కొరియానం – కొలమానం
[dropcap]మ[/dropcap]ళ్ళీ వీడెవడ్రా అరుంధతిలో పశుపతి లాగా, అయిపోయిందన్నాడు. మళ్ళా వచ్చాడు.
మీ ఫీలింగ్ సరిగ్గా ఇదే అయితే కనుక..
నేను, “వదల బొమ్మాళీ వదలా.” అంటూ రావటం లేదు. కొనసాగించాలనుకుంటే అనంతంగా కొనసాగించే వీలు ఉన్నా, ఎంత వరకు రాయాలి? ఎలా రాయాలి? ఎలాంటి విషయాలు రాయాలి? ఎన్ని ఎపిసోడ్లు వస్తాయి? భాష ఎలా ఉండాలి? ఎంత శాతం ఇంగ్లీషు వాడాలి?
ఇలా ప్రతిదీ ఒక తూకం ప్రకారం రాశాను.
64 ఎపిసోడ్లు.
59 అధ్యాయాలు.
70,874 పదాలు.
ఏ ఎపిసోడ్ కూడా 4 పేజీలకు తక్కువ 7 పేజీలకు తక్కువ కాకుండా చూసాను (11). పదాల సంఖ్య చూస్తే 700 పదాలకు తక్కువ, 1700 కు ఎక్కువ కాకుండా ఉన్నాయి. ఒక్క చివరి ఎపిసోడ్ మాత్రమే 2084 పదాలు వచ్చాయి. అది కూడా ఎపిసోడ్, ఎపిలోగ్ కలిపితే.
ఇప్పుడో జోక్ చెప్పుకుందాం.
అనగనగనగనగనగా ఒకప్పుడు ఐర్లండ్ దేశంలో James Joyce అనే పెద్దాయన ఉండేవాడట. ఆయన పెద్దవాడు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆయనకు గడ్డం ఉంది కనుక.
ఆయన యూలిసీజ్ అనే ఒక నవల లాంటిది రాశాడట. కానీ అది నవల కాదు. అయినా పెద్దోళ్ళంతా అది గొప్ప నవల అని ఒక స్టాంపేసి చెప్పేశారు.
కానీ సమస్య ఏంటంటే అది ఎవరికీ ఒక పట్టాన అర్థం కాదు. దాని కోసం ఇంకో చిన్న పెద్దాయన A Guide to James Joyce’s Ulysses అని ఇంకో పుస్తకం రాశాడు. Sad గా.
అయితే కుప్పుసామయ్యర్ మేడ్డిఫికల్ట్ అన్నట్లు ఆ గైడ్ కూడా కష్టంగానే ఉంది.
దాంతో ఇంకో చిన్న చిన్న పెద్దాయన The Ultimate Guide To The Guide To The James Joyce’s Ulysses అనే పుస్తకం రాశాడు.
అప్పటికి కానీ ఆ నవల జనానికి అర్థం కాలేదు. అంత అర్థం కాని రచనలో కూడా ఎరోటికా ఉందని దాన్ని నిషేధితో (కాసేపు బెంగాలీ అనుకోండి) పుస్తకాల జాబితాలో చేర్చారని Irving Wallace తన magnum opus లాంటిది. కానీ magnum opus కాదు. అలా అని జనాలు అనుకునే The 7 Minutes అనే పుస్తకంలో రాశాడు.
అవ్విధంగా ఇక్కడ ఈ సంగతి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కొరియానం మీద మా ఫ్రెండ్స్ వేస్తున్న జోక్ వల్ల.
నేను A Guide to GitacharYa’s Koriyanam అనే పుస్తకం రాస్తా అని ఒకడు, అయితే నేను The Ultimate Guide To The Guide To GitacharYa’s Koriyanam అని ఇంకొకడు అంటున్నారు.
బాబులు ఇదేమీ మీ girlfriend కి బటర్ రాసే ప్రోగ్రామ్ కాదు. అసలే కొరియానం చదివింది 3-9 మందే. మీ గైడ్ లను ఎవరూ చదవరు అని పోట్లాడాను. సరే అని ప్రస్తుతానికి ఆగారు. అదండీ సంగతి.
అయితే మాకేంటి అంటారా?
కొరియానంలో 60 దాకా సినిమాల గురించి చెప్పాను. చాలావరకూ ఎక్కువమందికి తెలియనివో, పట్టించుకోనివో. కానీ అవన్నీ గొప్ప సినిమాలు. చూసి తీరాల్సినవే. కనీసం పదిహేను సినిమాలకు రివ్యూలిచ్చాను. అరడజను సినిమాలను డీప్‌గా విశ్లేషించాను (pun absolutely intended). అవతార్ 2 సినిమా కలక్షన్ల గురించి authentic సమాచారం ఇచ్చాను.
Screenplay గురించి చెప్పాను. కథలు ఎలా మొదలవుతాయో, ఎలా ముగుస్తాయో చెప్పాను. కొరియన్లు ఎలాంటి సినిమాలు చూస్తారు? వారి సినిమా, కథల మీద అభిరుచి ఎలా ఉంది? వారికి నచ్చిన మన సినిమాలు చెప్పాను. Superstar Krishna అల్లూరి సీతారామరాజు సినిమా మీద ఒక ప్రముఖ కొరియన్ సినీ విమర్శకుని సమీక్షను ఇచ్చాను.
కొరియన్ల ఆలోచనా విధానం, వారి సమాజం రీతులు అన్న వాటి గురించి సమాచారం అందించాను. వారికీ మనకూ ఉన్న సామ్యాన్ని తెలిపాను.
ప్రముఖ కొరియన్ నటుల గురించీ, వారి background, ఎదిగిన తీరు.. ఇవన్నీ బోరు కొట్టని రీతిలో అందించాను. 5గురు దర్శకుల గురించి గట్టిగా విశ్లేషించాను. పార్క్ చాన్-వుక్ తీసిన దాదాపు ప్రతి సినిమా గురించీ దర్శకుని ఆలోచనలతో సహా విశ్లేషించాను.
కొన్ని సైకలాజికల్ ఎఫెక్ట్ ల గురించి చెప్పాను.
ఒక్క మాటలో తేల్చాలంటే అదీ ఇదీ అన్న తేడా లేకుండా ఆసక్తికరమైన, ఉపయోగకరమైన సమాచారాన్ని పంచుకున్నాను. Unlike in any book/series about films, I also analysed the education system in South Korea. ఇంకేం కావాలి? కొరియన్ వేవ్ గురించిన ఒక మినీ ఎన్సైక్లోపీడియా కొరియానం.
కొరియానం ప్రకటనలో ఏమి ప్రామిస్ చేసామో వాటికన్నా ఎక్కువే అసలు సీరీస్‌లో వచ్చేలా చూశాను. As usual with my works, you may find practical solutions to many day to day issues in it.
నా 2013 పుస్తకం ‘చందమామ రావే’ లో క అనే అక్షరం పిల్లల చేత ఎలా పలికించాలి అన్న విషయాన్ని ఒక కథ లాగా చెప్పాను. నాకు తెలిసి కనీసం ఒక వెయ్యిమంది పిల్లలు క అనే అక్షరాన్ని పలకటం నేర్చుకున్నారు. ఆలోచింపచేయటాలు, ఎండట్టటాలు, అద్దం పట్టటాలకంటే direct గా ఉపయోగపడే అంశాలు, ప్రాక్టికల్‌గా నేర్చుకునే రీతిలో విశేషాలను ఇవ్వటం కన్నా ఒక పుస్తకానికి పరమార్థం ఏముంటుంది?
మొదట్లో చాలా విమర్శలు వచ్చాయి. ప్రత్యేకంగా భాష గురించి. కొండకచో వెకిలిగా ఉంది అని కూడా అన్నారు.
అర్థం కాలేదు అనేది ఇంకో సమస్య. Most of the Easter eggs aren’t understood by many. ‘ఒక రకమైన పాఠకులకు’ అర్థం కాని pop cultural references కూడా ఇబ్బంది కలిగించి ఉండవచ్చు.
చక్కగా నా ట్యూన్ లోకి వచ్చి మొదటి నుంచి చదువుతూ వెళితే అర్థం కాదు అన్న కంప్లయింట్ చేయటం వ్యర్థమని తెలుస్తుంది. But you have to closely observe the references and follow the narration to completely understand.
సినిమాలు తీసే విషయంలో రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి అని screenwriting gurus చెప్తుంటారు. సినిమా సంక్లిష్టంగా ఉండే పనైతే, కథ తేలికగా ఉండేలా చూసుకోవాలి. అదే కథ సంక్లిష్టమైతే కథనం/సినిమా తేలికగా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ కొరియానంలో కథనం సంక్లిష్టంగా ఉంది కాబట్టి చెప్పాలనికున్న అంశాన్ని వీలైనంత తేలికగా ఉంచాను.
ఇక అసలు సంగతి.
దాదాపు అన్ని సాహిత్య ప్రక్రియలు, 85 literary techniques వాడాను. That includes second person narration too (చివరి ఎపిసోడ్‌లో). Broad గా చూస్తే non-fiction thriller జాన్రా కిందకు ఈ సీరీస్ వస్తుంది.
కానీ, దీన్ని ఇదీ అని define చేయటం తేలికైన విషయం కాదు.
సింపుల్ గా నోటికొచ్చిందల్లా రాసిపడేసి దానికి కొరియానం అనే పేరు పెట్టాడు అని కూడా అనుకోవచ్చు. You’re welcome. కానీ, ఆ పిచ్చి రాతను కూడా చదివించేలా ఇంత సంక్లిష్టమైన పద్ధతిలో, ఎక్కడా ఏ ఒక్క లింక్ కూడా మిస్ కాకుండా plot-theme integrity దెబ్బతినకుండా రాయటం కూడా చిన్న విషయం కాదు. అందులో మొదలు పెట్టిన 16 threads కు satisfactory closure ఇస్తూ.
నేను ఇందులో ఇచ్చిన statistical data ఇవ్వాలంటే అంత ఈజీ కాదు. చాలా వరకూ real-time information ఇచ్చాను.
ఇక ఒక్క విషయాన్ని చెప్తే ఇలాంటి రచన చేయటం పిచ్చి రాతలు రాసినంత తేలిక కాదని అర్థమవుతుంది.
22 జూలై 2022 న ప్రచురితమైన కొరియానం 20వ ఎపిసోడ్‌లో ఈ వాక్యాలు రాశాను.
<<<“ఇకపోతే, దర్శకులు చెప్పిన కోణమే కాకుండా రాంగ్జాంగ్ గురించి మరో గొప్ప విషయం చెప్పాలి. ఈమధ్యనే మరోసారి చూస్తుంటే నాకు తట్టింది. దాన్ని నా స్నేహితులతో డిస్కస్ చేసి.. చాలా వివరాలు సేకరించాను. మరింత మథిస్తే గొప్ప సత్యం ఆవిష్కరింపబడే అవకాశం ఉంది. వాటి గురించి ముందు ముందు చూద్దాం. టైమ్ రావాలి కదా.”>>>
ఆ టైమ్ ఎప్పుడు వచ్చిందో గుర్తుందా?
2022 అక్టోబర్ 22, అక్టోబర్ 29, నవంబర్ 5. ఈ తేదీల్లో వచ్చిన 36, 37, 38 ఎపిసోడ్లలో మనం చూశాం.
ఎప్పుడో జులైలో మీడియమ్ లేదా రాంగ్జాంగ్ అనే సినిమా గురించి రాస్తూ, దీని ఉపసంహారానికి కావలసిన మెటీరియల్ మూడున్నర నెలల తరువాత రాబోయే కాంతారా అనే కన్నడ సినిమాలో ఉంటుందని (అసలు విడుదలయ్యే వరకూ ఎవరికీ తెలియని సినిమా అది) ఏ విధంగా ఊహించాను? ఉత్తినే random గా జరిగిన coincident కాదు. కచ్చితంగా నేను anticipate చేసి మరీ అక్కడికి ఆ కథనాన్ని ఆపి, సమయం రాగానే ముగించాను.
అంటే this is the next level of LIVE WRITING. Live writing యే సామాన్యమైన విషయం కాదు. అందులో ఇలాంటి Semi-bio pieces లో.
అదే కాదు. 64 ఎపిసోడ్లలో దాదాపు 40 planned episodes as I had my notes about Korean films. 24 ఎపిసోడ్లు లైవ్‌లో రాసినవే. ఆ క్షణం వరకూ అందిన సమాచారాన్ని ఉపయోగించుకుని, రాస్తున్న కథనంలో కంటిన్యుటీ దెబ్బతినకుండా రాయాలంటే.. చేతులు తిరిగిన రచయితలకే ఓ పట్టాన లొంగదు. మరి నాలాంటి dormant and out of form writers పరిస్థితి?
కావాలంటే శనివారం చాలా ఆలస్యంగా ఎపిసోడ్ పంపినందుకు సోమ శంకర్ గారు ఎన్నిసార్లు తిట్టుకుని ఉంటారో! కానీ అందాల్సిన సమాచారం అందాలంటే వీలైనంత ఆలస్యం చేయక తప్పదు. Sorry sir. Next time my episodes will reach you by Friday nights as I am not going to use live writing anytime soon.
అలా రాసిన వాటిలో Decision To Leave అనే సినిమా గురించిన blocks. ఇంకో రెండు చోట్ల ఆ శుక్రవారం రిలీజయ్యే సినిమా, కథనాన్ని ముందుకు తీసుకు వెళ్ళేందుకు ఉపయోగ పడుతుంది అనుకుంటే అది రిలీజయ్యి, దానికి రివ్యూలు లేదా premiere show watching access వచ్చేదాకా ఆగి, సినిమా చూసి, లేదా రివ్యూలు access చేసి, శనివారం అప్పటికప్పుడు రాసిన సందర్భాలు ఉన్నాయి. How did I anticipate all these things?
Subject తో మమేకమై పోవటం వల్ల. ఫిక్షన్ రాయటం తేలికే. నాన్-ఫిక్షన్ కూడా. విషయం మీద పట్టు ఉండి అవసరమైన సమాచారం అందుబాటులో ఉంటే.
కానీ లైవ్ లో రాస్తూ, సమాచారం అందుతుందో లేదో తెలియని పరిస్థితిలో రాయటం… either the writer is a mad man or a genius. నేను ఈ రెండూ claim చేయను. కానీ ఎందుకు చెప్పానంటే కొరియానం రాయటానికి నేను ఎంచుకున్న ప్రక్రియను handle చేయటం మహామహులకే అంత తేలిక కాదు. By God’s grace, I pulled it off without making myself a pariah in front of all the seasoned writers of Sanchika and highly informed audience of our magazine.
ठीक है?
కాంతారా రాకుండా ఉండి ఉంటే, 36-38 ఎపిసోడ్లు సాధ్యపడేవి కాదు. కొరియానం as in this form అసంపూర్ణంగా మిగిలిపోయేది.
కొరియానం మొత్తం 326 పేజీలు. Apple Inc. వాళ్ళు చెప్పే Retina Display pixel density.
3+2+6 = 11.
దీంతో కలిపినా, లేదా ఎపిలోగ్‌ను ప్రత్యేక ఎపిసోడ్‌గా చూసినా మొత్తం 65. ఇక్కడ కూడా 6+5 = 11.
కొరియానంలో మొత్తం పదాలు 70,874. ఇక్కడ కూడా 7+4 = 11.
ఇదంతా planned యే. నమ్మినా. నమ్మకపోయినా. మా ఎడిటర్ చెప్పినా, నేను రాసేది ఎక్కువగా చదివేవారు చెప్పినా, నేను ఒక్క పదం కూడా వృథాగా లేదా ఎక్కువగా రాయను. కొలత కొలతే. తూకం తూకమే. కొలతలో చిన్న తేడా వచ్చినా acid base గా base acid గా మారిపోవచ్చు. ఎన్నో తేడాలు జరుగవచ్చు. సైన్సు స్టూడెంటును కదా. అదీ విషయం.
చివరగా సింగీతం శ్రీనివాసరావు గారు ఆదిత్య 369 లో వాడిన ఒక టెక్నిక్‌ను కొరియానంలో వాడాను. To drive the point without spending much time. అలాగే సత్యజిత్ రాయ్ తన సినిమాలలో ఏకరూపత తీసుకుని వచ్చేందుకు వాడిన టెక్నిక్ కూడా వాడాను. కొరియానంలో ఏకసూత్రత మిస్ కాకుండా.
25వ ఎపిసోడ్ దగ్గర Interval Card వేశాను. తరువాత 39 ఎపిసోడ్ల సెకండ్ హాఫ్ నడుస్తుంది. అంటే మూడు గంటల సినిమాకు మొదటి 65 నిముషాలకే ఇంటర్వెల్ పడితే? అలాగ.
చివరి 16 ఎపిసోడ్లు క్లైమాక్సు. Most of the threads and blocks are resolved here. Relentless pacing.
చినరి ఎపిసోడ్‌లో కథనాన్ని ముగించలేదు. ఆ పని ఎపిలోగ్‌లో చేశాను.
అంతే!
కొరియానం.
కొరియానం పుస్తకంలో ఇక్కడ ఇవ్వని సమాచారం దాదాపు మరో 18 పేజీలు ఉంటుంది.
కచ్చితంగా పుస్తకం రూపంలో వస్తుంది. తీసుకు రావటం నా బాధ్యత. తెలుగులోనే కాదు, ప్రపంచంలో కూడా ఇలాంటి రచన రాలేదు అని డప్పా వేసుకుంటున్నప్పుడు అలాంటి రచనను పుస్తక రూపంలో తీసుకు రాకపోతే నేను రాసిన దాని మీద నాకే గౌరవం లేనట్లు.
I intend this work as a tribute to Telugu literature. అంగీకరిస్తే, this is my way of saying thanks to Sri Kasturi Muralikrishna garu.
And this work is dedicated to Dr. Madhu Chittarvu (he’s one among the few) for his encouragement. Some of his posts about Koriyanam brought new readership to my work. Thankful.
Memes ను బాగా ఉపయోగించుకున్న తెలుగు రచన కూడా కొరియానమే.
Paying respect to all the elders, and those who followed my work,
I, hereby, conclude this.