[dropcap]కొ[/dropcap]రియానం – A Journey Through Korean Cinema
- మెక్ గాఫిన్లు
- రెడ్ హెర్రింగులు
- సస్పెన్స్
- మిస్టరీ
- In medias res
- చెహోవ్స్ గన్
- ఫ్లాష్ ఫార్వర్డ్లు
- ఫ్లాష్‌బ్యాక్‌లు
- ఫ్రేమింగ్ డివైస్‌లు
- Unreliable narrator
- Stream of consciousness
ఏంటివన్నీ, ఏదన్నా సస్పెన్స్ త్రిల్లర్ నవలో సినిమానో అనుకుంటున్నారా? కాదు. కొరియన్ సినిమాపై వినూత్నమైన శైలిలో వస్తున్న వ్యాస పరంపర. ఎప్పటికప్పుడు నూతనత్వానికి పెద్దపీట వేస్తూ, తెలుగు సాహిత్య రచనల స్థాయి ప్రామాణికతకు గీటురాయిగా ఎదుగుతున్న సంచిక అందిస్తున్న సరికొత్త సీరీస్…
కొరియానం – A Journey Through Korean Cinema
ఒక సస్పెన్స్ త్రిల్లర్ తరహాలో రాయబడుతున్న ఈ రచన కొరియన్ సినిమా చరిత్రను ఎవరూ చూడని కోణంలో పరిచయం చేస్తుంది. ఆది మానవుల నుంచీ క్యూరియాసిటీ రోవర్ వరకు, కథ అనే ప్రక్రియ సృష్టి నుంచీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వరకూ… దేన్నీ వదలకుండా ప్రత్యేక శైలిలో రచయిత వేసే చురకల సహితంగా… మీరూ ఈ ప్రయాణంలో భాగం కండి.
శ్రీ వేదాల గీతాచార్య అందించే ఈ సీరిస్ వచ్చే వారం నుంచే…