Site icon Sanchika

కొరియానం – A Journey Through Korean Cinema-62

సోల్ సర్కస్ 2

[dropcap]‘O[/dropcap]ur Twisted Hero’ by Korean author Yi Mun-yol is a powerful social commentary on the corrupt and oppressive nature of authoritarian regimes. The novel depicts a totalitarian government’s indoctrination of young school children and how this indoctrination can lead to the suppression of individuality and the manipulation of truth.

Through the character of Han Pyong-tae, the protagonist of the story, Yi Mun-yol reveals how the education system in authoritarian regimes is often used as a tool to reinforce the ruling ideology and suppress dissenting views. The novel shows how the children are forced to memorize party slogans and sing songs praising the government, with those who refuse to conform facing punishment and isolation.

Furthermore, the novel highlights the dangers of blindly following authority and the importance of independent thinking. Through Han Pyong-tae’s journey, the author shows how questioning authority and standing up against injustice is essential for the preservation of individual freedom and the progress of society.

‘Our Twisted Hero’ is a poignant commentary on the effects of authoritarianism on society, reminding readers of the importance of vigilance in safeguarding individual rights and freedoms. The novel offers a powerful reminder of the need for critical thinking and a willingness to challenge oppressive systems in the pursuit of a more just and equitable society.

ఇది నేను ఈ సినిమా గురించి summarise చేసుకున్నది. ప్రతి మనిషికీ తన మాట ఇతరులు వినాలనే కోరిక ఉంటుంది. తన బలాన్నో, తెలివితేటలనో, వేరే శక్తియుక్తులనో వాడి ఇతరులను తన కంట్రోల్ లోకి తెచ్చుకోవాలనుకుంటాడు. అలాగే సమాజం కూడా ప్రతి మనిషినీ నియంత్రించాలని అనుకుంటుంది. అలాగే సమాజాన్ని కూడా నియంత్రించాలని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అధికారం అన్నది నచ్చని వాళ్ళు దాదాపుగా ఉండరు.

ఆ అధికారాన్ని నియంతృత్వంగా మార్చి బల ప్రయోగం ద్వారా అందరూ నా గుప్పెటలో ఉండాలి అనుకునే వారు కోకొల్లలు. చరిత్ర నిండా చాలామంది ఉన్నారు. ఇదే విషయాన్ని స్కూలు పిల్లలకు అన్వయించి ఇద్దరు విద్యార్థుల కథలాగా చెప్పాడు యి మున్-యోల్.

గొప్ప నవల. గొప్ప సినిమా. గొప్ప పాఠం.

చూడండి. మీకు తగిన రీతిలో అన్వయించుకోండి.

The smallest minority in the world is an individual – Ayn Rand

ప్రపంచంలో అందరూ మైనారిటీ రక్షకులే. వాళ్ళను ఉద్ధరించాలని అనుకునే వారే. వారి హక్కులను గురించి ఉపన్యాసాలు దంచేవారే. కానీ, అవకాశం వచ్చిన ప్రతి తడవా అసలైన మైనారిటీ.. ఒక వ్యక్తి.. an individual.. హక్కులను కాలరాసేందుకు అందరూ ప్రయత్నిస్తారు. Hypocrisy.

Every human being is a hypocrite.

తన భర్తా, అత్తా, మామా తన జీవితాన్ని నియంత్రించాలని చూస్తున్నారని వాపోయే మహిళ తన పిల్లలను అతి నియంత్రణలో పెట్టాలని చూస్తారు చూశారూ. సూపర్ కదా.

ఆఫీసులో బాసు తమను బాగా exploit చేస్తున్నారని, తోమేస్తున్నారని గోల పెట్టే మగవారు ఈఫీసులో (అనగా ఇంట్లో) తమ భార్యలకో, స్త్రీలకు తాము ఆఫీసులో కోరుకునేవాటిలో ఎంత అందిస్తున్నారు?

Metla Subbarao says Hi!

ఓమ్ సోక్-డే తగిలే వరకూ హన్ జీవితం ఒకలా ఉంటుంది. తగిలాక ఎదిరించాలనుకున్నాక మరోలా మారుతుంది. ఆ పైన ఓమ్ శరణం గచ్ఛామి అన్నాక మరోలా మారుతుంది. మాస్టర్ కిమ్ డ్రాగన్‌లా దూసుకొచ్చాక కొత్త మలుపు తిరిగుతుంది.

అతని తండ్రి సోల్ నగరంలో ఉన్నంత కాలం తను ఆడింది ఆట. పాడింది పాట. కాకపోతే just like every Korean guy with self-respect, తన జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలనుకుంటాడు. దానికి విద్యను మార్గంగా ఎంచుకుంటాడు.

అతని తండ్రి నగరంలో ఉన్నంత వరకూ అధికారులను మచ్చిక చేసుకుని కావలసినవి సాధించుకుంటాడు. అదే ఒక పై స్థాయి వ్యక్తితో తగూ పడ్డాక అతని జీవితం తలక్రిందులవుతుంది. ఇదే జీవితంలోని నిజం. వీటిని జయించి ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకేలా ఉండగలిగే వాళ్ళు చాలా అరుదు. మిగతా వాళ్ళందరిదీ సోల్ సర్కస్ (multiple puns).

Chapter 58

ఒక దక్షిణ కొరియా సైనికుడు ఉంటాడు. అతని డ్యూటీ జాయింట్ సెక్యూరిటీ ఏరియాలో. అక్కడ డీమిలిటరైజ్డ్ జోన్ (DMZ) వద్ద కావలి కాస్తూ ఎదురుగా అదే పని చేస్తున్న ఉత్తర కొరియా సైనికుల మొహాలు చూస్తూ నించోవటం. అలా జీవితాలు జీవితాలు గడిచిపోతాయి. కాకపోతే రోజూ చూసుకునే మొహాలు కాబట్టి, దేశాలు, సరిహద్దులు అనే విషయాలు పక్కన పెడితే, అలా రోజూ మొహాలు చూసుకునే వాళ్ళు పలకరించుకోరా? కొంచం కూడా స్నేహమన్నది డెవలప్ కాదా?

ఒక రోజు మన దక్షిణ కొరియా సైనికుడు తన తోటి సైనికులతో అటూ ఇటూ తిరుగుతూ దారి తప్పి ఉత్తర కొరియా వైపు వెళ్తాడు. అక్కడ చూసుకోకుండా ఒక landmine దగ్గరకు చేరతాడు. ఇంతలో వీళ్ళను చూసిన ఉత్తర కొరియా సైనికులిద్దరు వీళ్ళ దగ్గరకు వచ్చి వాటిని న్యూట్రలైజ్ చేసి వీళ్ళను కాపాడతారు.

ఇంట్లో చెప్పే వచ్చారా?

ఇలాంటి డైలాగులుండవు. ఎవరి దారిన వాళ్ళు వెళ్తారు. కొన్నాళ్ళకు, మన దక్షిణ కొరియా సైనిక వీరుడు ఉత్తర కొరియా సైనికులకు శుభాకాంక్షలు చెప్తూ పలకరింపు మెసేజులు పంపిస్తాడు. మానవ సహజంగా ఆత్మీయంగా పలకరించిన వారికి తగిన రెస్పాన్స్‌నే ఇస్తారు అతన్ని కాపాడిన సైనికులు. క్రమంగా వారిమధ్య స్నేహం బలపడుతుంది. మంచిగా పలకరించుకుంటే రాక్షసుల మధ్యే మైత్రి కుదురుతుంది. అలాంటిది మనుషుల మధ్య కుదరదా స్నేహం?

అలా వారి మోడువారిన జీవితాల్లో ఈ సాన్నిహిత్యం వసంతంలా నిలుస్తుంది.

కానీ కాలమాగదుగా. వసంతం తరువాత గ్రీష్మం రావాలి. అటూ ఇటూ పై అధికారులకు తమ స్నేహం గురించి తెలిస్తే ఏం కొంపలు అంటుకుంటాయో అని ఇక రాకపోకలు తగ్గిద్దాం అనుకుంటారు. ఇంతలో ఆ స్నేహితులలో ఒకరి పుట్టిన రోజు వస్తుంది.

దాన్ని సెలబ్రేట్ చేసుకుని కొంతకాలం సైలెంట్ అవుతాం అనుకుంటారు. ఆ సెలబ్రేషన్ టైమ్‌లో ఒక దేశపు అధికారి వస్తాడు. విషయం గ్రహిస్తాడు. ఇంతలో ఈ సైనికులు జరిగింది, జరుగుతోంది తెలియజెప్పి దయచేసి విషయాన్ని పెద్దది చేయవద్దని వేడుకుంటారు. As a human being that officer relents.

But fate has other plans. ఇంతలో ఒక కాల్. అది ఎత్తుతే బండారం బైట పడుతుంది. ఆ టెన్షన్, హడావుడిలో తుపాకి అనుకోకుండా పేలటం, మరణాలు సంభవించటం జరుగుతుంది.

వాళ్ళు చేసిన తప్పు సాటి మనిషితో స్నేహం. కాకపోతే ఆ సాటి మనిషి తమ దేశానికి శత్రుదేశం అని భావించే దేశపు వ్యక్తి. స్నేహానికి ఎల్లలు ఉండాలా? మరి దేశ భద్రత? మనిషి విశ్వమానవుడు కాడా? ఎల్లలు దాటలేడా? మరి అంతర్గత భద్రత? దేశం?

తెగే ప్రశ్న-సమాధానాలు కావు ఇవి.

అందుకే ఈ కథకు మరో కోణం చూపాడు మన పార్క్ చాన్-వుక్.

అదే Maj. Sophie E. Jean వైపు కథ.

ఇప్పటి వరకూ ఆదాము అవ్వకు చెప్పిన కథ నిజానికి పెద్ద స్పాయిలర్.

“డాలింగ్, ఇంత పెద్ద స్పాయిలర్ చెప్పేశావు. మరి సినిమా చూస్తే వచ్చే మజా పోతుంది కదా?” అవ్వ ఉవాచ.

“ఈ సినిమాను మిస్టరీ, థ్రిల్లర్ అని అంటే విశ్వ నరుడు గుఱ్ఱం జాషువాను అవమానించినట్లే. కథను తనకు నచ్చిన రీతిలో తీశాడు పార్క్. కానీ, అందులో చర్చించిన విషయాలు విశ్వజనీనం. అందరూ తెలుసుకోవలసిన, ఆలోచించవలసిన, ఆచరించవలసిన విషయాలు. అయినా నీకు పార్క్ సంగతి తెలుసుగా. కథంతా తెలిసినా అతనెలా తీశాడన్నది ప్రధానం. అందుకనైనా చూస్తారు.” ఆదాము ఉవాచ.

ఆదాము చెప్పినట్సు (నాకిక్కడ ఇలాగే పలికింది. మీకు కావాలంటే ట్లు అని మార్చుకోండి) సినిమా కథంతా తెలిసిపోయినా చూసేప్పుడు ప్రతి సన్నివేశం ఆశ్చర్య పరుస్తుంది. కచ్చితంగా చూడాల్సిన.. కాదు కాదు experience కావలసిన సినిమా ఇది.

“ఆదీ డాలింగ్, పేగు బంధం రక్త సంబంధం సరే! మరి స్నేహ బంధానికి కూడా ఎల్లలు ఉండకూడదు అనిపిస్తోంది. కానీ, ఆ స్నేహం వల్ల కానీ, బంధం వల్ల కానీ, greater good లేనప్పుడు?” అవ్వ తనలో తాను గొణుకుకుంటున్నట్లు పైకే అనేసింది.

ఆదాము ఆలోచనలో పడ్డాడు.

ఇంతలో అడవిలో ఎండుటాకులు కదిలినట్లయింది.

(సశేషం)

Exit mobile version