కొరముట్ల కుమారి నానీలు

1
2

[dropcap]రై[/dropcap]తుకు
రెక్కలు మొలిచాయి
కూలీగా
పట్నం వైపు ఎగిరివెళ్ళేందుకు.

***

సూర్యుడికి
భయమే లేదు
కరోనా కాలంలోనూ
యథేచ్ఛగా తిరిగేస్తూ…

***

వీధి లైట్లకు
షిఫ్ట్ సిష్టం లేదేమో
ఎపుడూ
రాత్రి డ్యూటీనే….

***

జాబిల్లి
మబ్బుల చాటున దాక్కుంది
కరోనాకు భయపడి
స్వీయ నిర్భందం.

***

చెరువు
అద్దం అయ్యింది
చందమామ
సింగారించుకునేందుకు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here