Site icon Sanchika

కొరియానం – A Journey Through Korean Cinema-6

Chapter 4

[dropcap]‘జా[/dropcap]యింట్ సెక్యూరిటీ ఏరియా’తో కొరియాలో విజయవంతమైన దర్శకుడిగా పేరు పొందిన పార్క్ చాన్-వుక్ పూర్వాశ్రమంలో పేరొందిన సినీ విమర్శకుడు. దర్శకుడు అయ్యాక కూడా తన గతాన్ని మర్చిపోలేదు. ఒక దర్శకుడు సినిమాను ఎలా చూస్తాడు, ఒక విమర్శకుడు సినిమాను ఎలా చూస్తాడు, ఒక సాధారణ ప్రేక్షకుడు ఎలా చూస్తాడు, ఒక intelligent movie buff సినిమాను ఎలా చూస్తాడో అన్న విషయం స్పష్టంగా తెలిసిన వ్యక్తి. అందుకే ‘జేఎస్ఏ’ విజయం తరువాత వచ్చిన పొగడ్తల వర్షంలో పొంగిపోలేదు. ఆ తరువాత ‘సింపతీ ఫర్ మిస్టర్ వెన్జెన్స్’ను చెరిగి పారేసినా (కొందరు విమర్శకులు. The film received mixed critical response) కుంగిపోలేదు. చేతనైతే మీరు సినిమా తీసి చూపించండి అనలేదు. ఒకానొక సందర్భంలో ఎవరో కోణంగి తన విమర్శను troll చేస్తే “నేను సినిమా తీయటం సరే! ముందు నువ్వు రివ్యూ రాసి చూపించు” అన్నాడు పార్క్ చాన్-వుక్. అప్పటికే అతనికి దర్శకుడిగా ఖ్యాతి వచ్చింది.

ఈ విషయంలో పార్క్ చాన్-వుక్ దృక్పథం…

While almost all film directors in Tollywood and mostly in other languages too have so low an opinion on film reviews and reviewers, there’s one legend in filmmaking who has utmost respect for film reviews and film criticism – even those (reviews) written in the form of tweets.

Park Chan-wook!

Ironically it was scathingly negative reviews that nearly killed his career before Joint Security Area happened, which went on to become the highest grossing and highest watched Korean film at that time in Korea, but he never relented.

He was a film critic himself of highest class before turning his hand in filmmaking.

He says: “I have a right to tell a story. They have a right to write what they want.”

‘జాయింట్ సెక్యూరిటీ ఏరియా’ను ప్రతి 9 మంది కొరియన్లలో ఒకరు చూశారని ఒక అంచనా. సినిమా హాళ్ళలో రిలీజప్పుడు 59 లక్షల టికెట్లు తెగాయి. కొరియన్ జనాభా అప్పట్లో 5.1 కోట్లు.

తరువాత వచ్చిన ‘సింపతీ ఫర్ మిస్టర్ వెన్జెన్స్’ను విడుదలైనప్పుడు కేవలం 92 వేలమంది మాత్రమే చూసినా, తరువాత గొప్ప క్లాసిక్ గా గుర్తింపు పొందింది. Oldboy చూసిన వాళ్ళు ఈ సినిమా వెతుక్కుని మరీ చూశారు. మిస్టర్ వెన్జన్స్, Oldboy, సింపతీ ఫర్ లేడీ వెన్జన్స్ – Vengeance Trilogy కింద గుర్తింపు పొందాయి. ఆ పెసిమిస్టిక్ narrative style, often times crude violence వల్ల కొందరు film buffs దీన్ని ఇటాలియన్ దర్శకుడు Sergio Corbucci తీసిన Mud and Blood Trilogy (Django, The Great Silence, The Specialists) తో పోలుస్తారు. కాకపోతే అందులో సామాజిక వ్యాఖ్య ఎక్కువ. Vengeance Trilogy is more about Love, human emotions, and the futility of vengeance and violence అంటాడు పార్క్ అభిమానులతో తన కరస్పాండెన్స్‌లో. చాలా పర్సనల్ work of art.

వెంజెన్స్ ట్రైలాజీ గురించి కొరియాలోను, ప్రపంచ వ్యాప్తంగానూ చాలా ఆన్లైన్ ఫోరాల్లో, విడిగానూ చాలా చర్చ జరిగింది. సహజంగానే, ఎంత చర్చ జరిగినా కళాకారుడి అసలు ఆలోచనలో 75 శాతానికి మించి పట్టుకోలేరు. అదే వెన్జన్స్ ట్రైలాజీ విషయంలోను, Oldboy విషయంలోను జరిగింది. మరి పార్క్ అసలు ఉద్దేశం ఏమిటి? ఎందుకు ఈ ట్రైలాజీ తీయాలనుకున్నాడు? అసలు ఎవరూ సినిమాగా తీయటానికి సాహసించని Sympathy For Mr. Vengeance ఎందుకు తీయ సాహసించాడు? ఆ కథలో ఉన్న గొప్పతనం ఏమిటి? యూనివర్సాలిటీ. ఎలా వచ్చిందా యూనివర్సాలిటీ?

పార్క్ మాటల్లోనే –

సాంఘిక జీవి మనిషి. కానీ ఒంటరి వాడు. He’s an altruist. కానీ individualist. అతను ప్రేమించగలడు. ప్రేమించిన వారి కోసం ఏమైనా చేయగలడు. కానీ, తన కోసం ఎంత ప్రేమించిన వారినైనా త్యాగం చేయగలడు. నిద్ర తన్నుకొస్తున్న తల్లి, బిడ్డను మరచి మరీ జోగినట్లు. ఈ వైరుధ్యాలు చాలా ఆసక్తి కలిగిస్తాయి ఒక third person లా అబ్జర్వ్ చేసినప్పుడు. అదే ఆ లంపటంలో ఉన్నప్పుడు మన objective view ను కమ్మేసి మనను మరోలా మారుస్తుంది. వేధిస్తుంది. వేదనకు గురి చేస్తుంది. అందుకే అలా మన నిజజీవితపు బేసిక్ ఎమోషన్లను చాలా సూక్ష్మంగా అటు involved person గా, ఇటు third person without any ties గా పరిశీలిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనే సింపతీ ఫర్ మిస్టర్ వెన్జన్స్.

కథ ఎక్కడైనా జరుగవచ్చు (yours truly: this story even happened in our hometown too). ఎవరికైనా జరుగవచ్చు. వారందరి రియాక్షన్లు దాదాపు ఒకేలా ఉంటాయి. కష్టానికి దుఃఖం. సుఖానికి ఆనందం. నొప్పికి బాధ. వీలైతే దాన్ని కలిగించిన వారి మీద ప్రతీకారం. అవతలి వాళ్ళు బలవంతులైతే కాంప్రమైజ్.

ప్రతీకారేచ్ఛకు కారణం? Ego. That Someone has ruptured my property. I should get back at that person and show him his place and damage his property so that that person could learn how it feels to be damaged. ఆ ఒక్కటీ వదిలేస్తే? పగా ఉండదు. ప్రతీకారం ఉండదు. That’s the reason why I want to make a film about vengeance to end all vengeance films. ప్రతీకారం తీరాక మనిషి ఎంత శూన్యత (metaphysical emptiness a majority of times. అందుకే Oldboy లో వు-జిన్ తనకు ఆరోగ్యరీత్యా ఎక్కువ రోజులు సేవని తెలిసినా ప్రతీకారం తీరాక ఆత్మహత్య చేసుకుంటాడు) పొందుతాడో, ఆ ప్రతీకారేచ్ఛ ఉన్నప్పుడు తెలియదు. మనసులో ఎప్పుడూ ఒకటే గిలి. హృదయాన్నే కాదు. మనిషితనాన్నే దహించి వేస్తుంది.

‘సింపతీ ఫర్ మిస్టర్ వెంజన్స్’లో నా self-indulgence ఎక్కువైంది. ఫలితం చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సినిమా తీసిన వెంటనే, చరిత్రలోనే ఇలాంటి ఫ్లాప్ చూడలేదు అనిపించుకున్న సినిమా తీశాను. కానీ, కళను, నేను చూపాలని అనుకున్న విషయాన్ని నిజాయితీగా present చేశాను కనుక సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా, మంచి సినిమాగానే తయారైంది.

‘జాయింట్ సెక్యూరిటీ ఏరియా’ తరువాత నన్ను నమ్మి నాకు పెట్టుబడి (they have given me a practical blank check) పెట్టిన వారికి న్యాయం చేయటం కోసం పూర్తి objective గా ఒక సినిమా తీయాలి. కానీ, పగ ప్రతీకారం సబ్జక్ట్ మీద నేను చెప్పాలని అనుకున్న విషయాన్ని నిరూపించాలి. ఎలా?

అప్పుడే Oldboy దొరికింది. అది మనం మామూలుగా చదివే ఒక సక్సెస్ఫుల్ థ్రిల్లర్. దాన్ని ఆధారం చేసుకుని మరింత లోతైన ఎమోషన్స్‌ను తడుముతూ, ప్రేక్షకులను మరింత ఇన్వాల్వ్ చేస్తూ సినిమా తీయగలిగితే? అదే Oldboy.

అందుకే స్టార్లను రప్పించాను. కథను వివరించాను. ప్రాత్ర నిడివికన్నా, దాని లోతుకు ప్రాధాన్యం ఇచ్చే Choi Min-sik ను ఓ డే-సు గా తీసుకున్నాను. షిరి, Happy End, Failan, Chi-hwa-seon మొదలైన హిట్లతో superstar గా ఎదుగుతున్నాడతను. డిట్టో తో యువతలో పేరు పొందిన Yu Ji-tae మరో పాత్రకు ఎంపికయ్యాడు. స్టార్ పవర్, objective narration with crowd pleasing moments, dark humour, satirical undertones అన్నీ కలిసి వచ్చి సినిమా గొప్ప సక్సెస్ అయింది. International fame is thanks to Quentin Tarantino. అయినా నా తపన తీరలేదు.

ఆర్టిస్టిక్‌గా personal scope లో తీసిన ‘సింపతీ ఫర్ మిస్టర్ వెన్జన్స్’ పరాజయం తొలిచేస్తూనే ఉంది. అంతే ఆర్టిస్టిక్‌గా, స్టార్ పవర్ వాడి విజయం సాధించవచ్చా? ఈ ప్రశ్నకు బదులుగానే Sympathy For Lady Vengeance వచ్చింది. ‘జాయింట్ సెక్యూరిటీ ఏరియా’లో ప్రధాన పాత్ర పోషించిన ఈ తరపు మహా నటి Lee Young-ae (yours truly: హిందీలో డబ్ అయి బాగా హిట్టైన కొరియన్ సీరియల్ ఘర్ కా చిరాగ్ లో ప్రధాన పాత్ర వేసిన నటి) ను రంగంలోకి దించాను. ఈ సారి నా పర్సనల్ కథ కాకుండా ఆమె కోణంలో కథను ఆలోచించి, తీశాను. అత్యద్భుత నటనతో ఆమె సినిమాను నిలబెడితే, నేను చెప్పాలని అనుకున్న విషయాన్ని without if’s and but’s చెప్పేశాను. My job is done. I can now move on to other projects.

పార్క్ ఈ సినిమాల గురించి మరింత సమగ్రమైన విశ్లేషణ తన పర్సనల్ నోట్స్ లలో రాసుకున్నాడు. అందుబాటులో ఉన్న విషయాలను ఆ యా సినిమాల గురించి వచ్చినపుడు చూద్దాం. ఈ లోగా మనం Oldboy గురించిన మరిన్ని విశేషాలు చూద్దాం.

Chapter 5

11 Must Know Facts About Oldboy the Movie

  1. Oldboy was at that time the all-time favourite non-west movie for legendary American filmmaker Quentin Tarantino. He promoted this film so aggressively in the Cannes Film Festival that a few even thought he was either losing his mind or had stakes in it (it’s proved to be a conspiracy theory and quickly written off). But his promotion helped the film reach far wider audience than was the norm for a Korean film at that time.
  2. Oldboy ని సంజయ్ దత్త్ హీరోగా, జాన్ అబ్రహమ్ వు-జిన్ తరహా పాత్రలో జిందా అనే పేరుతో సంజయ్ గుప్తా తీశాడు. లారా దత్తా హీరోయిన్ గా చేసిన ఈ సినిమాకు విమర్శకులు a standing ovation of middle finger తో గౌరవించారు. కొందరైతే లిటరల్ గా 0.5 rating కూడా ఇచ్చారు. Blatant plagiarism, some of the worst changes to major plot elements వదిలేస్తే జిందా మరీ చెత్త అయితే కాదు. నటన సంగతి వదిలేస్తే అప్పటి పరిస్థితులకు సంజయ్ దత్త్, జాన్ అబ్రహమ్ perfect casting.
  3. సోర్స్ కన్నా, సినిమా గొప్పదైన అరుదైన సందర్భానికి ఈ సినిమా ఒక ఉదాహరణ.
  4. Oldboy Manga ను Darkhorse Comics పాశ్చాత్య ప్రపంచానికి అందించింది.
  5. స్టీఫెన్ స్పీల్బర్గ్, విల్ స్మిత్‌లు ఈ సినిమా అమెరికన్ వర్షన్ తీస్తారని ప్రచారం జరిగింది కానీ, వర్కౌట్ కాలేదు. స్పీల్బర్గ్ గౌరవం కాపాడుకున్నాడు. అప్పటికే స్టార్డమ్ తగ్గుతున్న విల్ స్మిత్ ఈ సినిమా చేయకపోవటం మంచిదే అయ్యింది. ఈ సినిమా రీమేక్ కేసం జరిగిన arm twisting ను దుయ్యబట్టాడు ఓ డే-సు పాత్రధారి Choi Min-sik
  6. Oldboy ని కాస్తైనా చూడని 15 సం॥ నిండిన కొరియన్ లేడు అన్నది అతిశయోక్తి కాదు.
  7. తాను దర్శకుడయ్యాక వచ్చిన సినిమాల్లో, తాను తీయని వాటిలో టాప్ మూడు సినిమాల్లో ఒకటిగా క్వెంటిన్ టారంటినో ఈ సినిమాను పేర్కొంటాడు. సినీ అభిమానులు దీన్ని పల్ప్ ఫిక్షన్ స్థాయి సినిమాగా లెక్కిస్తారు. ప్రైవేట్ సంభాషణలలో టారంటినో ఈ సినిమాను పల్ప్ ఫిక్షన్ కన్నా గొప్ప సినిమాగా చెప్తుంటాడని, దీనికన్నా గొప్ప వెన్జన్స్ సినిమా తీయాలని కిల్ బిల్ తీశాడని కొందరు అంటారు. నిజానిజాలు దేవుడికే ఎరుక.
  8. 2013 లో జోష్ బ్రాలిన్ (మన థానోస్ బాబాయి గారే) కథా నాయకుడిగా స్పైక్ లీ అమెరికన్ రీమేక్ చేశాడు. తనెప్పుడూ తకరారు వేసుకునే టారంటినో మెచ్చిన చిత్రాన్ని స్పైక్ లీ రీమేక్ చేయటం ఆశ్చర్యకరం. అతని కెరియర్లోనే అత్యంత చెత్త సినిమాగా నిలిచింది. Some fans of Quentin Tarantino and Spike Lee comment that the failure or rather bad making of this film is Spike Lee’s own vengeance against Quentin Tarantino అంటారు.
  9. ఈ సినిమాలో (అమెరికన్ రీమేక్) ఎలిజబెత్ ఆల్సెన్ (Elizabeth Olsen) కథానాయికగా చేసింది. ఈమె మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో స్కార్లెట్ విచ్ పాత్ర చేసింది. అందులో థానోస్, స్కార్లెట్ విచ్ ల rivalry అందరికీ తెలిసిందే. She bears a great antagonism towards Thanos. కానీ Oldboy లో ఆమెను కాపాడటానికి (కూతురు – విషయం తెలియక ముందు ప్రియురాలు) ప్రయత్నించే పాత్రలో Josh Brolin నటించటం విచిత్రం.
  10. The dialogue work in Oldboy was recognized as 100 greatest dialogue works in film history. ఒక్క డైలాగ్ కూడా వృథాగా ఉండదు.
  11. Funnily enough, despite the name, fame, and recognition it brought him, Oldboy is not his favourite work for director Park Chan-wook. అదేదో ముందు ముందు తెలుసుకుందాం.

Exit mobile version