్ కోసం తీసుకెళ్ళిన స్ట్రాబెరీ మిల్క్ తాగుతూ జి-వూ తో గణిత సంభాషణలో మునిగిన ఇమేజ్ తో సినిమా ముగుస్తుంది.

బో-రామ్ ఈ హాక్-స్యుంగ్ ఇచ్చిన స్ఫూర్తితో గణిత పరిజ్ఞానాన్ని వాడి సంగీతంలో లోతులు చూస్తుంది.

శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన గీతను జగతిలో విన్నది అర్జునుడొక్కడే. ఈ హాక్-స్యుంగ్ పరిశోధనల సారాన్ని అర్థం చేసుకున్నది జి-వూ ఒక్కడే. కానీ చేరాల్సిన సందేశం అందరికీ చేరింది. కారణం ఆ చెప్పిన వారి సంకల్పం. అథారిటీ.

(సశేషం)

Exit mobile version