Site icon Sanchika

కోట్లలో ఒక బాలు

[dropcap]కొం[/dropcap]దరు కారణ జన్ములు
దేశమాత వరపుత్రులై
నిశ్శబ్దంగా ఉదయిస్తారు

దైవదత్త విద్యతో,కళా సాధనతో
అసామాన్య ప్రతిభతో, బహుముఖ ప్రజ్ఞతో
రసహృదయుల నోలలాడిస్తారు

మకుటంలేని మహారాజులై వెలిగి
జే జే ల హారతులందుకుంటారు
వినయంతో తమ ధర్మం నిర్వహించి
ఋణం తీర్చి మౌనంగా నిష్క్రమిస్తారు

ఒక్క గుండెగా యావద్దేశ ప్రజలశ్రుతప్తులై
అర్పించిన నివాళులందుకుంటారు
వంద కోట్ల కొక్కడు మన బాలు
మరొక్కబాలు మళ్ళీ రానే రాడు

Exit mobile version