Site icon Sanchika

కొరియానం – A Journey Through Korean Cinema-7

Chapter 6

[dropcap]ఎ[/dropcap]దలో జ్ఞాపకం కథలా మెదిలింది

మొత్తానికీ Oldboy చూడటం పూర్తైంది నాకు. ఐదారు సిటింగుల పైనే పట్టింది ఆ వైలెన్స్ తట్టుకుంటూ సినిమా చూడటానికి. వివరాలు మిస్ కాకుండా చూస్తేనే అసలైన మజా అని ఆ డీవీడీలు పంపిన మిత్రుడి సలహా కదా. ఆ సందర్భంలోనే వెన్జన్స్ ట్రైలాజీ కాకుండా ఎదురుపడ్డ కొరియన్ సినిమాలు City of Violence, Failaan, షిరీ. Peppermint Candy దర్శకుడి తరువాత సినిమా “డిటో”. అన్నీ ఏదోరకంగా డిప్రెస్డ్ ఫీలింగ్ కలిగించేవే.

వైలెన్స్ active గానో passive గానో ఉన్నవే. కాస్త రూట్ మారుద్దామని వెతుకుతుంటే నాకు ఎదురుపడింది మీ హాక్ అనే పేరు ఉన్న పిల్ల (అనే అనుకుంటున్నా). ఏదో ఫోరమ్‌లో ఆ పేరుతో ఉన్న ఐడీ ఒక సినిమా గురించి enquiry చేస్తూ కథను కాస్త చెప్పింది. నాకు ఆసక్తి అనిపించి ఆ థ్రెడ్ ఫాలో అయ్యాను. చివరకు చూస్తే ఈ సినిమానే చూడాలి అనిపించింది కొన్నాళ్లకు.

సినిమా పేరు …Ing. మన తెలుగు సినిమా బఫ్స్, పేరొందిన సో కాల్డ్ రివ్యూ రైటర్లు ఆ సినిమాను ఇప్పటికీ పట్టించుకోలేదు. కానీ, చూసి తీరాల్సిన గొప్ప సినిమా. అణువణువూ జీవితం మీద ప్రేమ నింపుకున్న వ్యక్తి తన జీవితాన్ని నిలబెట్టిన వ్యక్తికి tribute గా తీసిన సినిమా. వైలెన్స్ లేదు. రక్తపాతం లేదు. భీభత్సమైన కథాకథనాలు లేవు. ఉన్నదల్లా ప్రేమ, చిన్నపాటి మనసును మెలితిప్పి ఆహ్లాదమో, చిన్నపాటి తీపి విచారమో కల్పించే కథనం. ఒక తీపి జ్ఞాపకం లాంటి కథ. ఎన్నేళ్ళైనా మర్చిపోలేని చిరు జ్ఞాపకం.

ఈ సినిమా కోసం చాలా వెతకాల్సి వచ్చింది. పాప్యులర్ కాదు కదా. ఎక్కడా దొరకలేదు. మిత్రుడిని అడగాలన్పించలేదు. అప్పటికింకా వెన్జన్స్ ట్రైలాజీ పూర్తి చేయలేదు కదా. ఎన్నో వెబ్సైట్లలో శోధిస్తే కొన్ని కొన్ని వివరాలు మాత్రమే దొరికాయి. మి హాక్‌ను అడిగితే థియేటర్లో చూద్దామనుకునే లోపే తీసేశారని, రివ్యూలు మాత్రమే చదివానని చెప్పింది. అంటే సినిమా ఫ్లాప్. అంటే ఈ సినిమా చూడటానికి నేను చేస్తున్న ప్రయత్నాలు వృథానా? అనవసరంగా ఒక బాగోని సినిమాను గురించి ఏదో ఒక ఫోరమ్‌లో జరిగిన చిన్న డిస్కషన్ ఆధారంగా చూడాలని ప్రయత్నాలు చేస్తున్నానా? కొన్నాళ్లు ఆ సినిమాను పక్కన పెట్టాను. కొన్ని నెలల తరువాత…

అవతార్ వచ్చిందీఈఈఈఈఈఈఈ.

అవతార్ చూడటం, ఆ డిస్కషన్లు, హడావుడీ కొంత కాలం నడిచింది. అసలే గురువు గారి సినిమా. పైగా చాలా గొప్పగా ఉంది. కొత్త టెక్నాలజీ. కానీ ఆశ్చర్యకరంగా ఆ సినిమాలో ఒక సన్నివేశం చూసినప్పుడు ఒక కోట్ గుర్తుకు వచ్చింది. ఎందుకు? అంటే కొన్నిటికి లాజిక్ లు ఉండవు. ఆ కోట్ ఇచ్చింది …Ing సినిమా డైరక్టర్.

“రొమాన్స్ లో కన్నీరు కూడా తీయగానే ఉంటుంది.”

ఇంత అద్భుతమైన ఆలోచన ఉన్న దర్శకురాలు తీసిన సినిమా బాగనే ఉండి ఉంటుంది అన్న ఆలోచనతో మళ్ళా మళ్ళా ప్రయత్నాలు చేస్తే హఠాత్తుగా ఒక తెలిసిన వ్యక్తి పంపిన యూట్యూబ్ లింక్ ఓపెన్ చేస్తే దొరికిందీ సినిమా. 2003లో వచ్చిన …Ing, present continuous tense ను రిఫర్ చేస్తుంది. జీవితంలో ప్రతి క్షణమూ అద్భుతమే. ఆ అద్భుతాలను ఎన్ని పోగేసుకోగలమో మనం అంత ధనవంతులం అన్నది సినిమాలో ఆంతర్లీనంగా చెప్పే మెసేజ్.

చిత్రం చూశారా? ఇప్పటి వరకూ వెన్జన్స్ గురించీ వైలెన్స్ గురించి మాట్లాడుతున్న మనం ఆ ఎమోషన్ యొక్క పీక్ (Oldboy) చూశాక ఆ దర్శకుడు చెప్పినట్లు జీవిత పరమార్థం దగ్గరకి వచ్చాం!

క్లుప్తంగా …Ing కథ ఇదీ…!

మి సుక్ కు కూతురే లోకం. భర్త మరణిస్తాడు. చిన్నతనంలోనే తన కూతురుకు అనారోగ్యం. ఎన్నాళ్ళు బ్రతుకుతుందో తెలియని స్థితి. ఆ పిల్లను వీలైనంత సంతోషంగా ఉంచాలనేది మి సుక్ ఆలోచన. ఎదిగే దశలో కూతురు జీవితం అంతా హాస్పిటల్ లోనే గడుస్తుంది. ప్రస్తుతం హైస్కూల్ వయసు. ఆ పిల్లకు Ballad dancer కావాలని ఆశ. అది తీరదని తెలుసు. కానీ, తీరదని ఆశలను వదిలేసుకుంటామా ఏమి? కూతురు పేరు మిన్-ఆ (Min-ah). అంటే agile అని. చురుకైన, హుషారైన. వీటి కన్నా లాఘవం కలిగిన అని అర్థం. ఒక ballad dancer కావాలనుకునే అమ్మాయికి తగిన పేరు. అనారోగ్యం వల్ల ఎవరితో కలవలేదు. స్నేహితులు కూడా తక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి, ప్రత్యేకించి ఒక టీనేజర్ పరిస్థితి ఎలా ఉంటుందో మనకు అర్థం అవుతుంది. కానీ మిన్-ఆ దాదాపు నార్మల్ చైల్డ్ లాగనే ఉంటుంది. కాస్త introvert అంతే.

తల్లి తనను పేరు పెట్టి పిలిచే అంత చనువు ఇచ్చినా, ఈ పిల్లకు అవసరాన్ని బట్టీ ఎంతలో ఉండాలో బాగా తెలుసు. అలాగే ధైర్యవంతురాలు. ఆ విషయం తన లైటర్‌ను ఇంటి కింద పోర్షన్ లో దిగిన Young-jae ఎత్తుకుపోయినప్పుడు తెలుస్తుంది. Young-jae మిన్-ఆ ను ఆటపట్టిస్తూ దగ్గరవాలని చూస్తాడు. ఎంతకీ లొంగదు. తన లైటర్‌ను ‘దొంగిలించి’ నందుకు అతన్ని తెగ సాధిస్తుంది. తల్లి మి సుక్ మాత్రం వారి స్నేహాన్ని హర్షిస్తుంది. ఇంకా దగ్గరకమ్మని ప్రోత్సహిస్తుంది కూడా.

Progressive అనే మాట వాడకుండా, లెక్చర్లు దంచకుండా కేవలం తన చేతుల ద్వారా ఒక progressive attitude చూపిస్తుంది మి సుక్. క్రమేపీ మిన్-ఆ Young-jae కి దగ్గరవుతుంది. తన కలలను, ఆశలను పంచుకుంటుంది. వాటిని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాడతను. ఇంతలో ఒక ట్విస్ట్. అప్పటికే ముగింపు రాసేసి ఉన్న మిన్-ఆ జీవితం ఎలా ముగుస్తుంది అన్నదానికన్నా, ఆ ముగింపు వల్ల మి సుక్, Young-jae జీవితాలు ఎలా మార్పు చెందుతాయి అన్నది సినిమాలో ప్రధానాంశం. మొత్తం మూడు ట్విస్టులుంటాయి. ఒక్కొక్కటీ ఒక్కోరకంగా పేలుతుంది. కథను మనం చూసే దృక్కోణాన్ని మార్చేస్తుంది. ఇక నాలుగో ట్విస్ట్ అయితే… అబ్బో! మాటల్లో చెప్పలేం. దాని గురించి తరువాత మాట్లాడుకుందాం.

చాలా సింపుల్ కథ. చాలామందికి తెలిసిన కథే. ఇలాంటి కథలతో మనవాళ్ళు కూడా చాలా సినిమాలు తీశారు. ఈ సినిమా కోసం నేను వెతుకులాడే రోజుల్లోనే వచ్చిన ఓయ్ (బేబీ షామిలీ పెద్దయ్యింది) లో కొన్ని సన్నివేశాలు, అనుభూతించాల్సిన దృశ్యాలు వాడుకున్నారు. కానీ, ఒక గొప్ప సినిమాకు, మంచి సినిమాకు తేడా అల్లా aesthetics అని నేనిచ్చుకున్న సమాధానం. ఎక్కడో పెద్దలు చెప్పే ఉండవచ్చు కూడా. మరో రకంగా చెప్పాలంటే what separates great art from good art is aesthetics. ఆ తేడా మనకి సినిమాలో బాగా తెలుస్తుంది. చాలా సాధారణ సన్నివేశాలను కూడా దృశ్యాత్మకంగా రిచ్ గా చూపటమే కాదు, మనల్ని ఎంగేజ్ చేసే విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. కథ, కథనం, శబ్దం, తెరపై కనిపించే దృశ్యం, డిటెయిలింగ్, నటీనటుల హావభావాలు… ఇవన్నీ ఎంత sync అవుతాయంటే చూసి అనుభూతి చెందాల్సిందే తప్ప మాటల్లో చెప్పటం సాధ్యం కాదు.

ఏతావాతా, …Ing is not a great film by any stretch. But it is one of the very few films I recommend not to miss at any cost.

ఈ …Ing చూస్తున్నప్పుడే పరిచయమైన మరో సినిమా Our Twisted Hero. కొరియన్ కల్చర్ కు addict అయిన, అవుతున్న ఈ కాలం కన్నా దశాబ్దం ముందరగానే నాకు కూడా కొరియా సినిమాల మీదే కాదు, వారి దైనందిన జీవితాల మీద, సాహిత్య సంస్కృతీ సంప్రదాయాల మీద ఆసక్తి కలిగింది. అప్పుడు పరిచయమైన నవల Our Twisted Hero. సంచలన కొరియన్ రచయిత Yi Mun-yol రచించిన ఈ నవల ఒక పొలిటికల్ allegory. George Orwell రచించిన Nineteen Eighty-Four స్థాయి వర్క్ కింద చెప్తారు. ఆ నవల ఆధారంగా తీసిన సినిమానే Our Twisted Hero. ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం Oldboy లో Oh Dae-su పాత్రలో అదరగొట్టిన Choi Min-sik కనిపించిన తొలి సినిమా (తెరంగేట్రం ఎందుకో వాడబుద్ధి కాలేదు). పూర్వాశ్రమంలో అతను theatre artist. గొప్ప Method actor. Subtlety లో కూడా మాస్టర్.

1993లో వచ్చిన ఈ సినిమా కొరియాలో సంచలనం సృష్టించింది. ఈ రోజు మనం చూస్తున్న కొరియన్ వేవ్ కు బీజం వేసిన వాటిలో ఇది కూడా ఒకటి. ఇందులో Choi Min-sik played the villain role (మాస్టర్ కిమ్) who in retrospect turns out as a hero essential at that point of time. But the methods he chose to get to his goal are deplorable nonetheless. So, he’s a villain again. ఒక రకంగా చెప్పాలంటే Anti-Krishna.

గరికిపాటి నరసింహారావు గారు చెప్పే “తప్పది. కానీ తప్పదది.” అని చెప్పే సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకం. End result తప్పు కాదు. ఎంచుకున్న మార్గం సరైనది కాదు. పైగా alternatives ఉంటాయి కూడా. కానీ వాటిని వాడడు ఈ మాస్టర్ కిమ్. అలాంటి కాంప్లెక్స్ పాత్రను అవలీలగా లాగించేస్తాడు చోయ్.

ఇతని గురించి, మిత్రులు, విమర్శకులు, మాజీ జర్నలిస్ట్ కీ.శే. శ్రీ రాజేంద్రకుమార్ దేవరపల్లి ఇలా అంటారు.

<<<ప్రపంచ సినిమా రంగం ఎందుకని మోరలెత్తి కొరియా సినిమాల వైపు చూస్తోంది? హాలీవుడ్ వాళ్ళ ఎందుకని మర్యాదగా కొరియన్ సినిమాలను రీమేకులు చేసుకుంటున్నారు? ఎందుకు భారతదేశములో చాలా మంది సినిమా దర్శకులు/కథకులు రెండు,మూడు కొరియన్ సినిమాలను కలిపి కుట్టి స్వంత కథల్లా చలామణి చేసుకుంటున్నారు. కొరియా చలన చిత్ర పరిశ్రమ ఈనాడు ఉన్న స్థాయికి చేరుకోవటానికి చాలామంది కృషి చేసి ఉండొచ్చు కానీ అందరిలోకి అగ్రగణ్యుడు చోయ్ మిన్-సిక్. ఇతను గత ఇరవై ఏళ్ళలో ఎన్ని సినిమాలు, ఎన్ని పాత్రలు, ఎంతటి వైవిధ్యం?? రక్తం తాగే రాక్షసుడు (ఐ సా ది డెవిల్), అతి తక్కువ పడవలతో మహాసైన్యాన్ని ఎదిరించి గెలిచిన సైన్యాధిపతి (ది అడ్మిరల్). ఇక ఓల్డ్ బాయ్ అన్నది ప్రపంచ క్లాసిక్.

వందలాదిమందిని చంపిన నరభక్షకి అయిన భయంకరమైన పెద్దపులి, ఆ పులిని వేటాడాలనే ముసలి వేటగాడు. ఒకరోజు ఆ పులి వేటగాడి దగ్గరకొచ్చి రా తేల్చుకుందామంటే,తను వేటాడబోయే ఆ క్రూర మృగానికి సాష్టాంగ నమస్కారం చేసే సన్నివేశం, The Tiger: An Old Hunter’s Tale. ఇలా ప్రతి సినిమాలోనూ తన పూర్తి స్థాయి ప్రతిభ చూపే అద్భుతమైన నటుడు Choi Min-sik.>>>

ఈ Our Twisted Hero ఎంత allegorical కథో, …Ing కూడా అంతే allegorical. ఆ నవలలో ప్రతి వాక్యం ఒక ఆణిముత్యం. We have to double check each and every sentence to get the gist of it. ఈ సాధారణంగా కనిపించే అతి మామూలు ఫీల్ గుడ్ రొమాన్టిక్ డ్రామా …Ing కూడా ప్రతి సన్నివేశాన్నీ double check చేసుకుంటూ చూడాలి. అప్పుడు మనకు శంకరాచార్యులు అందించిన నిర్వాణ షట్కం బోధపడుతుంది. జీవితం మీద వైరాగ్యం రప్పించకుండానే. ఈ విషయాలు అర్థం కావు కాబట్టే Our Twisted Hero, …Ing రెండూ మనవైపు పాప్యులర్ కాలేదు. కొరియన్ వేవ్ కు ముందు సినిమా కనుక Our Twisted Hero ignore చేయబడింది. మామూలు రొమాన్టిక్ సినిమాగా చూడటం వల్ల …Ing అంత ప్రఖ్యాతి గాంచలేదు.

వీటి గురించి రాబోయే ఎపిసోడ్లలో చూద్దాం.

Exit mobile version