[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘కోరికల గుర్రం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]కో[/dropcap]రికల గుర్రం పరిగెడుతోంది
కళ్ళెం వేసినా ఆగదు!
సొంతం అనుకుంటే
ఎంతో హాయి
కానీ అది ఆసాంతం
అది నిలిచేనా
ఇవాళ మనదైనది
రేపటికి ఇంకెవరిదో కదా
పగటి వెలుగులు చిమ్మే
సూరీడు సాయంత్ర సమయాన
కానరాడు కదా
చల్లని జాబిలి కూడా
వేకువ జామున
వెల వెల పోవలసిందే కదా
తళ తళలు ఎపుడూ
మోసం చేస్తూనే వుంటాయి
అందమైనది అంటే
అందనిదీ అని కూడా అర్థం
ఒక వేళ అందినా
ఏదో రోజు
చేజారడం ఖాయం