కొరియానం – A Journey Through Korean Cinema-9

1
3

పదమై పెదవిపై నాట్యమాడింది

Chapter 8: Prologue

[dropcap]1[/dropcap]994, సెప్టెంబర్ 17.

Sacramento, California.

అప్పటికి బ్లాక్బస్టర్ల మెషిన్, తరువాత కొద్దికాలంలోనే దిగ్దర్శకుడిగా ఎదిగిన జేమ్స్ కామరాన్ హడావుడిగా తన మిత్రుడు, వర్ధమాన మెక్సికన్ దర్శకుడు Guillermo del Toro (అప్పటికి Cronis తీశాడు) రూమ్ లోకి దూసుకెళ్ళాడు. టోరో ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకంత హడావిడో అర్థం కాలేదు. ఆర్నాల్డ్ ష్వాజ్నెగర్‌తో తీసిన ట్రూ లైట్స్ మెగా సక్సెస్ అయింది. అప్పట్లో అదే అతి పెద్ద బజట్ సినిమా. దానికి ముందు టెర్మినేటర్ 2 చారిత్రక విజయం సాధించింది. కామరాన్‌తో సినిమాలు తీరాలని పెద్దా చిన్నా స్టూడియోలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. Twentieth Century Fox వాళ్ళు అతనితో ఒక మెగా డీల్ కుదుర్చుకున్నారు. దాని వల్ల కామరాన్ మల్టీ మిలియనేర్ అయ్యాడు. అయినా తన పాత అలవాట్లు మార్చుకోలేదు. బైక్ రైడింగ్ బాగా ఇష్టం.

మన టెర్మినేటర్ ఆర్నాల్డ్ గారు జత కలిస్తే ఇక జాతరే జాతర. వీళ్లకు తోడు టామ్ ఆర్నాల్డ్ జతయ్యాడు ట్రూ లైస్ టైమ్ నుంచీ. అలా ఒక ఉదయం రైడింగ్ కానిచ్చాక వచ్చాడు జిమ్ కామ్ అనబడే జేమ్స్ కామరాన్. “నాకో అద్భుతమైన ఐడియా వచ్చింది. చాలాకాలం నుంచీ ఆలోచిస్తున్నాను. ఎప్పుడూ హై కాన్సెప్ట్ పెద్ద బజట్ సినిమాలేనా? చిన్న బజట్‌లో తేలికైన సినిమాలు తీసి మెప్పించలేనా అని. ఫాక్స్ వాడితో రాబోయే ప్రాజెక్ట్‌కు ముందుగా ఒక లవ్ స్టోరీ తీయాలని ఉంది.”

“అద్భుతంగా ఉంటుంది జిమ్. ఇంతకీ నీ ఐడియా ఏంటి?” టోరో అడిగాడు.

“ఒక పెద్దింటి అమ్మాయి. ఎవరూ లేని అనాథ కుర్రాడు. అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోతుంటే ఆపబోయి గాయపడతాడు. ఇక కోలుకోలేడని చెప్తారు. తన వల్లే ఇతనికీ పరిస్థితి వచ్చిందని ఆమె ఇతన్నికి సేవ చేస్తుంది. అతని ఆప్టిమిస్ట్ మెంటాలిటీ వల్ల అతనితో ప్రేమలో పడుతుంది. కానీ జీవితం మీద ఆమెకు ప్రేమ పుట్టదు. ఈలోగా కోలుకోలేని అతను మరణిస్తాడు. మరణించే ముందు కూడా అతని కళ్ళలో ధైర్యం. ఒక పాత మిత్రుడిని కలుసుకోబోతున్నాను అన్నంత సంతోషం. అతని attitude, మరణాన్ని కూడా ఆనందంగా ఆహ్వానించిన అతని స్వభావం ఆమెను జీవితంతో ప్రేమలో పడేలా చేస్తుంది. దీన్ని రూరల్ backdrop లో తీద్దామని ఆలోచన. చిన్న పల్లె చాలు. చాలా తక్కువ లొకేషన్లు. ఎక్కువ ఖర్చు లేకుండా.” కామరాన్ చెప్పాడు. టోరో ఆశ్చర్యంగా విన్నాడు.

నిజానికి కామరాన్ తీసిన సినిమాలన్నీ ప్రేమ కథలే. మొదటి టెర్మినేటర్ నుంచీ ట్రూ లైస్ వరకూ. ప్రేమ అతని సినిమాల backdrop. ఈసారి అదే ప్రేమను foreground లో ఉంచి, సింపుల్‌గా ఒక ఫీల్ గుడ్ సినిమా తీద్దామని అతని ఆలోచన.

ఆర్నెల్ల తరువాత టోరో ఒక ఫోన్ కాల్‌లో అడిగాడు. “ఎంత వరకూ వచ్చింది జిమ్ నీ ప్రేమ కథ?”

“ఫాక్స్ వాళ్ళు రెడీ. లొకేషన్ హంట్ కోసం బజట్ కేటాయించారు. సినిమా తీయటమే ఆలస్యం.” కామరాన్ languid గా చెప్పాడు. “Backdrop ఏది? రూరల్ సౌత్? న్యూ ఫౌండ్ ల్యాండ్?”

ఎందుకంటే వీటి గురించే వారి మధ్య పాత సంభాషణలు జరిగాయి.

“టైటనిక్.”

టోరో నోరెళ్ళబెట్టాడు. ఏమనుకున్నాడో ఏమో కానీ, తరువాత ఇంటర్వ్యూల్లో చెప్పిన దాని ప్రకారం మరో బిగ్ బజట్ extravaganza అని మాత్రం నేను ఊహించానని చెప్పాడు. అవతల వైపు కామరాన్ మాట్లాడుతూనే ఉన్నాడు. టోరో చేతిలో రిసీవర్ జారిపోయింది.

Chapter 8

టైటనిక్ కథ చాలా సింపుల్ లవ్ స్టోరీనే. కామరాన్ కోరిక అలా తీరింది. మిగతావి వదిలేస్తే… ఎప్పుడూ పెద్ద స్కేల్‌లో ఆలోచించే కామరాన్ తను టోరోకు చెప్పిన కథను మాత్రం మర్చిపోలేదు. కానీ దాన్ని ఉన్నదున్నట్లు చిన్న బజట్ సినిమాగా తీయలేకపోయాడు. కానీ ఆ సింపుల్ ప్రేమ కథలోని జిస్ట్‌ను అటు టైటనిక్‌లో, ఇటు ఈమధ్యే వచ్చిన అలిటాలో వాడాడు. అలా చిన్న విషయాలలో ఆనందాన్ని వెతుక్కోవటమే జీవిత పరమార్థం అని చెప్పే మన కొరియన్ మూవీ …Ing ఎంత సింపుల్‌గా మొదలౌతుందంటే…

మన హీరోయిన్ చక్కగా తయారయి తన స్కూల్‌కు వెళ్తుంటే వచ్చే అందమైన షాట్స్‌తో. అలా ఒక చిన్న vibrant atmosphere ను ఎస్టాబ్లిష్ చేసిన దర్శకురాలు సున్నితమైన కథనంతోనే ఎంతో లోతైన అనుభూతులను పంచుతుంది. చిన్న డిటెయిల్స్ లోనే ఎంతో కథను చెప్పకనే చెప్తుంది.

మిన్-ఆ చేతికి ఒక ఉన్ని తొడుగు ఉంటుంది. మరోచేతిని మామూలుగానే వదిలేస్తుంది. ఎందుకు? మనలో ప్రశ్న. బుల్లీయింగ్ ఎక్కువుండే కొరియన్ స్కూళ్ళలో అసలు విషయాన్ని పట్టించుకోకుండా మిన్-ఆ ను మామూలుగానే చూస్తారు. అంటే ఆమె పరిస్థితి అందరికీ ముందే తెలుసు. ఏంటా పరిస్థితి? మనకింకో ప్రశ్న. వెనకాల – లల్లాల్ల లల్ల లల్లాల్ల లల్ల లల్లాల్ల లల్ల రిథమ్ ఉన్న background score మంద్రంగా వస్తుంటుంది. కథలోని సింప్లిసిటీని తెలియజేస్తూ. మరోవైపు జీవితమెంత complex అయిందో అన్న విషయాన్ని గుర్తుచేస్తూ ట్రాఫిక్ chaos. వాహనాల సౌండ్లు. మిన్-ఆ రోడ్ క్రాస్ చేసి స్కూల్‌కు వెళ్ళాలి. ఒక క్షణం ట్రాఫిక్ గురించి తటపటాయించినా ముందుకు కదులుతుంది. తన కండిషన్ తెలిసినా జీవితంలో ముందుకే వెళ్ళాలనే హింట్. మిన్-ఆ మనస్తత్వం. ఆ పిల్ల జీవితానికి ముంచుకొస్తున్న మరణం అనే ముప్పు ఆమెను ఆపలేకపోతోంది. ఇంతలో హడావుడిగా రోడ్ దాటుతున్న ఇంకో పిల్ల మిన్-ఆ ను గుద్దుకుంటూ వెళ్తుంది. చేతిలోంచీ వస్తువులు జారిపడతాయి.

క్షణం ఉంటే తన వస్తువుల కోసం ఆగిన మిన్-ఆ ని పెద్ద వెహికిల్ గుద్దేసేదే. ఒక వ్యక్తి ఆమెను ఆపి, నిలదొక్కుకునేలా చేసి ట్రాఫిక్ ఆపి ఆమెను పంపుతాడు. ఫర్లేదు. నేను ఉన్నంత వరకూ ట్రాఫిక్ ఆగుతుంది అనే assurance అతని నవ్వులో కనిపిస్తుంది. కానీ మనకు రిజిస్టర్ అయ్యేది, అతని కళ్ళలో కారుణ్యం. తోటి మానవుల పట్ల అంతులేని ప్రేమ.

ఒక్క డైలాగ్ ఉండదు. Patol Babu, Film Star లో పతోల్ బాబుకు ఇచ్చిన చిన్నపాటి “ఓ” అనే సౌండ్ కూడా ఉండదు. స్క్రీన్ మీద సరిగ్గా క్షణం కనిపిస్తుంది మనకు అతని మొహం. జీవితకాలం గుర్తుండిపోతుంది. అంత బలంగా రిజిస్టర్ చేస్తుంది దర్శకురాలు Lee Eon-hee. దీని వల్ల మనకు మరో క్యూరియాసిటీ. కేవలం రెండు నిముషాల కాలంలో ఎంతో చెప్తుంది మనకు. విజువల్ స్టోరీ టెల్లింగ్‌లో తారాస్థాయి. ప్రతి విజువల్, డైలాగ్, డిటెయిల్ కథను ముందుకే తీసుకువెళ్తాయి. సినిమాలో రాబోయే విశేషాల చిన్నపాటి ట్రైలర్. మరోరకంగా చెప్పాలంటే సినిమాలో ఉండే ప్రధాన మలుపులను సూక్ష్మంలో మోక్షంలా మనకు foreshadowing రూపంలో చూపించేస్తుంది.

దీన్ని Our Twisted Hero ఓపెనింగ్‌తో పోలుద్దాము.

పెద్ద భవనాలు, చిన్న భవనాలు. వాటిమధ్య చెట్లు, ఇళ్ళు. వెనకాల వాయిస్. కెమేరా ఒక క్లాస్ లోకి pan అవుతుంది. చెప్పే విషయం స్వేచ్ఛ గురించి. ఉదాత్తమైన విషయం. కానీ అది పూర్తయేలోపే, మన ఉపాధ్యాయుడు టైమ్ అయిందని దాని వివరణ ఇవ్వకుండానే క్లాస్ కట్టేసి వెళ్తాడు. ఆ కొటేషన్…

In the long history of the world, only a few generations have been granted the role of defending freedom in its hour of maximum danger. But most people failed at the time of most dangerous moment and gave up.

ఇది John F. Kennedy చెప్పిన మాటలకు మరో వేరియేషన్. అలా గివప్ చేయని వాళ్ళే నిజమైన హీరోలు. కానీ క్షణమెక్కువ కాలం క్లాస్‌ను కూర్చోబెట్టి పాఠంలో కీలకమైన వియయాన్ని చెప్పకుండా పిల్లలు కదలగానే ఆగిపోయి, తరువాత చూసుకుందాం అనుకునే లెక్చరర్ ఆ కొటేషన్‌ను చెప్పటం ఎంత గొప్ప ఐరనీ? రచయిత యి మున్-యోల్ ఎంత ప్రభావవంతంగా read between the lines టెక్నిక్ వాడాడో అంతకన్నా ప్రభవవంతంగా దర్శకుడు ఈ సన్నివేశంలో చూపిస్తాడు. ఆ లెక్చరర్ మొహంలో అసందిగ్ధం కూడా పైన మిన్-ఆ కు తోడు నిలిచిన వ్యక్తి మొహంలా మర్చిపోవటం కష్టం. కానీ ఇతనిది క్షణ కాలం పాటూ flash లా వచ్చే పాత్ర కాదు. ఇతను మన హన్ యే. కథలో ప్రధాన పాత్రధారి.

అటు …Ing అయినా, ఇటు Our Twisted Hero అయినా కేవలం మొదటి ఒకటిన్నర నిమియంలో ఎంతో సమాచారాన్ని ఎంతో చులాగ్గా ఇచ్చి మనను అనిర్వచనీయమైన ఆనందానికి/అలజడికి గురిచేస్తాయి. అసలు ఇలాంటి డిటెయిలింగ్‌తో మన subconscious mind లో తిష్ట వేసుకోవటం వల్లే కొరియన్ సినిమాలైనా, సీరీస్‌లు అయినా అంత popular అయ్యాయి. ఏదీ విడమర్చి చెప్పవు. కానీ ఎంతో అర్థమవుతుంది. ఊపిరి సలపనివ్వనంత వేగంగా కథనం ఉన్నా, relaxed pacing తో నడిచినా, కొరియన్ దర్శకులు విజువల్ లాంగ్వేజ్‌ను అర్థం చేసుకున్నారు. సినిమా పర్పస్‌ను అవగతం చేసుకున్నారు. ఎంతలా అంటే వారే ప్రత్యేకించి ప్రయత్నించకుండానే ఇంతలా సన్నివేశాలను ముస్తాబు చేసుకునేంత.

No manipulation. Just involving the audience. మంత్రదండం పెట్టి బోనులోకి. లాగినట్లు, గాఢత కలిగిన విజువల్స్ వాడకం కొరియన్ దర్శకుల ప్రత్యేకత. దానికి ఆద్యులలో ఒకడు Park Jong-won. ప్రత్యేక స్టైల్ లేకపోయినా ఇతని సినిమాలు ఎందుకు చరిత్రలో నిలిచాయంటే ఈ విజువల్ లాంగ్వేజ్ వల్లే. దాన్ని తరువాత తరం filmmakers ఇంకో లెవెల్‌కు తీసుకుపోయారు. Basically a majority of major Korean filmmakers are masters in visual storytelling. డైలాగ్స్ మనలా వాడి ఇతర లోపాలను కప్పిపుచ్చుకోవాలనుకోరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here